Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Avika Gor"
10th Class Diaries (2022)



చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
నటీనటులు: శ్రీకాంత్, అవిక గోర్
దర్శకత్వం: గరుడవేగ అంజి 
నిర్మాత: పి.అచ్యుత్ రామారావు, రవితేజా మన్యం 
విడుదల తేది: 2022



Songs List:



సిలకా సిలకా పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్ 

సిలకా సిలకా 



ఎగిరే ఎగిరే పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: సురేష్ గంగుల 
గానం: చిన్మయి

హో, ఎగిరే ఎగిరే నా పాదాలు పైకెగిరే
దిగవే దిగవే… దిగమన్న ఆకాశమే
ఎగిరే ఎగిరే… లేరెవరంటూ మనకెదురే
ఎదురయ్యనులే సరికొత్త ఆనందమే

పదవే పదవే మనసా
పంజరమొదిలి వయస
పచ్చని కలలే తెలుసా
పల్లకీ తెచ్చెనే

వినవే వినవే సొగస
స్వేచ్ఛగా అడుగే వేసా
సంకెళ్లన్నీ తెంచి
దిక్కులే దాటవే

పరదా దాటేసిన
సరద చూపించన
వరదై ఈ వేగాన
ఓ రాగాన నేనే సాగనా

ఎన్నో వర్ణాల వానవిల్లే
నన్నే అల్లిందే స్నేహమల్లే
వచ్చి వాలిందే కళ్లముందే ఇవ్వాలే

కొమ్మారెమ్మల్లో కోయిలల్లే
కొత్త రాగాలె పొంగి పొర్లే
ఇంత ఆనందం లేదు ముందే నీవల్లే

గదిలో ఒదిగున్న నా ఊసులే
వదిలా సీతకోకచిలకై
మదిలో అనిగున్న నా ఆశలే
అలలై ఉవ్వెత్తునెగిసాయిలే

అదుపు మరిచా అడుగే విడిచా
పరుగె తీసా సెలయేరులా
కనులే తెరిచా కలలే కలిసా
మరల మనిషై నేడు పుట్టానిలా

ఒక్కో క్షణాన్నే ఒడిసిపడదాం
ఒక్కో రకంగా ఎగసిపడదాం
ఇంకో లోకంలో అడుగుపెడదాం ఇవ్వాలే

గతమే గుర్తంటు లేనంతగా
గడిపా ఒక్కో క్షణమే వరమై
ఇకపై ప్రతిరోజు నాదంటుగా
మనసే విరిసింది వాసంతమై

వీచేగాలై తోచే దిశగా
అడుగే కదిపా నలువైపులా
అడిగే వారే అసలే లేరుగా
కనుకే చినుకై చెలరేగిపోయానిలా

ప్రాయం అలల్లా పొంగిపోయే
ప్రాణం గాలుల్లో తేలిపోయే
భారం కనుల్లో తీరిపోయే ఈ వేళే




పియా పియా పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యశస్వి కొండేపూడి

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో

నిను చూడని నా కనులకు
రంగులు కనపడవే
నీ నవ్వులే నా చూపులో ఓ కలలే

నిన్ను కలవని ఏ రోజున
సూర్యుడు రాడసలే
నీ నీడనే నను నడిపే వెలుగులే

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో

నీ జడలకు నా గుండె
జడగంటే అయ్యిందే
నే ఊహల్నే మోసే
నిను తాకినా నా చెయ్యే
గుడిగంటను తలచిందే
నువ్వే నా దేవే

నువ్వు సురుకు సురుకుమని మండుటెండలా
అట్ట చిర్రుబుర్రులాడిన ముద్దుగుంటదే
ఒక్క మెరుపు మెరుపుతీగ సాగినట్టుగా
ఇంత సిత్రంగా ఎట్ట ఉంటవే

ఎహే పిల్లోడి నిద్దరంతా తెల్లవారుతుండగా
చప్పుడన్నా చెయ్యకుండా రెప్పల్లో చేరగ
కలయో నిజమో తెలియదులే చెలియా

