Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nammina Bantu (1960)





చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, మాస్టర్ వేణు
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: యార్లగడ్డ వెంకన్న చౌదరి
విడుదల తేది: 07.0.1960

(ఈ సినిమా తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది)



Songs List:



నాజూకు తెచ్చు టోపీ పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం

నాజూకు తెచ్చు టోపీ  నాతోటే వచ్చు టోపీ
నాటోపీ పోయిందా నా పరువే గోయిందా

పట్నంలో కొన్నదీ  పైసాలు తిన్నదీ
దర్జాగాన్నదీ  తైతక్క మన్నదీ
లండన్లో చేసిందీ  ఇండియాకు వేసిందీ
తెల్లవాడు మెచ్చిందీ  వెళ్ళిపోతూ ఇచ్చింది
తెలివున్నా లేకపోయినా తలకాయే నున్నాయైనా
పప్పులోకి ఉప్పులాగా  కాఫీ కప్పులాగా
నా కంటికి రెప్పలాగ నన్నెపుడు వదలని టోపీ



తెల తెలవారిను లేవండమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి & పార్టీ

తెల తెలవారిను లేవండమ్మా - చెలియల్లారా రారండమ్మా ఆ ఆ ఆ
తెల తెలవారెను లేవండమ్మా - చెలియల్లారా రారండమ్మా
ముద్దులు జిలికే  ముచ్చటగులికే ముగ్గులు తీరిచిదిద్దండమ్మా
చెయి దిరిగిన ఈ విద్యలో మన స్త్రీ జాతికి సరియెవరమ్మా

రెక్కలు తటతట కొట్టుచు కోళ్ళు
కొక్కొరొకోయని కూసిననీ
అంబాయంటూ తల్లి పాలకై ఆవుదూడ లల్లాడు చున్నవీ 

హరే హరేలరంగ, హరేహరేలరంగ, హరేహరేలరంగ హరేహరే

అందెలు మ్రోయగ బిందెలతో 
నీలాటి రేవునకు తరలండి
పందెం వేసీ నేనూ, నేనని పనిపాటలకై మరలండి
తూరుపుదిక్కున బాలసూర్యుడు
తొంగితొంగి చూచేనమ్మా దొంగచూపు చూచేనమ్మా
కలవరపాటున దాగియున్న
ఆకధ యేమో అడగండమ్మా



ఆలు మొగుడు పొందు అందమోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల, టి. వి. రత్నం, స్వర్ణలత

ఆలు మొగుడు పొందు అందమోయ్ అందమోయ్ 
ఇద్దరకి విడరాని బంధమోయ్ బంధము
అయ్యాయ్యో  మన చెలిమి అన్యాయమైపోయే
పెనుబాము కాటేసి ప్రాణాలు పోయె అయ్యో..ఓ..

దిగుదిగు నాగా దివ్యసుందరనాగా
పగయేల మామీద బంగారు నాగా
పసుపు కుంకుమ మాపి  బ్రతుకు దీశావయ్య
తప్పేమి మాలోన దయజూపనే మయ్య

కన్ను మిన్ను కొనకుండ తిరుగుతారే
జాలి లేక మాపిల్లల చంపుతారే

ఈ నీతు లేలనే నీమాట చెల్లదే
ప్రాణాలు దక్కవే పతిచావు తప్పదే
పట్టముందు పొలుపోసి పెడుదునయ్యా
పొట్టనిండ ఆరగించిపోవయ్యా
రోజు రోజు పూజచేతు నాగులయ్యా
ఇక పంత మేల  నాధుని బ్రతికించయ్యా

మనుషుల సంగతి చెప్పనేటికే  మనసు లేనివారే
ఏరుదా టెదరు తెప్ప గాల్చెదరు
ఆపద మొక్కులు మొక్కెదరే

ఈ నీతు లేలనే నీమాట చెల్లదే
ప్రాణాలు దక్కవే పతిచావు తప్పదే

నేనే పరమ పతివ్రత నైతే
భారత నారిని అయితే
నిజముగ నాలో సత్యం ఉంటే
నీ తనువు భస్మమై పోవాలి
నీ జాతి మాయమై పోవాలి



పొగరుమోతు పోట్లగిత్తరా పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల

సాకి: 
కన్ను మిన్ను కానరాని, కాలి తెరపు గిత్తగా
పట్టుకుంటే మాసిపోయె, పాలపళ్ళ గిత్తరా... అరరెరరే
ఒంటి మీద చేయివేస్తే ఉలికిపడే గిత్తరా - ఏయ్ ?

పల్లవి:
పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య దీనిచూపే సింగారమౌనురా
ఓరయ్య దీని రూపే బంగారమౌనురా

ముందుకొస్తే ఉరిమి కొమ్ము లాడిస్తుంది
వెనక్కొస్తే ఎగిరి గాలు ఝాడిస్తుంది - 4-1...

