-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Geetha"
Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics Album Cover

Nuvvostanante Nenoddantana (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Banner : Sumanth Art Productions
Music : Devi Sri Prasad
Director : Prabhu Deva
Producer : M. S. Raju
Actors : Siddharth, Srihari
Actresses : Trisha Krishnan, Archana Shastry (Veda), Santhoshi
Release Date : 14 January 2005

Chandrullo Unde Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Chandrullo Unde' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Shankar Mahadevan
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: శంకర్ మహదేవన్ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా తందానే తందానే నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట ఏవంట నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ... చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్ యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్ కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్ రేయ్ రేయ్ రేయ్... ఓ... కమింగ్ డాడ్ గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... హే గగగా రిగ రిసాస సానినిస గగగా రిగ రిససా... కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జాణతనం బాటచూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంత వరకో రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా

Something Something Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Something Something' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Tippu.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Tippu
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: టిప్పు something something something something something there is some thing... Come on... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling లో లో దాగున్నా no no nothing అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... ఓ కొంటె కలా ఆ పంతమేలా రా ముందుకిలా కం నియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా సందేహిస్తా వెందుకలా సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక ఆటాడమంది వేళ మాయదారి హాయి గోల అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అందర్లోనూ ఉంది something అర్ధం కానీ ఏదో feeling నీ కాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికిపడదు తళుకు తారకా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా... అ అ ఆజా అ అ ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా సునో సరోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా...

Niluvaddam Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Niluvaddam' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Karthik and Sumangali.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Karthik, Sumangali
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్, సుమంగళి ఊ నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నామాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం హే నిలువద్దము నిను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

Paripoke Pitta Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Paripoke Pitta' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Mallikarjun and Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Mallikarjun, Sagar
Special Note : 'Paripoke Pitta' పాటలో హీరో సిద్ధార్థ్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రభుదేవా కూడా ప్రత్యేకంగా కనిపించడం విశేషం.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మల్లికార్జున్, సాగర్ పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట చరణం: 1 నా సంతోషాన్నంతా పంపించా తన వెంట భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ పుటుక్కు జర జర డుబుక్కు మేఁ చరణం: 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకూ తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంట ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట అరి హొయ్ హొయ్ హొయ్

Prema Kosamai Valalo (Remix) Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Prema Kosamai Valalo (Remix)' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Pingali Nagendra Rao
Singers : Ghantasala
Special Note : ఈ పాటను యన్.టి.రామారావు గారు నటించిన పాతాళభైరవి (1951) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం ఘంటసాల గారు అందించారు, V.J. వర్మ ఆలపించారు, పింగళి నాగేంద్రరావు సాహిత్యం అందించారు.
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: జూనియర్ ఘంటసాల పల్లవి: ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు. అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు

Ghal Ghal Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Ghal Ghal' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పిలిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 1 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితను సైతం చదవనివైనం కవితలు సైతం పలకని భావం సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2) చరణం: 2 మండే కొలిమినడగందే తెలియదే మన్నుకాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరె ప్రియురాలే గెలుపంటె తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జతవుంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

Padam Kadalanantunda Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Padam Kadalanantunda' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Sagar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సాగర్ పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూడందే దూరం కరగనంటుందా తారలను దోశిల పట్టే ఆశలు దూసుకు పోతుంటే లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేమంటే ఆ తీపికి విషమైన అమృతమే ఐపోదా

Adhire Adhire Song Lyrics in Telugu – Nuvvostanante Nenoddantana (2005)