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో

నీతోటి సావాసం నాకెంతో సంతోషం
నా పుట్టుకకే అర్ధం
ఓ అల్లరి ఆరాటం కాస్తంత మోమాటం
ఒకటే వింతే

నేను పరుగు పరుగు తీసి పిల్లగాలిలా
నిన్ను పట్టుకొని ఆటలాడ బుద్ధి పుట్టేనే
నువ్వు ఉరుకు ఉరుకుతుంటే కొండవాగులా
గట్టు దాటేసి తట్టుకోలేనే

నువ్వు ఎప్పుడు ఎదురుంటే పూటకొక్క పండగే
ఊపిరంత మూటగట్టి కానుకిచ్చుకుంటనే
దూరమైతే నువ్వు… బతకనులే చెలియా

పియా పియా పియ్యా
పియా పియా పియ్యా
పతంగిలా మనసేమో
హొయ్య హొయ్య హొయ్యా
హొయ్య హొయ్య హొయ్యా
తుళ్లి తుళ్లి ఎగిరిందమ్మో




కుర్రవాడ కుర్రవాడ పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: నూతన్ మోహన్ 

కన్నుల్లోనా దాచా నిన్ను
రోజూ ఎదుటనే చూడగా
శ్వాసల్లోనా మోసా నిన్ను
నువ్వే నాతోడై రాగా

వింటున్నా నిన్నటి
గురుతులన్ని తలచుకుంటూ
నీతో ప్రతి నిమిషం ఉంటూ
తిరిగేస్తున్నా నీ చేయి నేను పట్టుకుంటు
నీ కలలెన్నో కంటూ

కుర్రవాడ కుర్రవాడ నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా.

ఓ, మబ్బులో సినుకే, ఏ ఏఏ
మన్నులోన మొలకలేసెలే
దూరమై ఉన్న నింగి నేల ఏకమయ్యెలే.

చిన్నారి చల్లగాలి ఉండుండి మీద వాలి
నీ వెచ్చనైన ఊపిరూదే ఇప్పుడే
సన్నంగ మంచు రాలి నా కురులపైన తేలి
నీలాగ అల్లరేదో చేసే గుప్పెడే

నువ్ ఎప్పుడొచ్చినా తెలియదు
చప్పుడైనా చేయకుండా
రెప్పలు మూసినావులే
ఓ కొత్త లోకమే మళ్ళీ
ప్రేమలోన చూపుతుంటే
చీకటైనా నాకు పండువెన్నెలే

కుర్రవాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రవాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా

చీకటే కాదే… వేకువే వస్తుందిలే
గిర్రున తిరిగే భూమి నీదే
గెలుపు ఉందిలే.

నీ వేళ్ళు తాకినట్టి ఆ పుస్తకాలు తట్టి
ఆకాశమందుకోను రెక్కలొచ్చెనే
ఆశల్ని మూటకట్టి… పక్కన్నే కూర్చోబెట్టి
నువ్వన్న మాటలన్నీ బాటలయ్యెనే

నువు చెంత లేవనే సంగతి
ఇంత కూడా గురుతు రాదు
నా ఊహలన్ని నీవిలే

ఒక్కసారి నే చదివితే
మరచిపోను పాఠమైన
ప్రాణమెట్లా నేను మరువగలనులే

కుర్రావాడ కుర్రవాడ… నువ్వే అడుగుజాడ
గుండె గోడ మీద ఉన్న బొమ్మ నీదిరా
కుర్రావాడ కుర్రవాడ… నువ్వే వెలుగు నీడ
మనసునిండా పూలు పూసే కొమ్మ నువ్వురా




ఎన్నెన్నో అందాల పాట సాహిత్యం

 
చిత్రం: 10 th క్లాస్ డైరీస్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: మంగ్లీ 

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ మోము చిన్నబోయెనా
ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి
నీ గుండె బద్దలాయెనా

నీలోని ఆశలే… మోసాన్ని చేసెలే
నువు కన్న కలలే… కడతేరి ముడిసెలే
స్నేహాల బాసలే… ద్రోహాలు చేసెలే
చిరునవ్వులన్నీ చితులాయే

