Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rangasthalam (2018)







చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ చరణ్ , సమంత అక్కినేని, ఆది పినిశెట్టి , జగపతిబాబు
కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ఎడిటర్: నవీన్ నోలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేది: 30.03.2018





Songs List:






ఎంత సక్కగున్నవే లచ్చిమి పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్


యేరుశనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
సేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ - ఎంత సక్కగున్నవే
ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగ - ఎంత సక్కగున్నవే
సుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నవే

యేరుశనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

ఓ రెండు కాళ్ళ సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు
నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సెరుకు ముక్క నువ్వు కొరికి తింటావుంటె
ఎంత సక్కగున్నవే
సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే
తిరనాల్లలో తప్పి ఎడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
గాలి పల్లకీలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

కడవ నువ్వు నడుమున బెట్టి
కట్టమీద నడిసొత్త వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
కట్టెల మోపు తలకెత్తుకోనీ
అడుగులోన అడుగేస్తా ఉంటే
అదవి నీకు గొడుగట్టినట్టు
ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
బురద సేలో వరి నాటు ఏత్తావుంటె
ఎంత సక్కగున్నవే
బూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు
ఎంత సక్కగున్నవే

యేరుశనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే



రంగమ్మ మంగమ్మా పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్.మానసి


ఓయ్ రంగమ్మ మంగమ్మా (2)
రంగమ్మ మంగమ్మా
ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2)

గొల్లభామ వచ్చి
నా గొరు గిల్లుతుంటే
ఈ గొల్లభామ వచ్చి
నా గొరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే

ఉఫ్ఫామ్మా ఉఫ్ఫామ్మా అంటు ఊధడు
ఉత్తమాటకైన నన్ను ఊరుకోబెట్టాడు (2)

ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తెలుతుంటే
మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే,
మంటమ్మా మంటమ్మా అంటే సూడడు,
మంచి నీళ్లయిన సేతికియ్యడు.
మంటమ్మా మంటమ్మా అంటే సూడడు,
మంచి నీళ్లయిన సేతికియ్యడు.

ఓయ్...

రంగమ్మ మంగమ్మా (2)
రంగమ్మ మంగమ్మా
ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు (2)

హే.. రామ సిలకమ్మా
రేగి పండు కొడుతుంటే, యే...
రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న,
రైక మీద పడుతుంటే.. యే..

హే.. రామ సిలకమ్మా
రేగి పండు కొడితే
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే.
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు,
మారు రైకైన తెచ్చి ఇయ్యడు,
మరకమ్మా మరకమ్మా అంటు సూడడు,
మారు రైకైన తెచ్చి ఇయ్యడు.

రంగమ్మ మంగమ్మా (2)
రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు,

నా అందమంత మూట గట్టి..
అరె కంది సెనుకు ఎలితే..

ఆ కందిరీగలొచ్చి,
ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టు ముడుతుంటే.. యే..

నా అందమంత మూట గట్టి..
కంది సెనుకి ఎలితే...
కందిరీగలొచ్చి, నన్ను సుట్టు ముడుతుంటే.. యే

ఉష్ మ్మా ఉష్ మ్మా  అంటు తోలడు,
ఉలకడు పలకడు బండ రాముడు, (2)

రంగమ్మ మంగమ్మా (2)
రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు,
హేయ్.. రంగమ్మ మంగమ్మా
రంగమ్మ మంగమ్మా ఎం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకొడు...



ఆ గట్టునుంటావా నాగన్న పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శివనాగులు


ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సీసాడు సార ఉంది
కుందేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది
నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ అడపనేమో గందపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బద్దం ఉంది శుద్దముందీ
ఆ ఏపునన్నీతికి ముందర ఆ ఉందీ
అంటే..... అన్యాయం అధర్మం అబద్దం అసూస్
అందుకనీ....

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న




జిగేలు రాణీ పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రేలా కుమార్ , గంటా వెంకట లక్ష్మీ


రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి
మనందరి కల్లల్లో జిగేలు నింపడానికి
జిగేలు రాణి వచ్చింది ఆడి పాడి అలరించేద్దది అంతే...
మీరందరు రెడీ గా ఉండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు

ఒరెఒరెఒరెఒరే...
ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో
మరి ఉండ్రా ఏంటి నువ్ వస్తన్నావ్ అని తెలిసీ పక్కురినుండి కూడా వచ్చాం ఎగేసుకుంటూ
ఇదిగో ఆ గల్ల సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సూస్తన్నాడు నా వంకే
నువ్వేదో ఇస్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా ఓ మీద మీద కొత్తన్నావ
ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ
అందరి దగ్గరకు నేనే వస్తా
ఆ అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగు రాణీ
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగు రాణీ

ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే

ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ
కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే
మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ
మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానే
మరి నాకేమిస్తావే జిగేలు రాణీ
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తాదీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువ్ చదివెందెంతే జిగేలు రాణీ
మగాల్ల వీకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బి సెట్టి పంచ జారితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణీ
అది పోలీసోల్లకి రిసర్వేషనే
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ
ఏదడిగినా లేదంటావ్ నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ
నీకేం కావాలో చెప్పూ
హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ
నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
సడి సప్పుడు వింటూ చచ్చిపోతమూ
నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట వాడు పాడండి రాజా

నా పాటా వేలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాటా పులి గోరూ
వెండి పళ్ళెం ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కటనం
కొత్తగా కట్టించుకున్న ఇల్లూ
నా పాట రైసు మిల్లూ
అహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాషు లక్షా
అయిబాబోయ్ లచ్చే....



రంగా రంగా రంగస్థలానా పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్


రంగా రంగా రంగస్థలానా
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆత బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా
ఆత బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా

రంగా రంగా రంగస్థలాన
ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా
ఆట బొమ్మలం అంటా మేమంత తోలు బొమ్మలం అంటా
కంపడని చెయ్యేదొ ఆడిస్తున్నా
ఆట బొమ్మలం అంటా
వినపడని పాటకి సిందాడేస్తున్నా
తోలు బొమ్మలం అంటా
డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు
హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు

రంగా రంగా రంగస్థలానా
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా
ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా

గంగంటె శివుడి గారి పెళ్ళాం అంటా
గాలంటె హనుమంతుడి నన్న గారటా
గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన
వాల్లు కనికరించాలంటా
వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా
శూలమంటె కాళికమ్మ ఆయుదమంటా
పాట పాడడానికైన పోటు పొడవడానికైన
వాల్లు ఆనతిస్తేనె అన్ని జరిగేనంట

రంగా రంగా రంగస్థలానా
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా
ఆట బొమ్మలం అంటా మనమంత తోలు బొమ్మలం అంటా

డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు
హేయ్ డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు

పది తలలు ఉన్నోడు రావణుడంటా
ఒక్క తలపు కూడ చెడలేదె రాముడి కంటా
రామ రావణుల బెట్టి రామాయనం ఆట గట్టి
మచి చెడుల మద్య మనని పెట్టారంటా
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజటా
దయలేని వాడు యమధర్మరాజటా
వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట

రంగా రంగా రంగస్థలాన
ఆడడానికంటె ముందు సాదనంటు చెయ్యలేని
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా
ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలమంటా
డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు డుముకు
డుంగురు డుంగురు డుంగురు



ఓరయ్యో నా అయ్యా పాట సాహిత్యం

చిత్రం: రంగస్థలం (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం:చంద్రబోస్
గానం: చంద్రబోస్


ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే పాలుపట్టాను
ఈ సేతితోనే బువ్వ పెట్టాను

ఈ సేతితోనే తలకు పోసాను
ఈ సేతితోనే కాళ్లు పిసికాను

ఈ సేతితోనే పాడెమొయ్యాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే పాలుపట్టాను
ఈ సేతితోనే బువ్వ పెట్టాను

ఈ సేతితోనే తలకు పోసాను
ఈ సేతితోనే కళ్లు పిసికాను

ఈ సేతితోనే పాడెమొయ్యాలా
ఈ సేతితోనే కొరివి పెట్టాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

మాకు దారి సూపిన కాళ్ళు కట్టెల పాలయ్యేనా
మా బుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా

మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా
మమ్ము మేలుకొలిపిన గొంతు గాడ నిదురపోయేనా

మా బాధలనోదార్చే తోడుండె వాడివిరా
ఈ బాధను ఓదార్చనువ్వుంటే బాగుండెరా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

ఈ సేతితోనే దిష్టి తీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను

ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి పంపాను

ఈ సేతితోనే కాటికి పంపాలా
ఈ సేతితోనే మంటల కలపాలా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా

తమ్ముడు నీ కోసం తల్లడిల్లాడయ్యా
సెల్లి గుండె నీకై సెరువై పోయిందయ్యా

కంచంలోని మెతుకు నిన్నె ఎతికేనయ్యా
నీ కళ్లద్దాలు నీకై కలియజుసెనయ్యా

నువ్వుతొడిగిన సొక్కా నీకై దిగులుపడి
సిలకకొయ్యకురి  పెట్టుకుందిరయ్యా

రంగస్థలాన
రంగస్థలాన నీ పాత్ర ముగిసెనా
వల్లకాట్లో శూన్యం మెదలయ్యేనా

నీ  నటనకు కన్నింటి సప్పట్లు కురిసెనా

నువ్వెళ్ళోత్తానంటూ సెప్పే వుంటావురా
మా పాపపు సెవికది యినపడకుంటాదిరా

ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా........





No comments

Most Recent

Default