చిత్రం: ఏజెంట్ గోపి (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర, దాశరధి, వేటూరి
గానం: యస్.పి.బాలు,
నటీనటులు: కృష్ణ , జయప్రద, జయమాలిని
కథ: జి.బాలసుబ్రహ్మణ్యం
మాటలు: బమిడిపాటి రాధాకృష్ణ
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాత: శ్రీకాంత్ నహతా
ఫోటోగ్రఫీ: యస్.వి.శ్రీకాంత్
ఎడిటర్: డి.వెంకటరత్నం
బ్యానర్: శ్రీకాంత్ పిక్చర్స్
విడుదల తేది: 14.04.1978
పల్లవి:
రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర
రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర
ఓ హంస భలే రామచిలక ఓలమ్మి
తుర్రుమని ఉడాయించావే
తుర్రుమని ఉడాయించావే
ఓ హంస భలే రామచిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా
తుర్రుమని ఉడాయించారా
కోరస్:
అల్లో మల్లో రాముల వల్లో
ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (2)
చరణం: 1
ఓ పదహారేళ్ళ పిల్లా నువ్వు పలకానంటే ఎలా
నీకూ నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా
ఓ పదహారేళ్ళ పిల్లా నువ్వు పలకనంటే ఎలా
నీకూ నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా
ఆశపెడితే మోసగించే వేషాలెందుకు అందాకల్లా
ఓ హంస భలే రామచిలక ఓలమ్మి
తుర్రుమని ఉడాయించావే
తుర్రుమని ఉడాయించావే
కోరస్:
అల్లో మల్లో రాముల వల్లో
ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (2)
చరణం: 2
చింత తోపులో ఉంటా నువ్వు రాకాపోతే తంటా
నన్ను చూడనీ కడగంటా పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంటా నువ్వు రాకాపోతే తంటా
నన్ను చూడనీ కడగంటా పండించు వలపుల పంట
ఈడు జోడు బాగా కుదిరే నీది నాదే చక్కని జంట
ఓ హంస భలే రామచిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా
తుర్రుమని ఉడాయించారా
ఆ.. ఓ హంస భలే రామచిలక ఓలమ్మి
తుర్రుమని ఉడాయించావే
తుర్రుమని ఉడాయించావే
కోరస్:
అల్లో మల్లో రాముల వల్లో
ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (3)
****** ****** ******
చిత్రం: ఏజెంట్ గోపి (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
అది కట్టుకోక... ముడి పెట్టు కోక...
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం: 1
నా చూపుకు తెలుసు.. ఆ లోపలి సొగసు
నా మనసుకు తెలుసు... నీ దాగని వయసు
కొండల నడుమ కోనొకటుంది.. కోనకు నడుము నే కోరినదుంది
ఛీ ఫో...
గుట్టూమట్టూ అవతల పెట్టు.. అడిగిందిస్తే అవుతా జట్టు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం: 2
రుసరుసలాడే చినదానా.. అసలు విషయం దాచినదానా
రుసరుసలాడే చినదానా.. అసలు విషయం దాచినదానా
బుసకొట్టే రూపం.. కసి పట్టే కోపం..
ఉసిగొల్పే తాపం.. ఉడికిస్తే పాపం..
కిక్కురుమనక పక్కకు వస్తే ఉక్కిరిబిక్కిరి చేసేస్తా
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం: 3
అహా..హహా.. హెహెహెహ్హెహే... అహహహ్హహహహా..
చెరువున పడితే.. నువు చేపవు అయితే
నా చూపులతోనే.. నేగాళం వేస్తా..
చకచకమంటే.. నను తికమక పెడితే
నీ పంతం పడతా.. నీ తళుకే చూస్తా
కస్సుబుస్సు కాదనవద్దు... దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు ఉమ్మ్ ఉమ్మ్ సన్న రైక
అది కట్టుకోక... ముడి పెట్టు కోక...
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
****** ****** ******
చిత్రం: ఏజెంట్ గోపి (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే
ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే
చరణం: 1
కన్నేస్తేనే ఐసైపోతివే... నే చేయేస్తే ఇంకేమైపోదువే
కన్నేస్తేనే ఐసైపోతివే... నే చేయేస్తే ఇంకేమైపోదువే
సిగ్గూబిడియం చెరిపేస్తానే... అందంచందం దోచేస్తానే
దోచేస్తానే... దోచేస్తానే... దోచేస్తానే..
ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే
చరణం: 2
పిటపిటలాడే పొంకం ఊపితే.. నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే
పిటపిటలాడే పొంకం ఊపితే.. నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే
టక్కరిచుక్క టెక్కులు చాలే.. ఒంపులు తిప్పి ఒళ్ళోవాలే..
ఒళ్ళోవాలే... ఒళ్ళోవాలే... ఒళ్ళోవాలే
ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో
చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే
****** ****** ******
చిత్రం: ఏజెంట్ గోపి (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
చిటపటా చినుకులు.. మన కోసం కురిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి
ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి
చరణం: 1
ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది
ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది
హా.. వెచ్చని కౌగిలి పైటగా చేసుకో..
గాలిని వానని జంటగా గెలుచుకో...
చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి
చరణం: 2
నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు
నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు
అంతగా చూడకు సిగ్గులో ముంచకు
అందుకో వలపులు.. పంచుకో తలపులు..
ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి
అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...
చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి