చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రావురమేష్, హెబపటేల్ , అశ్విన్, నోయిల్ సేన్, కేరింత నూకరాజు, తేజస్వి మదివాడ
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, మానస, మహలక్ష్మి
విడుదల తేది: 16.12.2016
చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రకాశ్ పరిగోష్
మౌనమా ఓ మౌనమా మాటలేదుగా
పాదమా ఓ పాదమా బాటలేదుగా
తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా
గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే
ఆశ ఆవిరైపోతుందే
శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే
వెలుగులలో నువ్వు మునకేసి
చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరితీసి
బాధకు ఊపిరి పోసావే
సరదా సరదా స్వేచ్ఛను తెంచి
సంకెలలాగా మార్చావే
జతగా బ్రతికే బదులే వెతికి
జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే
గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే
తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ తప్పుకెళ్లి పోతుందే
తల్లకిందులై పోతుందే
ఆరి పోతుందే తెల్లారి పోతుందే
నేరమనేది నీది కదా
శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా
నొప్పి అనేది అందరికా
మూడే ముళ్ళు ప్రేమే కోరగ
మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగ
ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే
గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి
చిక్కు పెద్దదై పోతుందే
దిక్కు తోచకుండ పోతుందే
లెక్క నేడు మారిపోతుందే
తీరి పోతుందే చేయి జారి పోతుందే
2016
,
Ashwini
,
Bekkam Venugopal
,
Bhaskar Bandi
,
Hebah Patel
,
Kerintha Nookaraju
,
Naanna Nenu Naa Boyfriends
,
Noel Sean
,
Rao Ramesh
,
Sekhar Chandra
,
Tejaswi Madivada
Naanna Nenu Naa Boyfriends (2016)
Palli Balakrishna
Monday, March 1, 2021