-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. V. Ranga Rao"



చిత్రం:  నాదీ ఆడజన్మే (1965)
సంగీతం:  ఆర్. సుదర్శనం 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు 
దర్శకత్వం: ఏ.సి.త్రిలోక్ చందర్ 
నిర్మాత: ఎస్.వి.రంగారావు 
విడుదల తేది: 07.01.1965



Songs List:

Palli Balakrishna Sunday, March 6, 2022





చిత్రం: విక్రమార్క విజయము (1971)
సంగీతం: ఏ.ఏ.రాజా
నటీనటులు: రామకృష్ణ , విజయనిర్మల, ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, యం.బాలయ్య
దర్శకత్వం: గిడుతూరి. సూర్యం 
నిర్మాత: పింజల సుబ్బారావు
విడుదల తేది: Ferbruary.1971



Songs List:

Palli Balakrishna Monday, August 2, 2021
Bhakta Prahlada (1967) Telugu Songs Lyrics Album Cover

Bhakta Prahlada (1967) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Bhakta Prahlada (1967)
Banner : AVM Productions
Music : Saluri Rajeswara Rao
Director : Chitrapu Narayana Rao
Producer : A. V. Meyyappan
Actors : S. V. Ranga Rao
Actresses : Anjali Devi, Roja Ramani
Release Date : 12 January 1967
MOVIE HIGHLIGHTS

Roja Ramani played the title role of Prahlada as a child artist in Bhakta Prahlada (1967).

L. Vijayalakshmi appeared as a dancer in Hiranyakashipu's royal court.

Gitanjali, Vijaya Lalitha and Shanta portrayed the celestial dancers Menaka, Urvashi and Rambha, respectively.

Raara Priya Sundara Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Raara Priya Sundara' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: దాశరథి గాయకులు: పి. సుశీల రాజనర్తకి రారా ! ప్రియా ! సుందరా ! కౌగిలిలో నిన్ను కరగింతురా (రారా) వెన్నెలవేళ విలాసాలతేల వేచితినీకై క్షణాలేయుగాలై విరహముతో నేను వేగినదాన సరగున నన్నేలరా (రారా)

Bhujashakthi Nathoda Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Bhujashakthi Nathoda' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యము: (భాగవతము లోనిది) గాయకులు : మాధవపెద్ది సత్యం హిరణ్యకశిపుడు భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగు నా అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన విచ్చుగాక జగడంబు సైపక సౌకర్య కాంక్షియై యిలక్రింద నీగిన నీగుగాక క్రోధించి యటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక వాని శోణితమున వాడి మెరసి కఠిన హలధార కంఠంబు విదళించి మత్స హూదరునకు మహా తర్పణము చేసి మరలి వత్తు మీకు మేలుదెత్తు

Janani Varadayini Trilochani Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Janani Varadayini Trilochani' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by S. Janaki. Lyrics are written by Palagummi Padmaraju.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Singer : S. Janaki
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: పాలగుమ్మి పద్మరాజు గాయకులు: ఎస్. జానకి లీలావతి జననీ జననీ, జననీ వరదాయనీ త్రిలోచని నీపద దాసిని కావగదే (జననీ) పతి ఎడబాటే సైపగలేక, పశుపతిలోన సగమైనావే కాంతుని చూపే కరవైపోయె! కాంతుని చూపే కరవైపోయిన దీనను దయగన రాదా (జననీ) నా పతి ఏగతి తాపసియై ఘోరాటవిలో కృశియించేనో తపమును వేగమె సఫలము జేయవె తపమును వేగమె సఫలము జేసీ విజయము ఈయవె దేవీ (జననీ)

Aadhi Anadhiyu Neeve Deva Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Aadhi Anadhiyu Neeve Deva' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by M. Balamuralikrishna. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: దాశరథి గాయకులు: బాలమురళీకృష్ణ నారదుడు ఆది అనాదియు నీవే దేవా నింగియు నేలయు నీవే కావా అంతట నీవే ఉండెదవు శాంతివై కాంతివై నిండెదవు (ఆది అనాదియు) దీనజనావన నారాయణా మదమోహిత దానవ సంహరణ మాయని జ్యోతివో, తీయని గీతివో ఏమని వర్ణింతురా తరుణ బిందువున, విరళ సింధువున ఎచట చూచినను నీవేకదా కనులలోన మనసులోన నీ రూపమే (ఏమని వర్ణింతురా) నారద సన్నుత నారాయణా నరుడవో సురుడవో శివుడవో లేక శ్రీసతి పతివో నారద సన్నుత నారాయణా! దానవ శోషణ మానవ పోషణ శ్రీ చరణా భవ హరణా కనకచేల భయశమనశీల నిజ సుజనపాల హరి సనాతనా క్షీర జలధిశయనా ! అరుణ కమలనయనా గాన మోహనా! నారాయణా!

Sirisiri Lali Chinnari Lali Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Sirisiri Lali Chinnari Lali' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by S. Janaki and M. Balamuralikrishna. Lyrics are written by Arudhra.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Arudhra
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: ఆరుద్ర గాయకులు: ఎస్. జానకి, బాలమురళీకృష లీలావతి, నారదుడు సిరి సిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ళ లాలీ ఊగుమా! ఊయలా పాలకడలిలో జాబిలిరీతి వరలుము రతనాల గారాల బాల ముద్దుల మూట మురిపాల తోట ముసిముసి నవ్వుల ముత్యాలకోట ఊగుమా! ఊయలా పదునాల్గు లోకాల తరియింపజేయ ప్రభవించి నావయ్య వరభక్త శీల కలలెన్నో నీ కొరకు కాచుకొని పూచే ఫలియింపజేయుమా అరుదైన బాల ఊగుమా! ఊయలా కులదీపమై వెలుగు కొమరుని జూచి దీవించు నీ తండ్రి ఎచ్చోటనున్నా నీవారి ఆశలు వెత్తావులీని నిరతము నీ కీర్తి వికసించునన్నా ఊగుమా ! ఊయలా

