Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ummadi Kutumbam (1967)




చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, కృష్ణకుమారి
మాటలు (డైలాగ్స్): సముద్రాల జూనియర్
కథ, స్క్రీన్ ప్లే: యన్. టి.రామారావు
దర్శకత్వం: దాసరి యోగానంద్
సినిమాటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్
ఎడిటర్: జి.డి.జోషి
నిర్మాత: నందమూరి త్రివిక్రమరావు
బ్యానర్: యన్.ఏ.టి. & రామకృష్ణ సినీ స్టూడియోస్
విడుదల తేది: 20.04.1967



Songs List:



Padyam No : 1 of Yama పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

సీ॥ 
క్షీరాబ్ధిపై తేలు - శ్రీహరి పానుపు
ఒరిగినా ఒక ప్రక్క కొరుగుగాక
వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు
నాలుగు మూడైన అగునుగాక
పరమేశ్వరుని దివ్య ప్రళయతాండవమందు
తాళము తప్పిన తప్పుగాక 
చదువుల గీర్వాణీ మృదుకరాంచిత వీణ
పలికినా అపశృతుల్ పలుకుగాక

గీ॥ 
సకల లోకాల ధర్మశాసనము నమలు
చేసి విధి వ్రాయు - ఆయువు చెల్లగానే
వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి
మోసికొని పోవుచుండు యముండ - అబలా 



పోవుచున్నావా? పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: తిలకం 

పోవుచున్నావా? అవురా! యమధర్మరాజా!
పోవుచున్నావా :
సంత కరుణ మాని - కాంతుని ప్రాణములను గొని
పోవుచున్నావా !



Padyam No : 2 of Yama పాట సాహిత్యం

 

చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల 

సీ॥
కాలు మోపిన చాలు - కన్సని అరికాలు
కోసుకుపోయెడి కూసురాళ్ళు

అలికిడైనను చాలు -- -ఆదరి బుస్సున లేచి
పడగెత్తి పైబడు పాపరేళ్లు -
అడుగుపెట్టిన చాలు - ఒడలు జిల్లున లాగి
నరములు కుదియించు నదుల నీళ్లు
గాలి దోలిన చాలు కదలి గీయని కర్ణ
పుటములు ప్రేల్చెడి మురి వెదుళ్లు

గీ॥ 
పులులు సింహాలు శరభాలు పోవ పోవ
కటిక చీకటి - కనరాదు - కాలిదోవ
మరలిపొమ్మిక విడువుము మగని ఆశ 
మాట వినవేల ఓ బేల - మరలవేల





పోబేల పొమ్మికన్ పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఘంటసాల

పోబేల పొమ్మికన్ - పోపోబేల పోపొమ్మికన్
నా వెంట రా తగదు - రావకాదు - రా తగదు - రావలదు
చీమలు దూరని చిట్టడవులలో - కాకులు దూరని కారడవులలో
లబోదిబోమని అఘోరించినా ఫలితము సున్న
మరలుము మెదలక

చెప్పిన వినవు చెముడా గిముడా పట్టిన పంతము విడువవుగా
ఏమునుకొంటివి - ఎవడను కొంటివి
సముండను - పాశధరుండను కాలయముండను




Padyam No : 3 of Savitri పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: తిలకం

గీ॥ 
అమరులెటులైన సంతాన మందవచ్చు
మనుజ లోకాన సాధ్వులు మగడు లేక
పుత్రసంతాన మేరీతి పొందగలరు
తమకు తెలియని ధర్మమే - ధర్మరాజ 



ఇంతిరొ నన్నేలుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: ఘంటసాల, తిలకం

ఇంతిరొ నన్నేలుకో - లంకేశుడనని తెలుసుకో
సరసాలిక మానుకో - నీ బాపు మూడు తెలుసుకో
ఎందరెందరో అందగత్తెలు - కన్ను సైగలు చేసి చేసి
రారమ్మని పైన బడిన - రాను పొమ్మను దానవేంద్రుడ
పాపభీతి రవంతలేకను - పరసతిని చేపట్ట జూతువు
తప్పురా - ఇక ఇప్పుడైన అయోధ్య రాముని వేడుకో
అష్ట దిక్పతులందరును నా ఆనతిని ఊడిగము సేతురు
మానవాధముడైన రాముని గొప్ప జేసి చెప్పనేల
కదనమున ఆ రామ భాణము - కండలుగ - నిను చెండునప్పుడు
అష్ట దిక్పతులన్న వారెవరడ్డమౌదురొ చూచెదవులే





Padyam No: 4 of Ravana పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: ఘంటసాల

గడువిచ్చితి పది దినములు
గడబిడ సేయకను నీదు కాంతునిగానన్
బడయుము - కాదన్న నునిన్ 
విడువను హరుడడ్డమైన వెరవను తరుణీ



