-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Meena"
Puttintiki Ra Chelli (2004) Telugu Songs Lyrics Album Cover

Puttintiki Ra Chelli (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Puttintiki Ra Chelli (2004)
Director : Kodi Ramakrishna
Actors : Arjun Sarja
Actresses : Meena, Swati
Release Date : 14 April 2004

Gopala Gopala Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Gopala Gopala' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by Udit Narayan and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Sai Sri Harsha
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: ఉదిత్ నారాయణ్, సుజాత మోహన్ గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను చంపమాకు అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే (2) గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల ఎర్రని పెదవుల్లో మత్తున్నాదే కోడె వయసే ఊగిందే (2) తడిమే నీ చెయ్యే మహా వాటంగా ఉన్నది ఎగసే పొంగులతో తెగ కసి రేపుతున్నది నలత నడుము మడత నువ్వు అందుకో ఇక దడక దడక దడక దడక మరి ఆగలేనిక అందాల విందుంది సందకాడ అందింది దోచేయి అండగాడా (2) హేయ్ గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల కౌగిలికొస్తావా కాంతామణి చెక్కిలి ఇస్తావా చింతామణి (2) బాణీ చూపించు ఈ పూబోణి నీదిరా రాణీ చేసేయ్నా నా శృంగార సీమకి చిలుకు చిలుకు చిలుకు నాసోకు చిలకరా తళుకు తళుకు తళుకు నాజూకు మొలకరా ఆకాశం అదరాలి అల్లరోడా పాతాళం పొంగాలి సక్కనోడా (2) గోపాలా గోపాలా గోపీలోల వళ్ళంతా రేపావు ఏదో గోల (2) హో ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను చంపమాకు అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓ సారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతానే (2)

Chamanti Poobanthi (Childhood Version) Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Chamanti Poobanthi (Childhood Version)' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Sai Sri Harsha
Singers : K. S. Chithra
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీహర్ష గానం: కె. ఎస్. చిత్ర పల్లవి: చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చరణం : 1 ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా మన కన్న తల్లివి నువ్వమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చరణం : 2 నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం ఇందుకే నేను ముందు పుట్టినాను అమ్మ లా చూసే అన్ననైనాను నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా నీకోసం నేనున్నానమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో

Anuragham Chese Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Anuragham Chese' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra and S. A. Rajkumar.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Surendra Krishna
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: శ్రీహర్ష గానం: ఎస్. ఏ. రాజ్ కుమార్, కె. ఎస్. చిత్ర అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము కళ్లకి కాటుక పెడతా ఈ చల్లని చూపులకి బాషికమే నే కడతా ఈ నుదుటన ఆశలకి ఈ పచ్చని నూరేళ్ళకు నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము పగలే చుక్కలు పొడుచుకు వచ్చి నేలకు చేరెనురా చాపకు రెక్కలు మొలుచుకువచ్చి నింగికి ఎగెరెను రా పెళ్లంటే అయో వప్పని వాడు అరె పల్లకి ఎక్కి ముచ్చట చూసి పసిపాపే ముత్తైదై కనుపాపే కన్నమ్మై ఈ అన్నకి పెళ్లే చేసే పేరంటాలైయ్యిందా అనురాగం అన్నయ్యై మమకారం చెల్లెమ్మై ఈ బంధం వందెళ్ళయ్యే వదినమ్మే చేరిందా ఈ పందిట్లోనే మహారాణిని మీ అన్నయ్య పదాల పారాణి ని స్వర్గమొచ్చి మనవాకిట్లో ఈనాడు వాలేనమ్మ ఒక రెమ్మకి విరిసే పువ్వులం ఒక పెదవిపై మురిసే నవ్వులం అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము నన్ను నువ్వూ మరచినా వదిన నెపుడూ మరవకు ఇంటి ఆలిని మరచినా కంటి వెలుగును మరవకు రెండు కళ్ళు మీరు నాకు రెప్పనేనని మరవకు ఈ ఇల్లే వెయ్యిల్లై ఈ బ్రతుకే వేయ్యేళ్లై అనందం విందులు చేసి ఆకాశం అందేను గతజన్మల పుణ్యాల వరమల్లే వచ్చావో ఉగ్గుపాలు తాగిన గిన్నెకు నువు పెళ్లి పెద్దైనావు నువ్వు చుక్క పెడితే చాలు నా బుగ్గన అరుంధతి చుక్కే ఇచ్చు శుభ దీవెన అమ్మలేని ఈ ఇంట్లో మా వదినమ్మే అమ్మవుతుంది ఈ జంటకు శతమానము ఈ జన్మకు మా జత మానము అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము అనురాగము చేసే పెళ్లికి శుభలగ్నము దేవతలే దీవించే ఈ సౌభాగ్యము మంగళ హారతులిస్తా ఈ గువ్వల జంటకి చెడు కన్నుల దిస్టిని తీస్తా మా అన్నా వదినలకి ఈ పచ్చని నూరేళ్ళకి నే మొక్కేను ముక్కోటి దేవుళ్ళకు

