-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Chalasani Gopi"



చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బాప్పీ లహరీ 
నటీనటులు: మోహన్ బాబు, మమతాకులకర్ణి 
దర్శకత్వం: కె.యస్.ప్రకాష్ 
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 22.07.1992



Songs List:



జి. టి. రోడ్డు మీద కొట్టయ్య పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బప్పి లహరి 
సాహిత్యం: గురుచరన్ 
గానం: యస్.పి. బాలు, మల్గాడి శుభ 

జి. టి. రోడ్డు మీద కొట్టయ్య




ఆ పూల రంగు నీ చీర చెంగు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బప్పి లహరి 
సాహిత్యం: రసరజు 
గానం: కె. జె. జేసుదాస్, చిత్ర 

ఆ పూల రంగు నీ చీర చెంగు 




బుల్లి బుల్లి లోకముంది పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బప్పి లహరి 
సాహిత్యం: గురుచరన్ 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

బుల్లి బుల్లి లోకముంది 




దేవుడన్నో దండం పెడతా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బప్పి లహరి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

దేవుడన్నో దండం పెడతా 




ఓయబ్బో ఇదేమి దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగ పోలిస్ (1992)
సంగీతం: బప్పి లహరి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

ఓయబ్బో ఇదేమి దెబ్బ 

Palli Balakrishna Wednesday, July 13, 2022



చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవి
దర్శకత్వం: ఈరంకి శర్మ
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 01.03.1979



Songs List:



ఏమండీ ఏమనుకోకండి పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల 

ఎమండీ యేమనుకోకండీ
ఆకుచాటు మొగ్గనూ రేకు విడని పువ్వునూ
అనుభవం లేనిదాననూ ఏంచేయను ఏంచేయను ॥ఏమండీ॥

గుండె దడదడమంటోందీ గొంతు కెండుకు పోతోంది
చేతులాడ కున్నవీ చెమటలు పోస్తున్నవీ
జీవితంలో ఏమీ యెరగను కాగితంలో యేం రాయనూ
మహారాజ రాజశ్రీ సత్యం....
కాబోయే శ్రీవారూ కావాలని కోరారూ
మబ్బునే బతిమాలనా హంసను వెతుకాడనా
రాయబారులు యెవరూ లేరు సాహస మన్నది అసలేలేదు
ఏం చేయనూ ఏం చేయనూ ॥ ఏమండీ॥

ఎంత సొగసరి మావారూ ఇంతగా ననువలచారూ
మిధిల కొచ్చిన రాముడై మధుర కొచ్చిన కృష్ణుడై
నేడు వాకిట వేంచేశాడే హారతైనా యివ్వలేదే
ఎం చేయనూ ఎం చేయనూ ॥ ఏమండీ॥



హే బేబీ కానీ కానీ కైపులోన పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, రమోల 

హేబేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి ఆడనీ
కాని కాని కాని కాని
ఇలాంటి రేయిరాదు హాయిరాదు రాదనీ
తెలారు ఆడి అలవనీ కాని కాని కాని కాని

ఉన్నవయసూ... - ఊఁ 
ఊరుకోదు..........- నిజమా
ఊరుకుంటే ఉండిపోదు.... - అబ్బా 
మరీ
మనసు మనసు అనకు - వలపులోన పడకు
హద్దు గీసుకోకు ఆశ అణచుకోకు
అనుభవించు ఉన్నదానిని కాని కాని కానీ.
మిగుల నీకు రేపు ఉందని కాని కాని కానీ

పగలూ రేయీ - ఆఁ
తలపులేదు - ఓహో
మొదలు తుదీ అసలులేదు - ఆఁ లేదు
నీది నాది లేదు నీతి జాతి లేదు
వెనక చూపులేదు ముందు ఆపులేదు
మనిషి పశువు కాడు కాడనీ కాని కాని కానీ
గతము నెమరు వేయరాదనీ కాని కాని కానీ




ఇంత మంచివాడివైతే పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్ 

యింత మంచోడివైతే బావా బావా బావా
పనికిరావు దేనికీ యింతో అంతో గడుసుదనం వుండాలి
పురుషుడికి మగపురుషుడికీ
యింతో అంతో గడుసుదనం వుండాలి

