Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aadi Pudipeddi"
Top Gear (2022)



చిత్రం: టాప్ గేర్ (2022)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్ 
దర్శకత్వం: శశికాంత్ 
నిర్మాత: కె.వి. శ్రీధర్ రెడ్డి 
విడుదల తేది: 30.12.2022



Songs List:



వెన్నెలా వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం:  టాప్ గేర్ (2022)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సిద్ శ్రీరామ్ 

ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ
ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ ఏఏ ఏ
వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

నిండుగా నువ్వుగా
పండెనే నా కలా
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

నిన్నలా చూడకా
ఉదయమే రాదులే
నీ ఒడి చేరక
రాతిరే పోదులే

నిన్ను నే తలవని
నిమిషమే లేదులే
నువ్వనే ధ్యాసకు
తీరికే లేదులే

తీరిపోని దాహమల్లే
ఎంతకైనా తనివి తీరవే
ఎన్నివేళ జన్మలైనా
నువు నన్నే చేరవే

నిండుగా నువ్వుగా
పండెనే నా కల
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

ఏ క్షణం దూరమై వెళ్లనీ ప్రేమనే
ఎన్నడూ నీడలా ఉండనా చెంతనే
చీకటే చేరగా అనుమతే ఇవ్వనే
ఆపదేం ముసిరినా దరికి రానివ్వనే

ఎంత నువ్వు ఇష్టమంటే
చెప్పలేనే ఒక్క మాటలో
కాలమంతా కదిలిపోతా
నీ వరాల కాంతిలో

నిండుగా నువ్వుగా
పండెనే నా కల
నిన్నలా దాచనా
కంటిలో పాపలా

వెన్నెలా వెన్నెలా
నువ్వు నా వెన్నెలా
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా

Palli Balakrishna Friday, November 25, 2022
BLACK (2022)



చిత్రం: BLACK (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
నటీనటులు: ఆది సాయికుమార్, దర్శన బానిక్
దర్శకత్వం: జి.బి.కృష్ణ
నిర్మాత: మహంకాళీ దివాకర్ 
విడుదల తేది: 28.05.2022



Songs List:



నా గుప్పెడంత పాట సాహిత్యం

 
చిత్రం: BLACK (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: పూర్ణా చారి
గానం: ఇస్సాక్

నా గుప్పెడంత గుండెకింతా
చెప్పలేని వేగమంటా, వేగమంటా
ఎందుకంటా..?, ఎందుకంటా
 
నీ రాకతోనే మారిపోయి
మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట
ఎందుచేత..? ఎందుచేతా..?

కరగనీ ఈ సమయం
పెరగని నీ స్నేహం
కుదురుగా లేకుందే ఏమో నా ప్రాణం
ఇంతకీ సమయం ఆపదే ఈ పయనం
చనువునే పెంచిందే నీతో ఏకాంతం

ఉన్నట్టుగా మేఘాలపై ఇలా
నా పాదమే తేలింది ఏంటిలా
తూనీగలా రాగాలు పాడుతూ
నేనింతగా నీ మాయలో ఉండనా

కలలకు కన్నులు మొలిచాయిలా
మనసుకు రెక్కలు పొడిచాయా
పెదవులు మాటలు మరిచాయిగా
ఈ వింత నీదేనుగా

ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా

ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా

తగువులే చెలిమిగా మారెనే నేడిలా
అడుగులే ఒకటిగా సాగినాయే
అతిథిలా ఉండగా హృదయమే చాలదా
వెలితినే తీర్చిన వెలుగు నీవే

నీ తీరమే కోరి నా దారులే
నీ వైపుగా కదిలాయిగా
నీ నవ్వుకే బదులిచ్చానుగా
ఇపుడే ఇలా కలిసినా

ముందున్న కాలం ఏమున్నదో
నీతోటి నాకే రాసున్నదో
నామాటగా నన్ను ఇచ్చానుగా
కలా నిజం కలిసినట్టుగా

కలలకు కన్నులు మొలిచాయిలా
మనసుకు రెక్కలు పొడిచాయా
పెదవులు మాటలు మరిచాయిగా
ఈ వింత నీదేనుగా

ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా

ఎగిరి నింగి తాకుదాం
ఎదురే లేని తీరుగా
ఎవరు లేని చోటులో
ఎపుడూ తోడు నేనుగా

నా గుప్పెడంత గుండెకింతా
చెప్పలేని వేగమంటా, వేగమంటా
ఎందుకంటా..? ఎందుకంటా

నీ రాకతోనే మారిపోయి
మళ్ళీ నేను పుట్టేనంట, పుట్టేనంట
ఎందుచేత..? ఎందుచేతా..?

