Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mana Desam (1949)
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: సి.కృష్ణవేణి, చిత్తూరు.వి.నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, యన్.టి.రామారావు
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాత: సి.కృష్ణవేణి
విడుదల తేది: 24.11.1949

(ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా సి.హెచ్.నారాయణ రావు, సి.కృష్ణవేణి చేశారు, అలాగే ఇందులో హీరోయిన్ సి.కృష్ణవేణి గారే ఈ సినిమాకు నిర్మాత మరియు పాటలు కూడా పాడారు. ఇది యన్.టి.ఆర్ గారి మొదటి సినిమా ఇందులో పోలీస్ గా సహాయ నటుడు వేషం వేశారు)Songs List:జయ జననీ పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, సి.కృష్ణవేణి

జయజనసీ పరమపావ
జయజయ భారతజననీ |
శీత శైలమణి శృంగకింటా 
సింహళ జాంబూనదపీఠా
వింధ్య మహీధర మహామేఖలా

విముల కాశ్మీర కస్తూరిరేఖా
గంగా సింధూ మహానదీ
గౌతమి కృష్ణా కావేరీ
జీవసార పరిపోషిత కోమల
సస్యవిశాలా శ్యామలా
ఏమిటో ఈ సంబంధం పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: యం.యస్.రామారావు, సి.కృష్ణవేణి

ఏమిటో సంబంధం 
ఎందుకో యీ అనుబంధం 
నీలాకాశపు చందమామకూ 
భూలోకపు చెంగలువ భామకూ

వీచీ వీచని. పిల్లగాలికి
పూచీ పూయని పూలబాలకూ 
ఎందుకో - ఆనుబంధం అందుకే
అదే యీ సంబంధం

అందీ అందని మెరుపు కన్నెకూ
చిందులు వేనే నెమలి గున్నకూ
వావివరుస లేమో

ఔతారేమో బావా మఱదలు
ఐతే ఏమా అనుబంధం ?

అణువు అణువులో అనగే పెనగే
అమరానంద ప్రబంధం
యుగ యుగాలకూ జగ జగాలకూ
వెగటు వేయని తీయని బంధం

యుగ యుగాలకు జగ జగాలకూ
వెగటు వేయని తీయని బంధం

ఏమిటో ఈ సంబంధం 
ఎందుకో అనుబంధంచలో చలో రాజా పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: యం.యస్.రామారావు, సి.కృష్ణవేణి

చెలో చెలో రాజా చెలో చెలో రాజా 
ఎరుగని దొరసాని
చెలో చెలో రాజా
యెరిగి తరటు పోవోయి
పైగాలికే, తూగాడు చూ
చెలో చెలో రాజా చెలో చెలో రాజా 

తెలుసు మాకును సూటీపోటీ
కలవు మాకీ పాటీ
విడువుము, ఏదీ తమ బడాయి
చెలో చెలో రాజా చెలో చెలో రాజా

సాగెనోయీ
సాగెనోయీ మరో అడాయీ 
గెల్చుకో పందెము
జాబిలిలో కన్నె లేడితో
పైమాటగా వయ్యాళిగా 

నిలుపును వేగము
తెలిసెనా ఫలితము
నీ కోపమూ నా లోపమూ

నా లోపమే యీ పెనమూ 
చెలో చెలోరాజా చెలో చెలో రాజా |
చెలో చెలో రాజా చెలో చెలోరాజా !
నిన్ను నేను మరువలేనురా పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కీ (పి.జి.కృష్ణవేణి)

పంచదారవంటి ఫోలీవెంకటసామి 
నిన్ను నేను మరువలేనురా
వాలు గన్నులా మువ్వ వెంకటసామి 
నిన్ను నేను మరువ లేనురా 
నీకు వచ్చిందీ కోరమీసం
నాకు వచ్చిందీ దోర వయసు
ఇద్దరి మనసు ఒక్కటైతె
యెనక సింత లేనిబతుకె యెంకటసామి

కన్ను కన్ను కలిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్.
ఈడనున్న నేనేడ నున్న నీ వీడ నేనోయ్ 
ఫోలీ సెంకట సామీ
నావాడ వేనోయ్ పోలీ నెంకటసామి
సందులేదు మనకు సందమామ తోడు
అత్తలేని కోడలు ఉత్తమురాలు పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి

ఆత్తలేనికోడలు ఉత్తమరాలు ఓలమ్మా 
కోడలులేని అత్త గుణవంతురాలు
కోడలా - కోడలా - కొడుకు పెళ్లామా
పచ్చిపాల మీద మీగడేదమ్మా 
ఆ వేడిపాలలోన వెన్న యేదమ్మా