'Adhire Adhire' song from Nuvvostanante Nenoddantana (2005) movie is composed by Devi Sri Prasad and sung by Jassie Gift and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Nuvvostanante Nenoddantana (2005)
Music : Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Jassie Gift, Kalpana Raghavendar
చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: జస్సి గిఫ్ట్, కల్పన రాఘవేందర్ శివశివ మూర్తివి గణనాథా శివశివ మూర్తివి గణనాథా శివుని కొమరుడవు గణనాథా శివుని కొమరుడవు గణనాథా ఛల్ సిరికి హరికీ మనువంట ఛల్ సిరికి హరికీ మనువంట భళరే అనరా జనమంతా భళరే అనరా జనమంతా హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా అదిరే అదిరే కన్నే అదిరే అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ... ఓ... అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 1 ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో హెయ్ వరసై పిలిచే అందాలు అరె మనమై చిలికే గంధాలు అహ మనసే గెలిచే పంతాలు అరె మనువై కలిపే బంధాలు రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా అదిరే అదిరే కన్నే అదిరే ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే చరణం: 2 పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో పందార తునకో పదం లేని తెలుగో మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో హే ఎదురై రానీ మేనాలు హో హో చెవిలో పడనీ మేళాలు అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

Palli Balakrishna Thursday, June 18, 2026



చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: శివకృష్ణ, గీత, శ్యామల గౌరి
దర్శకత్వం: సి. ఉమామహేశ్వరరావు
నిర్మాత: టి.రామకృష్ణ రాజు
విడుదల తేది: 11.05.1985



Songs List:



ఆమని కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: పి.సుశీల, కె.రాజేశ్వరరావు, ప్రకాశరావు

ఆమని కోయిల పలికింది నిండుగా



నువ్వు పుట్టినరోజు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్, కె.రాజేశ్వరరావు

నువ్వు పుట్టినరోజు శనివారమాయే



ఎంతెంత దూరం పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, రాంభట్ల కృష్ణమూర్తి

ఎంతెంత దూరం కొసరి కొసరి దూరం




వాడ వాడ కదలండి పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, కె.రాజేశ్వరరావు

వాడ వాడ కదలండి గుండె గుండె 




హే నీకోసమని పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హే నీకోసమని దాసోహమనీ



ఈడు ఉంది తోడు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల బృందం

ఈడు ఉంది తోడు లేదు జోడు కావాలి




ఇవేమిటి జీవితాలు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: కె.అశోక్, కె.రాజేశ్వరరావు

ఇవేమిటి జీవితాలు ఎగురుతున్న విహంగాలు

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే.వి.రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, గీత, పల్లవి, జయమాలిని, జ్యోతిలక్ష్మి 
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
నిర్మాత: కె. రామచంద్ర రావు 
విడుదల తేది: 10.08.1979


(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )




Songs List:



యాలో యాలా ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

యాలో యాలా ఉయ్యాలా
గున్నమావిలో కన్నెకోయిలా కూసిందియ్యాలా
ఎండకన్నులా పండువెన్నెలా కాసిందియ్యాలా
ఈ పులకరింతలే పూలు పుయ్యాలా
ఆ పలకరింతకే పైట జారాల ....

వున్న ఈడులేని తోడు - ఈసులాడుకున్న ఈ వేళ
మల్లెపువ్వు పిల్ల నవ్వు - మాటలాడుకున్న ఈ వేళ
ఏ ఈడులో ఆ వేడుక జరగాలనే చలికోరిక
కంటిపాపనే చందమామ వాటేసిందియ్యాలా
కొంగుచాటున కొండగాలి కాటేసిందియ్యాల
ఈ కలవరింతలే కలిసిరావాల
ఆ కోగిలింతలో కలిసిపోవాల....

వానపువ్వు తేనెటీగ - ముద్దులిచ్చి పుచ్చుకున్న వేళ
కన్నెసోకు కన్నుసోకి మొగ్గలిచ్చుకున్న ఈ వేళ
ఈ గుండెలో గూడున్నది - ఏ గువ్వకో చోటున్నది
కొత్తబరుపు నాకోకబిగువు కాజేసిందియ్యాలా
పైటదరువు నా పరువుతీసి ఆరేసిందియ్యాలా
ఈ జలదరింత నేనేడ దాయాలా
ఈ తొలకరింత నేనెవరికియ్యాలా ....




