Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhagya Rekha (1957)




చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఎరమాకుల ఆదిశేషా రెడ్డి 
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, జమున 
దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
నిర్మాణ సంస్థ: పొన్నలూరి బ్రదర్స్
విడుదల తేది: 20.02  1957



Songs List:



మనసా తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

మనసా తెలుసా
నీ విరాగమంతా వృథాయని తెలుసా
అనుబంధాలను తెంచేనని 
నీ వనుకొని మురిసేవా
నీ మనసున భమ సేవా
మమకారమనే పాళము మరిమరి
పెనవేసెను తెలుసా

దీపములేని కోవెలలో పల
దేవుడు వెలిసేనా 
శ్రీ ధాముడు వెలిసేనా
అనురాగ మొలుకు మనసే ఆహరి
ఆలయమని తెలుసా 




అందాల రాజెవడు రా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

అందాల రాజెవడు రా
నా వన్నెకాడు ఎందు దాగియున్నాడురా
ముచ్చటైన నా సొగసు
ముద్దుగారు నా వయసు
మురిపించి కరిగించి
మోజుదీర్చు మొనగాడు

సుంద రాంగి నామీద దయలేదటే
చేయిచేయి కలిపి నన్ను సేరరాదటె
సక్కదనము గల్ల వోణ్ణి
సరదా సెల్లించువోణ్ణి
కొండనైన పిండిజేసి కోర్కెదీర్చు కోడెగాణ్ణి

ఎన్నాళ్ళకు నిక్కావురా సోగ్గాడా
ఏ మూల నక్కావురా నా సోగ్గాడ
ఏమూల నక్కావురా.....
పోకిళ్ళ పుట్టవు - పూర్నాల బుట్టవు
బంగారు మొలకవు - పంచదార చిలకవు.
ఉప్పులేక ముప్పుందుం - చప్పరించు గొప్పవాడ

హేయ్!..
నావంక జూడవేమే వయ్యారిభామ
నా వలపు దీర్చవేమే
మూడూ లోకాలనన్ను బోలినోడు కానరాడు
వీరాధి వీరుణ్ణి శూరాధి శూరుణ్ణి
వాడెంత వీడెంత వంజగాళ్ల బతుకెంత

ధీరుల్ని చూచానురా
మీ కండ బిగువు తేల్చుకుంటే వలచేనురా
కోతలన్ని కట్టిపెట్టి - కూతలన్ని చుట్టబెట్టి
మూతిమీద మీసముంటె
ముందు దూకి బరిమీద
పందెంలో గెల్చి - నా అంద మనుభవించేటి

అరె నీవెవడపురా
నిన్ను అంతు తేల్చేదనురా
రారా ! అంతు దేల్చెదనురా

అరరె కండలు దీస్తారా నిన్ను 
కరకర కోస్తారా నిన్ను
పరపర కోస్తారా...




తిరుమల మందిర సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

తిరుమల మందిర సుందరా
హరి గోవిందా గోఫందు
కొండ కొమ్ముపై కూర్చుంటే
దండ భక్తులే కొలువుంటే
నామాట నీ చెవుల పడుతుందా నీ
మనసులోని దయ పుడుతుందా

కోటి మెట్లబడి రాలేను ఏ
పాటి కానుకలు తేలేను
లోతులు నీకై చేతుల జాపీ
నా తండ్రియన నెనరుందా




కన్నె ఎంతో సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కన్నె ఎంతో సుందరి
సన్న జాజి పందిరి
చిన్నెజూసి వన్నె జూసి పోరా

మథు వొల్కేటి మందారము
మన సిచ్చేటిలే బ్రాయము
తన తళుకులతో - నును బెళుకులతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....

తన వాల్జూపు లుయ్యాలలై
అనురాగాలు పూమాలలై
తన మురిపెముతో
తన సరసముతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....

