-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vijayalalitha"



చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కాంతారావు, రామకృష్ణ, రాజనాల, విజయలలిత, అనిత, రాజబాబు
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాత: టి.వి.రాజు
విడుదల తేది: 19.02.1971



Songs List:



అనురాగ తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

అనురాగ తీరాలలో
నీ కనుపాప దీపాలలో
చిన్నారిని, నే నున్నాననీ
దరిచేరరావా ప్రియా 

అనురాగ తీరాలలో
నా కనుపాప దీపాలలో
చిన్నారివి, నీవున్నావసీ
దరిచేర లేదా సఖీ 

కడగంట నిను చూసి
కొనకొంగు ముడి వేసి
జత చేరుకోవాలనీ
వేచేనులే వెయ్యేళ్ళైననూ
వేచేనులే వెయ్యేళ్ళైనసూ

ఆరోజు రావాలనీ
ఆరోజు తలపోసి
ఈ వేళ నను చూసి
నునుసిగ్గు నీ కేలనే
జవరాలివి, నా ప్రియురాలివీ
తొలిరేయి నేడే చెలీ



చెంగున దూకే పరువాలు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.జానకి

చెంగునదూకే పరువాలు కో అన్నవి !
పొంగులు వారే హృదయాలు సై అన్నవి
విరిసే ఈ వేళలో
వీచే ఈ గాలిలో

ఎన్నడులేదే ఈ పులకింత
ఎదలో ఏదో తీయని వింత

ఏ మరుడో ! భూపరుడై
దాగ న్నాడో ఏ పొదరింట

జిల్లునసోకే చల్లనినీట
అల్లరిచేసే జల్లుల ఆట
ఈ అలలే ! ఊయలలై
ఆడించేనా ఈ సయ్యాట





మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి, యస్.పి.బాలు, 

మేఘమాల నీవైతే మెరుపుకన్నె నేనే
స్వాతివాన నేనైతే - జాతిముత్యం నీదే
కురియునోయి వలపువాన - మురిసేను మనసే
ఓ ప్రియురాలా
నా జతగాడా !

నల్లనల్ల మబ్బు - తెల్ల తెల్ల అంచు
ఒళ్ళఝల్లుమనగ కురిసె జలు
ఒళ్ళుఝల్లు మజ్జిగ కురిసె జల్లు
చినుకులందు తడిసి మేను కనువిందులు చేసే
చూసితి సొగసు నిలువదు మనసు
చూసితి సొగసు నిలువదు మనసు
నిలువదు మనసు
నిలువదు మనసు

బయట ఇంతవాన - లోన ఎంత వేడి
మనసులోని తాప మాప మి
మనసులోని తాప మాపవేమి
పండును వలపు
పండును వలపు
తనివితీర చెలియ నీదు ఒడిలోనవాలి
ముచ్చటగొలుపు - పండును వలవు
ముచ్చటగొలుపు పండును వలపు





చూడచక్కని చిన్నోడా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం:  యస్.జానకి

చూడచక్కని చిన్నోడా
ఈడు జోడుగ వున్నోడా
దొంగచూపులు చూచి వలపు
దోచుకున్నోడా నా వాడా
రార మొనగాడా నా వాడా
రార మొనగాడా

వాలుగన్నుల చిన్నదిరా ఇది
వరసలాడుతు - వున్నదిరా
చెంత జేరి - రారమ్మంటే
సిగ్గుపడతా వేమిరా
రార మొనగాడా - నా వాడా
రార మొనగాడా

అద్దమంటీ మనసున్నదిరా
అందమైన వయసున్నదిరా
ముద్దుగుమ్మా పక్కనుంటే
మూతిముడిచే వేమిరా
రార మొనగాడా 'నా వాడా
రార మొనగాడా



గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం: పి.బి. శ్రీనివాస్, బి. వసంత