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ మోము చిన్నబోయెనా

ఓ ఓ, ఏ దారి లేదుగా… ఎదురాయె ఓ దగా
వ్యధలే మూగగా… ఎద మూగదాయెగా
ఇన్నాళ్ళ వేదన… ఈ మౌన రోదన
అర్ధాలే లేని వ్యర్ధంగా మారెగా

చెలివో శిలవో… పోల్చే వీలు లేదా
కలవో కధవో… నీవనుకోమా
అలలై ముసిరే… అలనాటి జ్ఞాపకాలే
కలకే శిలువే… వేసె సుమా

ఎన్నెన్నో అందాల బంగారు చిలుక
నీ తోడు వీడిపోయెనా
ప్రేమించి ప్రేమించి ప్రాణాలు అలసి
నీ గుండె బద్దలాయెనా

Palli Balakrishna Friday, July 1, 2022
Thank You (2022)



చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్ 
నటీనటులు: నాగ చైతన్య, రాశిఖన్నా, మాళవిక శర్మ , అవికా గోర్
దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ 
నిర్మాత: దిల్ రాజు, శిరిష్
విడుదల తేది: 08.07.2022



Songs List:



మారో మారో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: విశ్వా, కిట్టు ప్రాగడ
గానం: దీపు , పృద్వీ చంద్ర 

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

పోరాటం క్రీడా… మీ మతమైతేరా
క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా

ఈ అసుర గనముకే
ఆ అధిపతి ఎవడనే
ఈ తలపడు క్షణమునే
దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో

మారో మారో యుద్ధం మొదలు
తాడో పేడో తేల్చెయ్ ఇపుడు
మారో మారో సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

నా శపథం తెలిసున్న
చెయ్యమాకు తాకిడి
నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ

నేనే నాకు సైన్యం
దూసుకుపోయే నైజం
చెల్లించాలి మూల్యం
ఢీ కొడితే తథ్యం

ఈ తరగని తెగువనే
హే విడువని క్షణమునే
ఈ తగిలిన పిడికిలే
ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా

మారో మారో… యుద్ధం మొదలు
తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు
మారో మారో… సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ




ఏంటో ఏంటేంటో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: జొనితా గాంధీ 

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ
నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి
ప్రతిసారి నీమీద వాలే గాలి
నను తాకి పోతుంటే ఏం చెప్పాలి

ఏదైనా నీకు ఇవ్వాలనుంటే
ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో
నీకోసం వేచి చూడాలనుంటే
నాకన్నా నువ్వే ముందుంటావేంటో

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తన
 
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో
సరిగా గమనిస్తే చాలా ఉందే
చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో
అది నీ జతలోనే మోయాలందే

బాబు నీ పేరే బళ్ళో పాఠంలా
బట్టీ కొట్టేది దేనికంటా
అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా
రోజు పాడాలటా ఆ ఆఆ

మా మేడలోన చూల్లేని అందం
మీ గూడు చూపింది నాకివ్వాలా
మా నాన్న కోపం మరిచేంత మైకం
నా చుట్టూ కమ్మిందే సంతోషంలా

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన

వెన్నెల జడి ప్రతి మలుపున
వెచ్చని సడి ప్రతి తలపున
విచ్చలవిడి మతి మరుపున
పడిన పడిన పడిన

ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో



ఫేర్వెల్ పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అర్మాన్ మాలిక్ 

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు
ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు

చేశామంటా ఎన్నో సందళ్ళు
చూశామంటా ఎన్నో సరదాలు
ఎదలో నిలిచేనంటా
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు

కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో
కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో

ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ
పునాదయ్యి కట్టాలి మన కోటనే
ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై
కలిసుండాలి కలకాలమే

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో




ఈ నిమిషం ఈ నిమిషం పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , మనీషా ఈరబత్తిని 

