-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "B. Nagi Reddy"



చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఎరమాకుల ఆదిశేషా రెడ్డి 
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, జమున 
దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
నిర్మాణ సంస్థ: పొన్నలూరి బ్రదర్స్
విడుదల తేది: 20.02  1957



Songs List:



మనసా తెలుసా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

మనసా తెలుసా
నీ విరాగమంతా వృథాయని తెలుసా
అనుబంధాలను తెంచేనని 
నీ వనుకొని మురిసేవా
నీ మనసున భమ సేవా
మమకారమనే పాళము మరిమరి
పెనవేసెను తెలుసా

దీపములేని కోవెలలో పల
దేవుడు వెలిసేనా 
శ్రీ ధాముడు వెలిసేనా
అనురాగ మొలుకు మనసే ఆహరి
ఆలయమని తెలుసా 




అందాల రాజెవడు రా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

అందాల రాజెవడు రా
నా వన్నెకాడు ఎందు దాగియున్నాడురా
ముచ్చటైన నా సొగసు
ముద్దుగారు నా వయసు
మురిపించి కరిగించి
మోజుదీర్చు మొనగాడు

సుంద రాంగి నామీద దయలేదటే
చేయిచేయి కలిపి నన్ను సేరరాదటె
సక్కదనము గల్ల వోణ్ణి
సరదా సెల్లించువోణ్ణి
కొండనైన పిండిజేసి కోర్కెదీర్చు కోడెగాణ్ణి

ఎన్నాళ్ళకు నిక్కావురా సోగ్గాడా
ఏ మూల నక్కావురా నా సోగ్గాడ
ఏమూల నక్కావురా.....
పోకిళ్ళ పుట్టవు - పూర్నాల బుట్టవు
బంగారు మొలకవు - పంచదార చిలకవు.
ఉప్పులేక ముప్పుందుం - చప్పరించు గొప్పవాడ

హేయ్!..
నావంక జూడవేమే వయ్యారిభామ
నా వలపు దీర్చవేమే
మూడూ లోకాలనన్ను బోలినోడు కానరాడు
వీరాధి వీరుణ్ణి శూరాధి శూరుణ్ణి
వాడెంత వీడెంత వంజగాళ్ల బతుకెంత

ధీరుల్ని చూచానురా
మీ కండ బిగువు తేల్చుకుంటే వలచేనురా
కోతలన్ని కట్టిపెట్టి - కూతలన్ని చుట్టబెట్టి
మూతిమీద మీసముంటె
ముందు దూకి బరిమీద
పందెంలో గెల్చి - నా అంద మనుభవించేటి

అరె నీవెవడపురా
నిన్ను అంతు తేల్చేదనురా
రారా ! అంతు దేల్చెదనురా

అరరె కండలు దీస్తారా నిన్ను 
కరకర కోస్తారా నిన్ను
పరపర కోస్తారా...




తిరుమల మందిర సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

తిరుమల మందిర సుందరా
హరి గోవిందా గోఫందు
కొండ కొమ్ముపై కూర్చుంటే
దండ భక్తులే కొలువుంటే
నామాట నీ చెవుల పడుతుందా నీ
మనసులోని దయ పుడుతుందా

కోటి మెట్లబడి రాలేను ఏ
పాటి కానుకలు తేలేను
లోతులు నీకై చేతుల జాపీ
నా తండ్రియన నెనరుందా




కన్నె ఎంతో సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కన్నె ఎంతో సుందరి
సన్న జాజి పందిరి
చిన్నెజూసి వన్నె జూసి పోరా

మథు వొల్కేటి మందారము
మన సిచ్చేటిలే బ్రాయము
తన తళుకులతో - నును బెళుకులతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....

తన వాల్జూపు లుయ్యాలలై
అనురాగాలు పూమాలలై
తన మురిపెముతో
తన సరసముతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....

నిను ఏనాడు దర్శింతునే
మన సేనాడు అర్పింతునో
అని దరియుటకై
కని మురియుటకై
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా




నీవుండేదా కొండపై నాస్వామి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

నీవుండేదా కొండపై నాస్వామి నేనుండే దీనేలపై
ఏలీల సేవింతునో ఏపూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్య మీవా
నా పైని దయజూపవా నాస్వామి

దూరాన నైనా కనే భాగ్యమీవా
నీరూపు నాలో సదానిల్పనీవా
ఏడుకొండలపైన వీడైనస్వామి
నా పైని దయజూపవా నాస్వామి




నీ సిగే సింగారమే ఓ చెలియ పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

నీ సిగే సింగారమే ఓ చెలియ నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చేనే ఓ వనలక్ష్మి మనసిచ్చి దిగివచ్చేనే
నీ నవ్వుపూలు అవేమాకు చాలు
నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాలా మరేపూజ లేలా
మా పై ని దయజూపవా ఓ నా చెలి

మా తోట పూచే వసంతమ్ము
మా బాట చూపే ప్రభాతమ్ము
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మాపై ని దయ చూపవా - ఒ నా చెలీ




ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు
కన్నీటి బ్రతుకుపై పన్నీటిజల్లు
ఎన్నాళ్ళ కెన్నాళ్లకు
ఇన్నాళ్లు నా కలల పన్నీరు జల్లినా
వెన్నెలల రాశితో విడని నెయ్యాలు




ఓ నా మొరవినరాదా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

ఓ నా మొరవినరాదా 
ఇక ఈ చెర విడిపోదా
అబలననీ అనాదననీ
జాలిలేని కూరుని
పాలబడిన దానిని
నీ చెంత జేర్పవా
వంతదీర్చవా - నే
నిక సై పను ఈ బాధ

ఏడ నున్నవాడవో
జాడ తెలియదాయె నే
కాపాడరా సఖా
జాగు సేయక నీవు
వినా గతి వేరెవరు




మనసూ గేసఖ తనువూగే పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

మనసూ గేసఖ తనువూగే ప్రియమదిలో సుఖాల
డోలలూగే ఏమధువా నేనోయి ప్రియ
వయసూగే చెలి సొగసూగే ప్రియ వగలూరు ఓర
చూపులూగే ఏకర మూపేనో సకియా
మలుపు మలుపు కడనించి చెవిలో మంతనాలు ఊదాలి.
కలసి మెలసి కలకాలమిలాగే మధురయా సాగాలి.
అలలూగే మది కలూగే ప్రియతెలివాక
తేలు నౌక ఊగే ఏవలపూ పేనోయి ప్రియా
రేవు రేవు కడ కనులు కనులతో మూగ బాసలాడాలి
పైరగాలి పన్నీటియేటిపై పడవ సాగిపోవాలి
ఇలాగే పడవ సాగిపోవాలి.
తరువూగే సఖి తెరువూగే పియ తలిరాకువోలె
డెందమూ ఏవలపూపే నో సకియా
తేనెలని ఎలతేటి పాట మనలోని మమత చాటాలి
కనుల కొనల కల కాలము వలపులు కాపురముండాలి
ఇలాగే కాపురముండాలి




కన్నీటి కడలిలోన పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ
దిక్కైన లేని నావ
ఏ తీరమైన చేరునో - ఏరాల పాలబడునో
ఏగాలి వాత బడునో

నాపాలి భాగ్యదీపము - నన్నేలు దివ్యతార
పోయేన జీవనతార
కన్నీటి కడలిలోన - కనరాక దాటిపోయె
నన వీడి మాయమాయె

నా ఆసలే అడియాసలై - మాసేన జీవనగాధ
ఈ నా విషాద గాధ
కన్నీటి కడలీలోన - నడిచారి రాత్రి మూసె
నవచంద్ర కాంతి మాసె

ఏనాటికీ వసంతము - ఈ తోట కింకరాదా
నా వీట వెలుగిక లేదా.
కన్నీటి కడలీలోన - కనరాక దాటిపోయె
ననువీడి మాయమాయె




లోకం గమ్మత్తురా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: ఎరమాకుల ఆదిశేషా రెడ్డి 
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

