Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jagath Janthreelu (1971)




చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, విజయరత్నం
గానం: ఘంటసాల, పి.సుశీల , యస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 
నటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, రేణుక
కథ, మాటలు, అసోసియేట్ డైరెక్టర్: దాసరి నారాయణరావు 
దర్శకత్వం: పి.లక్ష్మీదీపక్
నిర్మాతలు: పి.ఏకామ్రేశ్వరరావు
విడుదల తేది: 30.12.1971



Songs List:



ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఎక్కడున్నాడో వాడు ఎక్కడున్నాడో




హరి ఓం హరి ఓం ఆనరా పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: యస్.పి.బాలు 

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా
హరి ఓం హరి ఓం ఆనరా

చరణం: 1
ఎందరి కొంపలు తియ్యందే వీడింతవాడెలా అయ్యాడు
వీడి గుబీ తియ్యాలని వీరబ్రహ్మం చెప్పాడు

హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా


చరణం: 2
నిప్పు నీరు గాలి నేల నీవి నావి అన్నారు
డబ్బు జూడ అందరి దేనిని కై దెబ్బకొడితె రైతన్నారు 
హరి ఓం హరి ఓం ఆనరా
అల్బిత్తిరిలకు కాలం గదరా

చరణం: 3
పాపం పుణ్యం అనుకోకుండా పైసా సంపాదించాలోయ్ 
జేబులు బాగా నిండిన పిమ్మట
గుళ్లు గోపురాల్ కట్టాలోయ్

చరణం: 4
జిందాబాద్  జిందాబాద్ 
సోషలిజం కావాలని లెక్చరు దంచేస్తారూ
పార్టీ మార్చేస్తారూ ఆ తరువాత .....
సొంతం మీదకు ముంచుకు వస్తే 
శోష వచ్చి పడిపోతారు



చీరియో టాటా ? పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి: 
చీరియో టాటా ?
కన్నులనిండా కైపులువుంటే నో ఫియర్
మై డియర్ - కం నియర్
వెన్నెలకన్నా వెచ్చనిహాయి ఐయాం హియర్
తారనై లేచి యున్నానురా -
చంద్రుడా సాగి రావేమిరా రా 

చరణం: 1
నాకురులు నీలాల మేఘాలుగా
నా కనులు ఆకాశ దీపాలుగా
రేయిలో – హాయివై ఆడుకో - పాడుకో
తనువులో - అణుపుగా నిలిచిపోవాలిరా....

చరణం: 2
నామధుర గానాలు నీ మధువుగా
ఈ వలపులోకాలు కనువిందుగా
చెలిమిలో కలిమివై ఏలుకో ఏలికా
ఒకరిలో ఒకరమై ఇమిడి పోవాలిరా




పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పచ్చజొన్న చేనుకాడ చూచానయ్యో
నువ్వు పై లాపచ్చీసుమీద వున్నావయ్యో
అబ్బ - పండువంటి కన్నె మనసు లాగేవయ్యో

పచ్చజొన్న చేనుకాడా చూచానమ్మీ
నువ్వూ - దొంగచూపులతోటి మనసు దోచావమ్మీ
అబ్బ - తిప్పుకుందామంటే తిరిగి రాదోలమ్మీ 

కమ్మని నీ కౌగిట్లో రంజుగ కులకాలని నాకున్నది
కసిదీరంగా నాలుగు చేతులు కలపాలని నాకున్నది
ఇద్దరి ఆశలు తీరేవేళ దగ్గరలోనే వున్నది
అందాకా అమ్మాయిగారిని తమాయించమంటున్నది 

ఎన్ని జన్మలు మారిన నువ్వే కావాలని నేనంటాను
కన్నుమూసినా కలలో నువ్వే రావాలని అనుకుంటాను
నీడల్లే నీజాడ తెలుసుకొని కొంగుబట్టు కొని వస్తాను
నువ్వు వదిలినా నేను వదలనని నీళ్ళలో మునిగిచెబుతాను

కాదుకూడదని ఠలాయిస్తివా పక్కనబావి ఉందయ్యో
అవునని తలవూపావా చూస్కో కందిచేను పెరిగుందయో
చూపులు రెండూ ఏకమైనపుడు మాటలపని ఏమున్నది
పూల తెప్పపై జోరుజోరుగా తేలిపోతె హాయున్నది 




నీ మనసులోకి రావాలీ కాపురానికీ పాట సాహిత్యం

 
చిత్రం: జగత్ జంత్రీలు (1971)
సంగీతం: కోదండపాణి 
సాహిత్యం: విజయరత్నం
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

నీ మనసులోకి రావాలీ కాపురానికీ
నే అద్దె ఎంత యివ్వాలీ మాసానికీ
నా మనసులోకి రాకముందు కాపురానికి
నీ విషయమంత తెలియాలీ యివ్వడానికి

అమ్మమ్మో అయ్యయ్యొ అల్లరిచేశాడు
అబ్బబ్బో-అయ్యయ్యో-మెల్లగ దోచాడు
ఏమేమో చేశాడమ్మో
నే మైమరచి పోయానమ్మో
చేసింది యేముంది చేసేది రేపుంది
ఉలికి ఉలికి పడబోకు
ఉన్నదంత ముందుందీ
ఎంతెంతో ఉందమ్మో
ఇంకెంతో ఉందమ్మో

అమ్మమ్మో అయ్యయ్యో కళ్ళెము వేసింది
అయ్యయ్యో ఒళ్ళంత అల్లుకు పోయింది
ఎన్నెన్నో చేసిందమ్మో
అందకుండ పోయిందమ్మో
వారేవా మొనగాడా
తగ్గాలి నీ జోరు
జగజ్జంత్రి నీవై తే
జగజ్జాణ నేనోయి
ఒకరికొకరు సరిపడితే
జగమంతా మనదేలే
జగమంతా మనదేలే
ఈ యుగమంతా మనదేలే
అహో...

No comments

Most Recent

Default