Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Indra Danasu (1978)






చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకులు: పుహళేంది
సాహిత్యం: ఆత్రేయ (All)
నటీనటులు: కృష్ణ, శారద, కాంచన, బేబీ వరలక్ష్మీ
కథ, మాటలు ( డైలాగ్స్ ): మోదుకూరి జాన్సన్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  కె.బాపయ్య
అసోసియేట్ డైరెక్టర్: బీరం మస్తాన్ రావు
నిర్మాతలు: నన్నపనేని సుధాకర్ , టి.సుబ్బానాయుడు
సినిమాటోగ్రఫీ: పి.భాస్కరరావు
ఎడిటర్: నరసింహా రావు
బ్యానర్: ఉదయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 14.01.1978



Songs List:



నేనొక ప్రేమ పిపాసిని పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నానా
దాహం తీరనిది నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని





ఇది మైకమా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా 
ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా 
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా 
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా 

పూలదండకే ఇంత పులకరింతా 
చల్లగాలికే ఇంత జలదరింతా 
పూలదండకే ఇంత పులకరింతా 
చల్లగాలికే ఇంత జలదరింతా 

కళ్ళు తెరుచుకున్నా కలవరింతా 
కళ్ళు తెరుచుకున్నా కలవరింతా 
కలలు రాకపోయినా పలవరింత 

ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా 
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా 

పరిచింది నీ నవ్వు పాలపుంత 
పాకింది బుగ్గలలో జేవురింతా 
పరిచింది నీ నవ్వు పాలపుంత 
పాకింది బుగ్గలలో జేవురింతా ఆ 

కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ 
కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా ఆ 
కానుక ఇస్తుంది కన్నెవయసునంతా 

ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా 
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా 

నా చూపే వస్తుంది నీ వెంట 
నీ రూపే ఉంటుంది నా చెంత 
నా చూపే వస్తుంది నీ వెంట 
నీ రూపే ఉంటుంది నా చెంత 

నీతోనే నిండింది హృదయమంతా ఆ 
నీతోనే నిండింది హృదయమంతా 
నాతోడై ఉండాలి కాలమంతా 

ఇది మైకమా ఆ ఆ బింకమా ఇదే ఇదే నీకు అందమా 
ఇది స్వప్నమా ఆ సత్యమా ఇదే ఇదే పూర్వపుణ్యమా



ప్రేమకు లేదు మరణం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

పల్లవి: 
ప్రేమకు మరణంలేదు దానికి ఓటమి లేనేలేదు
ఓడి గెలుచుకుంటుంది
అది చావులోన బ్రతికుంటుంది

చరణం: 1
ప్రేమకు మరణం
తపస్సువంటిది పవిత్ర పేమ
తపించి కోరే వరమే ప్రేమ
తనువుతోటి పనిలేలిది ప్రేమ
మనసు విడిచి మనలేనిది ప్రేమ

చరణం: 2
తీయని బాగా పెరుగుతుంది
అది వ్రాయని గాధగ మిగులుతుంది.
గుండె పగిలినా నిండి వుంటుంది
కోటి జన్మలకు పుండిపోతుంది




తడిసిన కోక పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

తడిసిన కోక కట్టుకొని - కడవ సంకన పెట్టుకొని
వస్తుంటే....నే వస్తుంటే
అడ్డం తగిలి ఆ పాడే - పోకిరి పిల్లాడు
నా గడ్డం పట్టుకు కొసిరాడే సోకుల బుల్లోడు

కడవను చూపి నోరూరిందే
కళ్ళకు ప్రాణం మళ్ళోచ్చిందే
చూస్తుంటే, నిను చూస్తుంటే
దాహంవేసి వచ్చానే - తడిపొడి కోకమ్మా
గొంతు తడుపుకు పోదామకున్నానే
గడుసరి చిన్నమ్మా

చరణం : 
ఈ దాహం మామూలే ఈ వయసుకు
ఇది తీరేది గాదురా చన్నీళ్ళకు
తీరిగ్గా దొరికావు ఇన్నాళ్ళకు
ఈ చన్నీళ్ళు వేన్నీళ్ళు కానివ్వకు

కలిసున్నావా తమలపాకులు మడిచిస్తాను
మరి సెల్లావా పులి స్తరాకులా పారేస్తాను
విరహం పుడితే ఏం చేస్తావు
వేన్నీళ్ళోసుకు తొంగుంటాను
నెలలు తప్పితే ఏంచేస్తావు
నీకు దినాలుపెట్టి ఊక్కుంటాను



ఏడు రంగుల పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు 
మల్లె రంగు నా మనసు 

పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు 
నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు 
ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు 
ఆ ఆశలన్ని ఆకాశానికి 
ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఇంద్రధనుసై

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు 
మల్లె రంగు నా మనసు 

ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు 
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు 
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు 
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు 

వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా 
వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో 
ఇంద్రధనుసై నాలో 
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు 
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు 
మల్లె రంగు నా మనసు





మూసుకో మూసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్రధనుస్సు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

మూసుకో.... మూసుకో - తలుపులన్నీ మూసుకో
గడియలన్నీ వేసుకో – సొగసులను భద్రంగా దాచుకో
నా చూపులేలా దూసుకొస్తాయోచూసుకో ॥మూసుకో॥

చరణం 1
చూసి మెచ్చేవాళ్ళుంటేనే..సోయగాలను మోయగలవు
దాచుకుంటూ దోచుకొమ్మని
దారి నువ్వే చూపుతావు

చరణం 2
దేవుడిచ్చిన సొగసులకు_ దేనికమ్మా సిగ్గుపడతావ్
లేనివాళ్ళెటూ లేనివాళ్ళే
ఉన్నదానికి పులుకెందుకే

చదణం 3
ఎప్పుడో ఒకనాడై నా-ఇద్దరం గదిలోన వుంటాము
అప్పుడైనా తప్పదు
అది తప్పుగా నీకనిపించదు

Most Recent

Default