Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Uyyala Jampala"
Uyyala Jampala (1965)


చిత్రం: ఉయ్యాల జంపాల (1965)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.లీల, బృందం
నటీనటులు: కొంగర జగ్గయ్య , కృష్ణ కుమారి
కథ, మాటలు: పినిశెట్టి
నిర్మాత, దర్శకత్వం: కె.బి.తిలక్
విడుదల తేది: 1965

పల్లవి:
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు
ఎందువలన దేముడు...

చరణం: 1
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను (2)
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేముడు

చరణం: 2
అనుభవించదగిన వయసు
అడవిపాలు జేసెను (2)
అడుగుపెట్టినంతమేర ఆర్యభూమి జేసెను
అందాల రాముడు అందువలన దేముడు...

చరణం: 3
ధర్మపత్ని చెరబాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేముడు...





Palli Balakrishna Sunday, February 3, 2019
Uyyala Jampala (2013)


చిత్రం: ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం: సన్నీ M.R
సాహిత్యం: వాసు వలబోజు
గానం: హర్షిక గుడి, అనుదీప్ దేవ్
నటీనటులు: రాజ్ తరుణ్, అవికాగోర్
దర్శకత్వం: విరించి వర్మ
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ , పి.రామ్మోహన్, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 25.12.2013

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో... నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో... నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్..
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలామారి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించని

ఎటువైపు చూస్తున్న
నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం

Palli Balakrishna Sunday, August 20, 2017

Most Recent

Default