ఓ హెూ హెూయ్...
ఓ హెూ హెయ్
గప్పాం గప్పాం కత్తులు - గమ్మత్తైన కత్తులు
చురకత్తులు దొరకత్తులు
సరి కొత్త కొత్త కత్తులు
బంగారు పిడి చూడు
రంగేళి వరచూడు

ఈలోపల కత్తి పెట్టిచూడు - నీకు
పోరాటం చేతనైతె వాడు

గప్పాం గప్పాం పోరాటం
గప్పాం గప్పాం పోరాటం
చేతనైతె వాడు

పల్నాటి వీరకోళ్ళ పందాలకు వాడినదీ
గోలుకొండనవ్వాబుకు - గొప్ప తెచ్చి పెట్టినవీ పల్నాటి
చేతులెయ్యకండి గుచ్చుకుంటాయండి

గొంతుకోసి చూసుకోండి - తెగకుంటే ఒట్టండీ
ప్రతిరోజు వాడుతుంటే-పదును పెరుగుతాయండీ
ఒకరోజు వాడకున్న మెరుగుతరగబోవండీ
ఎంత దెబ్బ కైనా- ఇవి ఎదురుతిరుగుతాయండీ
డబ్బులిచ్చి తీసుకోండి. దెబ్బ వేసిచూడండీ




దైవం లేదా దైవం లేదా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం:  యస్.జానకి

దైవం లేదా, దైవం లేదా!
రగి లేగుండెల సెగలే-కనబడలేదా !

దైవం లేదా
రగిలే గుండెల సెగలే కనబడలేదా
దైవం లేదా
బుసకొట్టే విషవలయంలో
పసిపాపడు బలియౌనా

శిరసొగని వీరకిశోరం
చెఱపాలె కుమి లేనా !
కన్నీళ్ళకు విలు వేలేదా
కన్నీళ్ళకు విలు వే లేదా
కరుణామయు డే లేదా

ఆ దేవుని దీవెనలుంటే
నా దేవుడు రాకుంటాడా !

విషనాగుల కోఱలు విరిచే
పసికందును కొనిపోలేదా !
వికటించిన చీకటిపోదా |
వికటించిన చీకటి పోదా
వేకువ రానేరాదా

దైవం లేదా !
దైవం లేదా !
దైవం లేదా !

Palli Balakrishna Wednesday, November 29, 2023



చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక, విజయలలిత, చంద్రమోహన్, స్నేహ ప్రభ (నూతన తార)
కథ: విజయబపినీడు
అసోసియేట్ డైరెక్టర్స్: దాసరి నారాయణరావు, ఎం.ఎస్. కోటా రెడ్డి
దర్శకత్వం: కె.వి. నందనరావు
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ
విడుదల తేది: 18.06.1970



Songs List:



జానీ జింజర్ జానీ జింజర్ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు
వారే వారే వా వా | భలే హుషారు |
తిరుగులేదు మనదెబ్బకు తిరుగులేదురా
తిరుగులేదు మన దెబ్బకు తిరుగులేదురా!

రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడతదీ ।
మీ చేయి చేయి కలిపితే డబ్బూడిపడతదీ
నిప్పుకు గాలికి యిప్పుడు నేస్తమయ్యింది
ఇక చూస్కో నారాజా మజాగుంటదీ॥
కొండనైన పిండిపిండిగ కొట్టేస్తారూ ।
అ కొండమీద కోతినైన దింపేస్తారూ||
సాటిలేని మేటి వీరసింహులుమీరు
మీ ధాటి కెదురులేరు ! ఎదురైతే బ్రతికిపోరు

పడుచుపిల్ల కాస్త ప్రక్కనుంటేచాలు |
ఎంతపనినైనా చిటికెలోన చెయ్యగవీలు||
మన ముగ్గురమొకటైతే ఇంకేముందీ ।
అనుకున్నది చేతిలోకి చిక్కిపోతుందీ |
మనకు దక్కిపోతుందీ