Galira Kumbhini Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Galira Kumbhini' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: మాధవపెద్ది సత్యం హీరణ్యకశిపుడు గాలి, కుంభిని అగ్నిన్ అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమ : ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్యనరాది జంతు కలహ వ్యాప్తిన్ నమస్తాన సౌళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ యిప్పింపవే

Jayaho Jayaho Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Jayaho Jayaho' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela, S. Janaki and Soolamangalam Rajalakshmi. Lyrics are written by Samudrala Jr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Jr.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల జూనియర్ గాయకులు: పి. సుశీల, ఎస్. జానకి, రాజ్యలక్ష్మి రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ జయ హో నమస్త దానవ సామ్రాజ్య సంస్థాపన ధురీణా జయ హో జయ హో జయ హో అందని సురసీమ నీదేనోయీ అందరు ఆశించు అందాల హాయి అందించే నెరజాణలమోయి (అందని) రంభ: మంజులవల్లి నికుంజములోన రంజిలగా మోవి అందీయనా పాలవెన్నెలా జాలునా, వాలుకన్నులా ఏలనా అందమందు చిందులందు, దృఢ పరి రంభమందు నాకు సాటి నేనే మేనక: కోరికేమొ సెలవీర, సుకుమార ! రణధీర సోయగాల నడలా వాలి ఒడిలో సోలిపోయేనా, లాలించి రాగ రసదోలా తేలింతు | ప్రేమభోగాలా, మేన కానరాని వలపు తీరుల మెలగి మేను మరువజేయు మేటిని ఊర్వశి: మై మరతువులేరా ! మగరాయా వగదీర మనసార కౌగిలీర, వయను తలపులూర వల పేరు పొంగు వార, మరుని కోర్కెతీర మన సేల ఊర్వశేరా తిలోత్తమ: వన్నెలా కడకన్నులా విన్యాసాలలోనా సరి సరికేళీ విలాసాలలోన ప్రేమసితార మతారాల తార జాణ తిలోత్తమయే

Hiranyakashipuni Divya Charithamu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Hiranyakashipuni Divya Charithamu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam and Pithapuram Nageswara Rao. Lyrics are written by Kosaraju Raghavaiah.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: కొసరాజు గాయకులు, మాధవపెది. పిఠాపురం నాగేశ్వరరావు చండా మార్కులు చండా: హిరణ్యకశిపుని దివ్య చరిత్రము నవరస భరితమురా (హిర) చండా: వినవిన నెంతో వీనుల విందై వింత గొల్పుగదరా (హిర) చండా: వెడలెను రాక్షసనాధుడు విజయ దుందుభులు మొరయగ చండా: బేలలగుచు దిక్పాలకులందరు భీతి జెంది గొందులబడిపారగ చండా: ఓరోరీ వరుణా రారా ! చర్మమొలిపించెదను చూడరా నెల మూడు వానాలు అమర్క: కురిపించుటలుమాని అహ పైరు పచ్చల పెంపు అమర్క : గావించుటలు మాని . దేశదిమ్మరులగుచు తిరుగుచున్నారటర ఓరోరి వరుకా రారా చర్మమొలిపించెదను చూడరా

Chettu Meedha Oka Chilakundhi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Chettu Meedha Oka Chilakundhi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Kosaraju Raghavaiah.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: కొసరాజు గాయకులు: పి. సుశీల చెట్టుమీదా ఒక్క చిలకుంది! దాని పక్కగానే జామ పండుంది ! చూచి చూడకుండ చప్పరించకుండ ఎగిరిపోతే లాభమేముంది ! అయ్య ! ఊర్వశితావచ్చి వొయ్యార మొలికింప మొగము తిప్పుకొని వచ్చావు రాజాధిరాజ హిరణ్య మహారాజు వలపు జూపక మనసు దాచేవు అయ్యొ మెత్తని నీ మనను దాచేవు చందమామ వచ్చి ముందునిల్చిన ఏమొ వెచ్చంగ వుందయ్యా దేహం అబ్బ వెచ్చంగ వుందయ్య దేహం నా దేహం చల్లని నీచేయి తగిలితేనే చాలు తీరిపోతుందయ్య మోహం అహ చల్లారిపోతుంది తాపం విరహతాపం

Karunaleni Manasu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Karunaleni Manasu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Daasarathi Krishnamacharyulu.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: దాశరథి గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి గలుగువు సజ్జనుండు సౌడు జంతువులను బాధింపవలదయ్య ప్రాణి హింస ఘోర పాపమయ్య

Om Agnimeele Purohitham Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Om Agnimeele Purohitham' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Padma and Subramanya Sastry. The lyrics are adapted from the Rigveda.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Rigveda
Special Note : Adapted from the Rigveda.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: వేదం గాయకులు: సుబ్రహ్మణ్య శాస్త్రి, పద్మ చండా మార్కులు, ప్రహ్లాదుడు ఓం అగ్నిమీళే పురోహితం, యజ్ఞస్య దేవ మృత్విజం, హెతారం రత్నధాతమం ఓం ఇ షేత్వోర్టేత్వ వాయవస్థ పాయవస్థ దేవోవత్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే ! ఓం అగ్న ఆయాహి వీతయే, నో హవ్య దాతయే నిహతా నత్సీ బిషి ఓం శవ్నో దేవి రభిషయ అపోభవంతు పీతయే శంయో రభిస్రవంతున

Chadhivinchiri Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Chadhivinchiri' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

Mandara Makaranda Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Mandara Makaranda' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల మహాదుడు మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు నోవునే మదనములకు నిర్మల మందాకివీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త, మేరీతి నితరంబు జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయువేల

Kanjakshunakugani Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Kanjakshunakugani' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు కునకుగాని కాయంబు ఆగమే పవన కుంభిత చర్మ వైకుంఠు డొగడని వక్తంబు వక్తమే, ఢమఢమ ధ్వనితోడి థక్కగాక, హరి పూజనములేని హస్తంబు హస్తనే తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేకు జూడని కన్నులు కన్నులే తనుకుడ్య జాల రంధ్రములుగాక ఆ. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ నలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక !

