Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mayadari Krishnudu (1980)




చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: రజనీకాంత్, శ్రీధర్, మోహన్ బాబు, సుజాత, రతి అగ్నిహోత్రి 
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్ 
నిర్మాత: సి. దండాయుధపాణి 
విడుదల తేది: 19.07.1980



Songs List:



గుడివాడ గుమ్మటం పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

గుడివాడ గుమ్మటం - డెజవాడ బొంగరం
మీ వూరు వచ్చింది చూడండయ్యా
మేకాట, తోకాట, కుక్కాట, తిక్కాట
నిప్పాట, నీళ్ళాట, చూడండయ్యా
నిగ నిగలా నిమ్మ పండు - ఘుమ ఘుమలా పూచెండు 
దొరికిందా జాంపండు బెడిసిందా మిరప్పండు
చూస్తుండు, నువు చూస్తుండూ

ప్రాయానికి పైటొచ్చింది ఆ పైటకు పొగరొచ్చింది 
నీపై కది ఎగిరొచ్చిందా నీమతి పోతుంది
నా గజ్జెలు ఘల్లంటవి నీగుండెలో ఝల్లంటది
నాఈడు నీకై వుంది – నీతోడు కావాలంది
అందుకే చిన్నది ఆడి పొడితున్నది.
రారా రంగా విద్దెను చూపు - రాత్రికి నీ కెడతా మేపు
ఊరంతా ఈడేవుంది నిన్నే చూస్తుంది

ఆ తీగపై ఆడారిరా ఈ నిప్పులలో దూకాలిరా
సై అంటూ రారా రామూ సవాలు చెయ్ రా రామూ
ఆటలో ఓడకు అన్నమాట తప్పకు
వేశాడొక రాజా ఎత్తు చల్లిందొక రాణీ మత్తు
చూస్కో ఇక చిత్తు చిత్తు అంతా గల్లంతు
నువ్వున్నది దోచేందుకు - నేనున్నది దాచేందుకు
డొంకంతా కదిలించావు జంకేలా ఇంకా నీకు
ఊరికే చూడకు  కోరికుంటే ఆగకు




వచ్చాడు మా పల్లెకు పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల & కోరస్ 

వచ్చాడు మా పల్లెకు రేపల్లెకు గోపాలుగు గోపాలుకు
గోపాలుగు గోపాలుకు గోపాలుడు
మాయదారి కిష్టుకు మచ్చుజల్లే దుష్టుడు
ముచ్చమోహం చూడు వీడచ్చం కేటుగాడు ॥ వచ్చాడు||

దొంగకన్నా దొంగాడు దొరలాగే వుంటాడు 
కన్నెలనట్టే చూస్తాడు కను సన్నతో అంతా దోస్తాడు
మాటల్లో మనవాడు చేతల్లో మొనగాడు హోయ్
ఎవరికి దొరకడు వీడెవరినీ వదలడు 
వీడంతు చూడాలిలే నేడు హోయ్ హోయ్ హోడ్ ॥ వచ్చాడు||

కిష్ణుడు రానే వచ్చాడు కంసుడి ఆటలు కడ్తాడు
గోవులు కాస్తా నంటాడు చీరలు ఎత్తుకు పోతాడు
పగలంతా ఈవేషం రాత్రయితే మహ మోసం హోయ్
మానవుని దిగాలు ఈ రాధకు తెలుసులే
గుట్టంతా నే చెప్పలేను.. హోడ్ హోయ్ హోయ్ వచ్చాడు



చెంగావి పంచె కట్టి పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చెంగావి పంచె కట్టి చేత చెంగు బట్టి
చెయ్యిస్తివా - చుట్టేస్తివా - లోకా లాగే పోవా
చింతాకు చీరగట్టి చేత కొంగు బట్టి
అడుగేస్తివా - నడుమిస్తివా లోకా లూగే పోవా
పల్లంవైపే పారుతుంది నీరు నా పరువం సెలయేరై నిన్నే చేరు
మన పేరు కుర్రకారు ఊరు కోరికలూరు
నువ్వేరు నేపేరు అనరెవ్వరు ॥చెంగావి॥

పదహారేళ్ళ పంటచేనే నీవు నా వలపే నీకాపూ రేపు మాపూ
కలుపేదీ లేని తలపు నిన్నూ నన్నూ కలుపు
నా చూపు నీ చూపు తొలిమారుపు ॥చెంగావి॥




ఒకరితో ఒకడగా పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఒకరితో ఒకడగా ఇద్దరం ఒకరితో ఒకరుగా ఒక్కరం
ఇదే మధుర భావం ఇదే ప్రణయ రాగం
ఇది జీవితానంద బృందావనం

కుంకుమ భాగ్యం నీ వొసిగావు కొలిచే దైవం నీవైనావు
పల్లవి నీవే పలికించావు పరవశ మొంది పాటైనాను
వలపే పండి - ఒడిలో నిండి పెరిగెను పున్నమి జాబిలీ
సరాగం సంసారం ఇదేలే ఇదేలే
తనం నం తనం నం

వలపుల దీపం వెలుగున మనము పదికాలాలు పయనిద్దాము
మన తొలిరోజు కలలా మిగిలి కథలే చెప్పను. మనకిక రోజూ
ముందు తరానికి మన అనుబంధం..
తీసిని తెలిపే... తెలుగు ప్రబంధం
నరాగం - సంసారం ఇదేలే ఇదేలే
తనం నం తనం నం




అనగనగా చిట్టీ సింహంట పాట సాహిత్యం

 
చిత్రం: మాయదారి కృష్ణుడు (1980)
సంగీతం: ఇళయరాజా 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అనగనగా చిట్టీ సింహంట ఆ అడవికంతా గట్టి పిండంట
అది చెంగు చెంగున - అలా చెంగలించుతూ
తన అమ్మా నాన్ననూ ఎడబాసి ఎక్కడికో
కొండలను కోనలను దాటి వెళ్ళింది

గుంటనక్క కూటమిలో చిట్టి సింహం చేరేనట
టక్కులూ టమారాలు తనూ నేర్చెనట
జిత్తులు ఎత్తులతో తెలివి మీరింది
కల్లలూ కొల్లలకూ - తయారయింది
అలా చెడ్డదయింది పెరిగి పెద్ద దయింది
దాన్ని వేటగాళ్ళు వేటాడితే .. దౌడుతీసింది హోయ్..

జింకలున్న వనానికి చివరికొచ్చి చేరింది
మంచినీ మనసును మచ్చుకు చూసింది
చెలిమిలో తియ్యదనం రుచి చూసింది
గడిచింది తలచుకొని కన్నీరయింది.
అలా మారిపోయింది. మారి మంచి దయింది
జింకలకు రేపగలు రెప్ప అయింది హోయ్
కాపున్న సింహానికి కాలమెదురు తిరిగింది
పిల్లతో పాటు ఒక తల్లీ వచ్చింది
కానరాని మగని కొరకు వెతుకుతున్నది
అమగని చంపినది తానని తెలిసింది
ఆ నిజం దాగక.. ఈ నిప్పు అరక
అది లోలోన కుమిలి కుమిలి ఘోల్లు మన్నది

No comments

Most Recent

Default