కోడెవయసూ కుమ్మేస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వీటూరి
గానం: పి.సుశీల , యస్.పి.బాలు

కోడెవయసూ కుమ్మేస్తుంటే - కొంటె మనసూ దొలిచేస్తుంటే
తిమ్మిరెక్కి నాఒళ్లు తుళ్లి తుళ్లి పడుతుంటే...ఏం చెయ్యాలి...అమ్మో
ఎటు పోవాలి?
ఆరు బైట జారు పైట రెపరెపమంటే నా గుండెలోన రేగింది
సన్నని చలిమంట
నీ చూపు నా వైపు ఎగాదిగా చూస్తే నా వెన్నులాగ సాగింది
వెచ్చని పులకింత
పట్ట బోతే పావురాయి - కొట్ట బోతే కొక్కిరాయి
అందకుంటే సూదంటురాయి అందకుంటే ఆకురాయి
కలిసివుంటె హాయి - కలపవేమె చేయి - 
ఒ రాలుగాయి గడుగ్గాయి అమ్మాయి
ఏం చెయ్యాలి - ఎటుపోవాలి
జత కలపాలి - కధ నడపాలి ॥కోడెవయసూ॥

బుగ్గమీద ముగ్గులేసి అలా అలా రాస్తే
సింగారం చిలికింది సిగ్గుల సిరిమొగ్గ
కూత కూసి లేతనడుము అటూయిటూ వూగితె
వలపు వయసు గోదారికి వచ్చింది వరద
ముట్టుకుంటే మునగకొమ్మ - పట్టుకుంటే వదలడమ్మ
మచ్చికైతే పూలరెమ్మ - నచ్చకుంటే మంచుబొమ్మ

పెళ్లయితే కీలుబొమ్మ - అందాక ముళ్ళకొమ్మ
ఆ పైనే నీముచ్చుట తీరేనమ్మా
ఏంచెయ్యాలి ఎటుపోవాలి - జతకలవాలి కధనడపాలి




మాఘమాసం మాపటేల పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

మాఘమాసం మాపటేల - మనక ఎన్నెట్లో
గోరింట పొదరింట కోరిన కౌగిట్లో
ఎన్ని ముద్దుముచ్చట్లో - ఎన్నో వున్నై గుప్పెట్లో
ఎట్టా సెప్పను యిప్పట్లో - సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం||

పులకింతలే బుసకొట్టగా - గిలిగింతలే నసపెట్టగా
ఆ కళ్ళే గిల్లి గిల్లీ - నా ఒళ్ళే తుళ్ళి మళ్ళి
నాగమల్లి తోటకాడ చంద్రవంక వాగులోన
నిండా మునగకుండానే నీల్లాడబోకుంటే
చలి చలి చలి అన్నానే, చెలి చెలి చెలి అన్నాడే
ఆడేమన్నాడో నేనేం యిన్నానో
ఎట్టా సెప్పను యిప్పట్లో సెబుతా పెళ్ళిపందిట్లో ॥మాఘమాసం॥

పడుచందమే కడవెత్తగా - తడికొంగులే పడగెత్తగా
నీళ్ళే తొణికి తొణికి - నా ఒళ్ళే ఒణికి ఒణికి
నీలికొండ చాటుచూసి నీటిఎండ కాపుకాసి
ఆరీ ఆరకుండానే చీర కట్టుకొస్తుంటే
చుర చుర చుర చూశాడే - విర విర విర లాడానే
కంటే చూశాడో - కాటే వేశాడో.

