Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gharana Donga (1980)




చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి , మోహన్ బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: సురేష్ వర్మ
బ్యానర్: విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 29.03.1980



Songs List:



ఓ ముద్దు కృష్ణా నా బుజ్జి కృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఓ ముద్దు కృష్ణా నా బుజ్జి కృష్ణా
మురిపాల కృష్ణా గోపాల కృష్ణా
నీ జపమే చేస్తున్నా - నీ భజనే చేస్తున్నా
నీ తపనే చేస్తున్నా నా మనసే ఇస్తున్నా
నీకోసం నిద్రాహారం సర్వం మాని నే పడి చూస్తున్నా

నీ జపమే చేస్తున్నా నీ తపమే చేస్తున్నా
నీ మనసే వరమడిగి నా మనసే యిస్తున్నా
నీ కోసం నిద్రాహారం సర్వం మాని నే పడి చస్తున్నా
చక్క చకచా చక చక చా చక చక చా

చరణం: 1
గుండెల్లో గుబులుగా వుంది కృష్ణా, కృష్ణా.
ప్రతి రేయి పగలపుకుంది కృష్ణా, కృష్ణా...
వళ్ళంతా వగలై పోయి వయసంతా దిగులవుతుంది.
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా....
నేనంటే కన్నెలకిష్టం రామా రామా
నాకేమో నువ్వే ఇష్టం రామా రామా
వెన్నలాంటి కన్నెను చూస్తే వెన్నెల్లే నవ్వుతువుంటే
ఏ అందమో ఒక బంధమై నా కోసమే వచ్చినట్టున్నది

చరణం: 2
కలలోన దగ్గరకొచ్చి కృష్ణా కృష్ణా
తెరచాటు ముద్దులు పెడితే కృష్ణా కృష్ణా
యీడంతా కోడై కూసే తెల్లారి చుక్కలు పొడిచే
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా...
నాకేమో చలిగా వుంది రామా రామా
నా చెలికి ఎటుందో మరి రామా రామా
వెచ్చంగా తోడై వుంటే వెయ్యేళ్ళు వెన్నెల రాత్రే
ఏ ఊర్వశో నా ప్రేయసై కౌగిట్లో చిందేసినట్టుంది




రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే... అందమంత ఇస్తుంటే...
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా... అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే... అందగాడు తోడుంటే...
చందమామ నిదరోయేదెట్టాగా... చందమామ నిదరోయేదెట్టాగా

చరణం: 1
కౌగిట్లో కాలాలు కరగాలని... తప్పెట్లు తాళాలు మోగాలని
వలపుల్ని దాచేసి ఒంటరిగుంటే... చెలి తోడు లేకుంటే ఎట్టాగా
ఎట్టాగా... ఎట్టాగా..

ఆ కౌగిళ్లే మన ఇల్లు కావాలని... మల్లె పొదరిళ్లే  పడకిళ్లు కావాలని
కలగంటే కాదంటే ఎట్టాగా... చలి తీరి పోతుంటే ఎట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..

గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా
రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. అబ్బా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా

చరణం: 2
వానల్లే నువ్వొచ్చి తడపాలని... వరదల్లే నే పొంగిపోవాలని
చినుకుల్లో ఇల్లేసి ఒణుకుతు ఉంటే... చెలికాడు రాకుంటే ఎట్టాగా
ఎట్టాగా.. ఎట్టాగా

చుక్కల్లో పక్కేసుకోవాలని... రెండు దిక్కుల్ని కలిపేసుకోవాలని
అనుకుంటే తప్పైతే ఎట్టాగా.. ఈ ఆపలేని పులకింతలెట్టాగా

ఎట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా..
గెట్టా.. గెట్టా.. గెట్టా.. గెట్టా.. ఎట్టాగా 

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందగత్తె చూస్తుంటే... అందమంత ఇస్తుంటే...
అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా... అర్ధరాత్రి గడిపేది ఎట్టాగా

రొట్టె విరిగి నేతిలో పడ్డాకా.. లొట్టలేస్తూ కూర్చుంటే ఎట్టాగా
అందమైన ఈడుంటే... అందగాడు తోడుంటే...
చందమామ నిదరోయేదెట్టాగా... చందమామ నిదరోయేదెట్టాగా




వాన వెలిసిన వేళ.. పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

చరణం: 1
చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో
చిలిపి చినుకుల చిత్తడిలో... వలపు మెరుపుల సందడిలో
ఉరిమి పిలిచే నీ ఒడి కోసం... ఉలికిపడి నే చూస్తుంటే
కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
ఓ..కురిసి వెలిసిన వానలలో... కలిసి బిగిసిన కౌగిలిలో
నలిగిపోయిన ఆకాశం... పగలు వెన్నెల కాస్తుంటే
చూపూ చూపూ మాటాడాలా... మాటామాటా మానెయ్యాలా
వలపు వలపు వాటెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ.. వయసు తడిసిన వేళ
నువ్వే నాలో చినుకవ్వాలా... నేనే నీలో వణుకవ్వాలా
ముద్దు ముద్దు ముసరెయ్యాలా.. చలిలో
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి.. 

చరణం: 2
చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో
చలికి సణిగిన పల్లవితో... ఉలికి పలికిన పెదవులలో
ముద్దులడిగే ముచ్చట కోసం... పొద్దు గడవక చస్తుంటే
చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
ఓ..ఓ.. చీర తడిసిన ఆవిరిలో... ఆరిఆరని అల్లరిలో
హద్దు చెరిపే ఇద్దరి కోసం... మబ్బులెండను మూస్తుంటే

సిగ్గుల మొగ్గ తుంచెయ్యాలా... వెన్నెల పక్క పరిచెయ్యాలా
వేగుల చుక్క దాచెయ్యాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..