అల్లరంటే నీ కసలు నచ్చదేమి
ఆడపిల్లకది శానా యిష్టం కిస్మీ కిస్మి
NOT NOW
మరి when?
పెళ్ళి కావాలీ పెదవి కలవాలి
అంతవరకు దూరంగా వుండాలి
అయ్యయ్యయ్య
కన్నెపిల్ల పక్కనున్నా కన్నెత్తి చూడవు
తప్పు తప్పు తప్పు
పైటకొంగు జారేస్తే పక్క కెళ్ళి పోతావు
అదే వొప్పు చొప్పు
కాలుకాస్త తగిలిస్తే సారి సారి అంటావు
కన్ను కోడితే నలకేదో పడ్డదంటావు
పోనీ ఊదమని దగ్గరొస్తే వణికి వణికి పోతావు
లేక వొడిసి పట్టుకోనా ?
అబ్బో ఆమాత్రం కూడానా 
నా వయసు వన్ నైన్ నీ వయసు టూవన్నూ
కాదు నైంటీన్, ట్వంటీవన్
యస్సూ మన ఈడు మనజోడు నీతోడు ఫైను
అందుకనీ
అందుకనే
నన్ను చేసుకో వైఫు యింక చూసుకో లైఫు
జాగుచేస్తే నా వయసు అవుతుంది నైనువన్నూ
పోనీ అప్పుడైన వోపికుంటే నేను నిన్ను కాదన్నూ
నువ్వు కాదన్నా నేను వదలనూ
నువ్వు వదిలావా నేను బతకనూ




అందాల రాముడు పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం 

అందాలరాముడు సీతను కౌగిట పొదిగిన శుభదిన మీనాడు
అందాల సీతను రాముడు కౌగిట పొదిగిన శుభదిన మీనాడూ

శ్రీ శ్రీరాము డేలిందీ అయోధ్యనైతే
మా శ్రీవారు యేలేది నా జీవితం
ఆ సీత కదిపింది శివధనుస్సు నయితే
నా ఈ సీత కదిపింది నా మనసునే

వాల్మీకి రాసింది తొలి కావ్యమయితే
మన వలపే దాని తొలి భాష్యమూ
లేదు వనవాసం మనది సహవాసం
ప్రతిరోజు పట్టాభి షేకం
ప్రతిరోజు పట్టాభిషేకం

రాజ్యాలు భోగాలు వలదని ఆ సీతా
ఈ పార్వతె పుట్టింది నా కోసమే
తెల్లని మంచంటి చల్లని స్వామికై
నే తపస్సునే చేశాను ఈ జన్మలో
ఆ శివుడు మన్మధుని మసి చేసినాడు
నీ ప్రియుడు నేడు బ్రతికించుతాడు
నువ్వే నా వరము - నేనే నీ సగము
మనజీవితాలే ఆదర్శమూ
మన జీవితాలే ఆదర్శమూ




కన్నువంటిది ఆడది పాట సాహిత్యం

 
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)
సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

కన్నువంటిది ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ
తనువున యెక్కడ దెబ్బతగిలినా కన్నే యేడ్చేది
మనలో యెవ్వరు తప్పు చేసినా
స్త్రీకే శిక్ష పడేది - స్త్రీకే శిక్ష పడేది

తప్పటడుగులు మాన్పించీ తప్పువొప్పులు నేర్పించారూ 
తలుపుచాటూ తల్లిచాటూ దాటకుండా పెంచారూ
కనురెప్పలుగా కాపాడారు కంటిని ముల్లు కాటేస్తే
ముల్లుకే కంటిని అర్పిస్తారా
ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం

సీతా అహల్యలున్నారూ ఈ కలికాలంలోనూ
తాము చేయని నేరములకు శిక్షలింకా పడుతున్నారు
రాముడు యేడీ అహల్యకు భూదేవేదీ సీతమ్మకు
కన్నతల్లివున్నా మరలా కడుపులోకి వెళ్ళేదెలా 

Palli Balakrishna Monday, January 28, 2019



చిత్రం: గజదొంగ  (1981)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్. టి.రామారావు, జయసుధ, శ్రీదేవి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: చలసాని గోపి, కె.నాగేశ్వరరావు
విడుదల తేది: 30.01.1981



Songs List:



# పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980) 
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

పల్లవి: 
నీ ఇల్లు బంగారంగాను 
నా ఒళ్ళు సింగారంగాను 
జోరుమీద ఉన్నావు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా

నీ ఇల్లు బంగారంగాను 
నా ఒళ్ళు సింగారంగాను 
పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా 
మురిపాల మీగడంతా తోడిపెడతావా 

GOLDMAN.. అహా ...  GOLDMAN

చరణం: 1
బంగారు కొండమీద శృంగార కోటలోన 
చిలకుంది తెమ్మంటావా.. చిలకుంది తెమ్మంటావా 
రతనాళ రాతిరేళా పగడాల పక్క చూపి  పలికింది రమ్మంటావా 

ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా
హారాలకే అగ్రహారాలు రాసిస్తా 
అందాల గని ఉంది నువ్వు చూసుకో 
నీకందాక పని ఉంటే నన్ను చూసుకో 

చరణం: 2
వజ్రాలవాడలోన వైఢూర్యమంటి నన్ను 
వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా 
ముత్యాల మేడలోనా మాణిక్యమంటి నన్ను ముద్దాడ వస్తుంటావా 

