Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jagath Jetteelu (1970)




చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక, విజయలలిత, చంద్రమోహన్, స్నేహ ప్రభ (నూతన తార)
కథ: విజయబపినీడు
అసోసియేట్ డైరెక్టర్స్: దాసరి నారాయణరావు, ఎం.ఎస్. కోటా రెడ్డి
దర్శకత్వం: కె.వి. నందనరావు
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు, కె. రాఘవ
విడుదల తేది: 18.06.1970



Songs List:



జానీ జింజర్ జానీ జింజర్ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు
వారే వారే వా వా | భలే హుషారు |
తిరుగులేదు మనదెబ్బకు తిరుగులేదురా
తిరుగులేదు మన దెబ్బకు తిరుగులేదురా!

రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడతదీ ।
మీ చేయి చేయి కలిపితే డబ్బూడిపడతదీ
నిప్పుకు గాలికి యిప్పుడు నేస్తమయ్యింది
ఇక చూస్కో నారాజా మజాగుంటదీ॥
కొండనైన పిండిపిండిగ కొట్టేస్తారూ ।
అ కొండమీద కోతినైన దింపేస్తారూ||
సాటిలేని మేటి వీరసింహులుమీరు
మీ ధాటి కెదురులేరు ! ఎదురైతే బ్రతికిపోరు

పడుచుపిల్ల కాస్త ప్రక్కనుంటేచాలు |
ఎంతపనినైనా చిటికెలోన చెయ్యగవీలు||
మన ముగ్గురమొకటైతే ఇంకేముందీ ।
అనుకున్నది చేతిలోకి చిక్కిపోతుందీ |
మనకు దక్కిపోతుందీ




చిరునవ్వు దివ్వె ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం

చిరునవ్వు దివ్వె ఏమన్నదీ
అరమోడ్పు కన్నులేమన్నదీ
తనకున్న మున్నె మగడున్నచోటికి
మనసుపోయేనంటున్నదీ

లేడిలా మనసు పరుగిడినా
వగలాడి ఆ బిగువెందులకే
వేడికోరికల దాడులకే పూబోణి రవ్వంత జంకెనులే
తొలినాటివేనే ఈ బిగువు| ఒక రాతిరేనే ఈ బెదురు
ఆ పైన మనవైపు చూడదులే

ఇంతి ముంగురులు సరదవే
వెన్నెల రాసి నొకపరి చూడాలి
ఎంతమురిపాలె అన్నకు
తన చెల్లి సొగసులు చూసుకొని
అల్లారు మేనల్లు నెత్తుకొని అంతలో తిరిగివచ్చుననీ
శ్రీవారితో ముందే చెప్పాలనీ

కలికిరో కలువరేకులలో
కనిపించు ఆ మంచు ఎందులకే
కమ్మగా వరుని విరిపాన్పు
రమ్మంటే వలపుల విందులకు
వింత తళుకులూ విరిశాయి ఏదో విశేష మీరేయీ
కదలవే మదనుకొలువునకు




షోకైన మల్లెపువ్వుమీద పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

(Note: ఇది ఆడియో వెర్షన్,  వీడియో వెర్షన్ లో కొన్ని మర్పులు చేశారు)

షోకీల్లా పిల్లా బుగ్గమీద
ముద్దిచ్చే మోజు నీకులేదా
ఉంటేలే-లే-లేచి రా-రా- రా
నీకు వైకుంఠమే చూపుతా

ఈ మగువ నవ్వులలో నా బిగువు కౌగిలిలో
మత్తు ఉందీ | గమ్మత్తు ఉంది.
రంజైన సుఖముంది రా
ఒక్కసారీ చిక్కితేనూ
ఇక పైన పోలేవురా

ఈ మేని ఒంపులలో లేమెరుపు చూపిస్తా
తేనెలూరే వయసులోని
రుచి నీకు అందించుతా
నిన్నలేదు రేపుదూ
జల్సాగ జీవించరా




అంబ పలుకవే జగదంబ పలకవే పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జెట్టిలు (1970)
సంగీతం: ఎస్.పి.కొదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది సత్యం, పి.సుశీల

అంబ పలకవే జగదంబ పలకవే
కొండకింద కోటమ్మ పలకవే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే
ఎక్కడ వున్నావే తల్లీ ఏమైపోయినావే

టక్కుటమారం నేర్చినోళ్ళు
నిను చిక్కించుకోను చూస్తారే
పక్కన పొంచులు వేస్తారే
బొందిలో ప్రాణం ఉండువరకు
ఆ చవటల ఆటలు సాగనియ్యమే
ఆ చవటల ఆటలు సాగనియ్యమే

ఎదురుగానే నీవున్నావా.
ఎవరికి కనపడకున్నావా
లోకోద్ధరణకు పుట్టావమ్మా
నీకు సాటి ఎవరమ్మా బొమ్మా

నీదయ మాపై ఉంటేచాలు
మట్టినైన మాణిక్యం చేస్తాం
రాళ్ళనైన రత్నాలుగ చేస్తాం
దేశద్రోహుల నాశంచేసి
ఆశాజ్యోతుల వెలిగిస్తాం

No comments

Most Recent

Default