Ghunthakallu Ghumma Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Ghunthakallu Ghumma' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by Sujatha Mohan and Tippu.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Surendra Krishna
Singers : Sujatha Mohan, Tippu
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: టిప్పు, సుజాత మోహన్ గుంతకల్లు గుమ్మచూడరో రెండు కళ్ళు చాలబోవురో పాలకొల్లు పిల్లగాడురో గిల్లకుండ గిచ్చుతాడురో ఓసారికే వద్దంటే ఎలా నీ కౌగిలే అయ్యిందే వల మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ గుంతకల్లు గుమ్మచూడరో ఆ రెండు కళ్ళు చాలబోవురో పాలకొల్లు పిల్లగాడురో గిల్లకుండ గిచ్చుతాడురో.... సత్తినపల్లి సెంటర్లలోన చీర కొని తెచ్చాలే రాజమండ్రి సందులోన రైక నీకు కొన్నాలే కాపుగారి కోటకాడి మల్లెలన్నీ తెచ్చాలే భీమవరం రొయ్యతెచ్చి పులుసు వండి ఉంచాలే సోకుల గంట తెగ మోగాలంటూ అందినవన్నీ అందాలంటూ ఆడిగినవన్ని ఇచ్చేసి ఇచ్చినవన్నీ దోచేసి గుడు గుడు గుంచెం ఆడేసి చెడుగుడు పందెం వేసేసి అందించు అందం మొత్తం అదిరేలా పాలకొల్లు పిల్లగాడురో గిల్లకుండ గిచ్చుతాడురో గుంతకల్లు గుమ్మచూడరో ఆ రెండు కళ్ళు చాలబోవురో.... రాణిగారి కోటలోన ఓణీలోన చూశాలే నోరేవురి గోలచేస్తే ఆగలేక వచ్చాలే ముద్దులన్ని మూటగట్టి దాచిపెట్టి ఉంచాలే కండలన్ని చూపుతుంటే ఉండలేక వచ్చాలే అండా దండా ఉంటానమ్మో ముందు వెనుకా నువ్వేనయ్యో ఆశలు పొదలు చూపించి కౌగిలి సేద్యం చేయించి సొగసులు కారం దంచేసి పలుకులు బెల్లం కలిపేసి మోగిస్తా కసి కసి దరువేసి గుంతకల్లు గుమ్మచూడరో రెండు కళ్ళు చాలబోవురో పాలకొల్లు పిల్లగాడురో గిల్లకుండ గిచ్చుతాడురో ఓసారికే వద్దంటే ఎలా నీ కౌగిలే అయ్యిందే వల మనమాడాలి ఈ వేళ ఊగాలంట ఊరు వాడ గుంతకల్లు గుమ్మచూడరో ఆ రెండు కళ్ళు చాలబోవురో పాలకొల్లు పిల్లగాడురో గిల్లకుండ గిచ్చుతాడురో....