వరహాల పందిట్లో విరహాలు నీకేల 
రతనాల ముంగిట్లో రాగాలు తీయాల 
మేలైన సరుకుంది మేలమాడుకో 
ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో




ఇంద్రధనస్సు చీర కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట
ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట

చరణం: 1
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా
ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో
ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే
ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే

ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట

చరణం: 2
ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితెనేలో తానమాడించానా
పరువమనే పల్లకిలో అందమనే బాలికలా
వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపుల
పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో

ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట



అల్ల నేరేడు సెట్టుకాడ.. పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ  (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

పల్లవి:
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
ఊసులెన్నో చెప్పినాడే.. ఉట్టిగొట్టీ పోయినాడే
ఊసులెన్నో చెప్పినాడే.. ఉట్టిగొట్టీ పోయినాడే

అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ
అందమంతా ఆశపెట్టి.. అందకుండా పోయినావే
అందమంతా ఆశపెట్టి.. అందకుండా పోయినావే

అల్ల నేరేడు సెట్టుకాడ.. గున్న మావిళ్ళ గుట్టకాడ

చరణం: 1
ఎండల్లో..ఓ..కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
ఎండల్లో..ఓ..కొబ్బరాకు నీడల్లే పండుకొంటే
చీరకెన్ని సారెలంటాడు.. నీ చీరకెన్ని మూరలంటాడు
ఈ మూరకెన్ని ముద్దులంటాడు

అంటదు అంటదు అంటావే... చంటిదానా
అంటదు అంటదు అంటావే... చంటిదానా
అంటకుండా నేను ఉంటానా.. కంటితోనే పిలవకుంటానా..ఆ
అంటకుండా నేను ఉంటానా..ఆ.. కంటితోనే పిలవకుంటానా..ఆ
కౌగిలింతై..కలవకుంటానా..

అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ..

చరణం: 2
చుక్కాల చీరకట్టి.. చుక్కలేళ్ళకు వస్తుంటే..
చుక్కాల చీరకట్టి.. చుక్కలేళ్ళకు వస్తుంటే..
లేడి చుక్క ఏరమంటాడు..నాకు చుక్కలే మక్కువంటాడు
ఆ లేడి చూపులెందుకంటాడూ..ఊ

అంటడు అంటడు అంటావే..ఏఏ..కొంటేదానా
ఆయ్..అంటడు అంటడు అంటావే..ఏఏ..కొంటేదానా
అంటితలకు నీళ్ళుపొయ్యనా..ఆ..జంటవలపు ధుపమెయ్యనా
అంటితలకు నీళ్ళుపొయ్యనా..ఆ..జంటవలపు ధుపమెయ్యనా
ఇంటి తలపూ..గడియ వేయనా..ఆ

అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ
అల్ల నేరేడు సెట్టుకాడ..గున్న మావిళ్ళ గుట్టకాడ..
ఊసులెన్నో చెప్పినాడే..ఉట్టిగొట్టీ పోయినాడే
అందమంతా ఆశపెట్టి..అందకుండా పోయినావే




చుప్పనాతి చండురుడు పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చుప్పనాతి చండురుడు



ఇదో రకం దాహం.. పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి, కె.చక్రవర్తి

పల్లవి:
ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..ఆ.. 
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆ..ఆ..హా..ఆ

ఇదో రకం దాహం..అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..ఆ.. 
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..ఆ..ఆ..హా..ఆ

చరణం: 1
అర్రెర్రే..ఏ..ఏ.. కరెంట్ పోయిందే..
ఆ..అమ్మో..నాకు భయమేస్తుంది..
హ..హ..హ.. ఏం భయంలేదు నాదగ్గరగా రా
ఎక్కడ..?.. ఇక్కడే..
హు..మూ..ఎక్కడ...? 
ఇటూ..ఇటూ..అ..అ..అదీ..సుజా..ఆ
ఊహ..సుజా..మై డార్లింగ్..మూ..ఉహా..సుజా..ఆ

మసకలోనే..మనసుతీరా అల్లుకుంటున్నా..ఆ
ఇరుకులోనే..వలపుతీరా ఇల్లు కడుతున్నా..ఆ
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
నరనరాలలో..ఓ..ఓ నస..నసగా..
నాలో..నీలో గుస గుసగా..
గుండె గుప్పెడయిపోతుంటే..గుట్టు చప్పుడయిపోతుంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ..

ఇదో రకం దాహం..అదో రకం తాపం

చరణం: 2
ఇదిగో..ఇదిగో...ఏవి..ఏవిటయ్యా
అరగంట నుండి చూస్తున్నా..ఇది జైలు అనుకున్నారా..?
మీ ఇల్లు అనుకున్నారా.ఆ.? చూడలేక చస్తున్నాను వెధవది..