Patuthara Neethi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Patuthara Neethi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: మాధవ పెద్ది సత్యం హిరణ్యకశిపుడు చ: పటుతర నీతి శాస్త్ర చయ పారగు చేసెదనంచు బాలునీ వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత జెప్పినాడపు భృగు ప్రవరుండ వటంచు నమ్మితిన్ గట కట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండ వే

Varamosage Vanamali Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Varamosage Vanamali' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by M. Balamuralikrishna. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: బాలమురళీకృష్ణు నారదుడు వరమొనగే వనమాలీ! నా వాంఛితమ్ము నెరవేరును గా తామనవాదుల దర్పము తొలగీ ధర్మపాలనా ధరణి వెలయగా దాసుల.చీ శాంతినిలుపగా వన్నగశయనుడు నరసిజనచునుడు అవతరించుగా! ఎందు వెదకిన కనరాక హేమక శివు హృదయమున తిష్ఠ వేసి తబ్బిబ్బు జేసీ విసుగు నుసికొల్పి ఆడించు నీదులీల పరులకు గ్రహింప శక్యమా! గరుడగమనా!

Om Namo Narayanaya Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Om Namo Narayanaya' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and Chorus. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singers : P. Susheela, Chorus
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాలు గాయకులు: పి. సుశీల, బృందం ప్రహ్లాదుడు ఓం! నమో ! నారాయణాయ ! నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం భవ బంధాలు పారద్రోలి పరము నొనంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం గాలిని బంధించి హఠించి గాసిన పని లేదు జీవుల హింసించి క్రతువులా చేయగ పనిలేదు మాధవా మధుసూదనా ! అని మననున తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం తల్లియు తండ్రియు నారాయణుడే గురువూ చదువూ నారాయణుడే! యోగము యాగము నారాయణుడే! ముక్తియు దాతయు నారాయణుడే ! భవ బంధాలూ పారద్రోలి పరము నొసంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం నాధ హరే! శ్రీనాధ హరే! నాధ హరే! జగన్నాధ హరే!!

Balayuthulaku Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Balayuthulaku' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలమ నురేంద్రాల

Kanulaku Veluguvu Neeve Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Kanulaku Veluguvu Neeve' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and S. Janaki. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల గాయకులు: పి. సుశీల, ఎస్. జానకి ప్రహాదుడు కనులకు వెలుగువు నీవే కావా కనబడు చీకటి మాయే కాదా నిను గనలేనీ ప్రాణీ బ్రతుకే నిజముగ చీకటియౌగా దేవా కనులకు వెలుగువు నీవే కావా పేరుకు నేను తల్లిని గానీ , ఆదుకొనాలే నైతి పాలను త్రాగి ఆకలిబాపే | భాగ్యమునైనా నోచని నాకూ ఏల జనించితివయ్యా ! నా కేల జనించితివయ్యా! అండగనుండా విధాతనీవూ | ఆకలిదప్పుల బాధే లేదు నారాయణ నామామృత రసమే | అన్నము పానముగావా దేవా ! కనులకు వెలుగువు నీవే కావా

Aadhukovayya O Ramesha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Aadhukovayya O Ramesha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela and Chorus. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singers : P. Susheela, Chorus
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల గాయకులు: పి. సుశీల బృందం ప్రహ్లాదుడు ఆదుకోవయ్యా ! ఓ ! రమేశా పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా ! భువవనాయక ముక్తి దాయక భక్తపాలక కేశవా ! సర్వలోక కారణా ! సకలశోక హారణా ! జన్మ జన్మ కారణా ! జన్మ బంధ మోచనా ! సుష్టగర్వ శిక్షణా ! శిష్ట శాంతి రక్షణ! శాంతి రక్షణ!

Panchabdambulavadu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Panchabdambulavadu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Madhavapeddi Satyam and Chorus. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singers : Madhavapeddi Satyam, Chorus
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: మాధవ పెద్ది సత్యం, బృందం హిరణ్యకశిపుడు గా: పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంచు నిందించి | య క్కించిద్భీతియులేక | విష్ణున్ నహితుం కీర్తించు చున్నాడు వ లంచున్ చెప్పిన మానడు ! అంగమున పుత్రాకారతన్ వ్యాధి జు న్మించెస్ ) దీని వధించి రండు దనుజుల్ మిమీ పటుత్వంబులన్

Jeevamu Neeve Kadha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Jeevamu Neeve Kadha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల గాయకులు: పి. సుశీల జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా ! జనకుడు నీపై కినుక వహించి నను వధియింపా మది నెంచే చంపే దెవరూ సమసే దెవరూ సర్వము నీవేకదా స్వామీ!

Ninnegani Parulaberumga Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Ninnegani Parulaberumga' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు నిన్నేగానీ పరుల నెరుంగా ! రావే! వరదా ! బ్రోవగ రావే! వరదా ! వరదా ! అని మొరలిడగా కరివిభు గాచిన స్వామివి నీవుండ భయమేలనయ్యా! జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !

Hey Prabho Hey Prabho Lakshmi Vallabha Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Hey Prabho Hey Prabho Lakshmi Vallabha' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు హే ! ప్రభో ! హే ! ప్రభో ! లక్ష్మీవల్లభ ! దీనశరణ్యా ! కరుణా భరణా ! కమలలోచనా కన్నులవిందువు చేయగరావే! ఆశ్రిత భవ బంధ నిర్మూలనా ! లక్ష్మీవల్లభ లక్ష్మీవల్లభ

