Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Annadammula Savaal (1978)




చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
నటీనటులు: కృష్ణ , రజినీకాంత్ , జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవి
కథ: సుందరం
మాటలు: త్రిపురనేని మహారధి
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాతలు: జి.డి.ప్రసాద రావు, పర్వతనేని శశిభూషన్
ఫోటోగ్రఫీ: యస్.యస్.లాల్
ఎడిటర్: పి.వెంకటేశ్వరరావు
బ్యానర్: శ్రీ సారధి స్టూడియోస్
విడుదల తేది: 03.03.1978



Songs List:



నీ రూపమే... పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నీ రూపమే... నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే

నీ రూపమే... నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే
నీ రూపమే...

చరణం: 1
ఆశలు లేని నా గుండెలోన అమృతము కురిసిందిలే
వెన్నెల లేని నా జీవితాన పున్నమి విరిసిందిలే
నీవూ నేనూ తోడూ నీడై
నీవూ నేనూ తోడూ నీడై వీడక వుందాములే
వీడక వుందాములే...

నీ రూపమే... నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే 
నీ రూపమే...

చరణం: 2
లేతలేత హృదయంలో వలపు దాచి వుంటాను
నా వలపు నీకే సొంతమూ
నిన్ను చూచి మురిశాను నన్ను నేను మరిచాను
నీ పొందు ఎంతో అందమూ

ఏ పూర్వ పుణ్యమో ఏ దేవి దీవెనో 
ఏ పూర్వ పుణ్యమో ఏ దేవి దీవెనో
వేసెను విడరాని బంధమూ
వేసెను విడరాని బంధమూ

నీ రూపమే... నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో ఇది అపురూపమే
నీ రూపమే....




నా కోసమే నీవున్నది పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది
మౌనం వద్దు ఓ మాటైన ముద్దు అ మతిపోతున్నది
అడుగు వేయకు రాజహంసలే అదిరిపోయెనులే
తిరిగి చూడకు పడుచు గుండెలే చెదిరిపోయెనులే
వెచ్చని కోరిక నాలో మెరిసి  విసిరేస్తున్నది

నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది
మౌనం వద్దు ఓ మాటైన ముద్దు అ మతిపోతున్నది

చరణం: 1
మొదట చూపిన మూతి విరుపులు తుదకు ఏమాయెలే
అలక తొనకగా చిలుక చినుకుగా వలపు జల్లాయెలే
ఆ జల్లుల తడిచిన అల్లరి వయసే జత నీవన్నది

నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నది
మౌనం వద్దు ఓ మాటైన ముద్దు అ మతిపోతున్నది




గువ్వగూడెక్కే.. పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
అరెరెరే.. గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. 
కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా... 
నీ సొగసంతా దోచుకోనా 
హే దిగి వస్తే చిన్నదానా... 
నీ సొగసంతా దోచుకోనా 

గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. 
కళ్ళు కైపెక్కే..వళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా.. 
నే సగమిస్తా సందెకాడా 
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. 
నే సగమిస్తా సందెకాడా 

చరణం: 1
పడుచు పరపు నలగనన్నదీ.. 
నా పక్కన నువ్వులేకా.. 
మగ సెగలే రగులుతున్నవీ.. 
నీ ఆడ గాలి నన్ను తాకా.. 

ముద్దులేదు పొద్దులు పోకా.. 
నీవు రాకా నిద్దుర రాకా .. హా 
ముద్దులేదు పొద్దులు పోకా.. 
నీవు రాకా నిద్దుర రాకా... 
కరిగింది కంటి కాటుకా.. ఆ... 

గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. 
కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
ఎగిరొస్తే అందగాడా.. 
నే సగమిస్తా సందెకాడా 
ఆహాహాహా.. దిగి వస్తే చిన్నదానా... 
నీ సొగసంతా దోచుకోనా 

చరణం: 2
పెదవులు తడి ఆరుతున్నవీ.. 
నీ పెదవులతో ఎంగిలి పడకా.. 
వయసు మిడిసి పడుతు ఉన్నదీ.. 
నువ్వు ఒడిసి పట్టు ఒడుపే లేకా.. 

హేయ్.. రేగితే ఆగదు తిక్కా.. 
మబ్బు మీద వెయ్నా పక్కా 
రేగితే ఆగదు తిక్కా.. 
మబ్బు మీద వెయ్నా పక్కా 
రగిలింది కొంటె కోరికా.. ఆ.. హా 

గువ్వగూడెక్కే.. రాజు వేడెక్కే.. 
కళ్ళు కైపెక్కే.. ఒళ్ళు వేడెక్కే 
దిగి వస్తే చిన్నదానా... 
నీ సొగసంతా దోచుకోనా 
హేయ్.. ఎగిరొస్తే అందగాడా.. 
నే సగమిస్తా సందెకాడా





ఓ పిల్లా చలి చలిగా ఉందే.. పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి: 
హ్మ్మ్.. హ్మ్మ్.. లాలలాల..హేహే..జుజుజుజు..
పపపప్ప్పప.. పపపా.. పపాప్పా
పపపప్ప్పప.. పపపా.. పపాప్పా
ష్...
నిన్న రాత్రి మెరుపులు, ఉరుములు, వాన, చలి
ఒంటరిగా చెట్టుకింద నిల్చున్నాను
ఎవరో భుజం మీద చెయ్యి ఏశారు
దగ్గరగా లాకున్నాడు
తిరిగి చూశాను.. అతనే.. అతనే.. అతనే

ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 
నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే...

చరణం: 1 
ఆ తరవాతా..
ష్...
కళ్ళు చెదరిపోయాయి.. ఒళ్ళు బెదిరిపోయింది
పెదవులు వణికాయి... గుండె దడదడలాడింది
అతను నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు
వద్దు.. వద్దు... వద్దు.. 

తడిసిన నీ ఒళ్ళు.. మెరిసే నీ కళ్ళు
నాలో రేపెను గిలిగింతలేవో...
ముందర నువ్వుంటే.. తొందర పెడుతుంటే
మదిలో మెదిలే పులకింతలెన్నో
ముందున్నది.. విందున్నది అందాల ఈ రేయి

ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 
నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..

చరణం: 2
ఆ తరవాత
అతను నా నడుమ్మీద చేయ్ ఏశాడు.. 
తన కౌగిట్లో బంధించాడు..
నేను విలవిలలాడిపోయాను.. 
ఉక్కిరిబిక్కిరి అయ్యాను..
అయ్యో..అయ్యో...అయ్యో...

మిసమిసలాడేటి బుగ్గలు చూశానే... 
ముద్దులు ఇవ్వక వదిలేది లేదే
మధువులు చిందేటి పెదవులు చూశానే.. 
తేనెలు దోచాక కదిలేది లేదే
రా ముందుకు.. నా చెంతకు.. 
ఇంకెందుకే సిగ్గు?

ఓ పిల్లా చలి చలిగా ఉందే.. 
నిన్ను చూస్తుంటే కసి కసిగా ఉందే
కొంటె కోరికా జంట కావాలన్నదే..

ఇదంతా నిజమనుకుంటున్నారా...
ఊహు..వట్టి కల...
 it was a sweet dream.




నేర్పమంటావా పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: రమేష్ , యస్.జానకి

నేర్పమంటావా 

Most Recent

Default