Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangaru Chellelu (1968)




చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భారతి, విజయ నిర్మల 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి 
విడుదల తేది: 22.08.1968



Songs List:



అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి

చరణం : 1
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై.
చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో
కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి

చరణం : 2
కలిమి మనకు కరుైవె నాకాలమెంత ఎదురైన
కలిమి మనకు కరుైవె నాకాలమెంత ఎదురైన
ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన
ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది
అన్నయ్య సన్నిధి




చెల్లాయి పెళ్లికూతురయేనే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

పల్లవి: 
చెల్లాయి పెళ్ళికూతురాయెను
పాల వెలులే నాలో పొంగి పోయెను

చరణం: 1
నా చెల్లి మందారవల్లి అది
ననుగన్న బంగారు తల్లి
ఎన్నెన్ని జన్మలెనగానీ 
నాకి చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ

చరణం: 2
బంగారుగాజులు తొడుగుకొని సిగలో
అందాల జౌజులు తురుముకొని
పెళ్ళిపీటపై చెల్లి కూచోవాలి నా
కళలో వెలగాలి దీపావళి...

చరణం: 3
చిన్నారి చెల్లికి పెళ్లయితే.. నా
పౌన్నారి బావతో వేళుతుంటే_ఈ
అన్నయ్య కన్నీరు ఆగేనా
వన్నీటి వాగై సాగేనా...




విన్నవించుకోనా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
విన్నవించుకోనా
విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళూ నా మదిలో వున్న కోరిక

చరణం: 
నల్లనీ నీ కురులలో
తెలతెల్ల సిరిమల్లె నై
పరిమళాలు చిలుకుతూ
నే పరవశించి పోనా

వెచ్చనీ నీ కౌగిట
పవశించిన నవ వీణనై
రాగమే అనురాగమై
నీ మనసు నిండిపోనా

తీయని నీ పెదవిపై
చెలరేగిన ఒకపాటనై -
అందరానీ నీల నింగీ
అంచులందుకోవా...

చల్లనీ వీ చూపులే
తెలివెన్నెలై విరబూయగా
కుఱువనై నీ చెలియ నై
కన్నులందు వెలిగేనా




వలపు ఏమిటీ ఏమిటీ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

పల్లవి: 
వలపు ఏమిటి? ఏమిటి? ఏమిటి?
వయసు తొందర చేయుట ఏమిటి?
మనసు ఊయల పూగుట ఏమిటి?
ఎచట దాగెను రాగల పెనిమిటి?

చరణం: 1
అల్లరివాడో చల్లని రాజోలేక
అందాలు దోచేటి మగరాయుడో
కన్నులు మూసి, కపటాణ చేసి నన్ను
కవ్వించి కరగించు సుకుమారుడో
ఎవ్వరో ఎవ్వరో
నవ్వుతూ_సవ్వించుతూ
ఏలవాడే వాడే వాడే

చరణం: 2
మగసిరి చూపి_మననే నిలిపి కన్నె
మదిలోన మనుసిగ్గు లాలించునో
పొంకములన్నీ పొంగేవేళ_కోటి
మురిపాల కెరటాలు తేలించునో
చిలిపిగా చెలిమిగా
చనువుగా_తనివిగా
చేరరాడే వాడే నేడే



అ ఆ లు వస్తేగాని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: మాధవపెద్ది సత్యం, వసంత 

పల్లవి: 
ఆ ఆ ఆ ఆగండి
అ ఆ లు వస్తేగాని అయిదు బళ్ళూ తావండి
ఆత్రంగా పైపైకొస్తే అట్టే మంచిది కాదండీ
ఏనాడో అయిదు బళ్ళూ నేర్పానే నా నవనీతం
సరిగములో సరసం గలిపి సాగిద్దాం మన సంగీతం

చరణం: 
ఇంటిలోన ఎవ్వరులేరు ఎట్లాగండి మాష్టారు
ఒక్కదాన్ని వుండాలంటే భయమేస్తున్నది మాష్టారు
జతగా మీరుంటారా కథలైనా చెపుతారా
కథలోని నాయకుడెల్లే కవ్విస్తారా ఓ నియహో కూ

