Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

K.G.F: Chapter 1 (2018)చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
నటీనటులు: యాష్ , శ్రీనిధి శెట్టి,
దర్శకత్వం: ప్రశాంత్ నీల్
నిర్మాత: విజయ్ కిరగందుర్
రిలీజ్: వారాహి ఫిలిమ్స్
విడుదల తేది: 21.12.2018చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనన్య భట్

తరగని బరువైన వరమని అనుకుంటూ
తనువున మోసావే అమ్మ
కడుపున కదలికలే కలవర పెడుతున్న
విరివిగా పంచావే ప్రేమ
కను తెరవక ముందే కమ్మని నీ దయకు 
రుణపడిపోయింది జన్మ

తందాని నానే తానితాందానో తానే నానే నో
తందాని నానే తానితాందానో తానే నానే నో

చితికిన బతుకులలో చీకటి అడిగింది
వెతికే వేగు చుక్క ఎక్కడని
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగా ఎన్నాళ్ళని
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నానని

తందాని నానే తానితాందానో తానే నానే నో
తందాని నానే తానితాందానో తానే నానే నో
తందాని నానే తానితాందానో తానే నానే నో
తందాని నానే తానితాందానో తానే నానే నోచిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్ విజయ్ యువర్స్, సంజోష్ వెంకీ, సచిన్ బహ్రూర్, మోహన్ కృష్ణ, హెచ్.ఎస్. శ్రీనివాస మూర్తి, పునీల్ గుర్రనాగ్

చల్నే క హుకుమ్
రుఖ్నే క హుకుమ్
జిందగీ పే హుకుమ్
మౌత్ పే హుకుమ్

బందూక్ పే హుకుమ్
దుష్మన్ పే హుకుమ్
లెహరోన్ పే హుకుమ్
బొంబాయి పే హుకుమ్

జాను బొంబైక
జాను బొంబైక
జాను బొంబైక జాన్ రే

విడి అడుగుల్లో పిడుగు దాగుంది
అంతు చూస్తుంది భాగ్ రే
ఆగ్ తూఫాన్ జబ్బి మిల్తా హై
హైస బరూచ్ ఫైదా హోతా
యే ఖుదా జర దేఖో

జగమేలుతున్న సుల్తాను వీడే
జగదానికొస్తే సైతాను వీడే
యే ఖుదా జర రోఖో

గన్నంచుల్లో ధమ్కీ కరుణే లేని కల్కి
బొంబాయ్ కి గలియో గబ్ రాకే కైసా సాలా

సలాం రాఖీ భాయ్ - రాక్ రాక్ రాఖీ
సలాం రాఖీ భాయ్
సలాం రాఖీ భాయ్ సలాం రాఖీ భాయ్
ఇలాఖా తేరా భాయ్ తు హే సబ్ కా భాయ్

అన్నీ తానై పెంచిన 
అడుగు పరుగు నేర్పిన
అమ్మ మాటే మంత్రం

నిప్పు నొప్పి తెలిసిన
తప్పు ఒప్పు మరిచిన
గెలుపే వీడి సూత్రం

అక్షౌహిణి బలమైన
ఇతగాడి పయనాన్ని ఆపేనా
అణ్వస్త్రపు అలలైనా
ఈ ధీరుడి కొనవేలు కదిపేనా
చర్చి జ్యాదా హై హాత్ లోహా హై
డర్ కో బేచేగా జాన్ ఘంట హై

హట్ జర... ఖత్రా హై

గన్నంచుల్లో ధమ్కీ కరునే లేని కల్కి
బొంబాయ్ కి గలియో గబ్ రాకే కైసా సాలా
సలాం రాఖీ భాయ్

సలాం రాఖీ భాయ్ - రాక్ రాక్ రాఖీ
సలాం రాఖీ భాయ్
సలాం రాఖీ భాయ్ సలాం రాఖీ భాయ్
ఇలాఖా తేరా భాయ్ తు హే సబ్ కా భాయ్చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనన్య భట్ , శ్రీకృష్ణ , మోహన్ కృష్ణ, సంతోష్ , ఆదిత్య నారాయణ్, హెచ్. శ్రీనివాస మూర్తి, లోకేశ్వర్, గంట రితేష్

ఎవ్వడికెవ్వడు బానిస
ఎవడికి వాడే బాద్ షా
ఒత్తి చూసే తొత్తు కొడుకుల
నెత్తెక్కి ఆడేయ్ ధింసా

ఉరిగా బిగిసే తాడే
ఊగే ఉయ్యాలా
కరిగే మనసే మరిగి
పోనీ లావాలా

ఆయుధమే ఆగ్రహాలా జ్వాలా
రగిలే చూపులు మౌన శంకారావంలా
ఎగసే ఊపిరి యుద్ధ బేరి నాదంలా
నిర్జించరా దౌర్జన్యన్నీ వేళా

ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా

ఆధారామోస్ ఆధారామోస్
ఆధారామోస్ ఆధారామోస్

నా ఆణువణువూ నీవుగా
ప్రతి క్షణము నీదిగా
వేచా కాలమే సాక్షిగా
నీ ప్రతి పదమున జాడగా 
జయగీతము పాడగా
లేనా వీడనీ తోడుగా

ఒదిగి మదిరి ఉన్నా ఓర్పే నిప్పల్లే
అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే
కత్తిదూసే సైనికుడై రారా
బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే
బడుగు జీవుల ఆశ దీపం నువ్వేలే
కన్నీళ్లు తుడిచే నాయకుడైరారా

ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా

ఆధారామో ఆధారామోస్
ఆధారామో ఆధారామోస్చిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీకృష్ణ , మోహన్ కృష్ణ, సంతోష్ , ఆదిత్య నారాయణ్, హెచ్. శ్రీనివాస మూర్తి, లోకేశ్వర్, గంట రితేష్, అనన్య భట్ , విజయ్ యువర్స్

అదిగో పెను నిశ్శబ్దం పగిలి
ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి
ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

అదిగో పెను నిశ్శబ్దం పగిలి
ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి
ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం

ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా
ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెరతీసే వెలుగైరారా

ఢమఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకులతల తెంచక
మానదు లేరా ఈ చైతన్యం

ఢమఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకులతల తెంచక
మానదు లేరా ఈ చైతన్యం

చెడు కొడుకులతల తెంచక
మానదు లేరా ఈ చైతన్యం

అమ్మమాటిది కన్నా నీకొరకు
జన్మమన్నది ఒంటరి కడ వరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పదమై సాగరా

ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా
ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారా

ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగైరారా
ధీరా ధీర ధీర... ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రారాచిత్రం: కె.జి.యఫ్ చాప్టర్ 1 (2018)
సంగీతం: రవి బస్సుర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనన్య భట్, అభినవ్ భట్

అలసిన ఆశలకు నేస్తంగా
గుండె బలపు అండై నేనుంటానమ్మా

చెదిరిన కలలకు చేసాయంగ
రెక్కతోడై నే నడిపిస్తా నమ్మా

అందరికీ నీడై నిలిచే గగనంలా
వెన్నెల నిస్తుంది నా ప్రేమా

తందాని నానే తానితాందానో తానే నానే నో
హే తందాని నానే తానితాందానో తానే నానే నో
తందాని నానే తానితాందానో తానే నానే నో
హే తందాని నానే తానితాందానో తానే నానే నోNo comments

Most Recent

Default