Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: నర్తనశాల (2018)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మహతి స్వరసాగర్, సమీర భరధ్వాజ్
నటీనటులు: నాగసౌర్య, కాశ్మీర, యామిని భాస్కర్
దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి
నిర్మాత: ఉష మూల్పూరి
విడుదల తేది: 30.08.2018

హా ఎగిరెనే మనసు సీతాకోకలాగా
ఎగిరెనే ఎపుడు లేదిలాగా
నువ్విచ్చిన రెక్కల వల్లేగా
చుక్కల్లో విహరిస్తున్నాగా..

మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
మెరిసెనే మైమరచిపోయేలాగా   
నువ్వద్దిన రంగుల వల్లేగా
సరికొత్తగ కనిపిస్తున్నాగా

తొలిసారి పెదవి గమ్మంలో
చిరునవ్వే అడుగుపెట్టింది
కడదాకా ఉండిపోతే బాగుండనిపిస్తోంది

తొలిసారి గుండెసడి లోకి
అలలాంటి అల్లరొచ్చింది
ప్రతిసారి కావాలంటూ అడగాలనిపిస్తుంది

 ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే
  ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే
 
చల్లగా చిరుగాలై చుట్టేశావుగా హో..
మెల మెల్లగా సెగలోకీ నెట్టేశావుగా హో..
నాలో నే నవ్వేస్తున్నా నాకై నే వెతికేస్తున్నా
నీలాగే కనిపిస్తున్నా హయ్యాయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందే లేదు
తొలిసారి కావాలందీ నిన్నేలే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే

No comments

Most Recent

Default