చిత్రం: బుర్రిపాలెం బుల్లోడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: పి.శుశీల, యస్.పి.బాలు, మాదవపెద్ది రమేష్ , రమోల
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి, రతీదేవి (నూతన నటి)
కథ: సత్యానంద్ , జంధ్యాల
మాటలు ( డైలాగ్స్ ): జంధ్యాల
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
నిర్మాత: కె.విద్యాసాగర్
సినిమాటోగ్రఫీ: పి.భాస్కరరావు
ఎడిటర్: నరసింహారావు
బ్యానర్: తిరుపతి ఇంటర్నేషనల్
విడుదల తేది: 16.11.1979
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయం లో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
ఏనాటిదో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే
నీవు నన్ను తాకిన చోట పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే
మనసులో మధుర వయసులో
యమున కలిసి జంటగా సాగనీ
మన యవ్వనాల నవ నందనాల
మధు మాస మధువులే పొంగనీ
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ
ముద్దు ముద్దులడిగిన వేళా నెమలి ఆట ఆడనీ
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా
ఇదే రాసలీలా ఇదే రాగ డోలా
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావని లో ఆమని ఉదయంలో
నిన్ను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా ప్రాణమంతా నీ వేణువాయే
పులకింతలన్నీ నీ పూజ లాయే
ఏ యోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
ఏ యోగమో ఈ రాగమూ ఏ జన్మదో ఈ బంధమూ
ఇంద్రధనసు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే
ఇంద్రధనసు పల్లకీలో చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్ల మబ్బు కాళ్ళు కడిగీ మెరుపు కొంగు ముడిపెడుతుంటే
రాగలహరి అనురాగ నగరి రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి పద రేణువై చెలరేగనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోటా నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా అదే రాగ డోలా
అదే రాసలీలా అదే రాగ డోలా