Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sukha Dukhalu (1968)
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
నటీనటులు: వాణిశ్రీ, జయలలిత, చంద్రమోహన్, రామకృష్ణ 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐ. వి.మూర్తి
నిర్మాత: పి.కామేశ్వరరావు
విడుదల తేది: 19.07.1968Songs List:ఇది మల్లెల వేళయనీ పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

కసిరే ఏండలు కాల్చునని
ముసిరే వానలు ముంచునని 
ఇక కసిరే ఏండలు కాల్చునని
మరి ముసిరే వానలు ముంచునని 
ఎరుగని కొయిల ఎగిరింది 
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది 
నేలకు వొరిగింది 
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది 

మరిగి పోయేది మానవ హృదయం
కరుణ కరిగేది చల్లని దైవం 
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం 
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం 
వసి వాడని కుసుమ విలాసం 
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం 
ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం 
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం 

ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ 
తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది 
ఎందరు ఉన్నారూ మీలో పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల

ఎందరు ఉన్నారూ మీలో
ఎందరు ఉన్నారూ !
నీతికి నిలబడువారూ
నిందకు భయపడువారూ !

వచ్చానయ్యా ! వచ్చానూ
వరాల లక్ష్మిని వచ్చానూ
మక్కువగలిగిన వారికీయగా
చక్కని కానుక తెచ్చానూ


బ్లాకుమార్కెటియర్ __

వచ్చానమ్మా వచ్చానూ-నీ
కానుక కోసం వచ్చాను
ఆ కానుక నాకు యిచ్చావంటే
కళ్ళకద్దుకొని పూజిస్తాను
సత్రాలను కట్టించానూ
చలివేంద్రల పెట్టించానూ

గుడికి శిఖరమెత్తించానూ
బడిలో పప్పులు పంచానూ 
ఎలక్షన్లలో నిలిచినవాళ్ళకు
ఎన్నో చందాలిచ్చాను 

బ్లాకు మార్కెట్లు చేశావు
పాలడబ్బాలు దాచావు
శిక్షలు ఫైనులు తప్పుకొనంగా
బడానాయకుల మేపావు
చాలయ్యా నీ వేషాలు
జాతికి నువ్వు వేరుపురుగువు 

జైళ్ళలోన పడుకున్నాను
దేవతాపులుసు తిన్నాను
మీటింగులలో ముందుకు దూకి
ఎన్నో లెక్చరు లిచ్చాను
యిల్లూవాకిలి వదలిపెట్టి నే
ప్రజా సేవలో పండాను 

ప్రజా సేవకుడనన్నావు
ప్రజలకు టోపీ పెట్టావు
పర్మిట్లెన్నో సంపాయించి
పైసాలను తెగ తిన్నావు
దేశం పేరు చెరిచావు,
పోపో ఎందుకు అరిచేవూ

బక్కచిక్కినా రై తులం
దిక్కులేని కూలీలమూ
గంపెడు పిల్లల కన్నాము
కరువు తోటి చస్తున్నాము
మితముగ పిల్లలు కావాలి
మా బ్రతుకులు హాయిగ జరగాలి

భారతదేశపు సంపద పెంచగ
బంగారము పండించండి
పండిన పంటను దాచుకోక యీ
ప్రపంచాన్ని బ్రతికించండి
మీకోరికలను తీర్చెద
కరువుమాపి కాపాడెద
ఇదుగో కానుక పట్టండీ 
ఓ పదారు నా వయసు పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఓ పదారు నా వయసు
పండింది నా సొగసు
పడుచుగుండె తెలిసికోలేవా
ఓహో బావా.... ఇలా రావా....దోచుకోవా
ఓ.... పదారు నా

చిలిపిగా నవ్వకు
వలపులే పొంగును
కొంటె కొంటె చూపులన్ని గొడవ చేసెనోయ్
గులాబి బుగ్గలపై ఫలాన గురుతులతో
సరాగమాడినచో చల్లని మైకం

ఓ.... పదారు నా వయసు
పండింది నా సొగసు

నడకలో హంసలు నవ్వులో చిలకలు
గొంతులోన వంతపాడుకోయిలున్నది
చలాకి నా పరువం - జిలేబి తీపిసుమా
అందాల నా హొయలు ఆరగించుమా - ఓ

ఓ పదారు నా వయసు
పండింది నా సొగసు
పడుచుగుండె తెలిసికోలేవా
ఓహో బావా - యిలా రావా దోచుకోవా
ఓ పదారు
ఓ అందాలుచిందే పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఓ అందాలుచిందే ఆ కళ్ళలోనే
బంగారు కలలే దాగున్నవి

అవిరేకులు విరిపీ నీకై వేచీ
రేయీ పగలూ తీయని వగలై దాగున్నవి

చిరుగాలిలాగా సెలయేరులాగా
చెలరేగే తీయని పరువం ఏమన్నది

అనురాగం జిల్లున సోకే
ఆనందం వెల్లువదూకే
ఆ రోజు రానీ గానీ అంటున్నది

మనసైన నీవే పెనవేయగానే
అణవణువూ ఏమో ఏమో ఔతున్నది

నీ జడలో మలెలు వలికే
నా యెదలో తేనెలు చిలికే
ఆ రేయి నేడే నేడే రానున్నది
లలలాలా - అహహహా ఓహోహోహోమేడంటే మేడా కాదూ పాట సాహిత్యం

 
చిత్రం: సుఖఃదుఖాలు (1968)
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం: యస్.పి.బాలు

మేడంటే మేడా కాదూ
గూడంటే గూడూకాదూ
పదిలంగ అల్లుకొన్న
పొదరిల్లుమాది
నేనైతే ఆకూ కొమ్మా
తానైతే వెన్నెలవెల్ల
పదిలంగ నేసిన పూసెన
పొదరిల్లుమాది
కోవెల్లో వెలిగే దీపం దేవి మాతల్లి
కోవెలో తిరిగే పాటల గువ్వ నా చెల్లి
గువ్వంటే గువ్వకాదు గొరవంకగాని
వంకంటే వంకగాదూ నెలవంక గాని
గోరింకా పెళ్లయిపోతే
ఏ వంకకో వెళ్ళిపోతే
గూడంతా గుబులైపోదా
గుండెల్లో దిగులై పోదా

No comments

Most Recent

Default