Pamulollamayya Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Pamulollamayya' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by Ghantasala. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : Ghantasala
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: కొసరాజు గాయకులు: పిఠాపురం నాగేశ్వరరావు, L. R. ఈశ్వరి పాములవాళ్లు (సూరి, సింగి) సూరి: పాములోళ్లమయ్యా | మా పెట్టె చూడరయ్య బల్లె సూరి: ఈరిగాడి తమ్ముడు బంగారు గాడు ఉన్నడు సుబ్బిగడి తమ్ముడు చిన్నబ్బి గాడు ఉన్నడు సింగి: కంకణాల కాటిగాడు లంకణాల కోటిగాడు సూరి: సింకికళ్ల పోతడు మా జాతికెల్ల మొనగాడు సింగ్: గొర్రేనైన బర్రెనైవ గుటకేసే కొండపిలవ మడిసిన్న మాకు నైన మట్టుబెట్టు మిన్నాగు యినము గక్కు బొక్క బెరుడు తరిమికరను తాడిగిరి ఆహా" సూరి: యీటిపాలబడ్డ వాడు బతికి బట్టగట్టలేడు బొమ్మజెముడు పొదకాడ బుస్సు బుస్సు మన్నది తస్సదియ్య, దీని తస్సదియ్య చెయ్యి పెడితే కస్సుకన్సు మన్నది... సింగి: కట్టుగట్టి పడితేను కదలకుండ ఉన్నదీ ఓ హెయ్ ! సూరి: ఒదిలి పెడితె పేణాలు గావుపడుతనన్నది సింగి: పగబట్టినపుడు దీని పరవళ్ళు సూడాలి కాటే సేటపుడు దీని కవ్వింపు సూడాలి అబ్బో అబ్బో అబ్బో సూరి: అచ్చమైన తాచు ధీని కచ్చె యెపుడు కానలేడు ఆహా ఓహో పడిగే తిప్పి కొట్టెనంటె బెమ్మకూడ తిప్పలేడు

Ninne Nammi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Ninne Nammi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల గాయకులు: పి. సుశీల నిన్నే నమ్మి నీ పదయుగళీ, సన్నుతిజేసే భక్తావలికి మిన్నాగుల గమ భయమదియేలా పన్నగ శయన నారాయణ జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !

Madhilo Velilo Cheekati Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Madhilo Velilo Cheekati' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. Lyrics are written by Samudrala Sr.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Samudrala Sr.
Singer : P. Susheela
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన: సముద్రాల గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు మదిలో వెలిలో చీకటి సూపీ, పధము జూపే పతితపావనా ! జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !

Bhavajaladhinibadi Thelagaleni Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Bhavajaladhinibadi Thelagaleni' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు భవజలధినిబడి తేలగ లేని, జీవులబ్రోచే పరమపురుషా ! నను కాపాడీ నీ బిరుదమునూ, నిలుపుకొంటివా శ్రీతమందారా | జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా బ్రోచే భారము నీదేకదా నా భారము నీదేకదా !

Munchithi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Munchithi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: మాధవపెద్ది సత్యం హిరణ్యకశిపుడు ముంచితి వార్డులన్ గదలమొత్తితి, శైల తటంబులందు ద్రోబ్బించితి | శనరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంకి రొ ప్పించితి | ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్ను లందు త్రో యించితి | పెక్కు పాట్లు నలయించితి చావడు వేమి చిత్రమో |

Vishwamunindi Velige Neeve Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Vishwamunindi Velige Neeve' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు విశ్వమునిండీ వెలిగే నీవే, నాలోనుండి నన్ను కావగా విషమును ద్రావా వేరువగనేలా, విషధర శయనా, విశ్వపాలనా! 1జీవము నీవేకదా!

Kaladambodhi Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Kaladambodhi' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు కలడంభోధి గలండు గాలి గల డాకాశంబునం కుంభినిస్ కలడగ్నిన్ దిశలం పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునం ద్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలదీశుండు కలండు తండ్రి ! వెదకంగా నేల యీ యాయెడన్ !

Indhugaladu Andhuledanu Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Indhugaladu Andhuledanu' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహమువలదు | చక్రి సర్వోపగతుం | డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి, వింటే ||

Sri Manini Mandira Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Sri Manini Mandira' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు రచన : సముద్రాల గాయకులు: పి. సుశీల శ్రీ మానిని మందిరా ! త్రైలోక్య సమ్మోహనాకారా ! ప్రేమావతారా ! జగన్నాధా ! లోకాధినాథా ! మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి, వేదా? రక్షించి, దేవాసురుల్ క్షీర వారాన్ని ధిన్ ద్రచ్చగా గోర, కూర్మావతారుండ వై మందరంబెత్తి, శ్రీ మోహినీ వేష ముంబూని పీయూష దానంబుగావించి, వారాహ రూపంబునన్ భంగ పాటొందు భూదేవి రక్షించి, ఈనాడు నీ తత్వముల్ నమ్మగా లేని అజ్ఞానికిన్ సత్య దీపంబు చూపించి, మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి, నీదాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రా కృతింబూని వేంచేసినావా పరంధామా ! వైకుంఠ ధామా ! నమో! నారసింహా! నమో ! భక్తపాలా ! విధాతాదులే వెరగు చెందునీ ఉగ్రరూపమూ ఉపశమింపుమా ! త్రిలోకాలకూ ప్రియంబైననీ ప్రసన్నాకృతి ప్రసాదింపుమా !

Yella Sareera Dharulaku Song Lyrics in Telugu – Bhakta Prahlada (1967)

'Yella Sareera Dharulaku' song from Bhakta Prahlada (1967) movie is composed by Saluri Rajeswara Rao and sung by P. Susheela. This verse is adapted from Andhra Maha Bhagavatam by Pothana.