లోకం గమ్మత్తురా
ఈ లోకం గమ్మత్తుగా
చెయ్యాలి యేదో మరమ్మత్తురా
రేసుల కాసుల వేలుగబోసె
వస్తారిండ్లకు వట్టిచేతుల
కనికరించి ఈ బీదా బిక్కికి
కానీ యివ్వరు అదేమొగాని

వ్యాధుల మిషతో తాగుడుకోసం
బాధ లెన్ని యో పడుదురుగాని
వ్యాధికి మందే ఎరుగని పేదల
ఆదరించరు అవేమొగాని

వడ్డికి వడ్డి నెత్తిన రుద్ది
అసలుకు మోసం దెచ్చుకుందురు
కాలే కడుపుకు జాలే జూపరు
కలలో నైనను అదేమొగాని

నేడో రేపో పొలాలూడితే
నిలువు రెప్పల నింగిజూ తురు
ఇన్నో అన్నో నూకలువేసి
పున్నెం గట్టరు అదేమొగాని

వచ్చిన లాభం చచ్చిన జూపక
రచ్చకెక్కుదురు బోర్డులదిప్పి
మచ్చుకై నా బిచ్చం పెట్టరు
చచ్చే జీవుల కదేమొగాని



అన్ మేరే అన్ మేరే పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

అన్ మేరే అన్ మేరే
దేఖో మందు మజా
ఏక్ బుడ్డి ఆరణా దో బుడ్డి బారనా
పత్తెమేమి లేదండీ బాబా గురు వాజ్ఞండి
రొట్టె తినండి - ఉడుకునీళ్ళు తినండి
అరె పాలు తినండి - పంచదార తినండి

బట్టతలకు తగిలిస్తే జుట్టు పుట్టుకొస్తాది
కంటి జబ్బులకు రాస్తే నంటకి సుఖమిస్తాది
మంచిమాట చేస్తాము మనసులోది చెప్తాము
పాముకుట్టితే తేలు కొరికి తే
అరె ఎలుక కుమ్మితే ఎద్దు కర్చితే
ఒక్కసారి పట్టిస్తే ఉన్న జబ్బు ఒదుల్తుంది
అనుమానం లేవండి గుణమిచ్చే మందండి
ఏలూరులో దీన్ని వాడి ఇనుములాగ బలిశారు

సాలూర్లో డాక్టర్లే సర్టిఫికేట్లిచ్చారు
బారెడు గడ్డాల వాళ్ళు మూరెడు మీసాల వాళ్ళు
అనుపానం లేకుండా ఆవుపాల మర్దించిరి





కారు చీకటి దారిగనలేని నాకు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు

కారు చీకటి దారిగనలేని నాకు
వెలలేని బంగారు వెలుగు చూపించి 
అంతలో దయమాలి - అర్పి వేయుదువా
దీప మార్పివేయుదువా
తల్లిని తండ్రిని ఎరుగ గదా
నా తండ్రి) ఏ సుఖమెరుగ గదా
ఉన్నది ఈ నిధి ఒక టెగదా
కాపాడుము వరదా
ఓ దేవా - దేవా
దిగి రావ దయా జలధీ
దిగి రావయ ప్రేమనిధీ
ఓ తిరుమల వేంకటరమణా !
సరిహరి మురహరి మొరవిన రాదా
చరణ కమలముల నమ్మితిగా దా
జీవన జీవన జగధీశా !
దీనజనావన తిరుమల వాసా
ఆపద మొక్కుల దేవా రావా
నీ పదదాసిని బోవగ రావా
శరణు శరణు పరమేశా
శరణు శరణు జగదీశా
ఓ తిరుమల వేంకటరమణా !


Palli Balakrishna Saturday, November 25, 2023



చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి, ఘంటసాల, యస్.పి.బాలు, ఏ.పి.కోమలి, సరోజినీ, శూలమంగళం రజ్యలక్ష్మి, సుమిత్ర, వసంత, రమణ, బసవేస్వర్, స్వర్ణలత  
నటీనటులు: శోభన్ బాబు, శ్రీరంజని, వాణిశ్రీ 
దర్శకత్వం: బి.యన్ రెడ్డి 
నిర్మాత: బి. యన్ రెడ్డి 
విడుదల తేది: 19.03.1969



Songs List:



శ్రీ శైల భవనా ! పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, యస్.జానకి & బృందం

శ్రీ శైల భవనా ! భ్రమరాంబా రమణా! మల్లికార్జునా ! 
బాలేందు కోటీరా ! శ్రిత మందార! ఫణిహారా ! 
సురాసురార్చిత చరణా ! మల్లికార్జునా ! 
హరా! అఖిల భువనేశ్వరా ! అంధతిమిర భాస్కరా ! 
శంకర ! హరా ! అఖిల భువనేశ్వరా ! నటేశ్వరా ! 
జటలోని మినువాకతో, పయి నటియించు నెలరేకతో, 
తనకెన లేనిదీ – మన యెదలోనిదీ ఘనలావణ్య రూపమ్ముతో,
ఉమా హృదయ మందిరా ! సుందరా ! 
హరా! అఖిల భువనేశ్వరా ! 
అంధ తిమిర భాస్కరా శంకరా! హరా !      ॥  శ్రీశైలం ॥ 



కొండల కోనల సూరీడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి & బృందం

కోరస్: 
కొండల కోనల సూరీడు కురిసె బంగారు నీరు! 
పిలిసె వురకేసే యేరు! 
ఆ మావి గుబురు, హెయ్ హెయ్ 
ఆ సింత సిగురు, హెయ్ హెయ్ 
ఆ యెనక పిలిసేటి యేరూ - పదవే - పదవే 
పిలిసే పచ్చన్నీ బీడు, కదలే గొర్రెల బారు ॥ కొండల॥ 

హెయ్! జోడెడ్ల యీ బండీ-జోడు చెక్రాల బండీ 
గాజుల గలగల యింటే కదలనంటదీ బండి ! 
అందెల సందడి వుంటే ఆగి వింటది! 

కోరస్: 
ఎండల్లొ వానల్లో చీకట్లొ యెన్నెల్లో, 
మా వెంట వుండి, - మాకు కాపుండి, 
కరుణించీ మమ్మేలగా, తల్లీ, గిరినుంచి దిగివస్తివా? 

కొమ్మల రెమ్మల కదిలేను 
నెమ్మదిగా పిల్లగాలీ, నల్ల మలల పిల్లగాలి! 

కోతకు సింతల సిగురుంది! 
పూతకు మామిడి పువ్వుంది ! 
లేత సింత సిగురల్లె కోత కొచ్చిన వయసు ! 
పూత మావి పూవల్లె పూత కొచ్చిన పడుసు! 
ఊగేది సెంగావి సెంగు! దాన్ని లాగేవు కొంటే కోణంగు ! 
మత్తెక్కి సూసేవు నువ్వు, నిన్ను మక్కలిరగ దన్నేరు సూడు 




గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి 

పల్లవి:
గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో
నల్లకనుల నాగసొరము వూదేరు ఎవరో

గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో

చరణం: 1
ఓ...ఓ...
పోటుపాటు సూసుకొని ఏరు దాటి రావాలా
ముళ్ళు రాళ్ళు ఏరుకోని మందతోవ నడవాలా
ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో సైగెందుకూ

ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో

చరణం: 2
ఓ...ఓ..
పైరుగాలి పడుచుపైటా పడగలేసి ఆడేను
గుండె పైనీ గుళ్ళ పేరు ఉండలేక ఊగేను

తోపు ఎనక రాచకొడక తొంగి చూసేవెందుకో
నీవెందుకూ సైగెందుకూ

ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో




పదములె చాలు-రామా ! పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఏ.పి.కోమలి

పదములె చాలు-రామా ! 
నీ పద ధూళులె పదివేలు! 
నీ పదములె చాలు, రామా! 
నీ పద మంటిన పాదుకలు 
ముమ్మాదుకొని ఈ జగమేలు! 
నీ పదములె చాలు రామా 
నీ దయ గౌతమి గంగ-రామయ ! 
నీ దాసులు మునుగంగా !.... రామా.... 
నా బ్రతుకొక నావ 
దానిని నడపే తండ్రివి నీవా ! 
నీ పదములె చాలు రామా.... .... 