Seethakoka Chilaka La Chelli Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Seethakoka Chilaka La Chelli' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra and Mano.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Sai Sri Harsha
Singers : K. S. Chithra, Mano
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: శ్రీహర్ష గానం: మనో, కె. ఎస్. చిత్ర గాజులు బావా గాజులు బావా రంగులు గాజుల తెచ్చావా రంగులు గాజులు తెచ్చావా రాజానగరం రంగంపేట మల్లెలు గాజులు తెచ్చావా మల్లెలు గాజులు తెచ్చావా ఈ గోరింటాకు పండిన చేతికి ఎర్రని గాజులు వేస్తావా సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ముద్దుల మూటలు కట్టి బాబే చల్లగ నవ్వాలి అన్నకు బంగరు పాపే పుట్టి కోడలు అవ్వాలి అన్నా చెల్లి అనుబంధాల చుట్టరికం కోటి కోటి జన్మలు దాటి వరమవనీ వడిని నింపుకోవమ్మ పసుపు కుంకుమా నోము పండుగోయమ్మ అన్న ప్రాణమా కనుల విందు చేసేటి బుజ్జి బాబుకి దిస్టి చుక్క నేనౌతా జన్మ జన్మకి వెన్నెల తోటే పందిల్లేసే వైకుంఠపు వైభోగం వాత్సల్యాలే వాయణమిచ్చే శోభనిచ్చు సౌభాగ్యం అల్లారు ముద్దమ్మాయి అక్షింతలు ఇక త్వరలోనే ఈ ఇంట్లోన కేరింతలు ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు ఊయాలలో ఉపానమ్మా నిన్నపుడు ఆ ఉయ్యాలే బాబుకి అవుతా నేనిపుడు సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి సూర్యుడేమొ ఊయలందు పూలబంతిగా మచ్చలేని చందమామ ఆటబొమ్మగా తారలొచ్చి హారమేసి హారతియ్యగా నీలి మబ్బు జోల పాడే నీకు లాలిగా వియ్యపురాలు వియ్యంకులమై రేపు మేము వస్తాము పిల్లని ఇచ్చే వాళ్ళము అయినా పెత్తనాలు చేస్తాము భయమొద్దు లేవమ్మా ఇవి బెదిరింపులే నా మేనల్లుడు పెళ్లికి కూడా నే పెద్దలే మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు మన అమ్మ చలువై పుట్టావు నువ్వపుడు నీ పుట్టిల్లే పురిటికి అమ్మవుతుందిపుడు సీతాకోక చిలుకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ప్రాణమైన ఇస్తానమ్మ నీ నిండు నవ్వులకి తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు అరచేతుల్లో పెంచానమ్మా చిన్నపుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిపుడు

Anna Anna Puttintiki Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Anna Anna Puttintiki' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by K. S. Chithra and S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Sai Sri Harsha
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: శ్రీహర్ష గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర అన్నా అన్నా అన్నా.... పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత తలరాతే గా నన్ను చేర్చెను నరకం చెడు నిందను మాపేసి వస్తే న్యాయం పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి వేసవికైనా నీరుంది ఓర్పుకు అయినా హద్దుంది పాపం పెరిగితే భూదేవైనా కంపించకుంటుందా చీర సారె సిరులిచ్చి మెట్టినింటికి నన్నిస్తే పుట్టెడు నిందను కొంగున కట్టుకు పుట్టింటికి వచ్చేదా కాపుకాయనే లేనా కనులదాచుకొనా తప్పుతో రాలేనన్నా నిప్పుతో వస్తా ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను పేగు అదురుతోందమ్మ ప్రాణమొనుకు తోందమ్మ పుట్టింటికి రామ్మా చెల్లమ్మ పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి కట్టిన తాలే కాదన్న ఈ కాకుల లోకం ఏదన్నా మెట్టిన నరకం మంటలోంచి ఈ పుట్టింటికి స్వర్గానికి రా ప్రేమే అంతటి విలువైంది పుట్టిన ఇల్లే చలువైంది తప్పని అరిచే ఈ ఆచారం మెట్టింట్లో ఇరుకైంది అన్న నీడ కాదంటూ బలిపశువవుతావా గుండె పైన రాయల్లే బరువు పెంచరావా నింగిలాగ నేనున్నా ఉరుము భయము నీకొద్దు ఉరుము టారుముకొస్తున్నా జడుపు భయము ఇకలేదు పుట్టింటికి రామ్మా చెల్లమ్మ పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత అన్నలేడు కాబట్టేగా అడవికెళ్లే సీత తలరాతే గా నన్ను చేర్చెను నరకం చెడు నిందను మాపేసి వస్తే న్యాయం పుట్టింటికి రావే చెల్లి పిలిచింది మన ఇంటి తల్లి

Chamanti Poobanthi (Male Version) Song Lyrics in Telugu – Puttintiki Ra Chelli (2004)

'Chamanti Poobanthi (Male Version)' song from Puttintiki Ra Chelli (2004) movie is composed by S. A. Rajkumar and sung by Madhu Balakrishnan.