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

ఈ క్షణమే ఈ క్షణమే
నీలో నన్ను విడిచానే
నా సమయం నా సమయం
నీదై పోతు ఉందే

నువు నాతో అడుగేస్తే
వెలుగేలే ఏవైపైనా
కలలాగే గడిచిందే
నిను చూసే కాసేపైనా

నిదురించే నిమిషాన్న
పెదవుల్లో నీ పేరేనా
ఇకపైనా నను నీకే
వదిలేసా ఏదేమైనా

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ టెన్ టు ఫైవ్

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
నమ్మేలా లేదే మనసిపుడు

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

చిన్ని చిన్ని మాటలే చెప్పుకుంటే నేరమా
వచ్చిపోవా ఒక్కసారైనా
చిట్టి చిట్టి ఊహలే పంచుకుంటే పాపమా
ఉంటావేంటో అంత దూరానా

ఉదయము లేస్తూ లేస్తూనే
కలలను వెంటాడేస్తున్నా
పదమని నేనే నాతోనే
పరుగులు తీస్తున్నా

నాదైనా గగనంలో
సూరీడు చంద్రుడు నేనై
వేచేసే సమరంలో
నా సైన్యం నేనై నేనై

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
అయినాగానీ

Palli Balakrishna Tuesday, June 28, 2022
Cinema Choopistha Mava (2015)


చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రాజ్ తరుణ్, అవిక గోర్
దర్శకత్వం: నక్కిన త్రినాథ రావు
నిర్మాతలు:  బెక్కం వేణుగోపాల్, జి. సునీత, రూపేష్ డి గోలి, బోగాధి అంజి రెడ్డి
విడుదల తేది:  14.08.2015

చిత్రం: సినిమా చూపిస్త మావ (2015)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: లక్కీ రాజ్

వెల్లకే వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

నాలో ప్రాణమే పోయేంత శూన్యమే 
మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా
గుండె నే కోసేంత ఊపిరి తీసేంత
గాయం అయ్యిందే నా వల్లే నాకిలా

వెల్లకే, వదిలెళ్ళకే
నా ప్రాణమా నడి రేయిలో
ముంచకే నన్ను ముంచకే
ఓ మౌనమా కన్నీటిలో

ప్రేమే లేదని తిరిగి రాదనీ
న కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా
ఒంటరై పోవాలి ఓటమై మిగలాలి అంటూ
చెయ్యి జారే నీ ప్రేమే అందిలా



Palli Balakrishna Monday, March 1, 2021
Lakshmi Raave Maa Intiki (2014)


చిత్రం: లక్ష్మీ రావే మా ఇంటికి (2014)
సంగీతం: కె. యమ్. రాధాకృష్ణ
సాహిత్యం: భాస్కరబాట్ల
గానం: కె. యమ్. రాధాకృష్ణ
నటీనటులు: నాగ చౌర్య , అవికా గోర్
దర్శకత్వం: నంద్యాల రవి
నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి
విడుదల తేది: 05.12.2014

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే
దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే
ఒక్కొక్క మాట పిస్తోలు తూటా పేలినట్టు ఉంటదంట
ఒక్కొక్క నవ్వు టెంపుల్లో గంట మోగినట్టు ఉంటదంట
కొత్తగాలే తాకుతుంటే పైరగాలి ఎందుకంటా
అందరు చుస్తే అమ్మోరు ఏదో పూనినట్టు అవుతదంట
టచ్చింగ్ ఇస్తే భూకంపమేదో వచ్చినట్టు ఉంటదంట
ఆవరికే మాకువుంటే అష్టదిక్కులెందుకంట

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారే

పిల్ల వచ్చే కళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే గుళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే ఒళ్ళోకొచ్చే

చరణం: 1
బ్లూ టూత్ ఏదో ఆన్ చేసినట్టు
బ్యూటిఫుల్ బేబీని చూస్తుంటే
కొత్త ఫీలింగ్స్ పొంగేస్తూ ఉంటాయే
తీపి య సేదో ఆటివ్వు చేసి ఇందాక జరబెట్టి కొడుతుంటే
మేం జిల్లాలు దాటేస్తు ఉంటామే
రెండు కళ్ళల్లో స్క్రీన్ సేవర్ వీల్లేగా
చిట్టి గుండెల్లో వాల్ పేపర్ వీల్లేగా
నువ్ చూడకు నైకో అంతా డల్లేగా