Palli Balakrishna Wednesday, June 1, 2022
Tees Maar Khan (2022)



చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు:  ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్, సునీల్, పూర్ణ 
దర్శకత్వం:  కళ్యాణ్జీ గోగణ 
నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి 
విడుదల తేది: 2022



Songs List:



పాప ఆగవే ఆగి చూడవే పాట సాహిత్యం

 
చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: N.C. కారుణ్య 

పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా
పాప ఆగవే ఆగి చూడవే
చూసి చూడనట్టు వెళ్ళకే అలా

పాపం కాదటె… పంతం దేనికె
తీగె తెగేదాకా లాగితే ఎలా?
ఎందుకంత కోపం
కొంచం శాంతం శాంతం
ఊపిరి ఉన్నన్నాళ్ళు
నిన్నే నేను మరిచిపోలేనులే

నేనో గాలిపటం… నువ్వే కదా దారం
ప్రాణం నీ చేతుల్లో ఉన్నాదని మరిచిపోకులే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే  నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే

నువ్వే నాకు మొదటి జ్ఞాపకం
మదిలో నీదే మొదటి సంతకం
నువ్వే లేని నన్ను ఊహించుకోలేను
అర్ధం చేసుకోవే అలక మానవే
నువ్వే దూరమైతే గాలాడదే నాకు
మారం చెయ్యకుండా మాటలాడవే

మహారాణి లాగ నిన్నే చూసుకుంటా
మహారాజ యోగం పట్టేదాక సమయమీయవే

వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే
బతకనే బతకనే  నువ్వే లేక బతకనే
నువ్వే చెప్పు నువ్ లేకుండా ఎట్టా బతకనే

(వదలనే వదలనే నిన్నే నేను వదలనే
వందేళ్ళయినా వెయ్యేళ్ళయినా చెయ్యే వదలనే)





సమయానికే తగు మాటాడవా పాట సాహిత్యం

 
చిత్రం: తీస్ మార్ ఖాన్ (2022)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: రాకేందు మౌళి 
గానం: యం.ఎల్.శృతి

సమయానికే తగు మాటాడవా
సరసానికి చొరవే చూపవా
ఈ చూపే నావైపే వేసిన ఎరా
ఏదేదో చేసేసెయ్ చంపుతోందిరా

మాటల్లో చెప్పేసెయ్ వీలు లేదురా
పుట్టిందే నీకోసం అంది తొందరా

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
సమయానికే తగు మాటాడవా ఆ ఆ

ఫిదా ఫిదా ఫిదా అయ్యానులే
నేను నీకు ఫిదా… సదా ఇదే కదా
మనం అనే ఏదో లోకం ఇదా

హే నేనే కుడియా హే గుడియ
మై తేరి చుడియా
ఇది మాయ వలయా
ఈ అందాలు నీవేనయా

ఏదైనా ఏమైనా ఏకమవ్వనా
కాదన్నా వద్దన్నా కౌగిలివ్వనా

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
సమయానికే తగు మాటాడవా, ఆ ఆ
సరసానికి చొరవే చూపవా, ఆ ఆ
ఈ చూపే నావైపే వేసిన ఎరా
ఏదేదో చేసేసెయ్ చంపుతోందిరా

Palli Balakrishna Tuesday, March 22, 2022
Atithi Devo Bhava (2022)



చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటినటులు: ఆది సాయికుమార్, నువేక్ష 
దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్
నిర్మాతలు: రాజబాబు మిరియాల, అశోక్ రెడ్డి మిరియాల 
విడుదల తేది: 2022



Songs List:



బాగుంటుంది పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సిద్ శ్రీరాం నూతన మోహన్ 

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే

బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న
కాటుకంతా ఒంటికంటితే

అహహహా బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస

అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని

కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా టెన్ టూ ఫైవ్

అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా, (తెలుసు కదా)
అయినా బయటపడవు కదా, (పడవు కదా)
పదపదా ఎంతసేపిలా

వెలివేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని

నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మోసావు అన్ని దారులు

కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారి లేక నేనిలా
బంధించానే అన్ని వైపులా

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే



నిన్ను చూడగానే పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి దేవోభవ (2022)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి

నిన్ను చూడగానే నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే

ఒక నవ్వే కదా… ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా

నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది
నాదో చిన్న ఆశ

నీలో నన్ను చూశా
నాలో నిన్ను మోశా
అవునన్నా నువ్వు కాదన్నా
నా మనసే నీకిచ్చేశా

పూట పూట గుర్తొస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే

ఈ జన్మ నీతోనే
మరుజన్మ నీతోనే
వచ్చి వచ్చి గుండెల్లోన
వాలిపోవే గువ్వలా

నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటేనే సంతోషాన్ని
వెయ్యలేను కాటా

నువ్వే ఉన్న చోట
కాదా పూల తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా
నాకేం వద్దు వాటా

Palli Balakrishna Friday, October 29, 2021
Sashi (2021)



చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి, రాశి సింగ్
దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు నడికట్ల
నిర్మాతలు: ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతల పూడి శ్రీనివాస్
విడుదల తేది: 19.03.2021



Songs List:



ఒకే ఒక లోకం నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా

ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...
ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా...