SONG INFORMATION
Movie : Puttintiki Ra Chelli (2004)
Lyricist : Sai Sri Harsha
చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీహర్ష గానం: మధుబాలకృష్ణన్ పల్లవి: చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చరణం: 1 నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం అమృతాన్ని తాగి అమ్మలాగ రానా అమృతాన్ని మించే అమ్మప్రేమ తేన నీకంటే నా కెవరున్నారే నా చెళ్ళమ్మా ననుగన్నా తల్లివి నువ్వమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చరణం: 2 నీ నవ్వు చూడంగా ఉన్నాయి ఈ కళ్ళు పూవల్లే పెంచంగా ఉందమ్మా ఈ వళ్ళు నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమ్మ కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను గోరింటాకు నేనై నీ చేత పండుతాను గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లమ్మా ఈ జన్మే అంతా నీదమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా అమ్మలేని వారిని చేసి కోత కోసినాడమ్మా ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో

Palli Balakrishna Sunday, June 21, 2026



చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సహాయ సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్, మీనా (తొలి పరిచయం)
దర్శకత్వం: కె. ఆదిత్య
నిర్మాత: ఎం. నాగేశ్వర రావు
విడుదల తేది: 05.10.199



Songs List:



యువతరం శివమెత్తితే పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

యువతరం శివమెత్తితే



జిన్ని తారా జిన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

జిన్ని తారా జిన్ని



చూస్కో చూస్కో పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: గుండవరపు సుబ్బారావు
గానం: వందేమాతరం శ్రీనివాస్

చూస్కో చూస్కో



నల్లకోటు బావా పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: కె. అప్పలాచారి
గానం: ఎస్. జానకి, వందేమాతరం శ్రీనివాస్

నల్లకోటు బావా



ఏవిటో తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

ఏవిటో తల్లి

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
నటీనటులు: హరికృష్ణ, మీనా, ఆమని, ఉమాశంకరి,  రాజీవ్ కనకాల , ఆశా షైనీ, ముమైత్ ఖాన్ 
దర్శకత్వం: వి.అర్.ప్రతాప్ 
నిర్మాతలు: ఆర్.కె.బగవాన్, తేజ 
విడుదల తేది: 16.07.2004



Songs List:



చిలకా ఓ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: E.S.మూర్తి 
గానం: మనో, ఉష, రామమని

చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
చెబుతా ఓ కథని మా ఇంటికి వస్తావా
నీలాగే మాకు ఉంది ఓ పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు

ఆకలి అంటూ అడిగిన రోజే గుర్తే లేదమ్మా
అడగక ముందే తినిపించే అమ్మేలే వదినమ్మా
అల్లరిచేస్తే తిట్టనివాడిని ఏమంటారమ్మా
నాన్నై చూసే అన్నని దేవుడు మకిచ్చాడమ్మ
చదివింది మేమైనా అలసట మా అన్నదిలే
నలతంటు పడుకుంటే వదినకి నిద్దర రాదు
ఈ ఇల్లే మా ఇద్దరి ప్రాణం
ఇంకెందుకు వేరే స్వర్గం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
సంతోషానికి ఇంకో పేరై పూసిన రోజాలు
శ్రీరాముడి కల పండే వరమై పుట్టిన లవకుశులు
ఒక నిమిషం ఈ సీతని వదలని వానర సైన్యాలు
తమకోసం అసలేది కోరని కోవెల దీపాలు
ప్రతి రోజు పండగలా ఇల్లంతా సందడులే
అమ్మా అని పిలిచారా ఒళ్లంతా పులకింతే
మీరే గా మీరే గా ఈ తీయని స్వప్నం 
ఏ జన్మదో ఈ తీయని అనుభందం

నీలాగే మాకూ ఉందో పువ్వుల పొదరిల్లు
మా అన్నా వదినే మాకు చక్కని నేస్తాలు
 
చిలకా ఓ చిలకా చిగురాకులలో చిలుకా
నువ్వూ మా జతగా ఉంటావా మా ఇంట
మా అన్నా వదిన ఉండే పువ్వుల పువ్వుల పొదరింట
కలతే రాదమ్మా నవ్వులే పండే ఈ చోట




ఆనాటి నీ కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: వేటూరి 
గానం: యం.యం..కీరవాణి 

ఆనాటి నీ కళ్ళు 



అందం చందం పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: యం.యం..కీరవాణి , సునీత ఉపద్రష్ట

అందం చందం 





నా పేరు రంభ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: భువనచంద్ర
గానం: శ్రేయా ఘోషల్

నా పేరు రంభ 



తమిళనాడు బోర్డర్ పాట సాహిత్యం

 
చిత్రం: స్వామి (2004)
సంగీతం: యం.యం..కీరవాణి 
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో,  సునీత ఉపద్రష్ట