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారి

చరణం: 2
ఐ ఫోన్లో కూడా ఉండని ఫీచర్స్ అందాల పాపల్లో ఉంటాయే
మా మైండంత కెలికేస్తు ఉంటాయే
లిక్కర్లో లేని మత్తైన చక్కెర్ అమ్మాయి చెయ్ గాల్ల ఉంటాయే
తెగ ఊరిస్తు కొరికేయ్ మంటాయే
జంటా రెప్పల్లో కెమెరాలే ఉంటాయే
టిక్కు టిక్కంటు మాకు ఫ్లాసే కొడతాయే
మేం లడకి కోసం కుచ్ బి కరేగా

దేవతల్లే ఉంటె అమ్మాయే ప్రతి కుర్రాడు ఐపోడా పూజారే
దసరా దీవాళి సంక్రాంతి మరి కట్టుకు రావా ఓ సారి

పిల్ల వచ్చే కళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే గుళ్ళోకొచ్చే
పిల్ల వచ్చే ఒళ్ళోకొచ్చే

Palli Balakrishna Sunday, October 15, 2017
Uyyala Jampala (2013)


చిత్రం: ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం: సన్నీ M.R
సాహిత్యం: వాసు వలబోజు
గానం: హర్షిక గుడి, అనుదీప్ దేవ్
నటీనటులు: రాజ్ తరుణ్, అవికాగోర్
దర్శకత్వం: విరించి వర్మ
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ , పి.రామ్మోహన్, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 25.12.2013

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో... నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో... నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్..
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలామారి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించని

ఎటువైపు చూస్తున్న
నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం

Palli Balakrishna Sunday, August 20, 2017
Ekkadiki Pothavu Chinnavada (2016)


చిత్రం: ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుంజయ, స్వీకర్
నటీనటులు: నిఖిల్, హెబ పటేల్, పండిత శ్వేతా, అవికా గోర్
దర్శకత్వం: వి. ఆనంద్
నిర్మాత: పి. వి. రావ్
విడుదల తేది: 18.11.2016

హే పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన
అస్సలే నేను హైపరో హైపరో
అందులోన హ్యాపి మ్యటరో మ్యటరో
అగనంది స్పిడు మిటరో మిటరో
నాకు నేనే దొరకనట్టు స్పిడు పెంచి దుకుతున్నా
మళ్ళి మళ్ళి మళ్ళి రాణి రోజు
అందుకేగా ఇంత క్రేజో
ఆక్సిలేటర్ ఫుల్ రైజు
రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకున్న పిల్లదాన

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన

రిస్టు వాచ్ లోన ముళ్ళు కూడ చూడు
బండి చక్రమల్లె రయ్యమంది నేడు
ఎప్పుడెప్పుడంటు ఆగనంది మూడు
బ్రేక్ ఫెయిల్ చేసి తీసినాది దౌడు
సూపర్ సానిత్రి విమానంలో వచ్చి
చలియా నీ చెంత వాలిపోతా
జస్ట్ లవ్ ఫార్మాల్టీగానించి
అదే ఫ్లైట్లో హనీమూన్ కెత్తుకెళతా

వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో
వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో
స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పవర్ స్టార్ ఫిల్మ్  ఫస్ట్ డే ఫస్ట్ షో
చూసినట్టు పెరిగినాది పల్స్ రేటు
ఏవో నేలమీద తిరుగుతున్న గాని
అజ్ మేర దిల్ గాల్లో తేలే కైటు
రీవైండ్ చేసేసి చూస్తే పిల్లా
మన ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్లు గుర్తుకొచ్చనే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన బొమ్మే చూస్తే
మస్త్ కలర్లో మన ఫ్యూచర్ వెల్కమన్నదే

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన

Palli Balakrishna Tuesday, August 15, 2017

Most Recent

Default