హ..హ.. చూడలేక చస్తున్నాడంట హ..హ పాపం..
అయితే ఓ పని చేద్దాం...

మళ్ళీ ఏమిటది..ఏమిటది శబ్ధం..?
దోమలయ్యా బాబు చచ్చిపోతున్నాం..చంపలేక..
హ..హ..హ..హ..హ..హ..హ..

పెదవి తాకి పెదవి దాహం పెరిగిపోతున్నా..ఆ..ఆ..
జరగనున్నది జాము రాతిరి..జరిగిపోతున్నా...ఆ..
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ..
కన్నుల కరిగే కాటుక..వెన్నెల విందుల కానుక..ఆ.

కౌగిలింతలో..ఓ..కసికసిగా..ఆ..ఆ.
కరుగుతూ వుంటే..ఏ..ఏ..గజిబిజిగా..ఆ
ఇద్దరొక్కటయిపోతుంటే..ఒక్కరిద్దరయి ముద్దంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..ఆ




ఒక రాతిరి ఒక పోకిరి పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి

ఒక రాతిరి ఒక పోకిరి




రెండక్షరాల ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: గజదొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

రెండక్షరాల ప్రేమ

Palli Balakrishna Saturday, December 9, 2017



చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు (All)
నటీనటులు: బాలకృష్ణ , రాధ, మాలశ్రీ, మోహన్ బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: చలసాని గోపి
విడుదల తేది: 18.02.1988



Songs List:



అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మా 



చెయ్యి వెయ్యి నడుం చుట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు 
పెళ్లి చుక్క పెట్టినట్టు
వెన్నెలంత ఉంగచేసి వేచివున్న వేళలో
వేగుచుక్క పక్కకొచ్చి ఆకువక్కలందుకో హోయ్
సోకులన్ని కట్టబెట్టు చిలకచుట్టి పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దులతో సంకురాత్రి ముగ్గుపెట్టు
చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్

చరణం: 1
నవ్వుతూ చేరుకోవే చల్లగాలి తాకినట్టు
కులుకుతూ దరికిరావే రాజహంస నడిచినట్టు
మెల్లగా అల్లుకోరా పట్టుచీర నేసినట్టు
లేతనడుము తిప్పుకోరా తోడుపెరుగు చిలికినట్టు
మల్లెపూలు స్వాగతాలు ఇచ్చినట్టు
చాటునుంచి నన్నుచూసి కన్నుకొట్టు
సానమీద గందమరగదీసినట్టు
చెయ్యివేసి ఒంటివేడి వదలగొట్టు
వీడిపోని జట్టుకట్టు - పాలుతేనె కలిసినట్టు

చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు 
పెళ్లి చుక్క పెట్టినట్టు
అరె చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్

చరణం: 2
చెక్కిలి గిలిపెట్టు వలపు వీణ మీటినట్టు
చూడబోకు గుచ్చినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
సరసమంత చూపేట్టు వానజల్లు కురిసినట్టు
ముచ్చటించి రెచ్చగొట్టు పచ్చిపాలు కాచినట్టు
చిలికి చిలికి వెన్నపూస తీసినట్టు 
మెరుపు తీగ సొంపులన్ని వడిసిపట్టు
పూలతేనె బొట్టు బొట్టు రాలినట్టు
లేత లేత పెదవితోటి ముద్దులెట్టు
కౌగిలింత చాలినట్టు 
కట్టిపెట్టు కన్నెబెట్టు

చెయ్యి వెయ్యి నడుం చుట్టూ
వడ్డాణం పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దుపెట్టు 
పెళ్లి చుక్క పెట్టినట్టు
వెన్నెలంత ఉంగచేసి వేచివున్న వేళలో
వేగుచుక్క పక్కకొచ్చి ఆకువక్క లందుకో
సోకులన్ని కట్టబెట్టు చిలకచుట్టి పెట్టినట్టు
బుగ్గ మీద ముద్దులతో సంకురాత్రి ముగ్గుపెట్టు
చందమామ పడకటింట సంబరాల వేళలో
హంసరెక్క పక్కపైన పులకరింతలందుకో హొయ్




లవ్లీ గా ఉన్నావే పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

లవ్లీ గా ఉన్నావే 




అసలే కసీ కసీ పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

అసలే కసీ కసీ 




టకు చికు టకు చికు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల, మనో 

టకు చికు టకు చికు 




యమా కొట్టుడు పాట సాహిత్యం

 
చిత్రం: దొంగరాముడు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జిన్నవిత్తుల రామలింగేశ్వరారావు 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

యమా కొట్టుడు 

Palli Balakrishna Saturday, November 18, 2017

Most Recent

Default