నిను ఏనాడు దర్శింతునే
మన సేనాడు అర్పింతునో
అని దరియుటకై
కని మురియుటకై
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా




నీవుండేదా కొండపై నాస్వామి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

నీవుండేదా కొండపై నాస్వామి నేనుండే దీనేలపై
ఏలీల సేవింతునో ఏపూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్య మీవా
నా పైని దయజూపవా నాస్వామి

దూరాన నైనా కనే భాగ్యమీవా
నీరూపు నాలో సదానిల్పనీవా
ఏడుకొండలపైన వీడైనస్వామి
నా పైని దయజూపవా నాస్వామి




నీ సిగే సింగారమే ఓ చెలియ పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

నీ సిగే సింగారమే ఓ చెలియ నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చేనే ఓ వనలక్ష్మి మనసిచ్చి దిగివచ్చేనే
నీ నవ్వుపూలు అవేమాకు చాలు
నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాలా మరేపూజ లేలా
మా పై ని దయజూపవా ఓ నా చెలి

మా తోట పూచే వసంతమ్ము
మా బాట చూపే ప్రభాతమ్ము
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మాపై ని దయ చూపవా - ఒ నా చెలీ




ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు
కన్నీటి బ్రతుకుపై పన్నీటిజల్లు
ఎన్నాళ్ళ కెన్నాళ్లకు
ఇన్నాళ్లు నా కలల పన్నీరు జల్లినా
వెన్నెలల రాశితో విడని నెయ్యాలు




ఓ నా మొరవినరాదా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

ఓ నా మొరవినరాదా 
ఇక ఈ చెర విడిపోదా
అబలననీ అనాదననీ
జాలిలేని కూరుని
పాలబడిన దానిని
నీ చెంత జేర్పవా
వంతదీర్చవా - నే
నిక సై పను ఈ బాధ

ఏడ నున్నవాడవో
జాడ తెలియదాయె నే
కాపాడరా సఖా
జాగు సేయక నీవు
వినా గతి వేరెవరు




మనసూ గేసఖ తనువూగే పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

మనసూ గేసఖ తనువూగే ప్రియమదిలో సుఖాల
డోలలూగే ఏమధువా నేనోయి ప్రియ
వయసూగే చెలి సొగసూగే ప్రియ వగలూరు ఓర
చూపులూగే ఏకర మూపేనో సకియా
మలుపు మలుపు కడనించి చెవిలో మంతనాలు ఊదాలి.
కలసి మెలసి కలకాలమిలాగే మధురయా సాగాలి.
అలలూగే మది కలూగే ప్రియతెలివాక
తేలు నౌక ఊగే ఏవలపూ పేనోయి ప్రియా
రేవు రేవు కడ కనులు కనులతో మూగ బాసలాడాలి
పైరగాలి పన్నీటియేటిపై పడవ సాగిపోవాలి
ఇలాగే పడవ సాగిపోవాలి.
తరువూగే సఖి తెరువూగే పియ తలిరాకువోలె
డెందమూ ఏవలపూపే నో సకియా
తేనెలని ఎలతేటి పాట మనలోని మమత చాటాలి
కనుల కొనల కల కాలము వలపులు కాపురముండాలి
ఇలాగే కాపురముండాలి




కన్నీటి కడలిలోన పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ
దిక్కైన లేని నావ
ఏ తీరమైన చేరునో - ఏరాల పాలబడునో
ఏగాలి వాత బడునో

నాపాలి భాగ్యదీపము - నన్నేలు దివ్యతార
పోయేన జీవనతార
కన్నీటి కడలిలోన - కనరాక దాటిపోయె
నన వీడి మాయమాయె

నా ఆసలే అడియాసలై - మాసేన జీవనగాధ
ఈ నా విషాద గాధ
కన్నీటి కడలీలోన - నడిచారి రాత్రి మూసె
నవచంద్ర కాంతి మాసె

ఏనాటికీ వసంతము - ఈ తోట కింకరాదా
నా వీట వెలుగిక లేదా.
కన్నీటి కడలీలోన - కనరాక దాటిపోయె
ననువీడి మాయమాయె




