చిత్రం: రాధా గోపాలం (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం:
నటీనటులు: శ్రీకాంత్ , స్నేహ , సునీల్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణ
దర్శకత్వం: బాపు
అసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో నాని ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు )
నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబు
బ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్
విడుదల తేది: (2005)
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఆగడాలు పాగడాలు జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
చరణం: 1
భార్య వేచి ఉండడాలు మొగుడు రాకవోపడాలు
కోపగించు కోవడాలు కారణాలు చెప్పటాలు
గొంతుచించు కోవటాలు సమర్ధించు వాదాలు
గోడవపెంచుకోవడాలు గోల చేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు కసరడాలు విసరడాలు
చిలిపి చిలికి గాలి వానల ఆవడలు
వాయుగుండం పడటాలు పొంపుదుండం ఆవడాలు
తెల్లవారుజామునే తీరని తాకడాలు
సోరిలు చెప్పటాలు సరే అనుకోవటాలు
అసలు ఏం జరగనట్టు తెల్లారిపోవడలు
చరణం: 2
ఫోను ఏదో రావడాలు నవ్వుతూ మాట్లాడడాలు
అనుమానం రావడాలు తిరుగుటం అవడాలు
ఆరాలు తీయడాలు కారాలే నూరడాలు
ఏనాటికావాదాలు ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్కగా ఉండడాలు పక్క మంది చేయటాలు
బ్రహ్మయ్య ఉండటాలు మన్మధుని తిట్టడాలు
సోరి అని అనుకోవటాలు సర్దిచెప్పుకోవటాలు
చరణం: 3
చీరకట్టుకోవడాలు తెమరకుండపోవడాలు
మొగుడు ముట్టుకోవడాలు టైందాటిపోవడాలు
రైలు వెళ్లిపోవడాలు రోడ్ మీద ఎగరడాలు
తెల్లముఖం వేయడాలు ఇంటిముఖం పట్టడాలు
గంటసేపు తిప్పడాలు కంటినీళ్లు కార్చడాలు
అలగడాలు తలగడాలు తలవాదాలు
అర్ధరాత్రి దాటడాలు భద్రకాళి అవడాలు
నిద్రమానుకోవడాలు నిప్పుమీద చిమడాలు
సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాట ఆడుకోవడాలు
ఆగడాలు పాగడాలు జగడాలు
ఐ యామ్ సారీ...
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఐ యామ్ సారీ.. ఐ యామ్ సారీ..
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సారీ సారీ...
ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే
ఐ యామ్ సో సారీ...
No comments
Post a Comment