ఇనురుకుంటూ, కసురుకుంటూ, ఇటూ అటూ .
అటూ ఇటూ...డియర్
కుంకిళ్లు బెడుతుంది. కుప్పిగంతులేస్తుంది

సాకీ: 
అదిలిస్తే రంకెవేయు బెదురు మోతు గిత్తూ
కదిలిస్తే గంతులేసి కాండ్రుగునే గిత్తరా- అరరే

చరణం : 
దీని నడుము తీరు జూస్తుంటే, నవ్వు పుట్టుకొస్తుంది
నడకి జోరు చూస్తుంటే, ఒడలు పులకరిస్తుంది
వన్నె చిన్నెల రాణి, ఇవ్వాళ మంచిబోణీ
నిన్నొదిలి పెడితే ఒట్టు  ఈ నగలు కట్టి పెట్టు



చెంగు చెంగు నా గంతులు వేయండీ పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల

చెంగు చెంగు నా గంతులు వేయండీ
ఓ జాతివన్నె బుజ్జాయిల్లాగా
నోరులేని తువ్వాయిల్లారా

రంగు రంగుల ఓపరాలతో రంకెలు వేసేరోజపుడో
చెక చెక మంటూ అంగలు నేసీ చేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి  గోగాకింతా పెట్టేదెప్పుడో
ఆశలన్ని మీ మీద పెట్టుకొని
తిరిగే మా వెత లణగేదెపుడో

పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని సూర్చుని అలగరుగా
పట్టు పరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో
తృప్తి చెంది తలలూగిస్తారు
జాలిలేని నర పశువులకన్నా
మీరే మేలనిపిస్తారూ

తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు
సంపద బెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే
మానవజాతికి బ్రతుకే లేదు




అందాలబొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి, మాధవ పెద్ది

అందాలబొమ్మ  నా అందాల బొమ్మ !
శృంగారములో, బంగారం కలిపి చేశాడే బ్రహ్మ 
నిను చేశాడే బ్రహ్మ
షోకై నబావా ఓ షోకైనబావ
ఇక గోరంతలు కొండంతలుచేసి కోసెయ్యి వావా
గోతలు కోసెయ్యిచావా!

కట్టూ  నీబొట్టూ నిగగలాడే నీ జుట్టూ అహహహ, నీ గుట్టు నీ చెట్టు
నిజమాగ వర్ణన చెయ్యాలంటే
నెలల తరబడే పట్టు - ఒట్టు

ఐ స్త్రీలల్లో చదువుకొన్న నీ, పాఠాలన్నీ ఇవియే నా ?
అయ్యవారి కడ నేర్చుకున్నదీ
ఆడాళ్ళను పొగిడే కథలేనా

కవులు వ్రాయు కావ్యాలల్లోనూ
శిల్పులు చెక్కే బొమ్మల్లోను
కొత్తగ వచ్చే నవలల్లోను
రోజూ చూసే సినిమాల్లోనూ
మహా మునీంద్రుల మనసుల్లోను
సొగసు కత్తెల వర్ణనలే కద!

సంతోషించితి చాలునోయ్ నీ చాకచక్యములు
మెచ్చినాను లె బహుమానంగా
మేకతోలు కప్పింతునోయ్





ఎంత మంచివాడవురా పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల, ఘంటసాల

పొరపాటు బడిపోతినౌరా- నేడు పరితాపపడుచుంటిని
మాయ తెరలన్ని విడిపోయెగదరా! రారా!
ఎంత మంచివాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా
ఎన్ని నోళ్ళ పొగడుదురా
ఎటుల నిన్న విడుదురా ఎటుల నిన్ను వీడుదురా

ఎంత మంచి దాననే పొరపాటు గ్రహించితివే
ఎంత మంచి దానవే పొరపాటు గ్రహించితివే
పొరపాటు గ్రహించితినే
నా ప్రేమ హరించితివే నా ప్రేమ హరించితినే

మనసులోన కోవెలగట్టీ మల్లెపూల అంజలి బట్టి
నిను నిత్యము పూజింతునురా నీ కధలే స్మరియింతునురా
నీ పూజా సుమములు బెట్టీ రకరకాల దండలు గట్టి
నీ మెడలో వేసెదనే నాదానిగ జేసెదనే

కలలే నిజమాయెనులే
జీవితమే మారినులే
ఇద్దరమూ చూపులుకలిపి ఏకంగా పోదాములే
ఏకంగా పోదాములే



రైతు మేడి పట్టి సాగాలిరా పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల, ఘంటసాల & పార్టీ