నిన్నా మొన్నా గుర్తె రాని సంతోషాన్నే పంచైనా
ఎన్నాళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే...
ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే
దేహం నీది నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా
వెలిగించావే

నిన్ను నిన్నుగా ప్రేమించనా
నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా
జన్మజన్మలా జంటవ్వనా





దింతానా దింతాన పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హరిచరణ్

దింతానా దింతాన 
ఇది మనసుపండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

పాలసంద్రంలా పొంగిపోతున్న
పాలపుంతల్లో తేలిపోతున్న
విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్న
కురిసే తారాలన్నీ దోసిళ్లల్లో నింపేస్తున్న

చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న
కొత్త జన్మేదో అందుకుంటున్న
రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి
దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్న
నింగి అంచు మీద రంగు రంగు చేపలుగా
గెంతుతున్న ఓ...

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా

ఇంత కాలంగా ఎక్కడున్నావే
ఉన్నఫళంగా ఊడి పడ్డావే
తెలిసీ తెలియనట్టు నా మనసునే లాలించేశావే
అసలేం ఎరగ నట్టు నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూశాకే ప్రాణ మొచ్చిందే
వింతలోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి
నా చెంప గిల్లుతుంటే 
అంతకన్న హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కన్ను ఇంక
నన్ను కూడ చూడనందే

దింతాన దింతాన 
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన 
కల ఎదుట వాలినది నిజమేనా

కనురెప్పల కోలాటామిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులివెచ్చగా బాగుందిది
హే.. నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడవనులే
నీలోంచి కదలనులే

దింతానా దింతాన
ఇది మనసు పండగని అనుకోనా
దింతాన దింతాన
కల ఎదుట వాలినది నిజమేనా




విధినే విడిచే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: వెంగి
గానం: యం. యం. కీరవాణి

విధినే విడిచే నీ ప్రాణమే
విడిగా మిగిలే ఈ మౌనమే
కొనసాగి ఆగేనా నీ స్నేహమే
నువు లేక సాగేనా ఈ కాలమే
పలికే పేరు లేదే పెదవే ఉరుకోదే
సెలవే కోరలేదే కల అయినా రాదె




ఎవరికోగాని పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నరేష్ అయ్యర్, నారాయణ్ అయ్యర్

ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే
జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే
నేడు వదిలేసిందా చివరన
ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా

నిలువునా నిన్ను నిలుపుకున్నాక
వదలన వదలన కుదురున
కనులలో నిన్ను కలుపుకున్నాక
మరవన మరవనా జరుగునా
అయినా గాని వదిలేస్తున్న మనసును అణుచుకోని
మరి నీకోసం మరిచేస్తున్న
మరొక బతుకుతోని మలుపున

ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఏపుడిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముఖే
జన్మ తలవంచింది క్షణమున
ప్రాణం పంచె మనసునే
నేడు వదిలేసిందా చివరన




ప్రేమ ఇది ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: బోల్ట్, ఇషాక్ వాలి

ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా

నాలో ధ్యాసే నీవా నీవా
లోలో ఊసే నీవా... ఓ ఓ ఓ
పాడే కన్నె నీవా నీవా
ఆడే మిన్నే నీవా... ఓ ఓ ఓ

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ

భూగోళమంతా నీవల్లే నీవల్లే
నగిషీలు పూసే నీవల్లేనే
ఈ పాలపుంత నా వల్లే నా వల్లే
నగుమోము చేరే నీ వల్లనే

పంచే ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమ
భాషే ఏదైనా భావం ఇంతే రామ
పెంచే ప్రేమ ఎద ముంచేనమ్మా
ఎదురేమైనా నివురైపోదమ్మ

ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా

జారే కన్నే నీవా నీనా
మీరే మిన్నే నీవా... ఓ ఓ ఓ
తార తీరం నీవా నీవా
కారాగారం నీవా... ఓ ఓ ఓ

ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా
దూరం భారం నీవా నీవా
దారి దాపు నీవా... ఓ ఓ ఓ
వేగం వేదం నీవా నీవా
ఆది అంతం నీవా... ఓ ఓ ఓ

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ




రానే రాదే పాట సాహిత్యం

 
చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిలువేరు
సాహిత్యం: వెంగి
గానం: చౌరస్తా మ్యూజిక్, అదితి భావరజ్

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే
హద్దు లేనివంట అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ్ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్

నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే

పల్లవించే కొంటె అల పడిలేస్తే అందం హో
పంచుకుంటే నవ్వు నీలా మనదే అనుబంధం
తుళ్ళిపడే కుర్రతనం తీరమెక్కడో చూద్దాం హో
తెల్లవారే తూరుపింట తొలి వెలుగవుదాం