SONG INFORMATION
Movie : Bhakta Prahlada (1967)
Lyricist : Pothana
Singer : P. Susheela
Special Note : Adapted from Andhra Maha Bhagavatam.
చిత్రం: భక్త ప్రహ్లాద (1967) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: (భాగవతము లోనిది) గాయకులు: పి. సుశీల ప్రహ్లాదుడు ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం ద్రెళ్ళక నీరు నేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక నర్వమున్ అతని దివ్యకళామయ మంచు విష్ణునం దుల్లము జేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి,

Palli Balakrishna Monday, July 1, 2019



చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
నటీనటులు: కైకాల సత్యన్నారాయణ, జగ్గయ్య, యస్.వి.రంగారావు 
నిర్మాత & దర్శకత్వం: బి.యన్.రెడ్డి 
విడుదల తేది: 19.03.1955



Songs List:



హరికథ సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

హరికథ

సీతాదేవి శ్రీరామచంద్రుని మరీమరీ వేడుకోగా-
మిసమిసలాడే పసిడిలేడికయి
మిథిలానందనవేడ
ఆ మిథిలానందనవేడ
విసవిస నా రఘువీర వరేణ్యుడు
వెడలె లేడిజాడ

అది – వెనుకకొక్క పరిజూచి
తన మునిగాళ్ల పైనిలేచి
అట వేచి తన మెడను సాచి
భయమెదను దోచి
తన యొడలు దాచి
మరి – తారి పొదలలో దూరియడవి బం
గారు లేడి పరు గెత్తె

అంతట 
పారు లేడి గని శ్రీరాముడు తన
బాహువులను విల్లెత్తె
రోసముతో రఘురాముడు బాణము
మోసకారిపై వదలె -
హా సీతా ! హా లక్ష్మణా! యని యా
హరిణము ప్రాణము వదలే -

ఆ యార్త నాదమునిని యదరిపడి జానకీదేవి మరదియయిన లక్ష్మణస్వామితో.

తే॥ గీ॥ 
అన్న పొమ్మయ్య, పొమ్ము, నీ యన్నగారి
ఆర్తనాదము వలెదోచునది యదేమొ
నా మనసుకీడు శంకించునయ్య! క్రూరు.
లైన రాక్షసులుందురీ కానలోన!

ఆ పలుకులు విన్న సౌమిత్రి పక్కున నవ్వి, “అమ్మా !”

తెలియక అందువుగానీ ఆ
దేవదేవునకు భయమేమీ
తులువలైన దైత్యులను దునిమి – ఈ
ఇలనుబ్రోవ జనియించె రాముడని॥ తెలియక ||

అన్న మరది మాటలకు ఆపార్ధంబు కల్పించి ఆ సీతా మహిసాధ్వి అనరాని నిష్ఠురో క్తులాడింది

తే॥ గీ॥ 
అవురవుర మాయదారి! నీ యన్నగారి
మోసకారి రక్కసుల పార్టీని, ఇచట
నేమిచేయ దలంచితో యెరుగవచ్చె
కుటిల బుద్ధులు, నీకు దక్కుదునె నేను

అన్న సీతమ్మ పలుకులు చెవులకు ములుకులై సోకిన లక్ష్మణస్వామి, “హరి హరీ!" యని దుఃఖించి, చేయునదిలేక పర్ణశాల వాకిట.. ఏడుగీటులు గీసి, ఏమి
సంభవించినను, వానిని దాటి అడుగు పెట్టకూడదని వదినగారితో పదేపదే చెప్పి, ఒప్పించి అన్నగారు పోయిన మార్గము ననుసరించి తానునూ బయలుదేరెను.
అంతలో అదనుకై ప్రక్కనే పొంచియున్న రావణాసురుడు వృద్ధభిక్షుక వేషంలో
పర్ణశాల ముంగిట నిలిచి, "భవతి భిక్షాందేహీ” అన్నాడు. ఆ కేక విని జానకి దేవి
బిచ్చంతో బైటికివచ్చి గుమ్మందగ్గిరే నిలబడింది. ఆ తల్లి ఆ గీటుదాటి
రాకపోవడం జూచి, తాను ముందుకు రావడానికి భయపడి, లేని ఆగ్రహం నటిస్తూ
ఆ కపటి - “ ఔరా ! ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా: నాలుగడుగులు

ముందుకు రాలేవా ? అభ్యాగతుణ్ణి దైవంలాగ పూజించాలని సాధ్వివి నీకు ఆ మాయావి తెలియదా ? నీ భిక్షం నీ దగ్గరే ఉంచుకో-నే వెళ్లొస్తా” నన్నాడు.
మాటలు విని, మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తోందరగా విచ్చంతో ఆ రాక్షసుడి ముందు నిలబడగా,

చటుకున తన పది తలలతోడ
ఆ కుటిల రాక్షసుడు తో చె
వికటముగా పకపకమని నగి
తన వింశతిబాహులు చాచె
అది గని 'హా'యని గుండెలదర
సీతమ్మ నేలపై వ్రాలె

అప్పుడా లంకాధిపతి మూర్ఛపోయిన సీతాదేవిని భూమితోసహా పెల్లగించి ఆకాశమార్గాన్ని ఎత్తుకుని పారిపోయాడు. పాపం ! ఆ మహా సాధ్వి....




బ్రతుకు స్వప్నముకాదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. సుశీల

బ్రతుకు స్వప్నముకాదు పండుపున్నమికాదు
అంతులేని వసంతమస లెక్కడాలేదు.

ఈసెగల ఈ పొగల నీబ్రతుకు ముగిసెనే
నీ కలలు మాసెనే - అయ్యో -

ఈదీన పసికూన కేదారి చూపేవు
ఏరాతి మనసు నీ పాపకై కరుగునో

ఆమంటలంతలో ఆరిపోవునుగాని
నీ మనసులో మంట నిలిచి రగిలేను

తానెవరో నీవెవరో ఏనాటి బంధమో
దైవమే నీ గుండె దయతోడ నింపెనా!




తాధిమి తకధిమి తోల్బొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: మాధవపెద్ది సత్యం 

లుళ లుళ లుళా.... ఆయీ.... ఆయి
తాధిమి తకధిమి తోల్ బొమ్మా
దీని తమాష చూడవె కీల్బోమ్మా

తాధిమి తకధిమి తోల్బొమ్మా
దీని తమాష చూడవె కీల్ బొమ్మా
దీని తమాష చూడవే మాయబొమ్మా
ఆటమ్మా పాటమ్మా జగ
మంతా బొమ్మాలాటమ్మా....
తలాంగు తకధిమి తోలొ బొమ్మా తోం
తకతై తకతై మాయబొమ్మా

లుళ లుళ లుళా.... ఆయీ... ఆయి
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.... ఆపదలు కాయీ....
ఆయి - ఆయీ
ఆపదలు కాయీ.....