ఉంగారమా - బలే వుంగారమా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: తిలకం

ఉంగారమా - బలే వుంగారమా 
నా సామి వ్రేలి ముద్దుటుంగారమా.
రామయ్య ఎపుడు వచ్చు - రావణుని ఎప్పుడు గూల్చు 
నా సింతలెపుడు దీర్చు - ఉంగారమా



ఎంతమాత్రము - సింతింప వలదు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: మాధవపెద్ది 

ఎంతమాత్రము - సింతింప వలదు సీతమ్మతల్లి
దశకంఠునైనా - వాని తాతనైనా
పిసికిపిండి జేతు - భీతి జెందవలదు




వాయుపుత్రుడ నేనురా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: మాధవపెద్ది 

వాయుపుత్రుడ నేనురా - రక్కసిమూక 
పనిబట్టి పోతానురా హేరామచంద్రప్రభూ
శేటుకాలము వచ్చెరా - మీకు సెడ్డబుద్ధులు పుట్టెరా  
తల్లి సీతను తెచ్చిన – మీ ఒళ్లు హూనం సేయవచ్చిన 
గుప్పుగుప్పున పొగలు గమ్మగ
గప్పుగప్పున మంట లెగయగ హేరామచంద్రప్రభూ
లంకనంతయు గాల్చి - ఈ
లంకేశు పొగరడగింప వచ్చిన



సదివినోడికన్న - ఓరన్నా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు.
గానం: మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి 

సదివినోడికన్న - ఓరన్నా - మడేలన్న మిన్న
పెద్దలు సెప్పినమాట - ఇది సద్దికూటిమూటే - ఎంక్యా
ఏటికి అద్దరి ఇద్దరి ఒకటే కులాలు మతాలు అన్నీ ఒకటే 
రేవునబెట్టి వుతి కేటప్పుడు ముతకాసన్నం అంతా ఒకటే
మంచి ఒక్కటే మారకుంటది - మాటొకటే కలకాలముంటది
పెట్టేయిల్లు సల్లగుండమని - మా కులమొకటే కోరుకుంటది.




జిగిజిగిజిగిజిగి జిగేలుమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం:డా॥ సి. నారాయణ రెడ్డి.
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

జిగిజిగిజిగిజిగి జిగేలుమన్నది - చిన్నది నీముందు - హొయ్
సొగసుకాడ నువు చూడగానే మరి రగిలెను ఏమందు

మొన్న పేరు విన్నాను - మరి నిన్న కలుసుకున్నాను.
అమ్మతోడు నిను నమ్మి - దోరవయసమ్ముకుంటి ఈనాడు
మత్తుగా - గమ్మత్తుగా - మనకు కుదిరిందిజోడు.
నా చూపులోన నీ చూపు నాటగా - సైపలేని సిగ్గాయెరా !
నా చెక్కిలిపై నుపు నొక్కినంత - కైపెక్కి సోలిపోయానురా !
ఓ దొరా | నీ ముందర - ఓపగా లేనురా




తస్సాదియ్యా - తస్సాదియ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం:కొసరాజు.
గానం: ఘంటసాల

తస్సాదియ్యా - తస్సాదియ్యా - తమాషైన బండి
సాగితేనె బండి - యహ - సాగకపోతే మొండి
తుర్రుమని దుమ్ము రేపు దూకుడెగాని
భంభం అని శెవులు పగులు కూతలెగాని - దీని సిగ దరగ -
శీల కాస్త జారెనంటె గాలి కాస్త తుస్సుమంటె- హేబుల్లా
ఉన్నచోటె వుంటాది - కదలను పొమ్మంటాది
కాలినడక నేర్వనోళ్ల కర్మమింతేనూ - కర్మమింతేనూ
జంటలేని ఒంటరోళ్ల తిప్పలింతేనూ - తిప్పలింతేనూ
నమ్మరాని పైనమిది - ఇనప ముక్కల జీవమిది
డబ్బెంతో పోసికొన్న అబ్బాదీని జబ్బేయిది




భలే మోజుగా తయారైన పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా

చరణం: 1
సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే
సూటు లోన నిను చూస్తుంటే సోకుగ నువు నడుస్తువుంటే
ఎవరి మనసు చెదిరేనో ఎన్ని కళ్ళు బెదిరేనో
ఎన్ని కళ్ళు బెదిరిన గాని నిన్ను విరిగి పూయనుగాని
ఉక్కు తునకలే నా మనసు ఒక్క నీకే అదితెలుసు

చరణం: 2
కొండ మీద కోతిని కొత్త వరస అటాడించి
పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో
పేరు నిలుపుకుంటావో మీ ఊరు దారిపడతావో
కొండ మీద కోతిని పట్టి కోరిన నీ ముందర పెట్టి
గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా
గుణపాఠం నేర్పిస్తా గురుదక్షిణ చెల్లిస్తా

భలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లబ్బాయి
గురువుకు నామం పెడతావా గురితప్పి జారి పడతావా
గురువుకు నామం పెడతానా గురితప్పి జారి పడతానా
పాఠాలన్ని సూటిగ నేర్పిన పట్టనవాసపు అమ్మాయి




చెప్పాలనివుంది ఆ... పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

చెప్పాలనివుంది ఆ...
చెప్పాలనివుంది ఊ...
దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ
చెప్పాలనివుంది

పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్నుతట్టి
మనిషిగ తీర్చిదిద్దిన మరువరాని దేవత కథ

కోరనిదే వరాలిచ్చి - కొండంత వెలుగునిచ్చి
మట్టిని మణిగా చేసిన - మమతెరిగిన దేవత కధ
చెప్పాలనివుంది 

అంతటి దేవికి - ఇంతటి దయ ఏలనో
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలాతీరునో
నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే
చెప్పాలనివుంది
ఆలోకమె మరచిపోవు- నీలోనే నిలిచిపోవు




Hullo my dear hullo పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

Hullo! Hullo! Hullo my dear hullo
అలా - ఆలా - అలా గాలితో చరో
Hullo ! Hullo! my dear hullo !
అలా - అలా గాలిలో చలో

లండన్ – జాపాన్ - ప్యారిస్ - గీరిస్ అన్నీ చుట్టేశా !
యండన్ బ్యూటీస్ రంజు వెరైటీస్ - ఎన్నో తిరిగేశా
అయినా సరే - నీకేహురే - హాటుగ మనసిచ్చేశా 
Hullo ! Hullo! my dear hullo !
సూటూబూటూ హ్యాటూ హైటూ చూసే అనుకున్నా
సాటిలేని నీటు కాడవని సెహబాసంటున్నా 
I for you - you for me - సైసై అంటున్నా
ఆలా - అలా గాలిలో చలో చలో

పట్టి నిన్ను రాకెట్టులో పెట్టి - పరలోకానికి వూదేస్తా
మస్తు మస్తుగా బిస్తర్ వేసి - నీకై బైఠాయిస్తా
I for you !
you for me-
I for you-you for me-అలాగాలిలో చలో
Hullo! Mohini_చలో
చలో గాలిలో చలో.




చేతికి చిక్కావే పిట్టా పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

చేతికి చిక్కావే పిట్టా - నువ్వు చచ్చినా నేనొదిలిపెట్ట
ఓ వన్నెల విసనకర్ర - ఓ రంగుల రాట్నమా !
నా దెబ్బకు తట్టుకొనగ నీ యబ్బకు తరం గాదు
కులుకుతొలికి ఎందరినో కొంగున ముడివేశావు యూ
సంసారు లెందరినో సన్నాసులు చేశావు -
పడవలసిన చేతిలోనె – వడ్డావే చివరికి

అలాంటిలాంటోణ్ణిగాదు - అల్లాటప్పావోణ్ణి గాదు.
గడుసువారి బుల్లోణ్ణి - మొనగాన్నే - మొగాన్నే 
నా దెబ్బకు తట్టుకొనగ నీ యబ్బకె కాదు 
వాడి అబ్బకైన తరంగాదు 
కోపమా ?.... నాకు బెదురు లేదు.
తాపమా .... నన్ను తాక లేదు.
ఈ తళుకులు ఈ బెళుకులు ఎన్నెన్నో చూశానే (నేను)
ఏడాకులు నీకంటే ఎక్కువనే చదివానే
పట్టుబట్టి నీ గుట్టు రట్టు సేయవచ్చానే




కుటుంబం - ఉమ్మడి కుటుంబం. పాట సాహిత్యం

 
చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.లీల  

కుటుంబం - ఉమ్మడి కుటుంబం.
చల్లని హృదయాలకు - చక్కని ప్రతిబింబం
మనసులన్ని పెనవేసి - తలపులన్ని కలబోసి.
మమతలు పండించేది - మంచితనం పెంచేది.
ఎవరికివారై పోతే - నవ్వులపాలౌతారు.
కలసి మెలసి వుంటేనే - విలువ పెంచుకుంటారు
చెప్పుడు మాటలు వింటే - ఎప్పటికీ చేటు
అడ్డుగోడలేవుంటే ఆ యింటికి చేటు
మిడిమేలపు బుద్ధులతో - పెడదారిన పడతారు
కంటిముందు స్వర్గాన్నే - కాలదన్నుకుంటారు.
కుటుంబం - చీలిన కుటుంబం 
చెదిరిన హృదయాలలోని - చీకటికే ప్రతిబింబం.


Most Recent

Default