లోకం గమ్మత్తురా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: ఎరమాకుల ఆదిశేషా రెడ్డి 
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

లోకం గమ్మత్తురా
ఈ లోకం గమ్మత్తుగా
చెయ్యాలి యేదో మరమ్మత్తురా
రేసుల కాసుల వేలుగబోసె
వస్తారిండ్లకు వట్టిచేతుల
కనికరించి ఈ బీదా బిక్కికి
కానీ యివ్వరు అదేమొగాని

వ్యాధుల మిషతో తాగుడుకోసం
బాధ లెన్ని యో పడుదురుగాని
వ్యాధికి మందే ఎరుగని పేదల
ఆదరించరు అవేమొగాని

వడ్డికి వడ్డి నెత్తిన రుద్ది
అసలుకు మోసం దెచ్చుకుందురు
కాలే కడుపుకు జాలే జూపరు
కలలో నైనను అదేమొగాని

నేడో రేపో పొలాలూడితే
నిలువు రెప్పల నింగిజూ తురు
ఇన్నో అన్నో నూకలువేసి
పున్నెం గట్టరు అదేమొగాని

వచ్చిన లాభం చచ్చిన జూపక
రచ్చకెక్కుదురు బోర్డులదిప్పి
మచ్చుకై నా బిచ్చం పెట్టరు
చచ్చే జీవుల కదేమొగాని



అన్ మేరే అన్ మేరే పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

అన్ మేరే అన్ మేరే
దేఖో మందు మజా
ఏక్ బుడ్డి ఆరణా దో బుడ్డి బారనా
పత్తెమేమి లేదండీ బాబా గురు వాజ్ఞండి
రొట్టె తినండి - ఉడుకునీళ్ళు తినండి
అరె పాలు తినండి - పంచదార తినండి

బట్టతలకు తగిలిస్తే జుట్టు పుట్టుకొస్తాది
కంటి జబ్బులకు రాస్తే నంటకి సుఖమిస్తాది
మంచిమాట చేస్తాము మనసులోది చెప్తాము
పాముకుట్టితే తేలు కొరికి తే
అరె ఎలుక కుమ్మితే ఎద్దు కర్చితే
ఒక్కసారి పట్టిస్తే ఉన్న జబ్బు ఒదుల్తుంది
అనుమానం లేవండి గుణమిచ్చే మందండి
ఏలూరులో దీన్ని వాడి ఇనుములాగ బలిశారు

సాలూర్లో డాక్టర్లే సర్టిఫికేట్లిచ్చారు
బారెడు గడ్డాల వాళ్ళు మూరెడు మీసాల వాళ్ళు
అనుపానం లేకుండా ఆవుపాల మర్దించిరి





కారు చీకటి దారిగనలేని నాకు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కారు చీకటి దారిగనలేని నాకు
వెలలేని బంగారు వెలుగు చూపించి 
అంతలో దయమాలి - అర్పి వేయుదువా
దీప మార్పివేయుదువా
తల్లిని తండ్రిని ఎరుగ గదా
నా తండ్రి) ఏ సుఖమెరుగ గదా
ఉన్నది ఈ నిధి ఒక టెగదా
కాపాడుము వరదా
ఓ దేవా - దేవా
దిగి రావ దయా జలధీ
దిగి రావయ ప్రేమనిధీ
ఓ తిరుమల వేంకటరమణా !
సరిహరి మురహరి మొరవిన రాదా
చరణ కమలముల నమ్మితిగా దా
జీవన జీవన జగధీశా !
దీనజనావన తిరుమల వాసా
ఆపద మొక్కుల దేవా రావా
నీ పదదాసిని బోవగ రావా
శరణు శరణు పరమేశా
శరణు శరణు జగదీశా
ఓ తిరుమల వేంకటరమణా !


No comments

Most Recent

Default