Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: సామాన్యుడు (2006)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: రాజు
గానం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: జగపతి బాబు, కామ్నా జఠ్మలాని, సాయి కుమార్
కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చావలి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్
ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డి
బ్యానర్: ఆర్.ఆర్.మూవీ మేకర్స్
విడుదల తేది: 19.10.2006

పల్లవి:
ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

పొద్దుగల్ల లేవనంటది
దస్ గ్యారా దాక పంటనంటది
కూర బువ్వ వండనంటడి
పక్కింటి రంగు టీవి కాడ ఉంటది
తిడతానంటే పడదంట కొడతానంటే పోతానంటది
నేను ఎట్టాగ వేగేదిరో

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 1
అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి

అత్తరేసి మస్తుగుంటడి
ఈడు ఇస్తరేసి సిస్టర్ అంటది
బొడ్డుకింద చీర కడ్తది
పోరి గోల్కొండ పొదమంటడి
సరసమంటే రాను అంటది
షికారు కొస్తదంట ఊరించి చంపుతుందిరో నాయనా

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

చరణం: 2
ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది

ముద్దులాడ రాను అంటది
ముక్కుపుడక తెచ్చి ఇవ్వమంటది
దొంగ చూపు చూస్తవుంటది
నన్ను చేరమంటే సిగ్గు అంటది
ముట్టకుండ పట్టకుండ
ముసుగు పెట్టి పడుకుంటే
నీకు అల్లుడ్ని ఎట్టా ఇస్తారో బామ్మర్థి

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కా
వేగలేను నీ అక్కతో
నే ఆడలేను తైతక్క

No comments

Most Recent

Default