తకతై - తకతై మాయబొమ్మా
నాలుగు దిక్కుల నడిమి సంతలో
తూలే తుళ్లే తోల్బొమ్మా
తూలే తుళ్లే కీల్బొమ్మా
ఎవరికెవ్వరో ఏమౌతారో
ఇవరము తెలుసా ? - కీల్ బొమ్మా
ఈ-ఇవరము తెలుసా ? - మాయబొమ్మా

తలాంగు తకధిమి తోల్ బొమ్మా - తోం
తకతై - తకతై - మాయబొమ్మా

కోపము తాపము క్రూర కర్మలూ
కూడని పనులే తోలొమ్మా
పాపపు రొంపిని పడబోకే పర
మాత్ముని నమ్మవె కీల్బొమ్మా
ఆటన్నా - పాటన్నా పర
మాత్ముని బొమ్మా లాటన్నా
ఆటన్నా - పాటన్నా.........





కన్నదేవకి వంతు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

కన్నదేవకి వంతు కన్నీరే కాని
కన్నార నీలీల కాంచలేదాయె, కృష్ణా....
ఏకొర నోములు - ఏవి నోచెనో
శన్నదేవకికి - కన్నీరాయె

నీ మురిపెములూ - నీ చిరుసొగసులు
పేద యశోదా - పెన్నిధులాయె
వ్రేపల్లియలో - వెలసిన కృష్ణా
వెన్నమీగడల చిన్నారికృష్ణా ! పొన్నారి కృష్ణా!
కృష్ణా ! గోవర్ధన గిరిధారీ కృష్ణా !
గోపీ హృదయ విహారీ కృష్ణా !
బృందావన సంచారీ కృష్ణా !
సుందర మురళీ ధారీ కృష్ణా !
అగణిత గుణ పరమాత్మా,
అగణిత గుణ పరమాత్మా, కృష్ణా !
జగముల వెలిగే స్వామి కృష్ణా, స్వామి కృష్ణా !
నీ లీలల మే మెరుగము, కృష్ణా !
నీలమోహనా ! బాలా కృష్ణా !
బాలా కృష్ణా ! బాలా కృష్ణా !



వెడలె ఈ రాజకుమారుడు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
రంగైన రాణితోడ వెడలె ఈ రాజకుమారుడు

మోజైన నాట్యాలాడ జైజై గీతాలు పాడ
బాజా బాకాల తోడ తాదీం తక తకతక తకతై
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
ఎచటికి పయనము ఎరుగము వైనము
ఒయ్యారి భామాతోడ ఊరేగే రంగయ్య
ఒయ్యారి దేవీతోడ ఊరేగే రంగయ్య
కస్తూరి రంగయ్య కావేటి రంగయ్య
మాఊరికావల తామరపూవుల కోనేటికీవల
కొలువుండ పొయ్యేము రంగయ్య రంగయ్య
రావయ్య రంగయ్య కస్తూరి రంగయ్య

కోరమీసపు చిన్నావాడ
ఓరచూపుల పిల్లాతోడ
కులుకుతు బెళుకుతు జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
నీవు గోటుగ నీటుగ జాతరకెళ్లేవ్ రయ్యో చిన్నోడ
ఓరయ్యో చిన్నోడు....
అయ్యో చిన్నోడ
ఓ లమ్మీ చిన్నమ్మీ !
గలగల మువ్వల సవ్వడితో తలలూ పుచు లేగల తో
అదే అదే ఆలమందా ఆ పుంతలోన
రెక్కలుసాచి చుక్కలదారి రివురివ్వున గూళ్లకు చేరే
అదే అదే పిట్టల బారు ఆకాశ వీధి....
ఆరేవు కాడ ఆతోపు నీడ
సన్ను సూసి సిన్నది నవ్వి ఊరు కున్నది
నన్ను చూసి చిన్నది నవ్వి ఊరు కున్నది

మిన్నేటి జాడ మేఘాల ఓడ
వెండి తెర చాపతో కొండ దాటి పోదువా
వెడలె ఈ రాజకుమారుడు బంగారు తేరుపైన
పొంగారు ఠీవి తోడ వెడలె మా రాజకుమారుడు



వెన్నెలపందిరిలోన పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఈ వెన్నెల.... మల్లి విరిపందిరిలోనా
చిరునవ్వుల హారతి శేఖరుతీనా
వెన్నెలపందిరిలోన - చిరునవ్వుల హారతులీనా
పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా! విరిసేవెన్నెలా!
మబ్బులదారీ, ఓ బాటసారీ !
నీ ఒంటరి పయనముకాదా.
నీ జంటగ నీ సఖిలేదా.....
నాకై వేచే - నవ్వులు పూచే
నా చెలి కన్నులకాసే వెన్నెలా
పైనా వెన్నెలా - మనసులోనా వెన్నెలా
పైనాలోనా చందమామ పరచేవెన్నెలా! పాలా వెన్నెలా!
చల్లనిరేయి - మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే
తియతీయని తలపులు రేగే
తీయని తలపులు తెచ్చేదెవరో
నాకై పరుగున వచ్చేదెవరో

పండువెన్నెలా - మనసునిండా వెన్నెలా
కొండపైనా కోనపైనా కురిసేవెన్నెలా ! విరిసేవెన్నెలా !





యౌవన మధువనిలో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: ఎ.యం.రాజా, పి.సుశీల

ఉయ్యాల పాట

యౌవన మధువనిలో - వన్నెలపూవుల ఉయ్యాలా
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాలా
జీవన మధువనిలో - పచ్చనితీగల ఊయాలా
ఉయ్యాల జంపాలా -
ఉయ్యాల జంపాలా
బ్రతుకే యెలమావితోట - మదిలో మకరందపుతేట
అడుగడుగున పూవులబాట అనిచాటే కోయిల పాట
ఉయ్యాల జంపాలా - ఉయ్యాల జంపాల
అలనల్లన నామదిలోనా - పలికేబంగారు వీణ
ఏమెత్తని అంగుళి ఆనీ - ఈ తీగెలు మీటెనొగానీ
ఉయ్యాల జంపాల - ఉయ్యాల జంపాల
పచ్చని మధువనిలో - వలపులు విచ్చిన ఊయాలా
పచ్చని మధువనిలో వలపులు....