నిన్న మొన్న గడిచెను వదిలెయ్
పాత రోజులన్నీ గతమేగా
నువ్వు నేను అన్న స్వార్ధం విడిచెయ్
చిన్ని చేతులన్నీ హితమేగా
స్వర్గమన్నదింక ఎక్కడో లేదోయ్
స్వప్నమై ఉంది స్వతహాగా
సాహసాలు చేసే సత్తువ ఉంటే
మనకు సొంతమేగా

దారే లేదని తుది వరకు
దరి లేనే లేదని తడబడకు
తీరే మారదు అని అనకు
నీ తీరం దూరం చేరువరకు

రానే రాదే విలువైన జీవితం పోతే రాదే
పోనే పోదే హృదయంలో వేధనే పోనందే

మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట
వదిలెయ్ వదిలెయ్
కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట
అడుగెయ్ అడుగెయ్
దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత
వలచేయ వలచేయ్
ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్

నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా
నీదే అదృష్టం మాటే మారాలే
నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే
ఇకపై నీదే నీదేలే


Palli Balakrishna Tuesday, March 16, 2021
Operation Gold Fish (2019)


చిత్రం: ఆపరేషన్ గోల్డ్ ఫిష్ (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆది, నిత్యా నరేష్, శశ
దర్శకత్వం: సాయికిరణ్ అడవి
నిర్మాతలు: ప్రతిభ అడవి, పద్మనాభ రెడ్డి, ఆశిష్ రెడ్డి
విడుదల తేది: 18.10.2019


Palli Balakrishna Friday, February 12, 2021
Garam (2016)


 చిత్రం: గరం (2016)
సంగీతం: అగస్త్య
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆది, అదా శర్మ
దర్శకత్వం: మదన్
నిర్మాత: సాయికుమార్ పుడిపెద్ది
విడుదల తేది: 12.02.2016

Palli Balakrishna
Rough (2014)


చిత్రం: రఫ్ (2014)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి
దర్శకత్వం: సి. హెచ్. సుబ్బా రెడ్డి
నిర్మాత: ఎమ్.అభిలాష్
విడుదల తేది: 28.11.2014


Palli Balakrishna
Galipatam (2014)



చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: ఆది, రాహుల్ రవీంద్రన్, ఎరికా ఫెర్నండేజ్
దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: సంపత్ నంది
విడుదల తేది: 08.08.2014



Songs List:



పానిపూరి (డించక డించ) పాట సాహిత్యం

 
చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సంపత్ నంది
గానం: శంకర్ మహదేవన్ , భీమ్స్ సిసిరోలియో

పానిపూరి (డించక డించ)



హే పారు పాట సాహిత్యం

 
చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం: అద్నాన్ సమీ, శ్రేయా ఘోషాల్ 

హే పారు 




ధూమపానం పాట సాహిత్యం

 
చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: సూరజ్ జగన్ 

ధూమపానం 




తేరే మేరే సాత్ పాట సాహిత్యం

 
చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: జావేద్ ఆలీ, శ్రేయా ఘోషాల్ 

తేరే మేరే సాత్ 



యః అల్లాహ్ పాట సాహిత్యం

 
చిత్రం: గాలిపటం (2014)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో
గానం: కైలాష్ ఖేర్ 

యః అల్లాహ్ 

Palli Balakrishna
Pyar Mein Padipoyane (2014)


చిత్రం: ప్యార్ మే పడిపోయానే (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: 
గానం: 
నటీనటులు: ఆది, శివాని శ్రీవాస్తవ
దర్శకత్వం: రవి చావలి
నిర్మాత: కె. కె. రాధా మోహన్
విడుదల తేది: 10.05.2014


Palli Balakrishna
Lovely (2012)



చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, శాన్వీ
దర్శకత్వం: బి. జయ
నిర్మాత: ఆర్. ఆర్. వెంకట్
విడుదల తేది: 30.03.2012



Songs List:



డోలారే డోలా పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: బెన్నీ దయాల్, భార్గవి, నోయల్ 

డోలారే డోలా 




చోరీ చోరియే పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: విజయ్ ప్రకాష్ 

చోరీ చోరియే 



నిన్ను చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: అనూప్ రూబెన్స్, ఐశ్వర్య 

నిన్ను చూసిన 




ఐ డోంట్ నో పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనూప్ రూబెన్స్ 
గానం: చైత్ర 

ఐ డోంట్ నో 




లవ్లీ లవ్లీ పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సైంధవి 

లవ్లీ లవ్లీ




నేనున్నది పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్  
గానం: అనూప్ రూబెన్స్, ధనుంజయ్ 

నేనున్నది 





ఏవో ఏవేవో పాట సాహిత్యం

 
చిత్రం: లవ్లీ (2012)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరాశ్రీ 
గానం: చైత్ర,  అనూప్ రూబెన్స్