చుక్క మెరిసెను - మొక్క పెరిగెను ు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: బసవేస్వర్, స్వర్ణలత 

చుక్క మెరిసెను - మొక్క పెరిగెను 
కుక్క మొరిగెను బౌబౌబౌ 
గౌన్సు విడువుము నౌ నౌ నౌ 
జీన్సు తొడుగుము నౌ నౌ నౌ 
గౌన్సు విడువుము 
జీన్సు తొడుగుము 
డాన్సు సలుపుము నౌ నౌ నౌ



పైరుగాలీ పడుసు పైట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు

పైరుగాలీ పడుసు పైట పడగలేసి ఆడేను! 
గుండెపైని గుళ్ల పేరు వుండలేక వూగేను- 
ఆగలేక, రాస కొడకా - సైగ చేసేవెందుకు ? 
సెగెందుకు ? 
గట్టుకాడ ఎవరో ! - సెట్టునీడ ఎవరో ! 
నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో.... 



శ్రీ గిరి శిఖర విమాన విహారీ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

శ్రీ గిరి శిఖర విమాన విహారీ 
శ్రీ శివ మూర్తి దేవేరీ 
ఔనని సెలవిమ్మా 
తల్లీ -అవునని సెలవిమ్మా




ఒక నాటిదా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: కోమలి & బృందం 

ఒక నాటిదా, 
ఒక చోటిదా, 
కడచిన ఎన్నో జన్మల దారుల నడచి వచ్చినది మీ జంట! 
రాగల ఎన్నో జన్మల దాకా సాగును పున్నెపు పంట! 
మీ అనురాగపు పంట! 



పగలైతే దొరవేరా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి 

పగలైతే దొరవేరా - రాతిరి నా రాజువురా! 
పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రీ పున్నమిరా! ॥ పగలై తే ॥ 

పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా ! 
రేయైతే వెన్నెలగ బయలంత నిండేరా ! 
రాతిరి నా రాజువురా ! 
నే కొలిచే దొరవై నా-నను వలచే నా రాజువే ! 
కలకాల మీలాగె నిలిచే నీ దాననే ! 
పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రి పున్నమిరా ॥ పగలైతే ॥ 




మనిషే మారేరా, రాజా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు

మనిషే మారేరా, రాజా, 
మనసే మారేరా ! 
మనసులో - నా మనసులో, 
సరి కొత మమత లూరేరా!  ॥ మనిషే || 

ఏచోట దాగేనో ఇన్నాళ్ళూ ఈ సొగసు 
ఆ తోట పువులేనా - అలనాటి లతలేనా ॥ మనిషే ॥

ప్రతి పొదలో ప్రతి లతలో 
పచ్చనాకులు గూడేరా ! 
గూట గూట దాగుండి కొత్త గువ్వపాడేరా ॥మనిషే ॥

అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు 
కులుకుతూ కొత్త పెళ్ళి కూతురిలా తోచెనే ! 
ఆనాటివె పువులై నా - అలనాటివె లతలైనా ! 
మనసే మారేనే - రాణీ - మనసే మారేనే 




చల్లరమ్మా, తల్లులూ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: శూలమంగళం రాజ్యలక్ష్మి   & బృందం 

చల్లరమ్మా, తల్లులూ, మీ చల్లనీ దీవనలవాన! 
చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన ! 
దేవదేవుడె వచ్చి పాపకు దీవనలు దయచేయును 
పూవులన్నా పాపలన్నా దేవదేవుని పిల్లలే ! 

కోరస్: 
చల్లరమ్మా తల్లులూ మీ చల్లని దీవనల వాన! 
చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన 




జో కొడుతూ కథ చెబితే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి 

జో కొడుతూ కథ చెబితే 
ఊ కొడుతూ వింటావా ! 
నా కన్న పాపా-నే కన్న పాపా .... జో .... జో .... 

ఒక కొండ - ఒక కనుమ - ఆ రెంటికి నడుమ - 
అనగనగా ఒక తోట, పచ్చన్నీ తోట! 
ఆకాశమంతేసి గూడుండే చోట, 
ఆ తోట ఒక చిలుక -ఆడేది పాడేది 
అది రామ చిలుక - జో-జో-జో 

ఒకనాడు వచ్చాడు ఒయ్యారి దొరకొడుకు 
ఆ తోట కడకు ! 
వలచింది రాచిలుక, ఆ రాజు కొడుకు! 
వాలింది వగకాని వలకేలి పైని ! 
బంగారు పంజరపు బ్రతుకై పోయింది ॥ జో-జో ॥ 

కోనైతే పిలిచేనూ - కొండా పిలిచేనూ 
ఆకాశమంతేసి ఆ గూడు పిలిచేనూ 
ఎగరని రెక్కలతో -పగిలిన గుండెలతో 
పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా ! 
బంగారు పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా! 




ఎల్లవేళ నిజం చెప్పరా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: బసవేస్వర్, స్వర్ణలత 

ముని : ఎల్లవేళ నిజం చెప్పరా 
పద్మ : దూ-దూ-దూ 
ముని : తల్లి తండ్రి మాట వినరా 
పద్మ : దూ-దూ-దూ - 
ముని : ఎదుటి వారి మేలు కోరరా 
పద్మ : దూ-దూ-దూ - 
ముని : అబ్బబ్బ 
పద్మ : నిజం చెప్పరా 
ముని: అన్నన్నా 
పద్మ : బలాదూరుగా 
ముని : అమ్మమ్మ 
పద్మ : మేలు కోరరా 
యిద్దరు : అయ్యయ్యొ-మరీ హోరుగా





తుమ్మెదా - తుమ్మెదా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: సరోజినీ 

బిచ్చక త్తె: 
తుమ్మెదా  - తుమ్మెదా 
పాలరాతి మేడ తుమ్మెదా! 
బందిఖానా అయింద తుమ్మెదా ! 
పూలరేకుల వీడు తుమ్మెదా.... నేల 
రాలిపోకుంటాద తుమ్మెదా, 
వన్నెలా బొమ్మను తుమ్మెదా 
నువ్ వదలేసి వెడతావ తుమ్మెదా ! 
వలచేటి రాజును తుమ్మెదా - నువ్వు 
వదిలేసి వెడతావ తుమ్మెదా !  || తుమ్మెదా ॥ 





శ్రీగిరి శిఖర విమాన విహారీ -II పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి

శ్రీగిరి శిఖర విమాన విహారీ 
శ్రీ శివ మూర్తి దేవేరీ 
నీ వరమిది కాదా - తల్లీ
నీ దయ యిక లేదా 
తల్లీ! శరణము మరిలేదా ! 




నీ వెరిగిన కథ చెబుతా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: జానకి 

నీ వెరిగిన కథ చెబుతా 
నిదరోతూ వినవా ? 
నా కంటి వెలుగా- నా గూటి పులుగా 
కథ వింటే కలలెన్నో కదలాడునేమో 
ఆ కథలో వ్యధలెన్నో మెదలాడునేమో ! జో-జో 
ఒక కొండ - ఒక కనుమ 
ఆ రెంటికి నడుమ ఉండే దొక తోట 
ఆ తోట ఆడేది పాడేదొక పిల - ఒక పేదపిల 
ఆ తోట అందాల దొరనే చూసింది 
చూసి చూసీ మనసిచ్చి వేసింది ఆ పేదపిల్ల ! 





గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో -II పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి 

గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో 
నల్ల కనుల నాగస్వరమూ వూదేరు ఎవరో ! 
అయ్యకు బువ్వ పెట్టాలా ! పెయ్యకు మువ్వ కట్టాలా 
ఒక్కటొక్కటే కొండ పైకి, సుక్కదీపం రాకమును పే 
రాక మును పే 
ఏటి గట్టుకాడ 
మావి సెట్టునీడ – ఎవరో 
కళ్ళనిండ నీళ్ళు నింపి 
సూసేరు ఎవరో ! 
కళ్ళు విప్పి రాచ కొడకా నా కోసం చూడవా 
మన పాప కోసం చూడవా!  || గట్టు కాడ || 


Palli Balakrishna Wednesday, October 18, 2023



చిత్రం: పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్ టి రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి 
దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్
నిర్మాతలు: నాగిరెడ్డి,  చక్రపాణి
విడుదల తేది: 29.02.1952



Songs List:

Palli Balakrishna Sunday, July 10, 2022



చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, షావుకారు జానకి
దర్శకత్వం: ఎల్. వి.ప్రసాద్
నిర్మాతలు: ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి
విడుదల తేది: 07.04.1950

(యన్.టి.రామారావు గారికి  హీరోగా తొలి సినిమా)




Songs List:



ఇంతేనా నిజమింతేనా పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: మాధవపెద్ది సత్యం 

ఇంతేనా నిజమింతేనా




ఏమనెనే చిన్నారి పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: ఘంటసాల 

ఏమనెనే...ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే..
వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి
ఏమనెనే... ఆమని కోయిల పాటల
గోములు చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే
  
వనరుగా చనువైన నెనరుగా
పలుకె బంగారమై
కులుకె సింగారమై
మా వాడ రాచిలుక మౌనమౌనముగా



తెలుపవలెనే చిలుకా పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: రావు బాలసరస్వతి దేవి, ఘంటసాల

తెలుపవలెనే చిలుకా




తెలుపవలెనే చిలుకా పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: రావు బాలసరస్వతి దేవి 

తెలుపవలెనే చిలుకా




దీపావళి దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: రావు బాలసరస్వతి దేవి 

దీపావళి  దీపావళి



దీపావళి దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: రావు బాలసరస్వతి దేవి , పి. శాంత కుమారి 

దీపావళి  దీపావళి





పలుకరాదటే చిలుక పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: ఘంటసాల

పలుకరాదటే చిలుక 




భాగవత పఠనం పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: ఎం. ఎస్. రామారావు 

భాగవత పఠనం 




భలే దొరలకు దొరకని సొగసు పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: టి. కనకం 

భలే దొరలకు దొరకని సొగసు 




మారిపోవురా కాలం పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: మాధవపెద్ది సత్యం 

మారిపోవురా కాలం మారుట దానికి సహజం




వలపుల వల రాజా పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ 

వలపుల వల రాజా 





విరహవ్యధ మరచు కథ పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ 

విరహవ్యధ మరచు కథ తెలుపవే ఓ జాబిలి





హరికథ పాట సాహిత్యం

 
చిత్రం: షావుకారు (1950)
సంగీతం: ఘంటసాల  
సాహిత్యం: సీనియర్ సముద్రాల 
గానం: ఘంటసాల

హరికథ 

Palli Balakrishna Monday, March 4, 2019


చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: గంటసాల, ఎస్.జానకి
నటీనటులు: చంద్రమోహన్, వారణాసి రామ్మోహనరావు, వాణిశ్రీ, అంజలీ దేవి, రేఖ (చైల్డ్ ఆర్టిస్ట్)
దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి
నిర్మాత: బి.ఎన్. రెడ్డి
విడుదల తేది: 1966

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా


ఏడేడు శిఖరాలు నే నడువలేను
ఏపాటి కానుక అందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా .. మముగన్న మాయమ్మ అలిమేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభునికి మా మనవి వినిపించవమ్మా


కలవారినేకాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనివాడు
స్వామి కరుణమయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగవల్లి
అడగవే మాయమ్మా అలిమేలుమంగా..



******   *******   *******


చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం:  బి.గోపాళం, ఎస్.జానకి

వెన్నెల రేయి చందమామ వెచ్చ గా ఉన్నది మామ
మనాసేదోలా గున్నది నాకేదోలాగా ఉన్నది
తీరికి వెన్నెల కాయు వేళ
దొర వయసులో పిల్ల
నీ కాలాగే ఉంటది మనసాఅలాగే ఉంటది

చల్లని గాలి తోడు గ రాగ సైగలథొ నువ్వు చూడగా
కను సైగలథొ వల ఏయైగా

గున్దెలదరగా నీతో పాటు గా
గుస గుస లాడగా సిగ్గౌతున్నది

చరణం: 1
అహా నడకల తోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగ
చిరు నవ్వులతో పక్క నిల్వగ
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు చిన్న బుచ్చుకొని చిత్తై పొవటె

చరణం: 2
తీయ తీయగా సరస మాడి చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువ్వు మత్తెక్కించాకే
మనసే నాతో రాలెదన్నదొఇ


******   *******   *******


చిత్రం:  రంగులరాట్నం (1966)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం:  పి. సుశీల

పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కనరాని దేవుడే కనిపించినాడే...కనిపించి అంతలో...
కన్ను మరుగాయే...కన్ను మరుగాయే..
కనరాని దేవుడే కనిపించినాడే...ఆ..ఆ..ఆ..ఆ


చరణం: 1
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ..
అల నీలీగగనాన వెలిగే నీ రూపూ
ఆనంద బాష్పాల మునిగే నా చూపూ...
మనసారా నిను చూడలేనైతి స్వామీ...
కరుణించి ఒకసారి కనిపించవేమీ...


చరణం: 2
అందాల కన్నయ్య కనిపించగానే...
బృందావనమెల్ల పులకించిపొయే...
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే...
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే...ఆ..ఆ..ఆ..ఆ

చరణం: 3
వలపుతో పెనవేయు పారిజాతమునై... ఎదమీద నిదురించు అడియాశ లేదూ
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై... నీ చరణకమలాల నలిగి పోనీయవా...
ఆ..ఆ..ఆ..ఆ..

కనరాని దేవుడే కనిపించినాడే...
కనిపించి అంతలో కన్ను మరుగాయే ... కన్ను మరుగాయే..



Palli Balakrishna Friday, February 8, 2019



చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మి
కథ : జలిమ్-జెవేద్
మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజు
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
బ్యానర్: విజయా ప్రొడక్షన్స్
విడుదల తేది: 30.11.1973



Songs List:



గాలిలో పైరగాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా...
పొదామా...  సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో నీలి నింగిలో

ఎగిరిపోదామా అందాల హంసలై రాజ హంసలై
పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా 

చరణం: 1 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 
అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం

అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా




తొలి వలపులలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను ..
అది కవుల పైత్యమనుకున్నాను ..
నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను ..
నీ చెలిమి కోరుతూ ఉన్నాను..

మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..
ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు..
ఆ అలకే వలపనుకుంటారు ..

చరణం: 1
కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు..
మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు..
మొగము తిప్పుకుంటారు..

సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు..
నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు..
సాకులు చెబుతూ ఉంటారు

తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను
మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..

చరణం: 2
ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు
కుత కుత లాడుతూ ఉంటారు

తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి...

చరణం: 3
కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు...
ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ
ల.ల.లా..ఉ..ఊ..ఉ..



హుషారు కావాలంటే పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా 

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే... మందురా  

చరణం: 1
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ... ఏది?....  మందొక్కటే మందురా       

చరణం: 2
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా 

నిన్నా రేపని తన్నుకోకురా...  ఉన్నది నేడే మరువబోకురా
అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే....  మందురా 

చరణం: 3
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..తోకాడించే నీవే తోడురా  

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా...





గడసాని దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల

పల్లవి:
గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ బాబు...  ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ..దాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని..

చరణం: 1 
అరెరెరె నడకంటె నడక కాదు
చలాకి నడక.. బల్ కిలాడి నడక
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ...   అది వడిసెల రువ్వ 

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

వగలంటే వగలు కాదు వలపుల సెగలు
చూపంటే చూపు కాదు మదనుడి తూపు
ఆ నడక...  ఆ నవ్వు...  ఆ వగలు...  ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ... దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..