అత్తమ్మనీ చేత ఆరళ్లెకాని ఓలమ్మా 
పచ్చిపాల మీద మీగడుంటుంద
'ఆ వేడిపాలలోన వెన్నవుంటుందా? 
కొరవిలో ఆ తమ్మా గుమ్మానికంటా వచ్చిందీ 
సొమ్మానికాలంటూ పొడిచింది తేలు
అ ఎందుకిపోరని ఏడుస్తూ యాయత్త ఓలమ్మా 
మంచిదాని. మల్లె మళ్లి పోయింది.వెడలిపో తెల్లదొర వెడలిపో పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, సి.కృష్ణవేణి

వెడలిపో, వెడలిపో 
తెల్ల దొరా మా దేశపు 
యెల్లదాటి వెడలిపో

కల్ల తెలిసినారు ప్రజలు 
చెల్లదింక నీ ఆటా

కల్లబొల్లి కబురు లాడి 
కాని పగలు కల్పించీ 
కొల్లగొట్టి మా దేశము
గుల్లచేసి తిన్నావిక

ప్రజలె ప్రజల మేలు గోరి
పాలించే యుగమ్మిది
చోటులేదు మీ కిట
కడసారి మాటయిదే మూటగట్టి 
వెడలిపో - వెడలిపో
నిర్వదమేలా కన్నీరదేలా పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: చిత్తూరు. వి.నాగయ్య

నిర్వదమేలా కన్నీరదేలా (2)
భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ
నిర్వదమేలా కన్నీరదేలా...
 
ఉరికి తుపాకీల గురికీ
ఎదజూపి ఎదిరించి ఎదురు తెన్నులు గన్న

జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన (2)
వెనుకంజ లేదు మనది ముందడుగు
నిర్వదమేలా కన్నీరదేలా...
 
కడుపారగని కన్నులందుంచుకొని పెంచు తల్లి మమకారాలు తలవలేరు (2)
కన్నీరుగా కరిగి అల్లాడు ఇల్లాలు (2)
పిల్లపాపల జూచి నిలువబోరు
తల్లి ఇల్లాలు పిల్లలు సర్వసౌఖ్యాలు
దేశమే దేశమ్ము కోసమే
నేడు దేశమ్ము కోసమే...
ఓహో...ఓహో...భారతయువత పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల & కోరస్

ఓహో... ఓహో...
భారతయువత! కదలరా
భారతయువత! కదలరా
నవయువ భారత విధాయకా
భారతయువత! కదలరా

మహాత్మాగాంధీకి జై
జవహర్‌లాల్ నెహ్రూకు జై
సర్దాల్ పటేల్‌కు జై

గాంధి జవహరు పటేలజాదు
మహారథులు మన నేతలురా
మహారథులు మన నేతలురా
గాంధి జవహరు పటేలజాదు
మహారథులు మన నేతలురా

భారతయువత! కదలరా
విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా
విజాతీయ పరిపాలన చెల్లని బజాయించరా ఢంకా
భారతయువత! కదలరా

ఆంధ్రకేసరికి జై

ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా...
ఆ... ఆ... ఆ... ఢిల్లీలో లాల్ ఖిల్లా పైన ఎగరవేయి నీ జెండా

ఎగరవేయి నీ జెండా
భారతయువత! కదలరా

డాక్టర్ పట్టాభికి జై
ఆచార్య రంగాకి జై
రాజాజీకి జై

హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన
హిందు ముస్లిం సిక్కు పారసీ క్రైస్తవులేకగళాన
మనదీ దేశం మనదేశమ్మని చాటింతమురా
దేశ దేశముల చాటింతమురా
దేశ దేశముల చాటింతమురా
చాటింతమురా...

భారతయువత! కదలరా
నవయువ భారత విధాయకా
భారతయువత! కదలరా
కళ్ళ నిన్ను చూచినానే పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల, సి.కృష్ణవేణి

కళ్ళ నిన్ను చూచినానే పిల్లా 
ఒళ్లు జిల్లుమన్నదే పిల్లా 
మరి కళ్ళు మూయగానే నీ కలలే
గస్తీ తిరుగుతున్నా, కవాతులో వున్నా
ఠాణాలో కూర్చున్నా నీ పిలుపే నీ తలపే 
కల్లగాదు అమ్మతోడు

జాలిలేని మనసుమీది అమ్మయ్యో 
అయ్యో బాబయ్యో :
పోలీసుతో పొందు లాఠీల విందు
ఒద్దులే చాలు ఒద్దులే

పోవయ్యా పోలీసు మామయ్యా 
సాగిపోవయ్యా పోలీసు మావయ్యా 

పోలీసు వాడైతె మనిసి కాడా
మనసు లేదా "ఊ" అను
"ఊఁ" అంటే యీలేసి పూలల్లొ పూజిస్తా
కల్లగాదు అమ్మతోడు
కళ్లు మూయగానే నీ కలలే.