ఘలుఘల్లున గజ్జెలుమోగ పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: 

బిచ్చగాళ్ల నాట్యం

ఘలుఘల్లున గజ్జెలుమోగ
తకతై తైతైతై ఆడవే

బులబుల్ జిల్లాలల్ ఆడవే
ఘలుఘల్లున గజ్జెలుమోగ ॥
వారే బుల్ బుల్!
చుక్కాలకోకగట్టి
అద్దాలారెయికా తొడిగి
కులుకుతూ నీవు ఆడ
రాలాలీ పైసా జోరుగ
రావాలీ పైసా జోరుగ
ఘలుఘల్లున గజ్జెలుమోగ
గలగలగల పైసా రాలునే




వెన్నెలవేళలు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

వెన్నెలవేళలు పోయినా
ఏమున్నది నాకిక బ్రతుకునా
అనురాగ మెరుగలేని జగతిని
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా ॥
కలిమిలేనిదానా - ఏకులములేనిదీనా
అందరాని ఆచందమామకై
ఆశపడితినేలా బేలనై
జీవితమంతా చీకటిరేయేనా
సుఖమంతా పోయెనా

ఏరికొరకు ఈ వాకిట నిలబడి
ఎదురుచూచి వేచేనో
చేరి ఎవరునను “పాపా”యని ఇక
చెంతనిలిచి పిలిచేరో




కనుల కొకసారయిన కనబడని పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు పాప (1955)
సంగీతం: అద్దేపల్లి రామారావు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి.సుశీల

పాప పాట

కనుల కొకసారయిన కనబడని నాతల్లి
సెలవిమ్మ నీకన్న పాపకు
ఈ చోటికేనాడు ఇంక రాలేనమ్మా
ఒకసారి ఒడిలోన ఒరిగి సెలవడగనా
సెలవిమ్మ నీకన్నపాపకు -
కలలెన్నో బేలనై కనిమురిసినా నమ్మ
కడలేని వేదనే కడకు మిగిలేనమ్మా
కలనేని ఏనాడు కనరాని నాతల్లి
నీ పాప బ్రతుకింక నేలపాలేనా ?

Palli Balakrishna Tuesday, March 19, 2019



చిత్రం: తాత మనవడు (1973)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి , కొసరాజు, సుంకర సత్యనారాయణ
నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్,  శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభ
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా)
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 23.03.1973



Songs List:



అనుబంధం ఆత్మీయత పాట సాహిత్యం

 
చిత్రం:  తాతా మనవడు (1973)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  వి.రామకృష్ణ 

పల్లవి:
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం  

చరణం: 1
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?

కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ       

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 2
కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం: 3
కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా?  . . చితిమంటల చిటపటలు వినిపించేనా?  

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం




ఈనాడే బాబు నీ పుట్టినరోజు పాట సాహిత్యం

 
చిత్రం: తాత మనవడు (1973)
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందం
నెలవంక పెరిగితే నింగికే ఒక అందం
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు
తనకోసం విలపించే తనయుడొక్కడు చాలు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే...
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
కన్నవారి కలలు తెలుసుకోవాలి
ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి
తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న
తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న

ఈనాడే బాబు నీ పుట్టినరోజు

తండ్రిమాటకై అడవికి తరలిపోయె రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు
తల్లి చరను విడిపించగ తలపడే ఆ గరుడుడు
అందుకె ఆ పక్షి ఇంద్రుడు అంతటి మహనీయుడు
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి
భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి
ధ్రువతారగ వెలగాలి

ఈనాడే బాబు నీ పుట్టినరోజు
ఈ ఇంటికే...
ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు

ఈనాడే బాబు నీ పుట్టినరోజు




నూకాలమ్మని నేనే పాట సాహిత్యం

 
చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు

పల్లవి:
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి.. చీపురుకట్టతో సింగారించి
దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే..ఏఏఏఏ
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే.. మీ పీకలు నొక్కేత్తానే

చరణం:1
హేయ్ వొంటిదాన్నిగా సూత్తారా.. ఒళ్ళు హూనముగా సేత్తారా
నుండేది మడిశారా.. ఇంకా ముంగట నిలిశారా
డొక్కసించుతా..ఏయ్.. డోలుకట్టుతా.. నిలుసోబెట్టి
తోలువొలుత్తా
ఓయ్.. డొక్కసించుతా డోలుకట్టుతా.. నిలుసోబెట్టి
తోలువొలుత్తా
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే

చరణం: 2
వరసబెట్టి తింతన్నావే.. వోలమ్మ తెగబలిశావె
వరసబెట్టి తింతన్నావే.. వోలమ్మ తెగబలిశావె
కొంపకి కోడల్ని.. కలకత్తా మాంకాళిని
యీ కొంపకి కోడల్ని.. కలకత్తా మాంకాళిని
వీపు కాసుకోండి.. నా దెబ్బ సూసుకోండి
మీ వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
నూకాలమ్మను నేనే.. మీ పీకలునొక్కేత్తానే

చరణం: 3
ఎవరుచేసిన ఖర్మ వారనుభవింపక..ఎవరికైనా తప్పదమ్మా
అలనాడు శూర్పణఖ.. ముక్కు చెవులు పోయి
అడవిలో పడి...ఏడ్చినమ్మా.. ఆఆ
యీనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు
ఎక్కడా చోటులేదమ్మా.. ఎక్కడా చోటులేదమ్మా
ఏయ్..నూకాలమ్మను నేనే.. మీ పీకలు నొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి
దుమ్ముదులుపుతా.. దుంపతెంచుతా
దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే
నూకాలమ్మను నేనే..మీ పీకలు నొక్కేత్తానే
నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే






రాయంటి నా మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి:
వచ్చేది పుల్లమ్మ..మొగుడూ
ఎల్లేది ఎల్లమ్మ..మొగుడూ
అడుగడుగో ఆదెమ్మ..మొగుడూ
యిదుగిదుతో ఈరమ్మ..మొగుడూ
మరి...నీ మొగుడో? 

