చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: సుశీల, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , జయప్రద
కథ: వడ్డాది
మాటలు: జంధ్యాల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సినిమాటోగ్రఫీ: ఎ. వెంకట్
ఎడిటర్స్: యమ్.ఉమానాథ్ , మణి
నిర్మాతలు: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి, నూలి రంగయ్య
బ్యానర్: విష్ణుప్రియ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 24.02.1979
పల్లవి:
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..
చరణం: 1
చల్లకొచ్చి ముంత దాచే చక్కని గుంట.. నువ్ సల్లగుండ
రావే నా వెంట రాగాల పంట
పగలు రేయి పండించుకుంట...ఓ..ఓ..ఓ..
అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..
చరణం: 2
మాటలెందుకు మగసిరుంటే.. పాటలెందుకు నీ పక్కనుంటే
అరుపులెందుకు నిన్నల్లుకుంటే.. అర్ధరాత్రి ఎవరేనా వింటే.. ఓ..ఓ..ఓ..
హద్దులెందుకు ముద్దాడుకొందుకు
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..
చరణం: 3
పాత రోజులు గుర్తుకొచ్చే.. కొత్త మోజులు పుట్టుకొచ్చే
బండబారిన పడుచుదనము... పడగ విప్పి పైపైకి వచ్చే
ఏ..ఏహె..ఏహె..
అల్లరెందుకు అందాల విందుకు
పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది
కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే..
అహ..అహ..హ..హ..హా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఓ..ఓ..ఓ.. ఓ.. ఓ..
***** ****** ******
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల
పల్లవి:
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
చరణం: 1
దేవుడి మాట.. కోవెల గంట.. దీవెనగా పలికింది
పండగ పూట పడుచుల పాట.. పల్లె పదంగా మిగిలింది
అనురాగాలే విను రాగాలై.. మమతల వేణువు పిలిచింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
చరణం: 2
రెప రెపలాడే రెప్పలలోనే రేపటి పొద్దులు మెరవాలి
నవనవలాడే నవ్వులలోనే వయసు వసంతలాడే
కన్నెతనంలో వెన్నెల కెరటం నేడే ఈడై ఎగసింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
***** ****** ******
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979)
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఓ.. కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ
వచ్చాను వలపే నీవని
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
ఓ.. ఓ.. ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ..
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
చరణం: 1
నీ సోకులన్నీ కను సోకగానే.. పులకింత నాలో పలికిందిలేవే
నిను చూడగానే నిలువెల్ల పొంగే.. నను తాకగానే తనువెల్ల ఊగే
నా రాగాలలో డోలలూగాలిలేవే
ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక
వచ్చాను పిలుపే నీదనీ..
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
చరణం: 2
జత చేరగానే జడివాన కురిసే.. జడివానలోనే ముడికాస్త బిగిసే
నీ గుండెలోనే తలదాచుకోనీ.. నీ ఎండలోనే తడి ఆర్చుకోనీ
ఈ వానల్లో వలపంతా వరదల్లే పొంగే
ఓ కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ
వచ్చాను వలపే నీవని
నీ కోసమే వేచి ఉన్నానులే
నీ కౌగిలే కోరుకున్నానులే
అహా..హ..హా..