ఏవో ఏవేవో 

Palli Balakrishna
Jodi (2019)



చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
నటీనటులు: ఆది, శ్రద్ధా శ్రీనాథ్
దర్శకత్వం: విశ్వనాథ్ అరిగెళ్ళ
నిర్మాతలు: సాయి వెంకటేష్ గుఱ్ఱం, పి. పద్మజ
విడుదల తేది: 06.09.2014



Songs List:



ఇది నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: యాజిన్ నజీర్ 

ఇది నిజమేనా



దేనికో ఏమిటో పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: ఆదిత్యా రావు, సత్య యామిని 

దేనికో ఏమిటో 




చెలియ మాటే పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: హరిచరన్, సమీరా భరద్వాజ్ 

చెలియ మాటే 




సఖియా సఖియా పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: హైమత్, అపమ నందన్ 

సఖియా సఖియా 



ఓ మై డాడీ పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: ఫణి కళ్యాణ్ 

ఓ మై డాడీ 



నువ్వు లేవన్న పాట సాహిత్యం

 
చిత్రం: జోడి (2019)
సంగీతం: ఫణి కళ్యాణ్
సాహిత్యం: ప్రియాంకా, అపమ నందన్ 
గానం: అపమ నందన్ 

నువ్వు లేవన్న 

Palli Balakrishna Tuesday, October 8, 2019
BurraKatha (2019)


చిత్రం: బుర్రకథ (2019)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర
నటీనటులు: ఆది, మిస్తీ చక్రవర్తి, నైరా షా
దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ దీపాల
విడుదల తేది: 05.07.2019

హే అందానికే నువ్వు అందానివే
ఆ బ్రహ్మ చదవని గ్రంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగెలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే

ముద్దు బేబీ, లవ్లీ జిలేబి

నీ పేరు వింటే పరధ్యానమే
సిరివెన్నెల రాదా మధ్యాహ్నమే
హే పిచ్చి పిచ్చిగా ఇట్టా నచ్చేస్తూ ఉంటే
ఈడు గోడమీద కోడిలాగ కూసెయ్ దా పిల్లా
నడిచే ఓ చందమామ కులికే ఓ సత్యభామ
ఇంకా నీకర్ధం కాదా నా ప్రేమ
ఉన్నావే నువ్వు తబలా జాజల్లే
నే బీటే వేస్తా జాకీర్ హుస్సేనల్లే

హే అందానికే నువు అందానివే
ఆ బ్రహ్మ చదవని గంధానివే
హే చూడ చక్కని చిన్నారి మసక్కలి నువ్వే పిల్లా
ఒక్క దెబ్బకు నా గుండె ఫసక్ చేసావే
తేనె మాటలే కోటి వీణలై
ప్రాణమంతట మోగేలే
రావే రావే రావే ఆడి కారల్లే
నిన్నోసారి నేనే ట్రైలే వేస్తాలే


Palli Balakrishna Monday, July 1, 2019
Chuttalabbai (2016)

చిత్రం: చుట్టాలబ్బాయి (2016)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామజోగయ్య శాస్త్రి , శ్రీకృష్ణ , గీతామధురి
నటీనటులు: ఆది, నమితా ప్రమోద్, ప్రణీత
దర్శకత్వం: వీరభద్రం చౌదరి
నిర్మాతలు: తళ్లూరి రాము, తలారి వెంకట్
విడుదల తేది: 19.08.2016

పల్లవి:
పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి
పట్టుచీరలన్ని ముస్తాబైపోయాయి
అందాల కనువిందుగ
పంచికట్టు లాల్చీ ప్యాంటు షర్టులన్నీ
జిగేలుమన్నాయి ఉల్లాసంగా
పందిళ్లు తోరణాలు వేసివున్నాయి
అక్షింతలు దీవెనలు ఆ గట్టిమేళం
ఎప్పుడంటు గోల పెట్టెస్తున్నాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

పిపిపి డుండుం డోలు సన్నాయి
మోగేందుకు సిద్దంగున్నాయి
పెళ్లింట్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యి
లగ్గం కానిద్దామన్నాయి

చరణం: 1
కుందనాల బొమ్మండి
చందనాల కొమ్మండి
భూమ్మిద సీతమ్మె మా సుందరి
అంత మంచి రత్నాన్ని
ఎంచుకుంది ఎవరండి
మాయింటి రామయ్యే కాడా మరి
అందానికే అందం చెలి
అబ్బా మీ పెళ్లికొడుకు పంట పండింది
అదృష్టమంటే మీ పిల్లదేనండి
అందుచేత మా కుర్రాడి కంట పడింది
మాటల్లో పొద్దుపోతే లాభమేముంది
జీరాబెల్లాలు పెట్టి తాళిబొట్టు
కట్టకుంటే మూర్తమెల్లిపోతుంది

