Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "M. S. Reddy"
Ramabanam (1979)



చిత్రం: రామబాణం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, మాధవపెద్ది, జేసుదాస్, రామకృష్ణ 
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద,  కృష్ణం రాజు, లత, జగ్గయ్య, జమున, మోహన్ బాబు 
దర్శకత్వం: వై.ఈశ్వర రెడ్డి 
నిర్మాత: యం.యస్.రెడ్డి  (మల్లెమాల సుందర రామిరెడ్డి)
విడుదల తేది: 02.03.1979



Songs List:



పచ్చిమిరపకాయ బజ్జీలూ పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.జానకి

పచ్చిమిరపకాయ బజ్జీలూ,.. బల్
పసందైన బుల్లి బజ్జీలూ...
కారంలో... ఆకారంలో... నా
బజ్జీలకు లేనేలేవు సమ ఉజ్జీలు

మతిమరుపును పోగొడతాయి
అతి తెలివిని పుట్టిస్తాయి...
ఆజీర్తిరోగం వున్నవాళ్ళకి...
ఆకలి ఘాటు చూపిస్తాయి. . .

ఈతకల్లు ఈరయ్యైనా...
ఇప్పసారా అప్పన్నైనా...
బ్రాందీ... విస్కీ... దొరలైనా... నా
బజ్జీలంటే పడిచస్తారు




సూరీడు యెదమిటినాడు... పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సూరీడు యెదమిటినాడు... నా
సొగసంత రవళించె నేడు...
వెలుగుల వల విసిరేసి....
తొలి వలపులు కాజేశాడు...

సుమబాల కనుగీటగానే... ఈ
సూరీడు యెద మీటినాడు...
కను... సైగలు చెలి విసిరాకే...
తను.. వెలుగుల వల విసిరాడు

ఎండా వెన్నెల రెండూ కాని
ఏదో తీయని గిలిగింత
ఉండీ లేని బిడియంలోనే
ఊహలకందని పులకింత
ఆ... గిలిగింత... ఈ... పులకింత
కలిపికూడితే.. జగమంత

అందీ అందని అందాలెన్నో
ముందుపోసినది ఈ ఉదయం
అంతేలేని ఆనందంలో
హరివిల్లైనది నా హృదయం ..
ఆ... హరివిల్లు... కురిసే జల్లు...
అనురాగానికి పుట్టిల్లు 



తాకకుండా తనువు దోచిన పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తాకకుండా తనువు దోచిన
తాను వరసకు ఏమౌతాడు...?
తాళి కడితే మొగుడౌతాడు
తరిమికొడితే సగమౌతాడు...

మాటువేసి మనసుదోచిన
మగువ వరుసకు ఏమౌతుంది?
తాళి కడితే ఆలౌతుంది
తరిమికొడితే తేలౌతుంది...

కళ్ళతోనే గాలం వేసి ఒళ్ళుమొత్తం గాయంచేసి
ప్రేమగందం పెదవికి రాశాడు... తన
పిచ్చినాలో రెచ్చగొట్టాడు...
చిలిపి తలపుల తలుపులు తీసి సిగ్గులన్నీ ఆవలతోసి
పంటినొక్కులు నాపై రువ్వింది. అహ
పడకటింటికి కాలు దువ్వింది...





అమ్మ... ప్రేమకు మారుపేరు...పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, జేసుదాస్

అమ్మ... ప్రేమకు మారుపేరు...
ఆమ్మ మనసు పూలతేరు... ఆ
తేరునీడా సోకగానే
నూరు జన్మల సేదదీరు...

మండు వేసవిలో ముంగిట వెలసిన
మంచుకొండ మా అమ్మ
పవలూ రేయీ ఆరక వెలిగే
పరంజ్యోతి మా అమ్మ...
ఆలనకైనా... పాలనకైనా
ఆదిదేవత మా అమ్మ...
జన్మ జన్మలా పున్నెమువలన... నీ
కమ్మని కడుపున పుట్టాను...
మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా
తల్లివి నీవే అంటాను...
కలలోనైనా... మెలకువనైనా
నీ దీవెనలే కోరుకుంటాను...