చిరునవ్వు దివ్వె ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం

చిరునవ్వు దివ్వె ఏమన్నదీ
అరమోడ్పు కన్నులేమన్నదీ
తనకున్న మున్నె మగడున్నచోటికి
మనసుపోయేనంటున్నదీ

లేడిలా మనసు పరుగిడినా
వగలాడి ఆ బిగువెందులకే
వేడికోరికల దాడులకే పూబోణి రవ్వంత జంకెనులే
తొలినాటివేనే ఈ బిగువు| ఒక రాతిరేనే ఈ బెదురు
ఆ పైన మనవైపు చూడదులే

ఇంతి ముంగురులు సరదవే
వెన్నెల రాసి నొకపరి చూడాలి
ఎంతమురిపాలె అన్నకు
తన చెల్లి సొగసులు చూసుకొని
అల్లారు మేనల్లు నెత్తుకొని అంతలో తిరిగివచ్చుననీ
శ్రీవారితో ముందే చెప్పాలనీ

కలికిరో కలువరేకులలో
కనిపించు ఆ మంచు ఎందులకే
కమ్మగా వరుని విరిపాన్పు
రమ్మంటే వలపుల విందులకు
వింత తళుకులూ విరిశాయి ఏదో విశేష మీరేయీ
కదలవే మదనుకొలువునకు




షోకైన మల్లెపువ్వుమీద పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

(Note: ఇది ఆడియో వెర్షన్,  వీడియో వెర్షన్ లో కొన్ని మర్పులు చేశారు)

షోకీల్లా పిల్లా బుగ్గమీద
ముద్దిచ్చే మోజు నీకులేదా
ఉంటేలే-లే-లేచి రా-రా- రా
నీకు వైకుంఠమే చూపుతా

ఈ మగువ నవ్వులలో నా బిగువు కౌగిలిలో
మత్తు ఉందీ | గమ్మత్తు ఉంది.
రంజైన సుఖముంది రా
ఒక్కసారీ చిక్కితేనూ
ఇక పైన పోలేవురా

ఈ మేని ఒంపులలో లేమెరుపు చూపిస్తా
తేనెలూరే వయసులోని
రుచి నీకు అందించుతా
నిన్నలేదు రేపుదూ
జల్సాగ జీవించరా




అంబ పలుకవే జగదంబ పలకవే పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల

అంబ పలకవే జగదంబ పలకవే
కొండకింద కోటమ్మ పలకవే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే

టక్కుటమారం నేర్చినోళ్ళు
నిను చిక్కించుకోను చూస్తారే
పక్కన పొంచులు వేస్తారే
బొందిలో ప్రాణం ఉండువరకు
ఆ చవటల ఆటలు సాగనియ్యమే
ఆ చవటల ఆటలు సాగనియ్యమే

ఎదురుగానే నీవున్నావా.
ఎవరికి కనపడకున్నావా
లోకోద్ధరణకు పుట్టావమ్మా
నీకు సాటి ఎవరమ్మా బొమ్మా

నీదయ మాపై ఉంటేచాలు
మట్టినైన మాణిక్యం చేస్తాం
రాళ్ళనైన రత్నాలుగ చేస్తాం
దేశద్రోహుల నాశంచేసి
ఆశాజ్యోతుల వెలిగిస్తాం

Palli Balakrishna Tuesday, November 28, 2023



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: కాంతారావు, కృష్ణకుమారి, చలం, టి.కృష్ణకుమారి, విజయలలిత, విజయనిర్మల, వాణిశ్రీ, హేమలత
దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
నిర్మాతలు: గుత్తికొండ వెంకటరత్నం, సె.హెచ్.ఎల్.ఎన్.రావు
విడుదల తేది: 14.04.1971



Songs List:



ఈ కన్నెగులాబీ విరిసినదోయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: దాశరథి 
గానం: ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ 

ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి 




ఎదురు చూచే నయనాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు



పదిమందిలో పాటపాడినా.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల

పల్లవి:
పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే...... !!పది!!

