Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchi Manasulu (1986)




చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
నటీనటులు: భానుచందర్, భానుప్రియ, రజిని, అశ్వని, బేబీ సీత 
దర్శకత్వం: బాలు మహేంద్ర 
నిర్మాత: శ్రీనివాసన్ 
విడుదల తేది: 05.04.1986



Songs List:



డమరుకము మ్రోగ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి & బృందం

డమరుకము మ్రోగ హిమశిఖరము ఊగ నటరాజు నర్తించనీ



డుం డుం .. పుట్టింటి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి & బృందం

డుం డుం .. పుట్టింటి బొమ్మ మెట్టింటి



ఈ సంధ్య కెంజాయ కుంకుంలో పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి & బృందం

ఈ సంధ్య కెంజాయ కుంకుంలో ఎన్నెన్ని రేపటి




జాబిల్లి కోసం.. ఆకాశమల్లే..(Female) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది 
నా మనసాక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది 
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటుపోతానో..
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో.
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై




జాబిల్లి కోసం.. ఆకాశమల్లే..(Male) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు 

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
నువ్వక్కడ.. నేనిక్కడ
పాటిక్కడ.. పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఎనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా.. ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ వుర్రూతలూగీ.. మేఘాలతోటీ రాగాల లేఖా
నీకంపినానూ.. రావా దేవీ

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది యెన్నళ్ళైనా 
వుండీ లేకా వున్నది నీవే
వున్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోడు నీవే
నీ దెగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై
నిను కాన లేకా.. మనసూరుకోకా.. పాడాను నేనూ పాటనై
జాబిల్లి కోసం.. ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై.. వేచాను నీ రాకకై




భరత కళే ఒక వేదం (Bit Song) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.జానకి 

భరత కళే ఒక వేదం హృదయానికదే ( బిట్ )

No comments

Most Recent

Default