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి

చరణం: 2
అడ్డుగోడై తెరసెల్లా
ఆడుకుంటోందేంటిళ్ల
పిల్లాడి ఆత్రాన్ని ఆపేంతలా
సిగ్గుబరువై నిలువెళ్ల
తలవంచుకుందే పూబాల
అందాల వెన్నెల్ని దాచేంతల
ఇన్నాళ్లుగా వేచారుగా
ఇందాక వచ్చికూడా ఇన్నికష్టాల
కన్నెర్రగా కందేంతగా
దోబూచులాటలో అల్లాడిపోవాలా
బుగ్గల్లో చుక్కలు రెండు తొందరన్నాయి
మాంగల్యం తంతునా వియ్యాలు కలిపే
అయ్యవారి మంత్రమేగ తరువాయి

చూడవోయి చుట్టాలబ్బాయి
మా పెళ్లింటికి పెద్దవి నువ్వోయి
మంచికి నీదెపుడు పైచేయి
చిలకల జంటకు కళ్యాణం చేద్దాం రావోయి


Palli Balakrishna Wednesday, November 8, 2017
Samanthakamani (2017)


చిత్రం: శమంతకమణి (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: సుదీర్ బాబు, సందీప్, నారారోహిత్, ఆది, సుమన్, చాందిని చౌదరి, కైరా దత్, జన్నీ హనీ
దర్శకత్వం: వి. ఆనంద్ ప్రసాద్
నిర్మాత: శ్రీరామ్ ఆదిత్య
విడుదల తేది: 14.07. 2017

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

ఏదో దొరికేస్తాది ఇక్కడికొచ్చాక
ముందేదో కదిలేస్తాది కిక్కంటూ ఎక్కాక
పొందేది పోయేది నీ సొంతం లెక్క
తెలిసేది తెల్లారి నిద్దర లేచాక

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

Palli Balakrishna Tuesday, October 31, 2017
Next Nuvve (2017)


చిత్రం: Next నువ్వే (2017)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్ ,
నటీనటులు: ఆది, రేష్మి గౌతమ్, వైభవి శాండిల్య, బ్రహ్మజి, అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: ప్రభాకర్ (తెలుగు సీరియల్ యాక్టర్)
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 03.11.2017

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై

కోరస్:
సున్నిచేతుల మీద పొన్నా పూలన్నివాలి
పన్నీరు చల్లేనా
మున్నా జూవ్వాల మీద వచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అద్దాల రైకగట్టి
మాఇంటి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి చంద్రాల చీరకట్టి
మాఇంటి మెరిసేనా

వేవేళ పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే
తప్పిపోయావే నువ్ కచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా కదే కలే కనాలనే

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారన నిన్నే చేరన
తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా
ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై

Palli Balakrishna Thursday, October 12, 2017
Sukumarudu (2013)



చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, నిషా అగర్వాల్
దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత: కె.వేణుగోపాల్
విడుదల తేది: 10.05.2013



Songs List:



తొంగి తొంగి (Club Mix) పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: విజయ్ ప్రకాష్ 

తొంగి తొంగి (Club Mix)



మనసున వెయ్యి కన్నులతో పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: విజయ్ ప్రకాష్ 

మనసున వెయ్యి కన్నులతో 
కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే 
కానరాదంట ప్రేమ
ఇద్దరి మధ్యన ఒద్దికగా 
ఇమిడిపోతుంది ప్రేమ
ఒంటరిగానే ఎందరినో 
ఏడిపిస్తుంది ప్రేమ

ఏ బాధ తానో ఏ వేదనో
ఎండలే మసి చేసే ఆ గుణం
నూరేళ్ళ ఆశే మూన్నాళ్ళ చేసి
కన్నీట ముంచేయదా ఆఆ

మనసున వెయ్యి కన్నులతో 
కాపు కాస్తుంది ప్రేమ
కనులను దాటి చూపులకే 
కానరాదంట ప్రేమ

కలలకు తీపి గురుతులనే 
కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు 
నిలిచిపోతుంది ప్రేమ
ఒక్కరి గుండెను ఇద్దరికి 
పంచి పెడుతుంది ప్రేమ
ఇరువురి లోన బంధమనే 
పెంచి పెడుతుంది ప్రేమ
ఏ బాధనైనా మరిపించదా
యెదలో తాను ఉంటె ప్రతిక్షణం
ఏ జన్మకైనా నే కోరుకొనే
నా తోడు ఈ ప్రేమనే 
నా తోడు ఈ ప్రేమనే
కలలకు తీపి గురుతులనే 
కానుకిస్తుంది ప్రేమ
ఊపిరి పోసి ఆయువు 
నిలిచిపోతుంది ప్రేమ



సుకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: బాలాజీ 
గానం: రాజా హాసన్, రాజేష్ , ధనుంజయ, మంజు, రమ్యా, ప్రదీప్తి 