చరణం 1:
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..||2||
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే ||2||
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ||2||
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......





రానీ రానీ మైకం రానీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎల్. ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది 

రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ బిడియం పోని 



గూటిలోని పిల్లకు పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: కె.జి. ఆర్. శర్మ
గానం: పి.సుశీల 

గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది 

Palli Balakrishna



చిత్రం:  సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ  (All)
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు, యస్.పి.శైలజ , చిత్ర 
నటీనటులు: విజయకాంత్, రాంకి మరియు నిరోషా, శ్రీప్రియ 
మాటలు: రాజశ్రీ
దర్శకత్వం: పి.ఆర్. దేవరాజ్
నిర్మాత: బి.కృష్ణారెడ్డి
విడుదల తేది: 23.09.1988



Songs List:



సింధూరపువ్వా తేనె చిందించరావా పాట సాహిత్యం

 
చిత్రం:  సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
కలలే విరిసేనే కధలే పాడేనే
ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే ఏ ఏ ఏ ఏ
ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ ఓ
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
అందాల సందడి చేసే రాగాలనేలి

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా



చిలకా రాచిలక పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం: నాగూర్ బాబు, యస్.పి.శైలజ

చిలకా రాచిలక



కనివిని ఎరుగని పులకింత పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, చిత్ర 

కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నా చెంత
కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నా చెంత
వన్నెలు చిలికే చల్లని మదిలో పాడే కోయిలా
నిలువెల్ల ఊహలే కురిసేను
మురిపాల కవితలే పలికేను

కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నీ చెంత
వన్నెలు చిలికే చల్లని మదిలో పాడే కోయిలా
నిలువెల్ల ఊహలే కురిసేను
మురిపాల కవితలే పలికేను

పూల వయసు పూచినది ప్రేమ దారి కాచినదీ 
పూజకోరి పూవే తానై పూజకొరకు వేచినది 
ఆశలన్ని ఊరించీ కథలు తోటి పలికించే 
సంధ్య వేళ నన్నే చేరి దోరవయసు కవ్వించే 
ఉరికెనులే మనకలలు తరగని సిరులై రావా 
నీ పాల వలపు నను శృతి చేసే 
నీ నీలి కనులే వలవేసే 

కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నీ చెంత
కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నా చెంత

అందమైన నెలవంకా ఆకశాన్ని మరిచినను 
నీవు లేక నేలేనే నిను నేను విడిచి పోలేనే
వానజల్లు వెనువెంట ఇంద్రధనసు రాకున్నా 
పలకరించు నా హృదయం నీకు సొంతమే కానీ
మదిలోని తలపులనే కదిలించీ రావా 
రాగాల సాగరం నీదేనా 
ఈ వేళ విరిసినే విరివాన 

కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నా చెంత
కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నీ చెంత

వన్నెలు చిలికే చల్లని మదిలో పాడే కోయిలా
నిలువెల్ల ఊహలే కురిసేను
మురిపాల కవితలే పలికేను

కనివిని ఎరుగని పులకింత
ఒక దేవత వెలిసెను నీ చెంత
వన్నెలు చిలికే చల్లని మదిలో పాడే కోయిలా
నిలువెల్ల ఊహలే కురిసేను
మురిపాల కవితలే పలికేను




నిను ఎవరో కొట్టారట పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం: నాగూర్ బాబు, యస్.పి.శైలజ

నిను ఎవరో కొట్టారట



తూరుపమ్మ ముద్ద పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం: నాగూర్ బాబు

తూరుపమ్మ ముద్ద



యెటిలోన యెల్లేటి పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరపువ్వు (1988)
సంగీతం: మనోజ్ - గియాన్ 
సాహిత్యం: రాజశ్రీ
గానం: నాగూర్ బాబు, యస్.పి.శైలజ

యెటిలోన యెల్లేటి

Palli Balakrishna Sunday, November 26, 2023

Most Recent

Default