Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sri Rama Bantu (1979)
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి, పూర్ణచంద్రరావు
నటీనటులు: చిరంజీవి, హరిప్రసాద్, గీత, సత్యకళ, అనిత, జయవాణి, మోహన్ బాబు
మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: ఐ. యన్. మూర్తి
నిర్మాత: యారగుడిపాటి. వరదా రావు (వై.వి.రావు)
విడుదల తేది: 03.08.1979Songs List:కొడుకో నా మేనత్త కొడుకో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

పల్లవి :
కొడకో, నా మేనత్త కొడకో
వగలే సొంతం అనుకో దిగులే లేదు ఇనుకో
ఎల్లుండే కాశి పొద్దున చేసుకో పెళ్లి చేసుకో

చరణం: 1
సూపు కలిసిన సుబలగ్గంలో సురుకు మందిర నామనస-
సేయి కలిపిన సాయంత్రంలో పేరుకు తీపి 4/8 c
అందాలన్నీ—నేచందాలిస్తా
ఈడోజోడో -- తాడో పేడో
ఈడోజోడో తాడో పేడో తేల్చేసుకో

చరణం: 2
పుట్టిననాడే పదహారేళ్లు
రానే రాదుర పదిహేడు
బావలు మామలే నాకున్నోళ్లు వరసకు చెల్లీ అనలేరు
అందాలన్నీ నేపందెం వేస్తా-
వయసో మనసో—వరసో తెలిసీ
వయసో మనసో వరసో తెలిసీ వాటేసుకో
సీతమ్మ సిగ్గు పడింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పల్లవి:
సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది.
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళ

చరణం: 1
కౌగిలినే కోవెల చేసి
మమతలనే మాలలు వేసి
అందాలన్నీ హారతులిచ్చి 
పులకింతలతో పూజలు చేసి 
ఏ వరాలు అడిగిందో ఆ జవరాలు
ఎవరికి తెలుసమ్మా ఆ వివరాలు

చరణం: 2
మల్లెలతో మంతనమాడి
జాబిలితో జాబులు పంపి
సిగ్గుల ముంగిట ముగ్గులు దాటి
వెచ్చని ఊపిరి వేణువులూది 
ఏ శృతిలో పాడిందో ఈ అనురాగం
ఎవరికి తెలుస్మూ ఆ రామాయణం
పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి: 
పూతరేకులాంటి పిట్టరో  
దాని పులకరింత పంచుకుంటరో
దీని పులకరింత అందుకుంటారో 
పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా 
అహ పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా

కోర వయసు కోడి పుంజురో
ఆడు కుర్రకారు దోర గింజరో
ఈడి ముద్దు ముదురుతున్న ముంజరో
పరువాల గిత్తా దీన్ని పట్టేది ఎట్టా ?

చరణం 1
సన్నగ చిన్నది నవ్విందంటే సన్నజాజి పూసే
కుర్రది వర్రగ నడిచిందంటే కూచిపూడి వెలిసే
ఆమాట నువ్వంటే నీ మనసు నేవింటే
చలి పెరిగి రమ్మంటే మెలి తిరిగి పోతుంటే
అన్నట్టు వున్నట్టు నీ నడుమే
ఉలికి ఉలికి పడుతుంటే కూతవిద

చరణం: 2
చూసిన కన్నుల కాసిన వెన్నెల - ఎండకన్న ఉడుకు
జాజులు వాడిన ఆశలు రేగిన మోజులెంత దుడుకు
నెలవంక నాకోసం ఇలవంక దిగివస్తే
నేలేత ఎన్నెళ్లే నన్నల్లుకుంటుంటే
నాముద్దు నీముద్దు ఇద్దరికీ నిద్దర చెదరగొడుతుంటేసీతమ్మ సిగ్గు పడింది (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళరామబంటు నేనేరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు 

రామబంటు నేనేరా 
శ్రీరామ బంటు నేనేరా
రక్కసి మూకల ఉక్కడగించి 
రామకార్యమున తీర్చగ వచ్చిన 

రాం రాం రాం రాం 
జై  రాం రాం రాం రాం 

పదితలులున్న పతితులెరుగరు 
మగువకు మానమే ప్రాణమురా...
అరె కుంక బుద్దులు లంకకు చేటని 
అంబ పలికి నీ పంబ అదరగా 

కళ్ళు  నెత్తినెక్కి నందుకు 
కన్నె పిల్లల్ని చెరబట్టి నందుకు 
కన్నె కొంపల్నెన్నో కాల్చినందుకు 
పల్లె పంటల్నెన్నో దోచినందుకు 
కొట్టు ఎద్దు తోకకు ఎన్నుపోటు పొడిచి 
నిండు ప్రాణాలెన్నో తీసినందుకు 

రాం రాం రాం రాం 
శ్రీ  రాం రాం రాం రాం 

నీ పుటకే బారం నివు బ్రతికుండడమే నేరం 
శీలాపహరణం చేసినందుకు చేస్తా చూడర వస్త్రాపహరణం
వళ్లు బలిసి ఉన్నందుకు కుళ్ళు బుద్ది పుట్టినందుకు 
సంపు కల్లుతాగి తూలినందుకు  నిప్పుతోటి పేలినందుకు 
చెప్పు అడ్డమైన గడ్డి గొడ్డులాగా గతికి వడ్డూ పొడవు పెరిగినందుకు 
కొడతా తిడతా భరతం పడతా రామరామ రఘురామ పరాత్పర పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు & కోరన్

వచనం : 
అప్పుడు హనుమంతుడు తన స్వామి శ్రీరామచంద్రుని వుంగరాన్ని సీతాదేవికి భక్తితో సమర్పించి 
"నీ కష్టాలు తీరే సమయం సమీపించింది. త్వరలో రామచంద్రమూర్తి రావణాసురుని జయించి నిన్ను గ్రహిస్తాడు తల్లీ" అన్నాడు. 
అసలు ఎవరయ్యా హనుమంతుడు ? రామకార్య దురంధురుడు, శ్రీరామ పాదసేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న పుణ్యమూర్తి, నాటికీ, నేటికీ, చిరంజీవి. 
మరి ఎక్కడ వుంటాడా హనుమంతుడు...?

శ్లోకం :
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్ప వారి పరి పూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

వచనం : 
ఎక్కడెక్కడ తన స్వామి శ్రీరామచంద్రుని నామసంకీర్తనం జరుగుతుందో
అక్కడ, రెండు చేతులూ జోడించి ఆనంద భాష్పాలు రాలుస్తూ కూర్చుని
వుంటాడుట ఆ భక్త శిఖామణి. అణు క్షణం ఆ మారుతి జపించే తారకమంత్రం ఏమిటయ్యా....?

రామదాసు:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రధాంగ ధరఘన, పతంగ వాహన
రమారమణ నారాయణా

చారుశీల సురలోల నిరంజన
సత్వపరాయణ సువిధామా
జానకి రమణా ధనుజవిరమణా
మారుతి పూజీత శుభచరణా

కోరస్:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రామదాసు :
రధాంగ ధరఘన పతంగ వాహన
రమారమణ నారాయణా...
రామ రామ రామ సీతా - రామ రామ రాం

కోరస్ :
రామ రామ రామ సీతా రామ రామ రాం


No comments

Most Recent

Default