పాపం - ఇంతేనా
అందుకయితె నందయ్య మావఁలేడా! 
గారాలు చేస్తాడు గారెలొండి పెడతాడు 
నేనంటె పడిచచ్చి నెత్తి నెట్టుకుంటాడు. 
నీ పొందు నాకేల పోవయా నాకు పోలీసు పోరేల - పో - పో
వైష్ణవ జనతో పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల

వైష్ణవ జనతో

జడియకురా ధీరా... పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: చిత్తూరు వి.నాగయ్య 

పల్లవి:
జడియకురా ధీరా... జడియకురా ధీరా...
సాత్విక రణ విజయము నీదేరా... జడియకురా ధీరా
ఈ పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా
ఈ పరాజయములన్నీ రేపటి జయ ఘోషలురా
పరపీడన చెర వీడక... భరతజాతి నిదురబోదు
పరపీడన చెర వీడక... భరతజాతి నిదురబోదు
జడియకురా ధీరా... జడియకురా ధీరా...

చరణం: 
నమ్మిన చెలికాడు నచ్చిన బంటు
మహదేవ దేశాయి మారణమ్మైన
కలగెనా బాపూజీ కనులలో దీక్ష
సహధర్మచారిణి జగదేక పూజ్య
మాత కస్తూరిబా మాయమై చనిన
మరచెనా మానెనా మనసులో ప్రతిన
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
బాపూజీ మార్గమే భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
చిరునవ్వు మాసెనా వెనుకంజ వేసెనా
బాపూజీ మార్గమే భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా
భరతజాతికి దాస్య ముక్తి మార్గమ్మురా.

ఇది వెరపో - మతి మరుపో పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి

ఇది వెరపో - మతి మరుపో
ఏలనో - మనోవ్యధా 
తెలివితేటలు మరిగిపోయి
మూగవారి పోవగా
కతమేమో చెడు కలగా 
బ్రతుకు గతే మారెనా

రూపు వేరాయె - చూపుమారె
పలుకులేనే లేదే
గెలుపు నాసించు మాజాతి

జయపతాక జారిపోవునా 
కదనసీమ కెదురుపోయి
తలమోసి కనిన మహా
ఫల మిదేనా ఇదేనా 

ఇది వెరపో శ్రీమతి మరపో 
ఏలనో మనోవ్యధా 

బావను మెప్పించాలి పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి

బావను మెప్పించాలి
తనదే తప్పని ఒప్పించాలీ

వలెటూరి బావకు, బస్తీ
పిల్ల తడాఖా చూపించాలీ
తీరు తీరు పాకాలూ 
జపాల బావ తినగానే
కను తెరచీ మడి విడచీ
మనసు మార్చుకోవాలీ

ట్రిక్కు తెలిసి మా బావ
ముక్కుమీద వ్రేలెయ్యాలి. 
కాయక్కాయ - చెల్లంటూ 
ఫక్కున నే నవ్వాలిమాటమర్మమూ నేర్చినవారూ పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి & కోరస్ 

శోభ:
మాటమర్మమూ నేర్చినవారూ
మనసూ మమతాతీర్చేవారూ 
పెద్దలుపిన్నలు సూత్తారంటా 
ముద్దులు విద్దెలు సూపించూ
డూడూ డూడూ బసవన్నా

వచనం:
ముద్దులు సూపించేవ్ గాని
ముందీ మాట చెప్పు ఎక్కడ పట్టావ్ ఎద్దుని ?

