Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kathanayakudu (1969)




చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, బెంగుళూర్ లత 
నటీనటులు: యన్.టి.రామారావు, జయలలిత 
దర్శకత్వం: కె.హేమాంబధరరావు 
నిర్మాత: కె.గోపాలకృష్ణ  
విడుదల తేది: 27.02.1969



Songs List:



పళ్లండి పళ్లండి పళ్లు పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

పల్లవి: 
పళ్లండి పళ్లండి పళ్లు
జామ పళ్లు
జామ పళ్లు
పలకమారిన పళ్లు - చిలక గొట్టని పళ్లు
కలకత్తా జామ పళ్లు కంటికి యింపైన పళ్లు

చరణం: 1
గట్టితనం తెలుసుకొని
ఖరీదెట్టి కొనండి
మెత్తగ వున్నాయంటె
బొత్తిగ నిలవుండవండి

చరణం: 2
రాజమండ్రి నుండి ఇవి రోజు రోజు వస్తాయండి
రేపుమాపని చూస్తే రేటు పెరుగుతుందండి
బత్తాయిలు వీటిముందు బలాదూరయ్యా
రంగు జూస్తే ఎనక్కెవడు పోలేడయ్యా
డాగులేమి పడనివయ్యా - టక్కులేమి చెప్పనయ్యా
పట్టి పట్టి చూడకుండా పరుగెత్తే వేమయ్యా



మంచివాడు మా బాబాయి పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల, బెంగుళూర్ లత 

పల్లవి: 
మంచివాడు మా బాబాయి
మా మాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి

చరణం: 1
రామ లక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
నీతికి నిలిచే నీ తమ్మునిపై
నిందలేందుకయ్యా

చరణం: 2
అమ్మా నాన్నా వలె చూసె
అన్నా వదినా వున్నారు
అన్నయ్యేదో అనగానే
అలుక ఎందుకయ్యా
అలుక ఎందుకయ్యా

చరణం: 3
మంచి మనసుతో బాబాయి
మనకు కానుకలు తెచ్చాడు
మూగ నోములు విడవాలి
ముగ్గురు కలసి నవ్వాలి



రావేలా దయలేదా ? పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం

పల్లవి: 
రావేలా దయలేదా ?
రావేలా దయలేదా ?
బాలా ఇంటికి రారాదా రారాదా
రారాదా రారాదా

చరణం: 1
వెన్నెల అంతా చల్లగ కరిగి పోతున్నది
పూవుల ఘుమ ఘుమ వాసన తరిగి పోతున్నది
నీవు లేక పోతే ఇల్లు బావురుమంది
నీవు రాక పోతే మనసు ఆవురుమంది

చరణం: 2
పగలంతా ఇంటిలోన చాకిరి నాకు
వేళాపాళనకుండా చదువులు నీకు
నీవు లేనిదే ఈ గది బావురుమంది
నీవు రానిదే నా మది ఆవురుమంది

ఏ రిక్షా ఆగుతున్నా నీవే దిగుతున్నావని
ఏ చెప్పులు చప్పుడైనా నీవే వస్తున్నావని
గాజులు గలగలమన్నా
తలుపులు దబ దబమన్నా
నీవేనని లేచి చూచి బేజారై పోతున్నా




వినవయ్యా రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
వినవయ్యా రామయ్యా
ఏమయ్యా భీమయ్యా
మనమంచే గెలిచిందయ్యా
మనమాటే నిలిచిందయ్యా

చరణం: 1
అబద్దాలు చెప్పే వాళ్లు 
అన్యాయం చేసేవాళ్లు 
చిత్తు చిత్తుగా ఓడారయ్యా
నెత్తికి చేతులు వచ్చినవయ్యా

చరణం: 2
మహా నాయకులు త్యాగంజేసి
మనకిచ్చిన స్వాతంత్ర్యం
కొందరి చేతుల పడనీకుండా
అందరి సొమ్మని చెప్పాలి

చరణం: 3
నిరుపేదల ప్రేమించే వాళ్లను
నిజాయితీగా నడిచే వాళ్ళను
పదవి వచ్చి వలచిందయ్యా
జయలక్ష్మి వరించిందయ్యా

చరణం: 4
దగాకోరులా దోపిడి దొంగలు
తలకిందులౌ తారయ్యా
నీతికి నిలబడు కథానాయకులు
జాతికి ప్రాణం పోసేరయ్యా



ముత్యాల జల్లు కురిసె పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల 

పల్లవి: 
ముత్యాల జల్లు కురిసె
రతనాల మెఱుపు మెరసె
వయసూ, మనసూ పరుగులు తీసే అమ్మమ్మా

చరణం: 1
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా
తనకు తానె నా రాజు నాతో
మనసు కలిపేనమ్మా

చరణం: 2
ముద్దు మోమును
అద్దాన సూపి
మురిసి పోయాడమ్మా
మల్లే పూల పల్లకిలోన
వళ్లు మరిచేనమ్మా




ఇంతేనయా పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల

ఇంతేనయా
తెలుసు కోవయా
ఈ లోకం ఇంతేనయా !
నీతీ లేదు, నిజాయితి లేదు
ధనమే జగమయ్యా !

చరణం: 1
డాబులుకొట్టి మోసంచేసి
జేబులు నింపేరు
పాపం, పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునా తీరే
ఇదే ప్రపంచమయా !

చరణం: 2
పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది
మనసేలేని సొగసేవుంది
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా 

చరణం: 3
మంచిని చేస్తే మనిషిని నేడు
వంచన చేసేరు
గొంతులు కోసేవాడికి నేడు
గొడుగులు పట్టేరు
దొంగలు దొరలె ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా





వయసు మళ్లిన బుల్లోడా పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

వయసు మళ్లిన బుల్లోడా
కొంటెచూపుల కుర్రోడా
నవ్వావంటే నవ్వుతా
నాటక మాడితె - కొడతా

మంచిగవుంటె చెంతకు చేరి
వలపులు విసిరేస్తా 
ఆడదాన్నని అలుసుగ చూస్తే
నిప్పులు చెరిగేస్తా
మనసిచ్చిన మగవాడికి నా
ప్ర్రాణం ఇచ్చేస్తా 
నమ్మినవాడు మోసం చేస్తే
ప్రాణం తీసేస్తా 

నీతో షికారు వస్తాను
గమ్మత్తుగ హుషారు చేస్తాను
చేతిలోన చెయ్ వేస్తాను
చెప్పినంత పని చేస్తాను
ఎప్పటికైనా తప్పకుండ
నా తడాఖా చూపిస్తాను నీకు
తాడాఖా చూపిస్తాను

No comments

Most Recent

Default