వాన వెలిసిన వేళ...  మనసు కలిసిన వేళ
నువ్వే నన్ను ముద్దాడాలా... నిన్నే నేను పెళ్ళాడాలా
ఎండావానా నీళ్ళాడాలా... చలిలో...
చలి.. చలి.. చలి.. చలి.. చలి.. చలి..




చిటికెల మొటికెల తాళాలంట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిటికెల మొటికెల తాళాలంట
చిరుచిరు నవ్వుల పందిట్లో సిరికీ, హరికీ పెళ్ళంట
ముద్దుకు మూడే ముళ్ళంట, హద్దులు

చరణం: 1 
అతను పాల కడలినే పాన్పు చేసుకొని
పండువెన్నెలా పైట చేసుకొని
మల్లె పువ్వులా వచ్చిందంటే మా దేవి
వచ్చి ఏమి యిచ్చిందంట శ్రీదేవి
యిద్దరి మధ్య ఎప్పుకున్నదే యిచ్చిపుచ్చుకోడం
వున్నది కప్పి పుచ్చుకోడం

బుడి బుడి మనసుల బులపాటం చెరిసగమైతే చెలగాటం 
అది చెప్పాలంటే మొగమాటం వద్దంటే అడగొద్దంట

చరణం: 2 
నీలాకాశం ఒళ్ళు చేసుకొని -
నీటి తామరలు కళ్ళు చేసుకొని
చిలిపి నవ్వులా వచ్చాడంట శ్రీహరి
వచ్చి ఏమి ఇచ్చాడంట కృష్ణహరి
యిద్దరి మధ్య ఎప్పుడు లేదు ముద్దులిచ్చుకోడం
హాయిగా పొదు పుచ్చుకోడం
చెడుగుడు వయసుల చెరలాటం
చెప్పలేనిదా యిరకాటం అది ఆపాలంటే ఆరాటం
వదంటే అడగొద్దంట
అలకల పులకల మేళాలంట



ధిమికిట ధిమికిట పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ధిమికిట ధిమికిట అన్నది అందం
తిదికిట తిరిగిట అన్నది పరువం
తెల్లారిపోవాలయ్యో అల్లరి బుల్లోడా
చల్లారి పోరాదయ్యో టక్కరి పిల్లోడా

చరణం: 1
నువ్వు మల్లెపూలిస్తే నీ పక్కకొచ్చేస్తా
నువ్వు తెల్ల చీరిస్తే నేను సోకు చేసేస్తా
నీ మల్లెపూల మంచం నేను దులిపేస్తా
నీ తెల్ల చీరె అంచుకాస్తా నలిపేస్తా
మిట మిటలాడే నా రాణీ, చిటపటలాడే చిన్నోణ్ణి
చిందులెందుకే, విందులియ్యవే అందమెక్కువ
అలివేణి, అలివేణి, అలివేణి

చరణం: 2 
నువ్వు మబ్బుల్లో వుంటే నేను మెరుపు ముద్దిస్తా
నువ్వు నీటిలో వుంటే నీకు చేప ముద్దిస్తా
నీ మెరుపులోన వురుములన్నీ లాగేస్తా
నీ చేప వగలు కంట నిలిపి ఆడిస్తా
పటమట దేశం పడుచోడా పిటపిటలాడే పిలదాన్ని
పందెమెందుకు సందెవేళకు తొందరెక్కువ 
అబ్బాయి అబ్బాయి అబ్బాయి.




పంపర పనస పండురో పాట సాహిత్యం

 
చిత్రం: ఘరానా దొంగ (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
పంపర పనస పండురో
పంపర పంపర పంపర పంపర
జంపర మల్లె చెందురో
జంపర జంపర
పడకే కుదరని రాతిరిలో పండగ వెన్నెల దిండురో
పంపర పనస పండురో
పంపర పంపర పంపర పంపర
జంపర జంపర జంపర జంపర
జంపర మల్లె చెండురో
జంపర జంపర జంపర జంపర
చలులే ముదిరిన రాతిరిలో వెచ్చగ వచ్చిన తోడురో

చరణం: 1
ముద్దుకు ముద్దీ పిల్లదిరో సోటకు సోకీ చిన్నదిరో
ముడి వెయ్యాలని ముడితో కాముడి గుడి కట్టాలని వున్నదిరో

కంటికీ చూపీ గుంటడురో. ఒంటరి గుంటే వదలడులో
పురి విప్పాలని నాతో సయసుకు పురిపెట్టాలని వున్నదిరో
తొలకరి మోజుల తొందరలో
కలిసి మెలిసి కౌగిట బిగిసి అలిసే కమ్మని జాతరలో

చరణం: 2
చుక్కకు తళుకీ చూపులురో, చక్కెరకందని తీపులురో
మక్కువ తీరని నులైలపొదలో చక్కని చిక్కని జాజులు రో
మాటల చాటున మాటలురో ఎదలో తుమ్మెద పాటలురో
మాపడివేళకు అల్లరి కధలో ఊపిరికెగిరిన పైటలురో

ఉలిపిరి గాలుల యీలలలో
వలపో, పిలువని పిలుపో తెలియక యిదే యీ తలుపో ....


No comments

Most Recent

Default