ఎట్టా సెప్పను యిప్పట్లో
సెబుతా పెళ్ళిపందిట్లో.... ॥మాఘమాసం॥





చీరులోయ్ చీరులు పాట సాహిత్యం

 
చిత్రం: చెయ్యెత్తి జై కొట్టు (1979)
సంగీతం: జే. వి. రాఘవులు 
సాహిత్యం: వేటూరి, వీటూరి, జాలాది 
గానం: పి.సుశీల , యస్.పి.బాలు, యస్. జానకి

చీరులోయ్ చీరులు - చీరులోయ్ చీరులు
చుక్కచుక్క జారుల్లో - నిషా హుషారుల్లో
ఆనంద నిలయం - అందాల వలయం  
ఈ చుక్క సరసం - అందుకుంటె సార్గం.....॥చీరులోయ్ ||

పాలకుండ ఎన్నెలంటరో ఎన్నెట్లో నీలికొండ జారుబండరో
బండమీద కొక్కిరాయిరో - నన్ను నిక్కినిక్కి చూస్తుందిరో

అయితే యిదే మన తక్షణ కర్తవ్యం

నీటూ గోటూ దుశ్శశనా
సరసకురారా సుయోధనా
దానంచేసే ఓ కర్ణా - పాచికలాడే ఓ శకునీ
బొమ్మలాట నువ్వు ఆడకురా .. దుమ్ము దులపరా దొరమావా

మరి పొజిసన్ మార్చహే 

మార్చుకున్నా చల్లార్చుకున్నా - దీపాలయాల కాదురో
చీకట్లో చిందువేయరో 

అయితే ఒత్తినొక్కి దీపమార్పెయ్....
భారతకథలో రారాజైనా భామకు లోబడిపోలేదా
మందు పొందూ మరిగినవాడే - ఇంద్రుడిగా నిలబడలేదా
నేలకు నాలుగు దిశలంటా ఈ మనిషికి నాలుగు దశలంటా
దశలూ దిశలూ మారితే ఈ చతుష్టయం గతి ఏమంటా
రంభా ఊర్వశి  నేను మీ రంగులు తేల్చేస్తాను 
కామిని యామిని నేను మీ కధలే మార్చుతాను

Palli Balakrishna Sunday, October 29, 2023



చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద , అంబిక, గీత, రామానాయుుడు 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
నిర్మాత: డి. రామానాయుడు 
విడుదల తేది: 19.09.1981



Songs List:



ప్రేమ మందిరం.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం
ప్రేమ మందిరం.. ఇదే ప్రేమ మందిరం..

నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
నిరుపేదలు తల దాచుకునే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం ఊ...ఊ..ఊ..

చరణం: 1
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం
ఎనిమిది దిక్కుల నడుమ సంసారం
ఎనభై నాలుగు లక్షల సంతానం

సప్తస్వర సంగీతం నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం

రిసరిగ గసగమ సగమదనిస
నిదపమగరిసనిద

సప్త స్వర సంగీతం నవరసాల సాహిత్యం
రంగరించుకున్నదీ రంగుల వలయం
మనసంఘమ నిలయం... నవసాగర మధనం...ఇది శాశ్వత ప్రణయం
సుందరం.. సుమధురం.. ప్రేమ మందిరం

నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం

చరణం: 2
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం
నీలో విన్నా వలపుల ఓంకారం
నీలో కన్నా వెలుగుల ఆకారం

ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం
రిసరిగ గరిదప దపదప దపదస
ఉదయారుణ మందారం... హృదయేశ్వరి సింధూరం
కౌగిలిగా మెరిసిన... కళ్యాణ మంటపం

ఇది సృష్టికి ప్రాణం.. మన ముక్తికి మూలం
ఇది ఇలలో స్వర్గం...
సుందరం... సుమధురం... ప్రేమ మందిరం

నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం
కలవారలు కలలు కనే పసిడి పంజరం
ప్రేమ మందిరం... ఇదే ప్రేమ మందిరం




చంద్రోదయం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

చంద్రోదయం



ఎక్కడో.. పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఎక్కడో... ఎప్పుడో...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా దేవదాసువా బాటసారివా కాళిదాసువా

ఎక్కడో... ఎప్పుడో...
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా శశిరేఖవా భద్రకాళివా చండీప్రియవా