సుకుమారుడు




మనసున నువ్వేలే పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రాంభట్ల
గానం: అంజనా సౌమ్యా 

మనసున నువ్వేలే 



తొంగి తొంగి సూడమాకు సందమామ పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కందికొండ 
గానం: రాంకీ, సుచిత్ర

తొంగి తొంగి తొంగి తొంగి
అరె తొంగి తొంగి సూడమాకు సందమామ
నా అందమంతా నీదే సందమామ
హే అందమంతా నాదైతే సందమామ
సోకులెట్టా దాచుడేంది సందమామ
తిరునాళ్ళు తీసుకెళ్లి సందమామ
నాకు రబ్బర్ గాజులెయ్యి సందమామ
వయ్యారి నడుము చుట్టూ సందమామ
నీకు వడ్డాణము వేయిస్తా సందమామా చల్
ఓయ్ ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు చందమామ చందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు చందమామా

హే కంచ్చి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు
ఓ మల్లె తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు
మసక మాపటేల వచ్చి నిన్ను చేరుతాలే
హే రంగు రిబ్బన్లన్నీ సంతకెళ్లి తెచ్చి పెట్టు
చిన్ని ముక్కుకేమో ముక్కెరేట్టు నచ్చినట్టు
సోకు చేసుకొని నీకు ముద్దులెట్టు థాలే ఉమ్మా
అరె ఇంకేమి కావాలె చందమామ ఇట్టాగే తెచ్చిస్తా సందమామ
సక్కని జాల్లోకి చందమామ సామంతి పూలు తెర అందమంతా
హే పూవు లేంటి సీరలేంటి సందమామ
నీకు చుక్కలని కోసిస్తా సందమామా
అరె ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు సందమామ సందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు సందమామా

హే లేత బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టిపించు
తేనె పెదవి పైన లిప్స్టిక్ అద్దీపించు
ఘాటు కౌగిలించి స్వర్గమేంటో చూపుతాలే
హే మోటు సరసమాడి గిల్లుతావే సక్కనోడా
ముద్దు ముచ్చటంత తీరినాక కానరావు
నువ్వు మాట కూడా చెప్పకుండా జారుతావే
హే ఇంకేమి చెయ్యాలె సందమామ
చెప్పెయ్యి చేసేస్తా సందమామ
మూడు ముళ్ళు వెయ్యాలి సందమామ
నీ ఇంటి దాన్ని చెయ్యాలి సందమామ

హే మూడు ముళ్ళు ఎందుకంటా సందమామ
నా గుండె నీకే రాసి ఇస్తా సందమామ
చల్ అరె ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జకట్టు సందమామ సందమామ
ఆడి దుమ్ము దుమ్ము దుమ్ము దుమ్ము రేపు సందమామా




ఓ... నీలాకాశంలో మెరిసే చంద్రుడివే పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయ ఘోషల్

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే
ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

ఓహోహో పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన అలజడి రేపావే
హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

ఓ ఓ ఓ అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

హే సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంటా నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట

అరే ఆలె అలె అలె ఆలె అలె అలె లే అలె లే

హో నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ

ఓఓఓ రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ

నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ... ఏలేలో... ఏలేలో... ఓ ఓ




ఓ బేబీ నా లోకం పాట సాహిత్యం

 
చిత్రం: సుకుమారుడు (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనూప్ రూబెన్స్ & కోరస్ 

ఓ బేబీ నా లోకం 

Palli Balakrishna Tuesday, August 1, 2017
Prema Kavali (2011)



చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: ఆది, ఇషా చావ్లా
దర్శకత్వం: కె. విజయ భాస్కర్
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 25.02.2011



Songs List:



డం డం డం డోలు డోలు బాజే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: బెన్ని దయాళ్

డం డం డం డోలు డోలు బాజే




చిరునవ్వే విసిరావే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాశ్

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై 
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 

సరదా సరదాలెన్నో అందించావే 
సమయం గుర్తే రాని సావాసంతో 
విరహం చెరలో నన్నే బంధించావే 
ఎపుడూ మరుపేరాని నీ అందంతో 
ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావే 
రెప్పల్లోన తుళ్లే చూపుల్తో 
ఆరాటం ఊరించావే మోమాటం వారించావే 
చేరువలోన చేసే దూరంతో చెలియా... ఆ...

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై

అసలే వయసే నన్ను తరిమేస్తుంటే 
అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే 
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే 
సరిగా నమ్మించే బదులేం చెప్పాలే 
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు 
ఎన్నాళ్లింక కాలం గడపాలే 
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు 
ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా... ఆ...