నా మాటా రామబాణం పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ 

నా మాటా రామబాణం
న్యాయం నా ఆరవ ప్రాణం
అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం
నా మాటా మన్మధ బాణం నా పత్రిక ప్రేమ పురాణం
ఉచితంగా సెక్స్ జ్ఞానం రుచి చూపడమే నా ధ్యేయం

చక్కెర బొమ్మకు మీసాలొస్తే చక్కని కాలక్షేపం...
రాతిరి పూటా రాణీ పేటా రసికుల పాలిటి స్వర్గం ...
కాలే కడుపుకు మండే గంజి కమ్మని అమృతపానం..
మంచిని పెంచి మనోవికాసం కలిగించేవి బుక్స్...
మంచం పట్టిన మనిషిని సైతం కదిలించేది సెక్స్...
నీతి రీతీ లేని పత్రికలు జాతిని పతనం చేస్తాయి
తాతలనాటి పుస్తకాలు తలగడకే పనికొస్తాయి...

నా మాట మన్మధ బాణం నా పత్రిక ప్రేమపురాణం
నా మాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం




వయసు మళ్ళిన అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

వయసు మళ్ళిన అందగాడా
వచ్చాను సందకాడా...
అర్ధరాతిరౌతుంది. ఆరాటం పెరుగుతూంది
ఆగలేను అందుకోరా...

సిగపూలూ వాడలేదు
అప్పుడే...
చెక్కిలైనా కందలేదు
ఇంతలోనే...
ఎంత సేపని ఎదురుచూసేది ?
నా కోసమేనా ?
ఎప్పుడింకా మోజుతీరేది?
ఆరినీ

ఏయ్ పిల్లా 
ఊ‌‍...
ఇదుగో రా దగ్గరికి రా
ఊ… హూ……
హ పట్టుకోలే ననుకున్నావా ?
ఏయ్...
ఏమిటి? చక్కిలి గిలా ?
మరుమల్లెల పక్కేశాను
బలే పనిచేశావ్
మంచి గందం తీసుంచాను
ఆహా
ఇంతకన్నా ఏమి చేసేది ?
బోలెడున్నాయ్
అంత సూటిగ ఎలా చెప్పేది?
నే చెప్తాగా....
వగలమారీ కుర్రది
వయసుమళ్ళి నేనున్నాని
చూడు చూడు నావంక
సోకు తగ్గలేదింక
రంగేళి రామ చిలకా నిన్ను
వదల్లేను చచ్చేదాకా
నిన్ను వదల్లేను చచ్చేదాకా...


Palli Balakrishna Sunday, November 5, 2023
Palnati Simham (1985)



చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కృష్ణ, జయసుధ, రాధ, రంగనాథ్ 
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: యం.యస్.రెడ్డి 
విడుదల తేది: 07.06 1985



Songs List:



ఈ కుంకుమతో పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఈ కుంకుమతో 




పాలు పొంగే గడ్డ పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, మాధవపెద్ది రమేష్ 

పాలు పొంగే గడ్డ 




ముక్కు పుడక పెట్టుకో పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ముక్కు పుడక పెట్టుకో 




రామచిలుక పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

రామచిలుక 



హాయమ్మ హాయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

హాయమ్మ హాయమ్మ 



ఈ కుంకమతో పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

ఈ కుంకమతో 




వినరా వినరా పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు

వినరా వినరా 

Palli Balakrishna Monday, July 11, 2022
Ankusham (1989)



చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల (All)
గానం: యస్.పి. బాలు, జానకి (All)
నటీనటులు: రాజశేఖర్, జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 13.07.1989



Songs List:



ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు, జానకి 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేతలు
పసిడి బుగ్గల పలకరింపులు
పడుచు జంటకే తెలుసు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం
జన్మ జన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే
ఆలు మగలకు అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు




గోరంత దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  జానకి 

గోరంత దీపం 




అయ్యలో జగరత పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అయ్యలో జగరత 




చిన్నారి కసిగందు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చిన్నారి కసిగందు 



నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

నేను తప్పు చేయలేదు 



చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చట్టాలను దిక్కరిస్తూ 



అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అమ్మ పిలుపుని నోచనివాడు 

Palli Balakrishna Wednesday, February 2, 2022
Sahasam Seyara Dimbaka (2015)


చిత్రం: సాహసం సేయరా డింబకా (2015)
సంగీతం: శ్రీ వసంత్
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, హామీద, జ్యోతి, సమత, షకలక శంకర్,  ఎమ్.ఎస్.రెడ్డి
దర్శకత్వం: తిరుమల శెట్టి వసంత్
నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి
విడుదల తేది: 2015


Palli Balakrishna Sunday, March 17, 2019
Thathayya Premaleelalu (1980)





చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: నూతన్ ప్రసాద్, చిరంజీవి
దర్శకత్వం: బి.వి.ప్రసాద్
నిర్మాత: ఎమ్. ఎస్. రెడ్డి
విడుదల తేది: 19.09.1980



Songs List:



వెన్నెల్లో విన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  ఎస్.పి.బాలు, ఎస్.జానకి 

పల్లవి:
వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం
నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...

వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం

చరణం: 1
ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...
ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...

కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా..
కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా..

విరజాజిలో నిను చూసితి... చూసి చేయ్ సాచి  దరి చేరితి..
చేరి నిలువెల్ల ముద్దాడితి...

కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం...
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...
కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం...

చరణం: 2
ఆహా.. లలలలలాలా..
లలలలలాలా.. అహా...
లలలలలాలా... లలలలలాలా.. అహా..  లలలలలాలా...

సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..
సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..

వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా...
వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా...

చిరుగాలినై దరి చేరితి.. చేరి మనసారా నిను తాకితి
తాకి పులకించి తరియించితి...

వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం.. నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...

లలాలా.. అహా..హా.... లలాలా..  ఉ..ఉ....




చిక్కావులే చక్కర బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

చిక్కావులే చక్కర బొమ్మ 



నా పేరు నాగమల్లి పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

నా పేరు నాగమల్లి 




బాగున్నది భలే పాట సాహిత్యం

 
చిత్రం: తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  మల్లెమాల
గానం:  

బాగున్నది భలే 

Palli Balakrishna Monday, January 28, 2019
Ekalavya (1982)


చిత్రం: ఏకలవ్య (1982)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  మల్లెమాల
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: యం. యస్.రెడ్డి
విడుదల తేది: 07.10.1982

పల్లవి:
ఇది మల్లెలు విరిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 1
గాజులు గలగల నవ్విన ఉదయం
పూజలు పాలై పొంగిన ఉదయం
గాజులు గలగల నవ్విన ఉదయం
పూజలు పాలై పొంగిన ఉదయం

రోజుల తరబడి వేచిన ప్రణయం
రోజుల తరబడి వేచిన ప్రణయం
మేజువాణిగా మారిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 2
పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి ఈడొచ్చిన ఉదయం
పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి ఈడొచ్చిన ఉదయం
పసుపూకుంకుమ గుసగుసలెన్నో
పసుపూకుంకుమ గుసగుసలెన్నో
తరుణం చెడియం ఊరిన ఉదయం
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 3
పరిమళాలు పురి విప్పిన ఉదయం
పరవశాలు తెర తీసిన ఉదయం
పరిమళాలు పురి విప్పిన ఉదయం
పరవశాలు తెర తీసిన ఉదయం
పారే యేరు పెరిగిన ఊరు
పారే యేరు పెరిగిన ఊరు
నోరారా దీవించిన ఉదయం

ఇది మల్లెలు విరిసిన ఉదయం..
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం


******   *******   *******


చిత్రం:  ఏకలవ్య (1982)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది..ఆఁ
మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అది పనిగా పలురుచులు అందీయనున్నది

మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు..ఆఁ..
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
ముచ్చట.. అచ్చట.. ముప్పూటలా మెక్కి
తొక్కి నా ఎద మీద సోలిపోనున్నడు
మనసు మెచ్చిన చిన్నది.. నను మనువాడబోతున్నది

చరణం: 1
పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా..ఆ.. ఆ..
పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా

అమ్మబాబు.. మూడు ముళ్ళెసినంత దాకా
అట్టె బులిపించి మానం ప్రాణం తీయమాకా
అయితే గంగనో మంగనో నే చూసుకుంటాను
అది కనక నిజమైతే రెండిచ్చుకుంటాను
రెండా? ఏంటి?
మ్చ్.. మ్చ్..

హేయ్ .. మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు

ఆహహా.. ఆహాహహాహహా.. హాహా..
ఆహహా.. ఆహాహహాహహా.. ఆహహా..

చరణం: 2
అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..
అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..

మంచిదేలే కదా అందాక వచ్చినాకా
ముద్దుమురిపాలు తీరే దాకా మూయవాకా
అవ్వా.. ఆశకు ఆటకు అద్దుండాలంటాను
అద్దంటూ గిరి గీస్తే ఐదిచ్చుకుంటాను
ఐదా? ఏంటి?
మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్..
హేయ్ ..

మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అదిపనిగా పలురుచులు అందీయనున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
లలలాలాలలాలలల.. లలలాలాలలాలలల..

Palli Balakrishna Monday, February 12, 2018
Kodenagu (1974)



చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
నటీనటులు: శోభన్ బాబు, లక్ష్మీ, చంద్రకళ 
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాష్ రావ్ ( డైరెక్టర్  కె.రాఘవేంద్రరావు గారి నాన్నగారు)
నిర్మాత: యం.ఎస్.రెడ్డి 
విడుదల తేది: 15.03.1984



Songs List:



ఇదే చంద్రగిరి...పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: మల్లెమాల
గానం: ఘంటసాల 

పల్లవి:
ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి
ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... 
ఇదే చంద్రగిరి..
ఇదే చంద్రగిరి...  శౌర్యానికి గీచిన గిరి... 
ఇదే చంద్రగిరి... 

చరణం: 1 
తెలుగుజాతి చరితలోన  చెరిగిపోని కీర్తి సిరి 
చెరిగిపోని కీర్తి సిరి
తెలుగు నెత్తురుడికించిన వైరులకిది 
మృత్యువు గరి
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి...   
ఇదే చంద్రగిరి 

చరణం: 2 
తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..
ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ
ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా
వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము...  
వెయ్యేళ్ళకు పూర్వము
ఇదే చంద్రగిరి ….  శౌర్యానికి గీచిన గిరి.. 
ఇదే చంద్రగిరి

చరణం: 3 
ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు
ఈ మహలే కవి గాయక 
పండిత జన మండల మొకనాడు
ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై 
మిగిలిన వీనాడు
గత వైభవ చిహ్నములై 
మిగిలిన వీనాడు...  ఈనాడు....




అందాల గడసరివాడు పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల 

అందాల గడసరివాడు
అడగకుండ మనసిచ్చాడు
ఆడపిల్ల కంతకన్న అందమేముంది
ఆనంద మేముందీ....

అతని ఎదలో గుడుగుడు గుంచం
ఆడుకుంటాను..... ఆ
ఆటలోనె వానిచుట్టూ 
అల్లుకుంటాను.
అతని గొంతుతొ ఎంకి పాటలు
పాడుకుంటాను.... ఆ
పాటలన్నీ మూటగట్టి దాచుకుంటాను....

