Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kathiki Kankanam (1971)




చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కాంతారావు, రామకృష్ణ, రాజనాల, విజయలలిత, అనిత, రాజబాబు
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాత: టి.వి.రాజు
విడుదల తేది: 19.02.1971



Songs List:



అనురాగ తీరాలలో పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

అనురాగ తీరాలలో
నీ కనుపాప దీపాలలో
చిన్నారిని, నే నున్నాననీ
దరిచేరరావా ప్రియా 

అనురాగ తీరాలలో
నా కనుపాప దీపాలలో
చిన్నారివి, నీవున్నావసీ
దరిచేర లేదా సఖీ 

కడగంట నిను చూసి
కొనకొంగు ముడి వేసి
జత చేరుకోవాలనీ
వేచేనులే వెయ్యేళ్ళైననూ
వేచేనులే వెయ్యేళ్ళైనసూ

ఆరోజు రావాలనీ
ఆరోజు తలపోసి
ఈ వేళ నను చూసి
నునుసిగ్గు నీ కేలనే
జవరాలివి, నా ప్రియురాలివీ
తొలిరేయి నేడే చెలీ



చెంగున దూకే పరువాలు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.జానకి

చెంగునదూకే పరువాలు కో అన్నవి !
పొంగులు వారే హృదయాలు సై అన్నవి
విరిసే ఈ వేళలో
వీచే ఈ గాలిలో

ఎన్నడులేదే ఈ పులకింత
ఎదలో ఏదో తీయని వింత

ఏ మరుడో ! భూపరుడై
దాగ న్నాడో ఏ పొదరింట

జిల్లునసోకే చల్లనినీట
అల్లరిచేసే జల్లుల ఆట
ఈ అలలే ! ఊయలలై
ఆడించేనా ఈ సయ్యాట





మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి, యస్.పి.బాలు, 

మేఘమాల నీవైతే మెరుపుకన్నె నేనే
స్వాతివాన నేనైతే - జాతిముత్యం నీదే
కురియునోయి వలపువాన - మురిసేను మనసే
ఓ ప్రియురాలా
నా జతగాడా !

నల్లనల్ల మబ్బు - తెల్ల తెల్ల అంచు
ఒళ్ళఝల్లుమనగ కురిసె జలు
ఒళ్ళుఝల్లు మజ్జిగ కురిసె జల్లు
చినుకులందు తడిసి మేను కనువిందులు చేసే
చూసితి సొగసు నిలువదు మనసు
చూసితి సొగసు నిలువదు మనసు
నిలువదు మనసు
నిలువదు మనసు

బయట ఇంతవాన - లోన ఎంత వేడి
మనసులోని తాప మాప మి
మనసులోని తాప మాపవేమి
పండును వలపు
పండును వలపు
తనివితీర చెలియ నీదు ఒడిలోనవాలి
ముచ్చటగొలుపు - పండును వలవు
ముచ్చటగొలుపు పండును వలపు





చూడచక్కని చిన్నోడా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం:  యస్.జానకి

చూడచక్కని చిన్నోడా
ఈడు జోడుగ వున్నోడా
దొంగచూపులు చూచి వలపు
దోచుకున్నోడా నా వాడా
రార మొనగాడా నా వాడా
రార మొనగాడా

వాలుగన్నుల చిన్నదిరా ఇది
వరసలాడుతు - వున్నదిరా
చెంత జేరి - రారమ్మంటే
సిగ్గుపడతా వేమిరా
రార మొనగాడా - నా వాడా
రార మొనగాడా

అద్దమంటీ మనసున్నదిరా
అందమైన వయసున్నదిరా
ముద్దుగుమ్మా పక్కనుంటే
మూతిముడిచే వేమిరా
రార మొనగాడా 'నా వాడా
రార మొనగాడా



గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం: పి.బి. శ్రీనివాస్, బి. వసంత

ఓ హెూ హెూయ్...
ఓ హెూ హెయ్
గప్పాం గప్పాం కత్తులు - గమ్మత్తైన కత్తులు
చురకత్తులు దొరకత్తులు
సరి కొత్త కొత్త కత్తులు
బంగారు పిడి చూడు
రంగేళి వరచూడు

ఈలోపల కత్తి పెట్టిచూడు - నీకు
పోరాటం చేతనైతె వాడు

గప్పాం గప్పాం పోరాటం
గప్పాం గప్పాం పోరాటం
చేతనైతె వాడు

పల్నాటి వీరకోళ్ళ పందాలకు వాడినదీ
గోలుకొండనవ్వాబుకు - గొప్ప తెచ్చి పెట్టినవీ పల్నాటి
చేతులెయ్యకండి గుచ్చుకుంటాయండి

గొంతుకోసి చూసుకోండి - తెగకుంటే ఒట్టండీ
ప్రతిరోజు వాడుతుంటే-పదును పెరుగుతాయండీ
ఒకరోజు వాడకున్న మెరుగుతరగబోవండీ
ఎంత దెబ్బ కైనా- ఇవి ఎదురుతిరుగుతాయండీ
డబ్బులిచ్చి తీసుకోండి. దెబ్బ వేసిచూడండీ




దైవం లేదా దైవం లేదా పాట సాహిత్యం

 
చిత్రం: కత్తికి కంకణం (1971)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: అప్పలాచార్య
గానం:  యస్.జానకి

దైవం లేదా, దైవం లేదా!
రగి లేగుండెల సెగలే-కనబడలేదా !

దైవం లేదా
రగిలే గుండెల సెగలే కనబడలేదా
దైవం లేదా
బుసకొట్టే విషవలయంలో
పసిపాపడు బలియౌనా

శిరసొగని వీరకిశోరం
చెఱపాలె కుమి లేనా !
కన్నీళ్ళకు విలు వేలేదా
కన్నీళ్ళకు విలు వే లేదా
కరుణామయు డే లేదా

ఆ దేవుని దీవెనలుంటే
నా దేవుడు రాకుంటాడా !

విషనాగుల కోఱలు విరిచే
పసికందును కొనిపోలేదా !
వికటించిన చీకటిపోదా |
వికటించిన చీకటి పోదా
వేకువ రానేరాదా

దైవం లేదా !
దైవం లేదా !
దైవం లేదా !

No comments

Most Recent

Default