Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lawyer Viswanath (1978)
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి
గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: యన్.టి.రామారావు, రంగనాథ్, శరత్ బాబు, జయసుధ, కవిత, సుజాత
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: వై వి రావు
విడుదల తేది:17.11.1978Songs List:పిలిచె పిలిచె అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల 

పల్లవి: 
పిలిచె పిలిచె అనురాగం
పలికే పలికె నవగీతం
అతడు నను చేరగానే
బ్రతుకు పులకించె తానే

చరణం: 1
ఈపడుచు గాలీ నా పైన వాలీ
ఏమమ్మో యింత సిగ్గు ఎందు కన్నది
ఏ బదులు రాక నిలువ లేక
జవ్వాడే నామనసేమో నవ్వుకున్నది

చరణం: 2
రవ్వంత బిడియం పువ్వంత ప్రణయం
నారాజు చూపుల్లోనే దాచుకున్నాడు
నే దాచలేక ప్రేమ లేఖ
అందాల మబ్బుల ద్వారా అందచేస్తాను
షరాబీ! పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి

సాకి: షరాబీ!

పల్లవి: 
వచ్చిందిరా ఈ గులాబీ
రేకు విచ్చిందిరా ! సోకు మెచ్చిందిరా!
లేత పరువాలు తెచ్చిందిరా

చరణం: 1
వలచింది ఒకరు నిలచింది ఒకరు నాకోసం
నా దోర వయసు ఈ లేత మనసు నీకోసం
ఈ తళుకు ఈ కులుకు నా బతుకు నీకొరకు
కలలోని వలపు వెలలేని ముడుపు నీదే

చరణం: 2
ఆడింది ఆట పాడింది పాట ఒకనాడు
నావాడి కొరకు నేనాడు తాను ఈనాడు
కన్నీరు దాచాను పన్నీరు జిల్లాను
ఏనాటికైనా నాదారిలోకి రావా
రాముడెప్పుడూ రాముడే! పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
రాముడెప్పుడూ రాముడే ! 
రఘురాము డెప్పుడూ రాముడే
అయోధ్యలో తానున్నా! 
కారడవులలో పోతున్నా

చరణం: 1
మబ్బులెన్ని కమ్ముకున్నా-మాసిపోదు సూర్యగోళం !
చీకటెంత భయపెడుతున్నా - చెదిరిపోదు చంద్ర బింబం !
ఎన్ని తలలు ఏకమైనా-ఎందరు మారీచులున్నా
ఎదురొడ్డి నిలిచేవాడు-ఎత్తైన విల్లు దించనివాడు

చరణం: 2
కడలి హద్దు దాటిందంటే పుడమినే ముంచేస్తుంది
గోవు మనసు రగిలిందంటే
కొమ్ములతో కుమ్మేస్తుంది అందుకే
వజ్రమును కోయాలంటే వజ్రమే కావాలబ్బీ
కోటలను కూల్చాలంటే ఫిరంగులు పేల్చాలబ్బీ
జిత్తులను మాపాలంటే ఎత్తులే వేయాలోయీ
కత్తులను తుంచాలంటే కత్తులే విసరాలోయీ
ఏరూపంలో నీవుంటున్నా
తోడుంటాడు యీహనుమన్న
కలకాలం వుండవులే కన్నీళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
కలకాలం వుండవులే కన్నీళ్ళు
కలలైనా కలతైనా కొన్నాళ్ళు
కలలన్ని మరిచి కన్నీరుతుడిచి
ఈ పాట పాడాలి నూరేళ్ళు

చరణం: 1
ఏగుండెలోన ఏగొంతువుందో
తెలిసేది నీబాధ లోనే ఏగొంతులోన ఏకోయిలుందో
పలికేది నీపాట లోనే
నిట్టూర్పు తగిలి తొలితూర్పు రగిలి
వెలిగేది నీచూపు లోనే

చరణం: 2
ఆ కన్ను మరిచె నా కన్ను తడిసే
నాఆశ అడియాసలాయె
దీపాలు వెలిగే పెనుచీకటాయె
నా నీడ నను వీడి పోయె-నడిరేయిలోనే కొడిగట్టె దీపం
వలపంత తెలవారిపోయె
భం భం భం భం శంఖునాదముతో పాట సాహిత్యం

 
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

భం భం భం భం శంఖునాదముతో
జగ జగ జగ జగదంబ పలుకుతో
కొండ దేవరను దిగివచ్చా
నేజన్మ కుండలిని చూస్తా బచ్చా

చేతిలో రాత చూడు రాతలో గీత చూడు
ఈ ఒంటరి గువ్వ జంటగ గూటికి
చేరే యోగం వుందా చూడు

బ్రహ్మిని తిమ్మిని చేస్తా-తిమ్మిని బ్రహ్మిని చేస్తా
ఆబ్రహ్మరాతలో ప్రేమగీతని
ఇప్పుడు ఇక్కడ పుట్టించేస్తా

నిప్పులాంటి నామనిషి–నీటి పాలై పోతుంటే
మంచిని పెంచి తలనేవంచని
వాడు వంచనకు బలిఅవుతుం టే
నిప్పును నేరగిలిస్తా ఆనీటిని ఆవిరిచేస్తా
మీవలపు కోవెల తలుపులు తెరిచి
ఇప్పుడు ఇక్కడ దీపం పెడతా

No comments

Most Recent

Default