తమిళనాడు బోర్డర్ 

Palli Balakrishna Friday, January 21, 2022



చిత్రం: దృశ్యం 2 (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: వెంకటేష్, మీనా
దర్శకత్వం: జీతు జోసెఫ్
నిర్మాతలు: డి.సురేష్  బాబు, అంటోనీ పెరుంబవూర్, రాజకుమార్
విడుదల తేది: 25.11.2021



Songs List:



ఇంకా ఎన్నాళ్ళో పాట సాహిత్యం

 
చిత్రం: దృశ్యం 2 (2021)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయా గోషాల్

ఎన్నో కలలు కన్నా
అన్నీ కలతలేనా
చుట్టూ వెలుతురున్నా
నాలో చీకటేనా

ఇంకా ఎన్నాళ్ళో కన్నీళ్లు
ఇంకా ఎన్నేళ్ళో భయాలు
ఇకపై ముగిసేనా ఏకాంతాలు

ఏది నిజమో… ఏది మాయో
ఏది పగలో… ఏది రాత్రో
తెలియకుండా బ్రతుకుతున్నానిలా

అలజడులలో అలసిపోయానిలా
నాలో నేనే కరుగుతున్నా
నన్నే నేనే అడుగుతున్నా

ఇంకా ఎన్నాళ్ళో గాయాలు
ఇంకా ఎన్నేళ్ళో గండాలు
ఇకపై కథకెపుడో సుఖాంతాలు

Palli Balakrishna Friday, November 26, 2021



చిత్రం: కలియుగ కర్ణుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , జయప్రద, జూహిచావ్లా, రమేష్ బాబు, మహేష్ బాబు, మోహన్ బాబు
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: డి. కాశీ విశ్వనాథరావు
విడుదల తేది: 14.08.1988



Songs List:

Palli Balakrishna Tuesday, August 24, 2021


చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
నటీనటులు: సుమన్, మీనా, ఆమని
దర్శకత్వం: సాగర్
నిర్మాత: కె.విజయలక్ష్మి ప్రసాద్
విడుదల తేది: 26.01.1995

చిత్రం: ఆలుమగలు (1995)
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, ఎం. ఎం. శ్రీలేఖ

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ  మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి

మల్లి...మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన రేఖ మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా
విరబూసినాక  దరహాస రేఖ
విరితేనెవాకా  ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మణి గీతిక నీవేనే మల్లి మల్లి...

మల్లి... మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

సుకుమారమైన కుసుమారివైనా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకైన వలరాజుకైనా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె మల్లి... మల్లి...

Palli Balakrishna Wednesday, May 12, 2021
చిత్రం: పెళ్ళాం చెపితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కాస్ట్యూమ్ కృష్ణ , మురళి మోహన్, శ్రీకాంత్, శివాజీ రాజా, హరీష్ కుమార్, మీనా కోవై సరళ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
బ్యానర్: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: దుగ్గిరాల కిషోర్, మురళీ మోహన్
విడుదల తేది: 15.05.1992

చిత్రం: పెళ్ళాం చెబితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: గణేశ్ పాత్రో
గానం: చిత్ర, శైలజా మారియు బృందం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికిదీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మందరకన్నా ముందరకాదా
ఆడితప్పాడు దశరధుడు
ద్రౌపదినొడ్డి తమ్ములతోనే
జూదమాడాడు ధర్మజుడు

మొగుణ్ణి తన్నిన సత్యభామయే
నరకాసురుణ్ణి నరికింది
గరళం నెత్తికి తాకరాదని
గంగ శివుని తలతాకింది
మగువే ఎగువవుతుందిరా
మగాడే దిగిరావాలి ఈవేళరా

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

అమ్మకన్నదీ అమ్మలగన్నది
ఆడపిల్లగా పుట్టింది
తాళి కట్టిన మగనిచేతిలో
తాడుకి బొంగరమయ్యింది

మట్టిలో పెట్టుకు మెట్టినింటికీ
మహాలక్ష్మీ కళతెచ్చింది
మూడుముళ్ళతో ఏడడుగులతో
నూరేళ్లూ నిను మలిచింది
మగడా జగడాలేలరా
సగమూ సగమౌదాము మాక్కూడరా

పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి
పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి

మగువే మగడి ఆధారం
గుండెల నిండా మమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

Palli Balakrishna Tuesday, March 2, 2021

Most Recent

Default