చరణం: 2
మాటలతోటే నన్ను మురిపించకురా
ఏమేమో పొగిడేసి బులిపించకురా
మాటలతోటే నన్ను... మురిపించకురా
ఏమేమో పొగిడేసి... బులిపించకురా

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

కవ్వించాలని నువ్వు కలలు కనకురా
కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా
గడ ఎక్కి...  తాడెక్కి...  గంతేసి...  చిందేసి
అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా 

గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని...    

చరణం: 3
తళుకు బెళుకు చూపిస్తా..
గజ్జె ఘల్లుమనిపిస్తా..

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ తళుకు...  ఆ బెళుకు... ఆ బిగువు...  ఆ బింకం
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ

గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..




అలా అలా అలా పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల 

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా... 
పొదామా...  సాగి పోదామా 

అలా అలా అలా అలా నింగిలో....  నీలి నింగిలో
ఎగిరిపోదామా....  అందాల హంసలై ...  రాజ హంసలై.... 
పోదామా ... ఎగిరి పోదామా
పోదామా ... ఎగిరి పోదామా 

చరణం: 1
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 

అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా     




తాగాను నేను తాగాను పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

పల్లవి:
తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను 
భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను   
చరణం: 1
కైపులో ఉన్నాను కలలుకంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను
వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను
నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  బాగా నేను తాగాను....  తాగాను    

చరణం: 2
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను....  మరచిపొమ్మంటాను


Palli Balakrishna Sunday, February 25, 2018


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, పండరీ భాయి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి. నాగిరెడ్డి, చక్రపాణి
విడుదల తేది: 23.09.1965

పల్లవి:
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి

విరహమె నీకు శీతలమైతే .. ఆ ..
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 1
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా ..
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. తమలపాకుతో విసిరెదనోయి..

యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి

చరణం: 2
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ ..
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి
మూగమనసె నీ మోజైతే ...
మూగమనసె నీ మోజైతే మాటాడక జరిగేరెదనోయి..
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..

విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే

ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  పి.సుశీల

పల్లవి:
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే 

చరణం: 1
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

చరణం: 2
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ... ఊ ఊ ఊ ఊ ...


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా సరినీవని నీ గురినేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది... కలవరమాయెనులే

నా సరి నీవని... నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే

చరణం: 1
నా హృదయమునే వీణ చేసుకొని.. ప్రేమను గానం చేతువని..
ఆ...ఆ...ఆ...
నా హృదయమునే వీణ చేసుకొని... ప్రేమను గానం చేతువని
నీ గానము నా చెవి సోకగనే.. నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే .. నా మది నీదై పోవునని...

నీకు నాకు వ్రాసి ఉన్నదని... ఎపుడో తెలిసెనులే

చరణం: 2
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే... గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా... నా ఎద దడ దడలాడునని

నా సరినీవని.. నీ గురి నేనని... ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది... కలవారమాయెనులే
నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము

చరణం: 1
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా

నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..

చరణం: 2
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..
నీవంటే.. నీవనచు.. ఊఁ..ఆపావే?
నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..

నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ...ఆ..
ఊ..ఊ..ఊ..ఊ..


******  ******  *******


చిత్రం:  సి.ఐ.డి (1965)
సంగీతం:  ఘంటసాల
సాహిత్యం:  పింగళి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
నీ పెదవులపై నవ్వు చిందితే.. మనసు చల్లగా ఉంటుందీ..
ఎందుకనో..ఓ...ఓ..ఎందుకనో

చరణం: 1
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..

కొంగున కట్టుకు నిను తిప్పాలని..
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని..
ఏదో వేడుక పుడుతుంది.... ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
కవ్వించి నీవు కలహమాడితే..  నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ..

చరణం: 2
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..

నీలో ఐక్యం చెందాలంటూ...నీలో ఐక్యం చెందాలంటూ... ఏదో తహతహ పుడుతుందీ.. ఎందుకనో..

ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో...ఓ..ఓ.. ఎందుకనో...
ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..
అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..ఓహో..ఓ...

Palli Balakrishna Saturday, December 9, 2017



చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, యస్.వి.రంగారావు, కె.మాలతి
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 15.03.1951



Songs List:



తీయని ఊహలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

ఓ ఓ ఓ ఓ 
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్





ఇతిహాసం విన్నారా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: టి.జి.కమలాదేవి 

ఇతిహాసం విన్నారా 



కలవరమాయే మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో





ఎంత ఘాటు ప్రేమయో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే 
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే 
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో




వినవే బాల నా ప్రేమగోల పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: రేలంగి

వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకే నువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల

గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల

చిరునవ్వుచాలే చిత్తైపోతానే
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
మురిపించేస్తాలే మూర్చైపోతానే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల

జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా 

చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో 
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో




వగలోయి వగలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: జిక్కీ & కోరస్ 

పల్లవి:
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలో

చరణం: 1
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
కొంగు తాకిందంటె హేయ్ హేయ్
కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు

చరణం: 2
నీ వెంట వస్తాను, ఆఁ... 
నీ జంట ఉంటాను... నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను... యేఁ?
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
చెలీయనీ భలేయని సరే యనీ చలామణి
నా వెంట మీరంతా గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు

ధీం తత తత ధీం తత తత ధీం తత తత
వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ

చరణం: 3
తరిగినతక నకతక జం
ఝనంతరి తకిట ఝంతకతోం
తకిటతై తకిటతై తకిటతై తకిటతై
తలాంగుతోం తలాంగుతోం తలాంగు...

తాళలేనే నే తాళలేనే
భామలారా ఓయమ్మలారా
ఇందరిలోనూ నీ సొమ్ములేవే
నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే ఓ యమ్మా
అవునే భామామణీ...
తధిగినతోం తధిగినతోం తధిగిన
తాళలేనే నే తాళలేనే 
తాళలేనే నే తాళలేనే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే తాళలేనే తాళలేనే... 






ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: వి.జె.వర్మ 

పల్లవి:
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు.
అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 1 
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 2 
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 






హాయిగా మనకింక స్వేచ్చగా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాల
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

కలలు నిజముకాగా కలకాలమొకటిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా - స్వేచ్చగా - హాయిగా





కనుగొన గలనో లేనో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల

కనుగొన గలనో లేనో 
కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో

పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు 
కలగ బ్రతకడ మేనో

కనుగొన గలనో లేనో 

వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక
చింతిని తిరగడమేనోయ్

కనుగొన గలనో లేనో 

పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే
బలిగా చేయడమేనో...

కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో
కనుగొన గలనో లేనో




రానంటే రానోయి పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పిఠాపురం, టి.జి. సరస్వతి 

రానంటే రానోయి 


Palli Balakrishna Wednesday, November 1, 2017



చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు (All)
నటీనటులు: ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి, జగ్గయ్య, గిరిజ
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాతలు: బి.యన్. రెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 14.01.1959



Songs List:



ఆనందం పరమానందం పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా
 
పల్లవి:
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

చరణం: 1
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

చరణం: 2
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం

ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం




అప్పుచేసి పప్పుకూడు పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, స్వర్ణలత

అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా




చేయి చేయి కలుపరావె పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఎ. యమ్.రాజా, పి.లీలా
 
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా ఉం ఉం ఉం ఉం
చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉం ఉహు ఉహు
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా
ఉహు చేయి చేయి

చరణం: 1
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా ఉం ఉం ఉం ఉం
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా
అహ చేయి చేయి

చరణం: 2
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా ఉం ఉం ఉహు ఉహు
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా

చేయి చేయి కలుపరావె హాయిహాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా
అహ చేయి చేయి





ఎచటి నుండి వీచెనో పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ....
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ ....
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ ....
మనసు మీద హాయిగా
తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . ..
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా, మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి.




