-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Priyanka Arul Mohan"




చిత్రం: శ్రీకారం (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్
దర్శకత్వం: బి. కిశోర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
విడుదల తేది:11.03. 2021



Songs List:



భలేగుంది బాలా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: పెంచల్ దాస్, నూతన మోహన్,
ధనుంజయ్, అనురాగ్ కులకర్ణి

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా 
దాని ఎధాన  దాని ఎధాన దాని ఎధాన ఉండే
పూల పూల రైక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద హ కట్టమింద 
భలే కట్టమింద పొయ్యే  అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన దాని ఎధాన
దాని ఎధాన ఉండే  పూల పూల రైక భలేగుందే బాలా

అరెరెరెరే 
నారి నారి వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నారీ నారీ వయ్యారి సుందరి నవ్వు మొఖముదాన
నీ నవ్వు మొఖం  నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖంమింద
నంగనాచి అలక భలేగుంది బాలా
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక భలేగుంది బాలా

వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా

హో ఓ ఓ...  హో ఓ ఓ...
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ... 
అరరే అరరే అరె అరె అరె అరె

తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి అలక నులక మంచం
అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా
అల సందా పోవ్వ నీకు అలక ఏలనే అగుడు సేయ తగునా

వచ్చానంటివో  అరె వచ్చానంటివో ఓ ఓ ఓ
వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే  అలకల సిలకా భలేగుంది బాలా 
దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుంది బాలా

అరెరెరెరే  సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
సురుకు సూపు సొరకత్తులిసరకే సింత ఏల బాలా
కారమైన ముది కారామైన ముది కారమైన 
నీ మూతి ఇరుపులు భలేగున్నయే బాలా
నీ అలక తీరనూ  ఏమి భరణము ఇవ్వగలను భామ

ఎన్నెలైన ఏమంత నచ్చదూ  ఊ ఊ ఊ
ఎన్నెలైన ఏమంత నచ్చదూ నువ్వు లేని చోటా
ఎన్నేలైన ఏమంత నచ్చదూ  నువ్వు లేని చోటా
నువ్వు పక్కనుంటే  నువ్వు పక్కానుంటే
నువ్వు పక్కనుంటే  ఇంకేమి వద్దులే చెంత చేర రావా
ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది నా అలక సిటికలోన



సందల్లే సందల్లే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సనపాటి భరద్వాజ్ పాత్రుడు
గానం: అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజు

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే

మన ఊరితో సమయాన్నిలా 
గడిపేయడం ఒక సరదారా
మనవారితో కలిసుండడం ఒక వరమేరా
నను మరవని చూపులెన్నెన్నో
నను నడిపిన దారులెన్నెన్నో
నను మలచిన ఊరు ఎన్నెన్నో 
గురుతులనిచ్చినదే

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే

ముగ్గుమీద కాలు వెయ్యగానే
రయ్యిమంటూ కయ్యిమన్న
ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం

భోగి మంట ముందు నిల్చొనుంది 
చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది
తంబురాలతో చిడత పాడెనంట
గంగిరెద్దులాటలో డోలు సన్నాయంట 

పెద్ద పండగొచ్చెనోయంటూ 
ముస్తాబుఅయ్యింది చూడరా,
ఊరు ఇచ్చటా ఇంటిగడప ఉంది
స్వాగతించడానికి వీధి అరుగు ఉంది 
మాట కలపడానికి రచ్చబండ ఉంది 
తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికీ

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా  ఓఓఓ...

దెబ్బలాటలోన ఓడిపోతే
కోడిపుంజు పొయ్యి మీద
కూరలాగా తాను మాడిపోదా పాపం

నేల మీది నుండి గాలిపటం
నింగిదాకా దారమే తోకగా ఎగురుతుంది
ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా
గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట
రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా
అంతటా సంబరాలే 

విందు భోజనాలు చేసి రావడానికి
నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
అంతమందినొక్కసారి కలవడానికి
చాలవంట మూడు రోజులు

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మన వారితో కలిసుండడం
ఒక వరమేరా ఆ ఆ ఆ...