చరణం: 1
రాయంటి నా...మొగుడూ
రంగామెల్లి తిరిగి...రాలేదు
మాచేను...దున్నాలి 
మంచిరైతు...కావాలి
మంచిరైతు...కావాలి      
రాయంటి నా..మొగుడూ
రంగామెల్లి తిరిగి..రాలేదు
రంగామెల్లి తిరిగి..రాలేదు

చరణం: 2
బీటిచేను మాది వాటంగ దున్నాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
ఆ రైతు మోతుబరై ఉండాలీ
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
తీయలేక వదులుకున్నాను
నాకు దిక్కులేక మొక్కుతున్నాను  
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు

చరణం: 3
మొరకలున్నచోట మేడి బాగానొక్కి
మొరకలున్నచోట మేడి బాగానొక్కి 
మెరకాపల్లంచేసి మెత్తగా దున్నలీ
తరగకుండా నీరు చెరువులా ఉండాలీ 
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
వివరించి చూసితే ఎదరమోడున్నదే మాచేను
యిష్టమైతే కౌలుకిస్తాను   
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
మాచేను దున్నాలి మంచిరైతు కావాలి
మంచిరైతు కావాలి      
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు




సోమ.. మంగళ.. బుధ.. పాట సాహిత్యం

 
చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సుంకర సత్యనారాయణ
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, యస్.పి. బాలు 

పల్లవి:
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది    

చరణం: 1
పెంచేదెట్లా గంపెడుమంద..
పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద
కలిగిన చాలును వొకరూ ఇద్దరూ.. 
కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 

చరణం: 2
కాదు.. కాదు.. కాదు.... వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా
బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..  తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 

చరణం: 3 
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే
నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ

ఎవరికివారే ఇట్లనుకుంటే..  ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..  ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం

అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య

బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?




ఏమిటో ఈ లోకమంతా పాట సాహిత్యం

 
చిత్రం: తాతా మనవడు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: 
గానం: వి. రామక్రిష్ణ 

ఏమిటో ఈ లోకమంతా ఎంతకూ అంతుపట్టని వింత

Palli Balakrishna Friday, March 1, 2019



చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, యస్.వి.రంగారావు, కె.మాలతి
దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి)
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 15.03.1951



Songs List:



తీయని ఊహలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

ఓ ఓ ఓ ఓ 
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్





ఇతిహాసం విన్నారా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: టి.జి.కమలాదేవి 

ఇతిహాసం విన్నారా 



కలవరమాయే మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో





ఎంత ఘాటు ప్రేమయో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే 
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే 
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో




వినవే బాల నా ప్రేమగోల పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: రేలంగి

వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకే నువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల

గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల

చిరునవ్వుచాలే చిత్తైపోతానే
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
మురిపించేస్తాలే మూర్చైపోతానే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల

జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా 

చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో 
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో




వగలోయి వగలు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: జిక్కీ & కోరస్ 

పల్లవి:
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ
బావలూ మామలూ బావలు మావలు భామలూ
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలో

చరణం: 1
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా 
కొంగు తాకిందంటె హేయ్ హేయ్
కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు 
వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు

చరణం: 2
నీ వెంట వస్తాను, ఆఁ... 
నీ జంట ఉంటాను... నీ వెంట వస్తాను
నీ జంట ఉంటాను... యేఁ?
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
సయ్యంటే బావా... ఊఁ అంటే మావా
చెలీయనీ భలేయని సరే యనీ చలామణి
నా వెంట మీరంతా గూమి గూమి గూడితే
లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు
వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు

ధీం తత తత ధీం తత తత ధీం తత తత
వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు
ఓ..ఓ..ఓ

చరణం: 3
తరిగినతక నకతక జం
ఝనంతరి తకిట ఝంతకతోం
తకిటతై తకిటతై తకిటతై తకిటతై
తలాంగుతోం తలాంగుతోం తలాంగు...

తాళలేనే నే తాళలేనే
భామలారా ఓయమ్మలారా
ఇందరిలోనూ నీ సొమ్ములేవే
నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే ఓ యమ్మా
అవునే భామామణీ...
తధిగినతోం తధిగినతోం తధిగిన
తాళలేనే నే తాళలేనే 
తాళలేనే నే తాళలేనే
తాళలేనే నే తాళలేనే
తాళలేనే తాళలేనే తాళలేనే... 






ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: వి.జె.వర్మ 

పల్లవి:
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు.
అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 1 
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు

చరణం: 2 
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు
అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 






హాయిగా మనకింక స్వేచ్చగా పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాల
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

కలలు నిజముకాగా కలకాలమొకటిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా - స్వేచ్చగా - హాయిగా





కనుగొన గలనో లేనో పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల

కనుగొన గలనో లేనో 
కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో

పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ 
గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు 
కలగ బ్రతకడ మేనో

కనుగొన గలనో లేనో 

వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక 
హృదయమంత చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక
చింతిని తిరగడమేనోయ్

కనుగొన గలనో లేనో 

పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే
బలిగా చేయడమేనో...

కనుగొన గలనో లేనో 
ప్రాణముతో సఖిని 
కనుగొన గలనో లేనో
కనుగొన గలనో లేనో




రానంటే రానోయి పాట సాహిత్యం

 
చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పిఠాపురం, టి.జి. సరస్వతి 

రానంటే రానోయి 


Palli Balakrishna Wednesday, November 1, 2017

Most Recent

Default