చిత్రం: GST (2021)
సంగీతం: యు. వి. నిరంజన్
నటీనటులు: ఆనంద్ కృష్ణ , అశోక్, స్వాతి మండల్, ఇందు, పూజ సుహాసిని, జూనియర్ సంపు, వెంకట్, నందు, వాణి
దర్శకత్వం: కోమరి జానకిరామ్
నిర్మాత: కోమరి జనయ్య నాయుడు
విడుదల తేది: 2021
చిత్రం: GST (2021)
సంగీతం: యు. వి. నిరంజన్
సాహిత్యం: బాల వర్ధన్
గానం: హరిణి ఇవటూరి
కంటి పాపకే ఆనందమే కదా
కళ్ళ ముందరే నువ్వే ఉండగా
ఎందుకో ఇలా సరికొత్త హాయిగా
నిన్న మొన్న లేని వేడుకగా
నీవెంటే నేనంటూ నా జంటై నాతో ఉంటె చాలు
నీడై నీతోనే వస్తున్న మౌనంగా
ఆకాశం మొత్తంగా నింపేసా
నీపై ఉన్న ప్రేమ ఆరో ప్రాణంగా
నాలోనే ఒదగంగా
దిరదిన్నానా దిరదిరనా దిరనానా దిరదిరనా (4)
వెంటే రమ్మంటున్న వెంటుంది పొమ్మంటున్న
వెంటబడి కంటబడి మురిపించేనే
కొంచెం నవ్విస్తుంటే ఇంకొంచెం ఉడికిస్తుంటే
కవ్వింతల్లో కాలం మొత్తం నిలవదే
గుండె గూటిలోన గురుతుగా
చప్పుడల్లే మారిపోతున్నాగా
కంటిపాపలోని వెలుగులో
రెప్ప వెయ్యకుండా చుస్తున్నాగా
దిరదిన్నానా దిరదిరనా దిరనానా దిరదిరనా (4)
ఉండి ఉండి లోలో చూస్తున్న నిన్నే నాలో
ఉన్నట్టుండి ఊహాల్లోనే మునిగినా
నీకై నీడై ఉంటూ నీలానే మారనంటూ
ఎందాకైనా వస్తా నీతో వదలక
పుట్టినాను నేను నీకని పట్టుకుంటా నీ చేతిని
కట్టుబడి ఉన్న మనసుని తట్టి చెప్పమంది ప్రేమని
కంటి పాపకే ఆనందమే కదా
కళ్ళ ముందరే నువ్వే ఉండగా
ఎందుకో ఇలా సరికొత్త హాయిగా
నిన్న మొన్న లేని వేడుకగా
నీ వెంటే నేనంటూ
నా జంటై నాతో ఉంటె చాలు
నీడై నీతోనే వస్తున్న మౌనంగా
ఆకాశం మొత్తంగా నింపేసా
నీపై ఉన్న ప్రేమా ఆరో ప్రాణంగా
నాలోనే ఒదగంగా
దిరదిన్నానా దిరదిరనా దిరనానా దిరదిరనా (4)

No comments
Post a Comment