చరణం: 1
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి
మొదటి సారి కలుసుకున్నదర్ధరాత్రిరీ
చూసుకున్న చూపులన్ని అదో మాదిరి

ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
ఆపై ప్రతిరాతిరి కలల రాతిరి
అవి చెదరగానే కలత రాతిరి
కలల రాతిరీ కథల రాతిరి ప్రేమ కథల రాతిరి
కలత రాతిరీ బరువు రాతిరి గుండె బరువు రాతిరి

ఎప్పుడో... ఎక్కడో... 
ఎప్పుడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎక్కడో కలిసినట్టు ఉన్నాది నాకు
చంద్రలేఖవా శశిరేఖవా బాటసారివా కాళిదాసువా

చరణం: 2
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆహాహా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది
మొట్ట మొదటి పరిచయం మరుపురానిదీ
రోజు రోజు కదీ మరీ దగ్గరవుతది

ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది
ఆపై ప్రతి రోజు అది గట్టి పడతదీ
నువ్వు ఊరుకుంటే మీద పడతది

మీద పడతదీ మోజుపడతదీ పెళ్ళి మోజు పడతది
గట్టి పడతదీ కట్టమంటది తాళి కట్టమంటది

ఎక్కడో... ఎప్పుడో...
ఎక్కడో చూసినట్టు ఉన్నాది నాకు
ఎప్పుడో కలిసినట్టు ఉన్నాది నాకు
బాలరాజువా దేవదాసువా భద్రకాళివా చండీప్రియవా
పాటల ధనుస్సు 
ఎక్కడో... ఎప్పుడో...





ఆటా తందాన తానా తానా పాట పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

ఆటా తందాన తానా తానా పాట 




తోలిసారి పలికేను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

తోలిసారి పలికేను



ఉదయమా ఉదయంచకు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు

ఉదయమా ఉదయంచకు




అమరం అమరం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాసరి 
గానం: యస్.పి. బాలు

అమరం అమరం




మా ఇంటి అల్లుడా... పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమ మందిరం (1981)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల , యస్. జానకి 

మా ఇంటి అల్లుడా... మాపటేల గిల్లుడా 
మహా జనానికి మరదలు పిల్లనురో 

Palli Balakrishna Sunday, October 15, 2023





చిత్రం: భలే కాపురం (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: చంద్రమోహన్ , జయసుధ, గీత,
దర్శకత్వం: ఎస్.గోపాలకృష్ణ
నిర్మాత: జి.అప్పారావు, ఎస్.తాజుద్దీన్
విడుదల తేది: 12.02.1982 

Palli Balakrishna Friday, July 30, 2021



చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్. జానకి, పూర్ణచంద్రరావు
నటీనటులు: చిరంజీవి, హరిప్రసాద్, గీత, సత్యకళ, అనిత, జయవాణి, మోహన్ బాబు
మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: ఐ. యన్. మూర్తి
నిర్మాత: యారగుడిపాటి. వరదా రావు (వై.వి.రావు)
విడుదల తేది: 03.08.1979



Songs List:



కొడుకో నా మేనత్త కొడుకో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

పల్లవి :
కొడకో, నా మేనత్త కొడకో
వగలే సొంతం అనుకో దిగులే లేదు ఇనుకో
ఎల్లుండే కాశి పొద్దున చేసుకో పెళ్లి చేసుకో

చరణం: 1
సూపు కలిసిన సుబలగ్గంలో సురుకు మందిర నామనస-
సేయి కలిపిన సాయంత్రంలో పేరుకు తీపి 4/8 c
అందాలన్నీ—నేచందాలిస్తా
ఈడోజోడో -- తాడో పేడో
ఈడోజోడో తాడో పేడో తేల్చేసుకో

చరణం: 2
పుట్టిననాడే పదహారేళ్లు
రానే రాదుర పదిహేడు
బావలు మామలే నాకున్నోళ్లు వరసకు చెల్లీ అనలేరు
అందాలన్నీ నేపందెం వేస్తా-
వయసో మనసో—వరసో తెలిసీ
వయసో మనసో వరసో తెలిసీ వాటేసుకో