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 

వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై 




తొలకరి చినుకై పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సాహితి
గానం: రంజిత్, శ్రేయా ఘోషల్

తొలకరి చినుకై





Listen to my heart.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భువనచంద్ర
గానం: అంజు, అంజనా సౌమ్య

Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 

ఈ నిమిషం నిత్యమై పోనీ.. 
కాలమిలా కౌగిలై పోనీ.. 
రెక్కలతో తాకనీ చుక్కలని.. 
కను రెప్పలతో..తాగనీ వెన్నలని.. 
మల్లి మల్లి నిన్ను చూసుకొని.. 
కలే ఇలా నిజమైందని.. 
నిన్నే నిన్నే నే చేరుకూని 
ఊపిరే నీవని..

Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 


పలుకని పలుకే చెలియా..వినపడుతూ ఉంటె.. 
వినపడగానే మనసే..పరవశమవుతుంటే.. 
నీ అందాలకి..నాలో విరహలకి.. 
దూరమే తరగని.. 
Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 

Listen to my heart..Only for you my girl.. 

తహ తహ లాడే తనువే..తడబడి పోతుంటే.. 
పెదవులు కలిసి ఒకటై.. వదలను లేమ్మంటే.. 
నీ మొహమాటము..నాలో ఆరాటము.. 
హద్దులే దాటని.. 
ఈ నిమిషం నిత్యమై పోనీ.. 
కాలమిలా కౌగిలై పోనీ.. 
రెక్కలతో తాకనీ చుక్కలని.. 
కను రెప్పలతో..తాగనీ వెన్నలని.. 
మల్లి మల్లి నిన్ను చుసుకూని.. 
కలే ఇలా నిజమైందని.. 
నిన్నే నిన్నే నే చేరుకూని.. 
ఊపిరే నీవని.. 
Listen to my heart..It's beating for you.. 
Listen to my heart..It's waiting for you.. 
Listen to my heart..Only for you my girl.. 
Listen to my heart..It's beating for you..
Listen to my heart..It's waiting for you..
Listen to my heart..Only for you my girl..

You Are My Girl




మనసంతా ముక్కలు చేసి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కె.కె.

సనిరీస సనిరీస 
నిసరీసా నిసరీసా
దనిప మపదనిసా 
సనిరిసా సనిరిసా

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే 

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ...

చరణం: 1
విరిసిన పువ్వుల కొమ్మ
తను పెనవేసిన ఒక రెమ్మ
ఎవరో తెంచేస్తు ఉంటే ఒప్పుకుంటదా
బుడి బుడి అడుగుల పాపైనా
తన ఆడుకొనేదొక బొమ్మైనా
ఎవరో లాగేసుకుంటే ఊరుకుంటదా
నువు నచ్చి మనసిచ్చి ఇపుడిక్కడేది చూస్తుంటే
కనుపాపల్లో కునుకుండదే... ఓ... ఓ...

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
ఓ...

చరణం: 2
వెలుతురు ఉన్నపుడేగా నీ వెనుకనే ఉంటది నీడ
ఉంటా నడిరాతిరైన నీకు తోడుగా
చిగురులు తిన్నపుడేగా
ఆ కుహు కుహు కోయిల పాట
అవుతా నీ గుండె లయగా అన్నివేళలా
నిను కోరా ఇటు చేరా
నువు ఎటువైపో అడుగేస్తే
ఎదలోతుల్లో కుదురుండదే... ఓ... ఓ...

మనసంతా
మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం
నీకై నీకై ప్రాణాలిస్తానన్నా
ఇంకా ఇంకా అలుసై పోతున్నానా
పొరపాటుంటే మన్నించవే 

మనసంతా ముక్కలు చేసి
పక్కకు వెళతావెందుకు ఓ నేస్తం
ఊరించి ఊహలు పెంచి
తప్పుకుపోతావెందుకు ఆ పంతం ఓ...




నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమకావాలి (2011)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిత్ర, విజయ్ ప్రకాష్

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే 
నా ప్రేమ లోకం నువ్వే...
ప్రియతమా  హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే... ఓ ఓ 
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే
ఇంకొంచం కోరుకోన నీ స్నేహం
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె మాటే
నీ పేరే ప్రేమ అయిందా నా కోసం 
ఇంతలో నువ్ సొంతమై నాలో వున్నా
చాలని అనలేనుగా ఎంతైనా
ఏదో తీపి ఆవేదనా

ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా హో...

కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు
ప్రేతి పూట పండగే నీతో వుంటే
మనసంతా మల్లె పూలు విరభూసే పరిమళాలు
జతలోన ఉహలోనా నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టానని
ప్రేమపై ముమ్మాటికి ఒట్టేయని
నీ ప్రేమ కావాలని...

ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

ఓ ప్రియతమా - ప్రియతమా
హృదయమా - హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నా కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే...ఓ 
ఓ ప్రియతమా - ప్రియతమా
హృదయమా - హృదయమా
ప్రణయమా నా ప్రాణమా


Palli Balakrishna Monday, July 31, 2017

Most Recent

Default