చెంతనీవు వున్నావంటే హనుమంతుడిలా గంతేసా
వింతచూపు చూశావం చే యిక్కడెమకాము పెట్టేస్తో
నా రంగుల నవనీతం నా ముదుల సంగీతం
ఆపలేనె నేవీవిరహం వీదేచారం. ఓ నియహో కూ

అమ్మ నాన్న వచ్చేశాక నుప కథ ఏమిటి మాష్టారు
బొమ్మలాంటి మీ అవతారం చూసేదెలాగ మాష్టారు
ఓ మాస్టారూ... ఓ మాస్టారూ.
అమ్మ నాన్న రానేరారు నీకెందుకు యీ బేజారు
రైలెక్కి రాజమహేంద్రం పొయ్యుంటారు.
ఓ యహో కూ




ఏగలేక వున్నాను రా మావా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 

పల్లవి: 
ఏగలేక వున్నాను రా మావా
ఎప్పుడేలుకుంటావు రా మావా
ఎప్పుడేలుకుంటావు రా 
ఏమి తొందరొచ్చిందోనే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందో నే పిల్లా
ఏమి ముంచుకొచ్చిందో నే 

చరణం: 
బొట్లా బొట్లా చీరగట్టి
బొండుమల్లెలు కొప్పునబెట్టి
కంది చేలో పందిరేసి
పందిరెక్కి నిక్కి చూసీ
ఒళ్ళంతా ళ్ళుచేసి కక్లన్నీ కాయగాసి 
విసిగి విసిగి వేగిపోతిరా మామా
చీమ చిటుకుమంటే వులికి పడితిరా

చరణం: 
పొందూరూ పంచెగట్టి మందారా నూనె రాసి
ఆదంలో నీడ చూసి నీడలోనే నిన్ను చూసి
లేత లేత బుగ్గలకోవం_బుగ్గల మీద సిగ్గుల కోసం
వురికి పురికి చేరవస్తినే పిల్లా
ముద్దుల సుద్దుల మూటలు తెస్తివే 

చరణం:
పైరగాలి జోరులోన, పెటచెంగు జాలిపోయె
నీవులేక నిల్వలేను_కావమింక నైవలేను
మూడు ముళ్ళు వేసేవాకా. ఆగవే నా రామ చిలకా
కాముని పున్నమి ముందు వున్నదే పిల్లా
కమ్మని కౌగిలి విందు వున్నదే...






జాజిరి జాజిరి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు గాజులు (1968)
సంగీతం: టి. చలపతి రావు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

జాజిరి జాజిరి జక్క మామా_చించించున్
జింగిరి బింగిరి జితుల మాహ_చించించున్
కాకరో చెట్టు మేకలు మేనేచించించున్

చరణం: 
నీ దేశం బంగరు బర్మా చించించాంచూం
నీ బావే తెలియదు ఖర్మా
సరదాగా వినుచూస్తేనే తరియించెను మా జన్మ
రతనాలే తెచ్చావో - ఇ ఈ జతగోరే వచ్చావో
మోజుంటే ముందుకు రావోయ్ చించించున్ 

చరణం: 
వంటింట్లో కుందేలుందీ
వాకిట్లో తోడేలుందీ
గురి పెట్టి చూచావంటే
గుండె ఝుల్లుమంటుంది
నీ మీసం భాగుందీ_ఇ ఈ నీ వేషం బాగుందీ
తొడగొట్టి దూసుకుపోవోయ్ చించించున్

చరణం: 
చెయ్ తిరిగిన మా బాసు_ఇ ఈ...చెయ్యడులే తిరకాసు
చెల్లుతుందీ వరహాలాగా అతనిచేతి అరకాసు
వ్యవహారం చేస్తావో ఎగనామం పెడతావో
ఏదైనా నీదేభారం_చించించున్ ....

No comments

Most Recent

Default