పెళ్ళి పీటలమీద చిలిపిగ
నన్ను చూస్తాడూ ....
ఎందు కంత సిగ్గు అని కనుసైగ చేస్తాడూ...
మొలక నవ్వులతోనే నేను
పలకరిస్తాను....
తెలుసులే నీ కొంటెతనమని
తిప్పి కొడతాను.... తిప్పికొడతాను ....




నాగుపాము పగ పన్నెండేళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: అత్రేయ 
గానం: ఘంటసాల 

నాగుపాము పగ పన్నెండేళ్ళు 
నాలో రగిలే పగ నూరేళ్ళూ ॥ నాగు॥

విషం లేదు నా హృదయంలో
భయంలేదు ఏ విషయంలో
అభిమానం త్యజించలేను
అవమానం సహించబోను
సహించబోను సహించబోను ॥ నాగు॥

ధర్మం వైపే ఉంటాను వుంటాను అందుకు
దైవాన్నైనా ఎదిరిస్తాను
స్నేహం చేస్తే ప్రాణంయిస్తాను
ద్రోహానికి వస్తే ప్రాణం తీసాను
ప్రాణం తీసాను॥నాగు ||

చెయ్యని నేరం మొయ్యాలా ?
నేరంచేసినవాళ్ళను వదలాలా ?
నీతిగ వుండీ నిందపడాలా :
నిజం నిప్పువంటిదని చెప్పాలా :
నాగుపాము పగ పన్నెండేళ్ళు
నాగరాజు పగ నూరేళ్ళు ఈ
కోడెనాగు పగ నూరేళ్ళు ....




నాలో కలిసిపో నా ఎదలో నిలిచిపో పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల 

నాలో కలిసిపో - నా ఎదలో నిలిచిపో
కాచుకున్న కౌగిలిలో కప్పురమై కరిగిపో
కరిగిపో
నవ వసంత మల్లికలా నవ్వుతూ వుండిపో
నవ యౌవన శోరలా నరనరాల నిండిపో

నీ నవ్వులే.... ఈ జన్మకు దీపావళి దివ్వెలు
నీ చూపులే.... నా ఆశకు నిన్నకాని రేపులు
నీకోసమె తెరిచినాను ఈ కోవెల తలుపులు
నువ్వే మోగించాలి తొలి గంటలు

అణువణువున నీ రూపే ఆవహించెనూ
అనుక్షణం నీ స్మరణే ఊపిరాయనూ
అనుకోని అనుబంధం పెనవేసెనూ
అది ముందుముందు జన్మలకు మిగిలిపోవును



సంగమం... సంగమం... పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: మల్లెమాల
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
సంగమం... సంగమం....
అనురాగ సంగమం జన్మ జన్మ ఋణానుబంధ సంగమం

సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం: 1
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం
సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం  ఆగి చూచు సంగమం

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

సాగిపోవు ఏరులన్నీ  ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం

సంగమం... సంగమం....
అనురాగ సంగమం ఆనంద సంగమం

చరణం: 2
నింగి నేల నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం
నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం

ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..

నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం నిలిచిపోవు సంగమం
సంగమం....సంగమం....
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

చరణం: 3
జాతికన్న నీతి గొప్పది మతము కన్న మమత గొప్పది
జాతికన్న నీతి గొప్పది మతము కన్న మమత గొప్పది
మమతలు మనసులు ఐక్యమైనవి
ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ అద్దమన్నవీ

సంగమం... సంగమం....
అనురాగ సంగమం ఆనంద సంగమం




కథ విందువా... పాట సాహిత్యం

 
చిత్రం: కోడెనాగు (1974)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల 

పల్లవి:
కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా
నా కథ విందువా

చరణం: 1
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు

కథ విందువా...నా కథ విందువా

చరణం: 2
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన మధురాధరము పైన
చిరు చేదు చిలికింది... జీవితమె మారింది
చిరుచేదు చిలికింది... జీవితమె మారింది

కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా
నా కథ విందువా

చరణం: 3
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి చేసింది ధనము
కాముకుల కాహుతైపోయింది మానము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము

కథ విందువా... నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా
నా కథ విందువా


Palli Balakrishna Friday, September 1, 2017
Vamsoddharakudu (2000)



చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
నటీనటులు: బాలకృష్ణ , రమ్యకృష్ణ , సాక్షీ శివానంద్
దర్శకత్వం: శరత్
నిర్మాతలు: యమ్.ఎస్.రెడ్డి. టి.సుబ్బిరామిరెడ్డి
విడుదల తేది: 14.01.2000



Songs List:



కొండపల్లి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: ఘంటాడి కృష్ణ
గానం: యస్. పి. బలు , చిత్ర

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
పూతకొచ్చే వేళల్లో లేత లేత ఊహల్లో
చాటుమాటు సరసంలో దాగిఉన్న మైఖంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ

తిననాన తిననాన తిన్న తాననానన (2)

వయసంటూ వచ్చాక మనసంటూ ఇచ్చాక
ప్రేమంటూ పుట్టకుండా ఉండమంటే ఎట్టాగ
బంధించి గుండెలోనే దాచుకుంటే మర్యాద
కల్లోకొచ్చిన బావా నా కౌగిళిలోకి రావా
మెళ్ళో మాలే వెయినా నీ ఒడ్లో వాలగ రానా
వినవే బాల ఎదలోని రాసలీల


కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ

దినకు దినకు దిన్నా  దినకు దిన 
దినాక దినక్ దినక్ దిన్నా

మత్తేదో కమ్మేసి గమ్మత్తే చేస్తుంటే 
మన పొత్తే పంచదార తీపి రుచులే తేవాల
నీ సొత్తే సొంతమైతే హాయి అంతే చూడాలా
అల్లుకుపోదాం భామ ఆలస్యం చేయకు రామ్మా
తొందర లేదంటూనే గిలిగింతలు పెడతావేలా
తగునా మధనా మదిలోని బాధ వినరా

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మా చందనాల ముద్దు గుమ్మ
కోటిపల్లి రాజా కొంగుపట్టి పూజ చేసుకోరా బాలరాజ
పూతకొచ్చే వేళల్లో లేత లేత ఊహల్లో
చాటుమాటు సరసంలో దాగిఉన్న మైఖంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను





అందాల ప్రాయం కందింది పాపం పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఓ... ఓ... ఓ... ఓ...ఓ
ఓ... ఓ... ఓ... ఓ...ఓ

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే

పరువైనా పరువాన పసికూన రాగాలు నను పిలిచెనా 
అనువైన సాయలు అందించనా
మృదువైన ఇరుముల్లో ఒనికేటి వైనాలు కనిపించెనా 
మౌనాల గానాలు వినిపించినా
చిక్కని చెక్కిలి నొక్కిలిలోన ఉక్కిరి బిక్కిరిగా
కొత్తగ అద్దిన ముద్దులు నిన్ను ముంచెత్తగా

హోయ్ అందాల ప్రాయం కందింది పాపం  
నీ కొంటె చూపులకే

తొలిసారి తెలిసింది సొగసింటి తగువెంత సుఖమైనదో 
పొగరాని సెగలెన్నో రగిలించెనో
చెలి వీణ పలికింది ముదిరేటి మునిపంట మురిపాలతో 
పదునైన కొనగోటి సరిగమలతో
వెచ్చని ఊపిరి తాకెను నన్ను అల్లరి పల్లవిగా
పచ్చని ఆశలు పాకలు ఎన్నో చిగురించగా

అందాల ప్రాయం కందింది పాపం పూబంతి తాకిడికే
కనరాని గాయం కలిగించే తాపం నీ కొంటె చూపులకే
హే జతచేరి జవరాలి మదిలోగిలి
పలికింది సరసాల తొలి జావళి




గుడిగంటలు మోగే వేళా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: మల్లెమాల
గానం: హరిహరన్, చిత్ర