జోహారు గైకొనరా పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం:  పి.లీలా

జోహారు గైకొనరా



కాలం కాని కాలంలో పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం:  పి.లీలా, పి. సుశీల 

కాలం కాని కాలంలో 




కాశీకి పోయాను రామా హరీ! పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, స్వర్ణలత 

కాశీకి పోయాను రామా హరీ!
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2)
కాశీకి పోలేదు రామా హరీ,
ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ!
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ!

శ్రీశైలమెళ్ళాను రామా హరీ,
శివుని విభూది తెచ్చాను రామా హరీ! (2)
శ్రీశైలం పోలేదు రామా హరీ,
శివుని విభూది తేలేదు రామా హరీ!
ఇది కాష్టంలో బూడిద రామ హరీ!

అన్నమక్కరలేదు రామా హరీ,
నేను గాలి భోంచేస్తాను రామా హరీ! (2)
గాలితో పాటుగా రామ హరీ,
వీరు గారెలే తింటారు రామా హరీ!
నేతి గారెలే తింటారు రామా హరీ!

కైలాసమెళ్ళాను రామా హరీ,
శివుని కళ్ళార చూసాను రామా హరీ!
రెండు కళ్ళార చూసాను రామా హరీ!
కైలాసమెళితేను రామా హరీ,
నంది తన్ని పంపించాడు రామా హరీ,
బాగ తన్ని పంపించాదు రామా హరీ!

ఆలుబిడ్డలు లేరు రామా హరీ,
నేను ఆత్మయోగినండి రామా హరీ!
గొప్ప ఆత్మయోగినండి రామా హరీ!
ఆ మాట నిజమండి రామా హరీ,
నేనందుకే వచ్చాను రామా హరీ!
నేను అందుకే వచ్చాను రామా హరీ!





మూగవైన యేమిలే పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం:  ఎ. యమ్.రాజా 

మూగవైన యేమిలే, నగుమోమే చాలులే!
సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే!
మూగవైన యేమిలే!

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే
దొంగ మనసు దాగదులే..
దొంగ మనసు దాగదులే..సంగతెల్ల తెలిపెనులే!
మూగవైన యేమిలే!

పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే..
పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే..
నను దయతో యేలుకొనుము...
నను దయతో యేలుకొనుము...కనుసన్నల మెలిగెదలే!
మూగవైన యేమిలే!

అందాలే బంధాలై నను బందీ చేసెనులే..
అందాలే బంధాలై నను బందీ చేసెనులే..
కలవరమిక యెందుకులే..
కలవరమిక యెందుకులే..వలదన్నా వదలనులే!

మూగవైన యేమిలే, నగుమోమే చాలులే!
సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే!
మూగవైన యేమిలే! 





ఓ పంచవన్నెల చిలకా! పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, స్వర్ణలత

ఓ మరదలా, నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా!
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే నీవూ నేనూ ఒకటే గదా!

ఓ పంచవన్నెల చిలకా! ...ఆ!?
ఆ!
ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)
మాటాడవేమే? మాటాడవేమే, నీ నోటి ముత్యాలొలక!
ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)

ఓహో బావా, మార్చుకో నీ వంకరటింకర దోవ!
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే ఒప్పుతుందా యీ లోకం?
ఓ కొంటె బావగారూ!
హాయ్!
ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2)
మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు!
ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2)

సీమటపాకాయ లాగ చిటాపటాలాడేవు (2)
ప్రేముందా లేదా, ఓ మరదలా, నా మీద?
ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2)

మరదలినైతే మాత్రం మరీ అంత చనువా? (2)
మరియాద కాదు మీ బావ మరిది చొరవ!
ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు?
మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు!

ఓ కొంటె బావగారూ! ఓ పంచవన్నెల చిలకా! (2)





రామ రామ శరణం పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: పి.లీలా

రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం!
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2)
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి

శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2)
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి

రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి మునులెల్ల గాచినట్టి





సుందరాంగులను చూసిన పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా
సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా

చరణం: 1
అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద

సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా
కొందరు ముచ్చటపడనేలా

చరణం: 2
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద
మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల
కొందరు కలవరపడనేల

చరణం: 3
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా

ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల
కొందరు పరవశ పడనేల

చరణం: 4
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా

సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా
కొందరు పిచ్చనుపడనేలా




ఆనందం పరమానందం (Version - 2) పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఎ. యమ్.రాజా, పి.లీలా
 
పల్లవి:
ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

చరణం: 1
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం

చరణం: 2
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం

ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం
ఆనందం పరమానందం ఆనందం పరమానందం





బలిదానం పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.సుశీల 

బలిదానం 



చిత్ర నలీయం పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల, పి.లీలా

చిత్ర నలీయం




నవ కళా సమితి పాట సాహిత్యం

 
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు
గానం: ఘంటసాల

నవ కళా సమితి 

Palli Balakrishna Thursday, October 5, 2017
Mayabazar (1957) Telugu Songs Lyrics Album Cover

Mayabazar (1957) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Mayabazar (1957)
Banner : Vijaya Productions
Music : Ghantasala
Director : K. V. Reddy
Actresses : Savitri
Supporting Cast : S. V. Ranga Rao
Release Date : 27 March 1957

Neekosame Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Neekosame' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, పి.లీల నీకోసమే నే జీవించునది  ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే నే జీవించునది  ఈ విరహములో ఈ నిరాశలో వెన్నెల కూడా చీకటిఐనా  మనసున వెలుగే లేకపోయినా నీకోసమే నే జీవించునది  చరణం: 1  విరహము కూడా సుఖమే కాదా  నిరతము చింతన మధురము కాదా విరహము కూడా సుఖమే కాదా  నిరతము చింతన మధురము కాదా  వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా  నీ రూపమునే ధ్యానించునది  నా హృదయములో నా మనస్సులో నీ రూపమునే ధ్యానించునది  చరణం: 2  హృదయము నీతో వెడలి పోయినా మదిలో ఆశలు మాసిపోయిన మన ప్రేమలనే మరి మరి తలచి  ప్రాణము నిలుపుకొనీ  నీకోసమే నే జీవించునది  చరణం: 3  మెలుకువనైనా కలలోనైనా  కొలుతును నిన్నే ప్రణయ దేవిగా  లోకములన్నీ ఏకమె అయినా ఇది నాదానవేగా నీ రూపమునే ధ్యానించునది  ఈ విరహములో ఈ నిరాశలో నీకోసమే నే జీవించునది 

Choopulu Kalisina Subhavela Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Choopulu Kalisina Subhavela' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, పి. లీల పల్లవి: చూపులు కలిసిన శుభవేళా  ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము  ఉల్లాసముగా నేనూహించిన అందమె నీలో చిందెనునులే చూపులు కలిసిన శుభవేళా  ఎందుకు నీకీ కలవరము చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము  ఎందుకు నీకీ పరవశము  ఏకాంతంలో ఆనందించిన నా కలలే నిజమాయెనులే చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ పరవశము  చరణం: 1 ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే... చెలువములన్నీ చిత్రరచనలే... చెలువములన్నీ చిత్రరచనలే... చలనములోహో నాట్యములే చూపులు కలిసిన శుభవేళా  ఎందుకు నీకీ కలవరము చరణం: 2 శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే... శరముల వలెనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే... శరము ఉద్యానమున వీర విహారమే... శరము ఉద్యానమున వీర విహారమే... చెలి కడనోహో శౌర్యములే... చూపులు కలిసిన శుభవేళా  ఎందుకు నీకీ కలవరము ఎందుకు నీకీ కలవరము

