చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ నటీనటులు: నాని, కార్తికేయ రెడ్డి, ప్రియాంక అరుల్ మోహన్ దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి. వి. మోహన్ విడుదలతేది: 13.09. 2019
Songs List:
రా రా జగతిని జయించుదాం పాట సాహిత్యం
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: పృద్వి చంద్ర, బషీర్ మాక్స్ రా రా జగతిని జయించుదాం రా రా చరితను లిఖించుదాం రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం రా రా నడుములు భిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం గదులు గడులుగ గడపలు దాటేయ్ దడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం యెరలు మొరలు చెరలను దటేయ్ తరులు గిరులు జరులను దాటేయ్ ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా......... సరిగా సరిగా మన శక్తులన్ని ఒక చోట చేర్చుదాం త్వరగా త్వరగా మన తప్పులన్ని సరిదిద్ది సగుదాం చెమటె చెమటే చమురైన వాహనం దేహమే కదా శ్రమకే శ్రమకే తను కోరుకున్న గమ్యాన్ని చూపుదాం తారల కలలు తాకుదాం మన తీరుని తెలుపుదాం ఆరని తపన ఆయుదం ఇక పోరుని సలుపుదాం గదులు గడులుగ గడపలు దాటేయ్ దడలు దడులు దరులను దాటేయ్ ఎగిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి దస దిసల కొసకు పోదాం యెరలు మొరలు చెరలను దటేయ్ తరులు గిరులు జరులను దాటేయ్ ఎరిరెగిరి ఎగిరి యెగిరి ఎగిరెగిరి యెగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం రా......... రా రా జగతిని జయించుదాం రా రా చరితను లిఖించుదాం రా రా భవితను సవాలు చేసే కవాతు చేద్దం తెగించుదాం రా రా నడుములు భిగించుదాం రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించివేసే రహస్య వ్యూహం రచించుదాం
హొయ్ నా హొయ్ నా పాట సాహిత్యం
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ఇన్నో జంగా, అనిరుద్ రవిచంద్రన్ వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాల గువ్వతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో నడిచే గాజు బొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer Bae you’re one of a kind no other Be my sweetie be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you’re one of a kind no other Be my sweetie be my sugar Had enough as a one side lover నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెలోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా కలిసే కానుకవ్వనా పెదవుల్లోయినా నింపైనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇక నా వేషం హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా వేయనా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా హొయ్ నా కలకాలం నీతో కాలక్షేపం చేయనా చేయనా… వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా.. ఏదో వింత రాగమే విన్నానా
నిను చూసే ఆనందంలో పాట సాహిత్యం
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: సిద్ శ్రీరామ్ కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోకముందు అపుడే ఇదేమి తలపో నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతుందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో అణువణువున ఒణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే మెదడుకు పది మెలికలేసినది తెలియనిదిది తెలివికే ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరయినది నిదరకే తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతూ ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో ఒకటొకటిగ పనులు పంచుకొని పెరిగిన మన చనువుని సులువుగ చులకనగా చూడకని పలికెను ప్రతి క్షణమిలా ఒకటొకటిగ తెరలు తెంచుకొని తరిగిన మన వెలితిని పొరబడి నువు మరల పెంచకని అరిచెను ప్రతి కణమిలా వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే వెనక వెనక అణిచేసినా నిజము మరుగుపడదే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తేలికౌతూ ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలుకాకముందు అపుడే ఎలాంటి మలుపో..
గ్యాంగు గ్యాంగు లీడరు పాట సాహిత్యం
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అనిరుద్ రవిచంద్రన్ యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్ యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్ సిటికే వేసి వెల్కం చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టందోయ్ గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్ యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్ యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్ పీ పీ ...... హేయ్ సరస్వతీ పేరులోనె కొత్త సాఫ్టురో ఈ బామ్మమ్మరో బధ్రఖాళి కదరో హేయ్ వరలక్ష్మి మాటలోనె అంత హార్డురో ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని చూపిస్తు ఉంటాదోయ్ మా ప్రియా డార్లింగ్ స్వాతిలా ఓ చెల్లి అందారికి ఉండుంటె ఈ లోఅం ఓ స్వర్గం అవునని నా ఫీలింగ్ అడ్డెడ్డె చిన్ను చిన్ను... పెన్సిల్ కి ఇది పెన్ను అంత కలిసి మించేస్తరు మిన్ను గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్ యే సీను సిరిగి సీటులిరిగి సీటి కొట్టాలోయ్ యే సీడెడు నైజాం ఆంద్రా సిందు తొక్కాలోయ్ పీ పీ..... గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడరు వచ్చడు లెగండోయ్ హ్యాంగు హ్యాంగు ఓవరులో ఊగాలి పదండోయ్
కథ రాయడం పాట సాహిత్యం
చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019) సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: అనిరుద్ రవిచంద్రన్ కథ రాయడం Katharaayadam Reprise
2019
,
Anirudh Ravichander
,
C. V. Mohan
,
Gangleader
,
Kartikeya Gummakonda
,
Nani
,
Naveen Yerneni
,
Priyanka Arul Mohan
,
Vikram K. Kumar
,
Y. Ravi Shankar
Gangleader (2019)
Palli Balakrishna
Sunday, July 21, 2019