సాని సాని సాని సనినిప నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస రిమమప పనినినిస

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించానే
హృదయమే పాన్పుగా ముందు పరిచాను నీ ముందు పరిచాను

సాని సాని సాని సనినిప నీస నీస నీస నిపమరి
రిమమప మరిస రిమమప మరిస రిమమప పనినినిస

నీ అందెల సవ్వడిలో నిగమ సారముంది
నీ చూపుల రాపిడిలో మధన తాపముంది
ఎన్నో జన్మల పుణ్యం ఎదురైనది ఈ వేళ
ఈ అరుదైన అనువైన అనుబంధం
ఇక ఏనాడూ విడిపోదు ఈ బంధం
ఇది దొరకక దొరికిన శృంగార సౌభాగ్యము

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి పరవశించాను

తద్దిందింతన  తద్దిందింతన (2)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏ ఏ న,  న న న, ఏ ఏ ఏ ఏ ఏ ఏ న

సిరి తరగని మధుసిరి నీ పరువానికి బిరుదు
నిను మించిన మదవతీ ఈ లోకంలో అరుదు
నింగీ నేలకు వంగీ నిను నను చూస్తోంది
ఈ పులకింత విలువెంతో వయ్యారం
నీ మదిలోని వలపంత పురుషోత్తమా
ఇది కని విని ఎరుగని కైవల్య వైభోగమే

గుడిగంటలు మోగే వేళా
గువ్వలు గుసగుసలాడే వేళా
ఖజురహో శిల్పంలో నిన్ను చూశానే
అదరహో అనిపించి నిన్ను చేరాను
హృదయమే పాన్పుగా ముందు పరిచాను నీ ముందు పరిచాను

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ





బుడి బుడి చినుకుల వానా పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాము, చిత్ర

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ

తళుకు తలుకుమను మెరుపులు వెలుగులు 
మిడిసి మిడిసి పడు పరువపు సొగసులు 
వగలు తెలిసి మతి చెడినదే ఓ చెలియా
చిలిపి చిలిపి చిరు చినుకుల పొదిగిన 
విరుల శరములను వదిలిన మాధనుడి 
ఒడుపు తెలిసినది నిన్నిక విడవదుగా
కోరి కన్నేతనం కోక దాటే క్షణం కౌగిలింతే సుఖం ఔనా
ఊరించి ఊరించి గోపాలా ఊగించమాకయ్య ఉయ్యాలా సిగ్గే అగ్గై రగిలే వేళల్లో

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ

మనసుపడిన తొలి వలపుల తహా తహా 
ఎగసి పడిన పసి వయసుకు తెలియక 
తనువు విరహమున మరిగిన క్షణమిదిరా
పడుచుతనపు రుచి పెదవికి తెలియును 
అధర సుధల రుచి మనసుకి తెలియును 
మరుల రుచులు మగమతికే తెలియునుగా
ఈడు నీ పొందుకై ఈల వేసే క్షణం బలక్రిష్ణార్పణం అననా
గుండెల్లో పుట్టింది గిలిగింత పాకింది మెల్లంగ ఒళ్ళంతా వయ్యారాలే వరదై పాంగంగా

బుడి బుడి చినుకుల వానా చినదానా చిటికేసిందమ్మో  
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
తడి పొడి సొగసుల్లోని గుట్టంతా బయటేసిందమ్మో 
హొ హొ హొ హో హొ, హొ హొ హొ హో హొ
అందిస్తావ కొత్త అందాలన్నీ
సందిస్తావా కొంటె బాణాలన్నీ
సూర్యుడు చూడని సుందర దీవుల్లో




డోలే డోలే పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

డోలే డోలే




నీ చూపు చూస్తే భల్లే పాట సాహిత్యం

 
చిత్రం: వంశోద్ధారకుడు (2000)
సంగీతం: కోటి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: గానం: యస్. పి. బాలు, చిత్ర

నీ చూపు చూస్తే భల్లే 

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default