సీతమ్మ సిగ్గు పడింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పల్లవి:
సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది.
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళ

చరణం: 1
కౌగిలినే కోవెల చేసి
మమతలనే మాలలు వేసి
అందాలన్నీ హారతులిచ్చి 
పులకింతలతో పూజలు చేసి 
ఏ వరాలు అడిగిందో ఆ జవరాలు
ఎవరికి తెలుసమ్మా ఆ వివరాలు

చరణం: 2
మల్లెలతో మంతనమాడి
జాబిలితో జాబులు పంపి
సిగ్గుల ముంగిట ముగ్గులు దాటి
వెచ్చని ఊపిరి వేణువులూది 
ఏ శృతిలో పాడిందో ఈ అనురాగం
ఎవరికి తెలుస్మూ ఆ రామాయణం




పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి: 
పూతరేకులాంటి పిట్టరో  
దాని పులకరింత పంచుకుంటరో
దీని పులకరింత అందుకుంటారో 
పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా 
అహ పరువాల పిట్టా దీన్ని పట్టేది ఎట్టా

కోర వయసు కోడి పుంజురో
ఆడు కుర్రకారు దోర గింజరో
ఈడి ముద్దు ముదురుతున్న ముంజరో
పరువాల గిత్తా దీన్ని పట్టేది ఎట్టా ?

చరణం 1
సన్నగ చిన్నది నవ్విందంటే సన్నజాజి పూసే
కుర్రది వర్రగ నడిచిందంటే కూచిపూడి వెలిసే
ఆమాట నువ్వంటే నీ మనసు నేవింటే
చలి పెరిగి రమ్మంటే మెలి తిరిగి పోతుంటే
అన్నట్టు వున్నట్టు నీ నడుమే
ఉలికి ఉలికి పడుతుంటే కూతవిద

చరణం: 2
చూసిన కన్నుల కాసిన వెన్నెల - ఎండకన్న ఉడుకు
జాజులు వాడిన ఆశలు రేగిన మోజులెంత దుడుకు
నెలవంక నాకోసం ఇలవంక దిగివస్తే
నేలేత ఎన్నెళ్లే నన్నల్లుకుంటుంటే
నాముద్దు నీముద్దు ఇద్దరికీ నిద్దర చెదరగొడుతుంటే



సీతమ్మ సిగ్గు పడింది (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

సీతమ్మ సిగ్గు పడింది - సిగ్గుల్లో
సిరిమల్లె మొగ్గేసింది
రాముని వలపులే తొలకరి చూపులై
తాకని తనువున సోకిన వేళ



రామబంటు నేనేరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు 

రామబంటు నేనేరా 
శ్రీరామ బంటు నేనేరా
రక్కసి మూకల ఉక్కడగించి 
రామకార్యమున తీర్చగ వచ్చిన 

రాం రాం రాం రాం 
జై  రాం రాం రాం రాం 

పదితలులున్న పతితులెరుగరు 
మగువకు మానమే ప్రాణమురా...
అరె కుంక బుద్దులు లంకకు చేటని 
అంబ పలికి నీ పంబ అదరగా 

కళ్ళు  నెత్తినెక్కి నందుకు 
కన్నె పిల్లల్ని చెరబట్టి నందుకు 
కన్నె కొంపల్నెన్నో కాల్చినందుకు 
పల్లె పంటల్నెన్నో దోచినందుకు 
కొట్టు ఎద్దు తోకకు ఎన్నుపోటు పొడిచి 
నిండు ప్రాణాలెన్నో తీసినందుకు 