మన ఊరితో సమయాన్నిలా
గడిపేయడం ఒక సరదారా
మనవారితో కలిసుండడం
ఒక వరమేరా ఓఓఓ...

సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
సందల్లే సందల్లే  సంక్రాంతి సందల్లే
అంగరంగ వైభవంగా  సంక్రాంతి సందల్లే



హేయ్ అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: నూతన మోహన్, హైమత్

నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్నా
ఏదో రోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా
హే పో పో పోమ్మన్నా పడిగాపే కాస్తున్నా
గర్ల్ ఫ్రెండయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్నా

సారీ అన్నా క్షమిస్తానా
నే వింటానా వస్తా ఏమైనా
హేయ్ అబ్బాయి
హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి
కాస్తా ఇటేపు చూడోయి

హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి
నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్ నా

హే హేయ్ అబ్బాయి
హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి

నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా
పోనీ పాపం అమ్మాయంటు వదిలేస్తూ ఉన్నా
నీదే తప్పున్నా ఇన్నాళ్ళు తగ్గున్నా
పడనే నేను వదిలేయ్ నన్ను ఆపేయ్ అంటున్నా

నువ్వేమన్నా వస్తానన్నా
నే వింటానా బుద్దిగా ఆగమ్మా
హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి
ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి
హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి
ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగిస్తే కట్ చేసెయ్నా

తెగ ప్రేమే ఉన్నానీ పైన చీపయ్యానా
తొలిచూపుల్లోనే మనసు నీదే తెలుసుకున్నా
ఇక అప్పట్నుంచే ఏమైనా నీతో ఉన్నా
ఒక నిన్నే నిన్నే తగిన జోడనే ఊహిస్తున్నా
నేడని రేపని ఎంతకాలమే అయినా
ఏదీ చూడక ఒక్కమాటపై నేనున్నా
అయినా నీకిది అర్థమైననూ కాకున్నా
అసలే నిన్ను వదిలేపోను నీతోపాటే నేనుంటా
హేయ్

హేయ్ అబ్బాయి
హే హేయ్ అబ్బాయి
ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి
హేయ్ అబ్బాయి హే హేయ్ అబ్బాయి
సిగ్గేంటోయ్ అబ్బాయి నీకే ముద్దోటిచ్చి పోగొట్టెయ్నా




శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీకారం (2020)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హైమత్, నూతన్ మోహన్

కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా....వెతికిన వెలుగుగా
అలికిడి ఎదురయ్యింది...నిశీధినే జయించగా
శ్రీకారం కొత్త సంకల్పానికి.... 
కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి....చినుకు పరిమళమల్లే
దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా..... నిన్నటి మొన్నటి పద్ధతికి
వారధులం మనమేగా.... రేపటి మార్పులకీ

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్
ఇన్స్ఫెర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

మండే ఎండకు ఫ్రెండ్ అవడం... మనకు తెలుసుగా
అలవాటే ఇక.. చెమటతడి పండుగ
ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా... మనసుకు నచ్చిన దారిగా

బురదేం కాదిది....మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక.... ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది... ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం... బంగారం పండిద్దాం

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫెర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వికెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

అచ్చంగా మనం... కంప్యూటర్ కాలం యువకులం
మెదడే ఇంధనం... చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది... ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా... సుళువుగా రాణిస్తాం మనం
తరముల నాటిది.... మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే... మనకీ వ్యవసాయం, హో హో
జీన్సే తొడిగినా.. మన జీన్స్ లో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం... నేడే నవయువ కర్షకులై

Palli Balakrishna Sunday, January 17, 2021




చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
నటీనటులు: నాని, కార్తికేయ రెడ్డి, ప్రియాంక అరుల్ మోహన్
దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి. వి. మోహన్
విడుదలతేది: 13.09. 2019



Songs List:



రా రా జగతిని జయించుదాం పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: పృద్వి చంద్ర, బషీర్ మాక్స్

రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

సరిగా సరిగా మన శక్తులన్ని ఒక చోట చేర్చుదాం
త్వరగా త్వరగా మన తప్పులన్ని సరిదిద్ది సగుదాం
చెమటె చెమటే చమురైన వాహనం దేహమే కదా
శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం
తారల కలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం
ఆరని తపన ఆయుదం ఇక పోరుని సలుపుదాం

గదులు గడులుగ గడపలు దాటేయ్
దడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం
యెరలు మొరలు చెరలను దటేయ్
తరులు గిరులు జరులను దాటేయ్
ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం
రా.........

రా రా జగతిని జయించుదాం
రా రా చరితను లిఖించుదాం
రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం
రా రా నడుములు భిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం





హొయ్ నా హొయ్ నా పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఇన్నో జంగా, అనిరుద్ రవిచంద్రన్

వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా

పలికే పాల గువ్వతో
కులికే  పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా 
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover
I think I caught the feels this summer
Bae you’re one of a kind no other
Be my sweetie be my sugar
Had enough as a one side lover

నా జీవితానికి రెండో
ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి  రెండో భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమా

గుండెలోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా
కలిసే కానుకవ్వనా
పెదవుల్లోయినా నింపైనా
చిరుదరహాసం

ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం

హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా…

వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా
వేరే కొత్త భూమిపై ఉన్నానా.. 
ఏదో వింత రాగమే విన్నానా




నిను చూసే ఆనందంలో పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోకముందు 
అపుడే ఇదేమి తలపో

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే

అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతుందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో

అణువణువున ఒణుకు రేగినది
కనబడదది కనులకే
అడుగడుగున అడుగుతోంది మది
వినబడదది చెవులకే

మెదడుకు పది మెలికలేసినది
తెలియనిదిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది
నిదరయినది నిదరకే

తడవ తడవ గొడవాడినా
తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా
విడని ముడులు పడెనా

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు
అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగ పనులు పంచుకొని
పెరిగిన మన చనువుని
సులువుగ చులకనగా చూడకని
పలికెను ప్రతి క్షణమిలా

ఒకటొకటిగ తెరలు తెంచుకొని
తరిగిన మన వెలితిని
పొరబడి నువు మరల పెంచకని
అరిచెను ప్రతి కణమిలా

వెతికి వెతికి బతిమాలినా
గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా
నిజము మరుగుపడదే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరాటంలో
నను నేనే వదిలేశాను కదే
అరె భారమెంత నువు మోపినా 
మనసు తేలికౌతూ ఉందే

నిను చూసే ఆనందంలో
కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలుకాకముందు 
అపుడే ఎలాంటి మలుపో..



గ్యాంగు గ్యాంగు లీడరు పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: అనిరుద్ రవిచంద్రన్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
సిటికే వేసి వెల్కం చెప్పండోయ్
సిరునవ్వులతో హారతి పట్టందోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
పీ పీ ......

హేయ్ సరస్వతీ పేరులోనె కొత్త సాఫ్టురో
ఈ బామ్మమ్మరో బధ్రఖాళి కదరో
హేయ్ వరలక్ష్మి మాటలోనె అంత హార్డురో
ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో
ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని
చూపిస్తు ఉంటాదోయ్ మా ప్రియా డార్లింగ్
స్వాతిలా ఓ చెల్లి అందారికి ఉండుంటె
ఈ లోఅం ఓ స్వర్గం అవునని నా ఫీలింగ్
అడ్డెడ్డె చిన్ను చిన్ను... పెన్సిల్ కి ఇది పెన్ను
అంత కలిసి మించేస్తరు మిన్ను

గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్

యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్
యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్
పీ పీ.....

గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్
హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్




కథ రాయడం పాట సాహిత్యం

 
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: అనిరుద్ రవిచంద్రన్

కథ రాయడం
Katharaayadam Reprise

Palli Balakrishna Sunday, July 21, 2019

Most Recent

Default