కోరస్ : అహహైఆహై - ఒహోహో ఓహోహో

హేయ్  రైతు మేడి పట్టి సాగాలిరా
లోకం వాడి చుట్టు తిరగాలిరా
రైతు మేడిబట్టి సాగాలిరా
లోకంవాడి చుట్టు తిరగాలిరా

రైతు లేంది రాజ్యం లేదు
ఈ పోచుకోలు రాయుళ్ళకు బువ్వే రాదు

రైతు మేడిపట్టి సొగాలిరా
లోకం వాడి చుట్టు తిరగాలిరా

కష్టమనక చెమట దీని కాల్వలన్ని తవ్వాలి
చాలుజూచి కొండ్రవేసి దుక్కి బాగాదున్నాలి
మనసులోని కోరికలను అదుపులోకి తేవాలి
చీకు చింతల నంత చెక్కి పార వెయ్యాలి
ఎండనకా వాననకా ఏరువాక సాగిద్దామా
వీలెరిగి వాలెరిగి విత్తనమ్ము వెదజల్లు
తడుపులలో తప్పుంటే పైరు ఎర్రబడిపోతుంది
నడవడిలో చెడుగుంటే పేరు మచ్చబడిపోతుంది

రైతు మేడిబట్టి సాగాలిరా
లోకం వాడి చుట్టు తిరగా
సోమరులై పని చెయ్యని వాళ్ళకి గూటికి గుడ్డకు లోటేను
వళ్ళు మరచి శ్రమించే వాళ్లకు జీవితమంతా సుఖమేనూ


పగలనక రెయ్యనక పండిద్దామా
పంట పండిద్దామా
పండించి లోకాన్ని బ్రతికిద్దామా మనం బ్రతికిద్దామా
పగలనక రెయ్యనక పండిద్దామా పంట పండిద్దామా
పండించి లోకాన్ని  బ్రతికిద్దామా మనం బ్రతికిద్దామా



ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు పాట సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: లీల, మాధవపెద్ది సత్యం

ఓహో ఒహోహో.
ఆహా అహాహా
జవ్వాదీ
జవ్వాదీ

ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు గోలంకొండ జవ్వాదీ
వానన చూస్తే చాలు వలపు పుట్టు జవ్వాది
హై ఝమ ఝమ ఝమ ఝమాయించు జాతిపున్గు జవ్వాది
గాలిసోకితే చాలు కైపుపుట్టు జవ్వాదీ

హై ఝమ ఝమ ఝమ 
హై ఝమ ఝమ ఝమ
హై ఘుమ ఘుమ ఘుమ
హై ఘుమ ఘుమ ఘుమ

కొరాపుట్టి అడవులన్ని కదిలించానయ్యా
నే కదిలించానయ్యా
పొదలో జవ్వాదీ పిల్ల భోక్కురన్నదయ్యా
నే వుచ్చులెన్నొ వేసీ - అహ మచ్చు ముందు పోసి
కాపేసి - కన్నేసి - పడదోసి - పట్టేసి
నే చెవులు పిండి సాధించిన చిత్రమైన జవ్వాదీ
కొండపల్లి గుట్టలన్ని పారజూస్తినయ్య
నే దారిగాస్తినయ్యా
చిరత గండులాగ అదీ ఉరిమి చూచెనయ్యా
ఆ డెబ్బ గాచుకొంటి  పెడబొబ్బ కదురుకొంటీ
అటు దిరిగి - ఇటు ఒరిగి- అబ్బో అబ్బో - అయ్యొ అయ్యొ
అదుముకొని తెచ్చుకొన్న అలవి కాని జవ్వాదీ

నూజివీడు దొరలంతా మోజు పడ్డారయ్య
డబ్బుముందె కట్టారయ్య

బడే బడే పొచ్చావులు మెచ్చుకున్నారయ్యా
అహ రాజులు పూసేదీ
మహరాణులు రాసేదీ
ఒహొ రండి - చూడండి
వాడండి - చౌకండి
ఇది మావద్దే దొరుకునయ్య మంచి రకం సరుకయ్య జవ్వాదీ

చుస్తారేమన్నా మాయన్న రామన్నా లక్ష్మన్నా
రామన్నా లక్ష్మన్నా
సూటిగ ముందుకు రారన్నా రామన్నా లక్ష్మున్నా 
రామన్నా లక్ష్మున్నా

అక్కడ వాహన ముందన్నా దిక్కులు చూస్తారన్న
ఎదురేలేదుర రామన్నా
పదరా ముందుకు లక్ష్మన్నా
రామన్నా లక్ష్మన్నా - రామన్నా లక్ష్మన్నా

హరిగోవిందం -భజగోవిందం
హరిగోవిందం - భజగోవిందం
గోనిందం - గోవిందం - గోవిందా



మాట పడ్డావురా పద్యం సాహిత్యం

 
చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాష్టర్ వేణు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల 

మాట పడ్డావురా

No comments

Most Recent

Default