రాం రాం రాం రాం 
శ్రీ  రాం రాం రాం రాం 

నీ పుటకే బారం నివు బ్రతికుండడమే నేరం 
శీలాపహరణం చేసినందుకు చేస్తా చూడర వస్త్రాపహరణం
వళ్లు బలిసి ఉన్నందుకు కుళ్ళు బుద్ది పుట్టినందుకు 
సంపు కల్లుతాగి తూలినందుకు  నిప్పుతోటి పేలినందుకు 
చెప్పు అడ్డమైన గడ్డి గొడ్డులాగా గతికి వడ్డూ పొడవు పెరిగినందుకు 
కొడతా తిడతా భరతం పడతా 



రామరామ రఘురామ పరాత్పర పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ బంటు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పూర్ణచంద్రరావు & కోరన్

వచనం : 
అప్పుడు హనుమంతుడు తన స్వామి శ్రీరామచంద్రుని వుంగరాన్ని సీతాదేవికి భక్తితో సమర్పించి 
"నీ కష్టాలు తీరే సమయం సమీపించింది. త్వరలో రామచంద్రమూర్తి రావణాసురుని జయించి నిన్ను గ్రహిస్తాడు తల్లీ" అన్నాడు. 
అసలు ఎవరయ్యా హనుమంతుడు ? రామకార్య దురంధురుడు, శ్రీరామ పాదసేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న పుణ్యమూర్తి, నాటికీ, నేటికీ, చిరంజీవి. 
మరి ఎక్కడ వుంటాడా హనుమంతుడు...?

శ్లోకం :
యత్ర యత్ర రఘునాథ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్ప వారి పరి పూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

వచనం : 
ఎక్కడెక్కడ తన స్వామి శ్రీరామచంద్రుని నామసంకీర్తనం జరుగుతుందో
అక్కడ, రెండు చేతులూ జోడించి ఆనంద భాష్పాలు రాలుస్తూ కూర్చుని
వుంటాడుట ఆ భక్త శిఖామణి. అణు క్షణం ఆ మారుతి జపించే తారకమంత్రం ఏమిటయ్యా....?

రామదాసు:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రధాంగ ధరఘన, పతంగ వాహన
రమారమణ నారాయణా

చారుశీల సురలోల నిరంజన
సత్వపరాయణ సువిధామా
జానకి రమణా ధనుజవిరమణా
మారుతి పూజీత శుభచరణా

కోరస్:
రామరామ రఘురామ పరాత్పర
రావణ సంహర, రణధీరా....

రామదాసు :
రధాంగ ధరఘన పతంగ వాహన
రమారమణ నారాయణా...
రామ రామ రామ సీతా - రామ రామ రాం

కోరస్ :
రామ రామ రామ సీతా రామ రామ రాం


Palli Balakrishna Monday, January 28, 2019


చిత్రం: టింగు రంగడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: నందమూరి రాజ
నటీనటులు: చిరంజీవి, గీత
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.10.1982

పల్లవి:
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
అర్రెర్రె.. టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని

చరణం: 1
రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
హ..హా.. రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
జారి బోలపడ్డావే జాణ కూతురా.. అడ్డ రోడ్డు నవ్విందే అత్త కూతురా..
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..ఆ..ఆ
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..
అందమంత కందెనా.. ఆ మందు నీకు వేయనా
తేనటీగ తీపి కుట్టు నే కుట్టనా..
బుజ్జగించి బుగ్గ ముద్దు పెట్టెయ్యనా..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..

చరణం: 2
మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
హా.. మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
రెచ్చగొట్టి పోమాకు రేపు మాపులో..
రెప్ప కొట్టుకుంటాది కొత్త ఊపులో..
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..ఆ..ఆ
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..

సందమామ కొయ్యనా.. ఆ..సంతకాలు చెయ్యనా
కౌగిలింతలోన నిన్ను కట్టెయ్యనా.. ఆకలింక చూసి బువ్వ పెట్టెయ్యనా

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ..హా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆ..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

హొయ్.. హొయ్.. హా.. హొయ్.. హోయ్..
హా.. హా.. టుర్ర్.. టుర్ర్..



Palli Balakrishna

Most Recent

Default