శోభ :
ఎద్దూ. గిద్దూ అనటోకు ఎఱ్ఱమొగమా 
కళ్లుపోతాయి కాశీలో పట్టా మా నందీశ్వరుణ్ణి 
కాలు దువ్వదూ దువ్విందంటే
నేలా నింగీ చూడదూ
ఓయి జంకూ గొంకూలేనిరాజా 
సవాలుచేస్తా కాసుకో
ఆది సరేగాని నీయెద్దుతారీ ఫేందో సెప్పుకోమరి

నా ఎద్దు కేంరా సింధులో పట్టా?
ఐతే బలే బహుద్దూరీ
కలుగు పఠాణీ ఇదో బిరుదునిషానీ
ఆడుగే, లడాయిరా గెలుచుట ఖరారురా 

ఏయ్ : మాటలతోమన్నిస్తారా మా
రాజులు ఆటసూపించు

సుద్దున సత్తెం చూస్తారంటా
బిరుదునిషానీ ఇస్తారంటా 
మూటలువిప్పీ మూపుల పైన 
కాశ్మీరుశాలువ కప్పేరంటా
రానందయ్య రానందయ్య.
కిటకిట తానెతానే తందాన తందనాన 
కిటకిట తానెతానే తందాన తందనాన
తోడునీడగా మీరు ఉండరన్నా
వేరైతే మర్యాద ఉండదన్నా
పొందుగా, కమా విందుగా ఆడరాజోడుగా
ఆరెదిద్ది ఆరెదిద్ది దిద్ది దిద్ది జయహో... జయహో...మహాత్మగాంధీ పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: కోరస్ (బృంద గాయనీ గాయకులు )

జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ
జైబోలో, జైబోలో, బోలో, బోలో, జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
జైబోలో, జైబోలో, బోలో, బోలో, జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
పరాధీనతా బంధ విమోచన
మహాపర్వ మీ శుభదినమూ
అభంగ స్వేచ్ఛా రణాంగణములో
సాహసానికిది ఫలమూ

జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ

స్వతంత్ర మానవ జాతులలో
మన మాటకు విలువా...
మనకొక జెండా లభించె నేటికి
ఇక ఏనాటికి మనదే మనదే
మనదే మనదే మనదేశం...
తానతందాన. తందానతానా పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి 

శోభ:
తానతందాన తందానతానా
దారులుగాచే రాజు సేనలు 
దాసీలక్ష్మిని పసిగట్టారు.
నిలు నిలు నిలు మని దారులుగట్టి
పద పద పద మని రెక్కలుగట్టి 
పరాసు వారితో బేటీ నున్న
ప్రభువు లెదుట పెట్టి తందానతాన

వచనం:
అప్పుడు విజయరామరాజు దాసీలక్ష్మితో 
చినరంగారావు మేనమామ యింటికి దాటిపోతున్నాడనిపోల్చి 
బొబ్బిలి కూన పరారౌతుంది. కావలిస్తే పరీక్ష చెయ్యమని దొరగారితో చెప్పాడు

బుస్సీగారు సరేనని ఏమన్నారయ్యా 

పళ్లు మిఠాయిలు బల్లనుంచెను పరాసుదొరగారూ 
పచ్చలబాకు నుంచినారయా పళ్లకు పెడగాను
ముద్దులాడుచు వెలమవీరుని ముందుకు విడిచారు
తానతందాన తానతందాన

విడిస్తే...

చరచర బల్లమీదికి పరుగుదీసినాడు
పచ్చల బాకే బొబ్బిలి బాబు పట్టిఎత్తినాడు
వహ్వా భళి భళి భళి పౌరుషమ్మని
బాలుని పైకెత్తి.... తందానతాన తానతందాన

వచనం:
అప్పుడు విజయరామరాజు నెలమందలించాడయ్యా

వంత:
లేని పోని రోషాలకులోనై కానిపనులుచేసి
కక్షలు పెంచి దేశద్రోహులై కసినివీడరేల మచ్చరాలతో 
మీలో మీరే రచ్చకెక్కనేల ఛీ చాలుచాలు మీ సాహస మింకనాలు పొందనంగ 
వెలవెలబోయి వెనుకకు మరలె విజయరామరాజు..... 
వెంటనంటి నా భటులు చల్లగా వెడలిపోయినారు
తందాన తాన తానతందానమావాఁ నందయ మావాఁ పాట సాహిత్యం

 
చిత్రం: మనదేశం (1949)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: సి.కృష్ణవేణి 

మావాఁ నందయ మావాఁ 
అందుకో నన్నందుకో
నా అందాలే నీ కళ్ళకు
బందాలోయ్ మావాఁ 
చుక్కనోయ్ నీ నొసటా చాదూ 
చుక్కనోయ్ నీ రొంటా చెక్కా 
ముక్క నోయ్ ఇంకెవరికి నేను 
చిక్కనోయ్ -మావాఁ నందయ మావాఁ 
పలకమన్నా సలకనోయ్
పంచదార చిలకనోయ్.
వెలిశానోయ్ నీ కోసం
తెలుసుకో ఎవరో తెలుసుకో 
నందయ మావా 

No comments

Most Recent

Default