Lahiri Lahiri Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Lahiri Lahiri' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, పి.లీల లాహిరి లాహిరి లాహిరిలో  ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా  లాహిరి లాహిరి లాహిరిలో  ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా  ఆ..ఆ..ఆ..ఆ  చరణం: 1  తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో - ఉరవడిలో  తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో  పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో  ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా  ఆ..ఆ..ఆ..ఆ  చరణం: 2  అలల ఊపులో తియ్యని తలపులూ...  చెలరేగే ఈ కలయికలో - మిలమిలలో  అలల ఊపులో తియ్యని తలపులూ...  చెలరేగే ఈ కలయికలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో  లాహిరి లాహిరి లాహిరిలో  ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా  ఆ..ఆ..ఆ..ఆ 

Srikarulu Devathalu Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Srikarulu Devathalu' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by M. L. Vasanthakumari.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: యమ్.ఎల్.వసంత కుమారి & కోరస్ శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్దిల్లవమ్మా వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా  సకల సౌభాగ్యవతి రేవతీదేవి  తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను సకల సౌభాగ్యవతి రేవతీదేవి  తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను అడుగకే వరములిడు బలరామదేవులే  జనకులై కోరిన వరము లీయగను వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నరి శశిరేఖ వర్ధిల్లవమ్మా  చరణం: 1  శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి  పినతల్లియై నిన్ను గారాము శాయ శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి  పినతల్లియై నిన్ను గారాము శాయ అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే  పినతండ్రియై సకల రక్షణలు శాయ వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా  చరణం: 2  ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి  మేనత్తయై నిన్ను ముద్దు శాయగను ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి  మేనత్తయై నిన్ను ముద్దు శాయగను పాండవ యువరాజు బాలుడభిమన్యుడే  బావయై నీ రతన లోకమై మురియా వర్ధిల్లుమా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా  చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా 

Neeve Naa Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Neeve Naa' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, పి.లీల నీవేనా...  నీవేనా నను తలిచినది  నీవేనా నను పిలిచినది  నీవేనా నా మదిలో నిలచి  హృదయం కలవరపరిచినది నీవేనా...  నీవేలే నను తలచినది  నీవేలే నను పిలిచినది  నీవేలే నా మదిలో నిలచి  హృదయము కలవరపరిచినది....నీవేలే కలలోనే ఒక మెలకువగా  ఆ మెలుకువలోనే ఒక కలగా కలలోనే ఒక మెలకువగా  ఆ మెలుకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయయో  తెలిసి తెలియని అయోమయంలో నీవేనా నను తలిచినది  నీవేనా నను పిలిచినది  నీవేనా నా మదిలో నిలచి  హృదయం కలవరపరిచినది నీవేనా...  కన్నుల వెన్నెల కాయించి  నా మనసున మల్లెలు పూయించి కన్నుల వెన్నెల కాయించి  నా మనసున మల్లెలు పూయించి కనులను మనసును కరగించి  మైమరపించి నన్నలరించి నీవేలే నను తలచినది  నీవేలే నను పిలిచినది  నీవేలే నా మదిలో నిలచి  హృదయము కలవరపరిచినది....నీవేలే నీవేలే

Aha Naa Pellanta Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Aha Naa Pellanta' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి. సుశీల అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట  అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట  నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం  అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట  అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట  నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం  చరణం: 1  వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట  బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట  వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట  బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట  హబ్బి బ్బొ బ్బొ బ్బొ బ్బొ బ్బొ హ హహహహ  అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట  అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట  నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం  చరణం: 2  బాలా కుమారినంట చాలా సుకుమారినంట  బాలా కుమారినంట చాలా సుకుమారినంట  పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్చపోవునంట  అయ్యయ్యయ్యయ్యయ్యొ హ హహహ  అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట  అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట  నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం  చరణం: 3  తాళి కట్టవచ్చునంట ఛీ  తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట  తాళి కట్టవచ్చునంట  పాద నిగ మమ మాప గప మగ  తాళి కట్టవచ్చునంట  పప పద మమ మప గగ గమ రిగ మప  తాళి కట్టవచ్చునంట ఛీ  తధోం తోతో త తధీం ధీం ధీం త  తధోం త తధీం త తత్తత్తాం తిత్తత్తాం  తతాం తతాం తాం సరిగమ పదనిస  తాళి కట్టవచ్చునంట ఆ తాళి కట్టవచ్చునంట  తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట  మేలిముసుగు చాటు తీసి దాగుడుమూతలాడునంట  హహహహ హహహహ హాహహహ హహహ

Sundari Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Sundari' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and Savitri.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, Savitri
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, సావిత్రి (ఈ పాట లక్ష్మణ కుమారుడు మాయాశశి మీద చిత్రీకరణ జరిగింది) సుందరి నీవంటి దివ్య స్వరూపంబు  ఎందెందు వెదకిన లేదుకదా  ఎందెందు వెదకిన లేదుకదా  నీ అందచందాలింక నావే కదా  సుందరి ఓహో సుందరి అహ సుందరి  నీవంటి దివ్య స్వరూపంబు  ఎందెందు వెదకిన లేదుకదా  దూరం దూరం - ఆఁ దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన  ఆర్యపుత్రుడనింక నేనెకదా దూరమెందుకే చెలియా వరియించి వచ్చిన  ఆర్యపుత్రుడనింక నేనెకదా మన పెళ్ళివేడుకలింక రేపేగదా - అయ్యో అహ సుందరి నీవంటి దివ్య స్వరూపంబు  ఎందెందు వెదకిన లేదుకదా  మన పెళ్ళివేడుకలింక రేపేగదా  సుందరి ఓహో సుందరి రేపటిదాకా ఆగాలి - ఆఁ ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా ఆగుమంచు సఖియ అరమరలెందుకే సొగుసులన్నీ నాకు నచ్చేగదా నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి  నీవంటి దివ్య స్వరూపంబు  ఎందెందు వెదకిన లేదుకదా  నీ వగల నా విరహము హెచ్చేగదా సుందరి ఓహో సుందరి అహ సుందరి హెచ్చితే ఎలా? పెద్దలున్నారు  పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి ఊఁ.... - ఆఁ పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా పెద్దలున్నారంటు హద్దులెందుకే రమణి వద్దకు చేరిన పతినే కదా నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి నీవంటి దివ్య స్వరూపంబు  ఎందెందు వెదకిన లేదుకదా  నీ ముద్దు ముచ్చటలింక నావేకదా సుందరి అహ సుందరి ఓహో సుందరి అహ సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి...

Vivaha Bhojanambu Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Vivaha Bhojanambu' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: మాధవ పెద్ది సత్యం ఘటోత్కచుడు: వివాహ భోజనంబు వింతైన వంటకంబు  వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు  వివాహ భోజనంబు వింతైన వంటకంబు  వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు  అహహ్హ హహ్హ హహ్హ (3) ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల  ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల  ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు  వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు  అహహ్హ హహ్హ హహ్హ (3) భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు  వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు  అహహ్హ హహ్హ హహ్హ (3) మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు  వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు  అహహ్హ హహ్హ హహ్హ (3)

Vinnava Yesodhamma Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Vinnava Yesodhamma' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Susheela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : P. Susheela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి.సుశీల, పి.లీల, స్వర్ణలత (గోపికలు యశోధమ్మ కృష్ణుడు మరియు ద్రౌపది మధ్య జరిగే పాట) విన్నావ యశోదమ్మా! విన్నావ యశోదమ్మా! మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లరి పనులు విన్నావ యశోదమ్మా అన్నెం పున్నెం ఎరుగని పాపడు  మన్నుతినే నా చిన్నితనయుడు  ఏమి చేసెనమ్మా ఎందుకు రవ్వ చేతురమ్మా ఆ... మన్ను తినేవాడా? వెన్న తినేవాడా?  కాలిగజ్జెల సందడి చేయక  పిల్లివలె మా ఇంట్లో దూరి కాలిగజ్జెల సందడి చేయక  పిల్లివలె మా ఇంట్లో దూరి ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని  దుత్తలన్నీ క్రింద దించుకుని ఎత్తుగ కట్టిన ఉట్టందుకుని  దుత్తలన్నీ క్రింద దించుకుని పాలన్నీ తాగేశనమ్మా పెరుగంతా జారేశనమ్మా,  వెన్నంతా మొక్కేశనమ్మా  ఒక్కడే ఎట్లా తినేశనమ్మా?  ఇది ఎక్కడనైనా కలదమ్మా ఇది ఎక్కడనైనా కలదమ్మా?  విన్నావటమ్మా.... విన్నావటమ్మ  ఓ యశోదా! గోపిక రమణుల కల్లలూ  ఈ గోపిక రమణుల కల్లలూ...  ఆ... ఎలా బూకరిస్తున్నాడో!  పోనీ పట్టిద్దామంటే చిక్కుతాడా!  భామలందరొక యుక్తిని పన్ని  గమ్మము నొకరుగ కాచియుండగా  భామలందరొక యుక్తిని పన్ని  గమ్మము నొకరుగ కాచియుండగా  ఒకరింట్లో విని గజ్జెల గలగల  ఒకరింట్లో విని వేణుగానమూ ఒకరింట్లో విని గజ్జెల గలగల  ఒకరింట్లో విని వేణుగానమూ ఆహా ఇంకేం  దొంగ దొరికెనని పోయిచూడగా  ఛంగున నెటకో దాటిపోయే  ఎలా వచ్చెనో ఎలా పోయెనో  చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా... ఎలా వచ్చెనో ఎలా పోయెనో  చిలిపి కృష్ణుడనే అడుగవమ్మా... నాకేం తెలుసు నేనిక్కడ లేందే!  మరి ఎక్కడున్నావు?  కాళింది మడుగున విషమును కలిపె  కాళియ తలపై తాండవమాడి కాళింది మడుగున విషమును కలిపె  కాళియ తలపై తాండవమాడి ఆ విషసర్పము నంతము జేసి  గోవుల చల్లగ కాచానే... గోవుల చల్లగ కాచానే... గోవుల చల్లగ కాచానే... హే కృష్ణా... హే కృష్ణా....  ముకుందా మొరవినవా నీవు వినా దిక్కెవరు దీనురాలి గనవా కృష్ణా  నా హీన గతిని గనవా....కృష్ణా కృష్ణా కృష్ణా.... 

Dayacheyandi Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Dayacheyandi' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల, కె.రాణి, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల దయచేయండీ దయచేయండీ  తమంత వారికలేరండీ! తమంత వారిక లేరండీ!  అతి ధర్మాత్ములు అతి పుణ్యాత్ములు అతి ధీమంతులు మీరండీ  తగు కైవారం తగు సత్కారం  తగు మాత్రంగా గైకొండి  తమంత వారిక తమరండీ తతంగమంతా తమకండి  హై హై వైవై కైకై గైగై జియ్యా...  చరణం: 1  పెండ్లి కుమారా, రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా  పెండ్లి కుమారా, రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా  ముల్లోకాలను వెతికి తెచ్చిన అల్లుడవంటే నీవయ్యా  ముల్లోకాలను గాలించి తెచ్చిన ల్లుడవంటే నీవయ్యా  పల్లకి దిగి రావయ్యా తతంగమంతా నీదయ్య తతంగమంతా నీదయ్య కిరీటాలు! కిరీటాలు! వజ్రాలు కిరీటాలు! ధగ ధగ కిరీటాలు!  ధరించినంతనె తలలో మెరయును  బలె యోచనలు బ్రహ్మాండముగా  బలె యోచనలు బ్రహ్మాండముగా  శిరస్త్రాణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివె  అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా  అందుకోండయ్యా దొరలు ముందుకు రండయ్యా  చరణం: 2  హారాలు మణిహారాలు హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు హారాలు మణిహారాలు పతకాలు నవపతకాలు మణిబంధాలు బుజబంధాలు అందాలకు అనుబంధాలు అందాలకు అనుబంధాలు వింత చీరలు వింత ముసుగులు వింత చీరలు వింత ముసుగులు బ్రహ్మాండాలకు సంబంధాలు అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా అందుకొండమ్మా తల్లులు ముందుకు రండమ్మా చరణం: 3 రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు  రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు  తొడిగన తోడనె తోధిమి తోధిమి  అడుగు వేయగనే తైతక్కతైతక్క  తొడిగన తోడనె తోధమి తోధమి  అడుగువేయగనే తైతక్క తైతక్క  నేలమీదనిక నిలువనీయక కులాసగ మిము నటింపజేసే రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు  రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షణలో బాలశిక్షలు  చరణం: 4 ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ  ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ  నయగారము నా కళరా వయ్యారము నా వలరా  నయగారము నా కళరా వయ్యారము నా వలరా హోయ్  నేనే నీ జోడురా నేనే నీ ఈడురా వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ చరణం: 5 సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా సరసతలో ఇది జాణరా రసికతలో ఇది రాణిరా హోయ్  నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా  వన్నె చిన్నెలెన్నరా ఓ రాజా ఒకటే మా వయసూ ఓ రాజా ఒకటే మా సొగసూ

Bhali Bhali Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Bhali Bhali' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: మాధవపెద్ది సత్యం భలి భలి

Lalli Lalla Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Lalli Lalla' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Leela.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : P. Leela
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: జిక్కి, పి.సుశీల లల్లిలలా లల్లిలలా  లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే అల్లీబిల్లీ ఆటలే లల్లిలలా పాటలే ఎవరెవరో కోయిలలూ  కుహూ కుహూ కుహూ కుహూ  ఎవరెవరే నెమిళలూ  కెకే కెకే కెకే కెకే  ఎవరెవరే ఎవరెవరే  వన్నెలేడి పిల్లలూ ఎవరెవరే ఎవరెవరే  వన్నెలేడి పిల్లలూ లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా లల్లిలలా లల్లిలలా లల్లి లల్లి లల్లిలలా అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ  చక్క చక్కని జోస్యం చెపుతామూ అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ  చక్క చక్కని జోస్యం చెపుతామూ యవ్వన శోబుల పరామే ఇది బావను తలచుట గర్వమే యవ్వన శోబుల పరవమే ఇది బావను తలచుట గర్వమే ఆ బావే తనకిక సర్వమే అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ  చక్క చక్కని జోస్యం చెపుతామూ ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము ఉన్న మాటకు ఉలుకెందుకు మరి ఉన్నదె చెబుతాము వలదన్నా చెబుతాము నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె నీ బావా నూతన విద్యల ప్రవీణుడే బల్ ప్రతిభావంతుడె నీ బావా అతి చతుర వీరుడె నీ బావా అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ  చక్క చక్కని జోస్యం చెపుతామూ మల్లీ జాజీ మాలతి సంపెంగ  పూలబాణములు వేసేనూ మల్లీ జాజీ మాలతి సంపెంగ  పూలబాణములు వేసేనూ బాలామణితో మురిసేను  మన బాలామణితో మురిసేను  తన పెళ్ళికి బావను పిలిచేను అల్లీబిల్లీ అమ్మాయికి చల చల చల్లని జోస్యం చెపుతామూ  చక్క చక్కని జోస్యం చెపుతామూ

Ashtadhikkum Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Ashtadhikkum' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: మాధవపెద్ది సత్యం అష్టదిక్కు్మ్

Jai Sathya Sangalpa Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Jai Sathya Sangalpa' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and Chorus.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, Chorus
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఘంటసాల జై సత్య సంగల్ప

Aanandham Aanandham Aanandhame Song Lyrics in Telugu – Mayabazar (1957)

'Aanandham Aanandham Aanandhame' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala, P. Leela and Chorus.

SONG INFORMATION
Movie : Mayabazar (1957)
Music : Ghantasala
Lyricist : Pingali
Singers : Ghantasala, P. Leela, Chorus
చిత్రం: మాయాబజార్ (1957) సంగీతం: ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: కోరస్ ఆనందం ఆనందం ఆనందమే

Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default