Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Madhura Sridhar Reddy"
Maaya (2014)



చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: హర్షవర్ధన్ రానే, అవంతిక మిశ్రా, సుష్మా రాజ్, నందిని రాయ్, అనితా చౌదరి 
దర్శకత్వం: నీలకంఠ 
నిర్మాత: మధురా శ్రీధర్ రెడ్డి 
విడుదల తేది: 01.08.2014



Songs List:



ఏం చేస్తూ ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: బాలాజీ 
గానం: శ్రీ సౌమ్యా, దినకర్

ఏం చేస్తూ ఉన్నా 




పోకిరి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: డి. రమా
గానం: శ్రావణ భార్గవి 

పోకిరి రాజా 



ఎందుకో పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: రమ్యా బెహ్రా 

ఎందుకో 




ఔనన్నా కాదు అన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: డి. రమా, కిరణ్ వారణాసి 
గానం: సాయి శివాని, దినకర్ 

ఔనన్నా కాదు అన్నా 




మాయ పాట సాహిత్యం

 
చిత్రం: మాయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: సిరా శ్రీ 
గానం: అమల చేబ్రోలు 

మాయ

Palli Balakrishna Monday, August 8, 2022
Dorasani (2019)



చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్
దర్శకత్వం: కె.వి.ఆర్. మహేంద్ర
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని
విడుదల తేది: 12.07.2019



Songs List:



నింగిలోన పాలపుంత పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: అనురాగ్ కులకర్ణి 

నింగిలోన పాలపుంత  




కళ్లలో కలవరమై పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: చిన్మయి శ్రీపాద

కళ్లలో కలవరమై కలవరమై 
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమో వరమే అవగా
గుండెలో పరవశమో వరమై
కళ్లలో కలవరమై కలవరమై  కలిగే కోరిక

ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా 
ఊహాలే ఎన్నో కొంటె కథలే చెప్పగా
ఆరాటాల వడిలో ఆడుతూ ప్రాణమే
ఆనందాల నిధికై చూడగా
ఊరించే ఊసులు ఎన్నో 
ఉడికిస్తూ చంపుతుంటే
ఆ తపనలోన తనువు తుళ్ళి పడుతుంటే

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల 
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే

ఏమో ఏమో ఏమో అసలే మెల్లగా
ఎదపై తీపి మధువే చెల్లగా
ఏదో ఏదో ఏదో మైకమే ముద్దుగా
మైమరపించు మాయే చెయ్యగా
అణువణువు అలజడి రేగి
తమకంలో తేల్చుతుంటే
ఆ ఆదమరపులోన ఈడు సతమతమై

పాల బుగ్గలోని తళుకులే
వెన్నుపూస లోన వణుకులై
కంటిపాప లోన కవితలా మారే
చిన్ని మనసులోని కోవెల 
పసిడి వన్నెలోని నవ్వులా
లేత పెదవిపైన ముత్యమై మెరిసే




కప్పతల్లి పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: అనురాగ్ కులకర్ణి 

కప్పతల్లి 




ఆడి పాడే పాట సాహిత్యం

 
చిత్రం: దొరసాని (2019)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: లోకేశ్వర్

ఆడి పాడే

Palli Balakrishna Monday, July 1, 2019
ABCD (2019)


చిత్రం: ABCD (2019)
సంగీతం: జుదా శాండీ
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్, అదితి భావరాజు
నటీనటులు: అల్లూ శిరీష్ , రుక్షర్ ధిల్లోన్
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: .మధురా శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 01.03.2019

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందే
చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

నీతో చేరుతూ ఏదో కొత్తగా
మరో నేనులా మారానే
పదా రమ్మని అలా వేలితో
కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందులేదే ఈ హాయి
సందడేమో అల్లుతూనే నీ వైపోయే
ప్రతీ క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే
ప్రపంచమే చూశానులే నీలా ఏదీ లేదంటే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

మెరిసే లోపలే మనసే
మురిసే నిన్నిలా కలిసే
నిమిషాలు రోజులై
నిలిచేను చేతిలో
నేనుంటా నీడలా ఇలా
నీతోనే అన్ని వేళలా

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే అల్లారేదో తెచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే

మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా
కన్నుల్లో మత్తులాగ అల్లావే

Palli Balakrishna Saturday, February 23, 2019
Sneha Geetham (2010)


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తిక్
నటీనటులు: సందీప్ కిషన్ , సుహాని కలిత, కృష్ణుడు, చైతన్య , శ్రేయా ధన్వంతరి, రియా
దర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత: శిరీష శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 16.07.2010

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా
వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలో ఏమైనా
నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా
నీ కలతను చెరిపేనా శ్రుష్టించిన బ్రహ్మైనా

నీకే సాధ్యం ....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా
నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా
ఆ నింగిని తాకేలా సందిస్తే నీ బాణం
తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం

గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

కలలే అలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే
కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే
తలపే... చెదిరెనా
తపనే ....తరిమెనా

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

చిగురులు తొడిగిన తోడే కలయై చిటికెలో నను వీడే
చింతే వచ్చి చెంతన చేరి శిశిరం లా తోచే
నడకే .....తడబడే
నడిపే..... విధి ఇదే

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బంధమే... విరబూసే
సంతోషమే.. మది నిండే
నవలోకమే.. పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

ధ్యేయం ధ్యానం ఒకటై సాగే..
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే..
ఒక చెలిమి కోసం వేచే క్షణం
ఒక చెలియ కోసం జరిపే రణం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

స్నేహం ప్రేమై మారే వైనం..
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఓ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం

హృదయం లోన మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎదగదుల పైన ఓ సంతకం
మది నదులు కలిపే ఈ సంగమం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

Palli Balakrishna Thursday, December 14, 2017
Its My Love Story (2011)


చిత్రం: ఇట్స్ మై లవ్ స్టోరీ (2011)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్య
నటీనటులు: అరవింద్ కృష్ణ , నిఖిత నారాయణ్
దర్శకత్వం: మధురా శ్రీధర్ రెడ్డి
నిర్మాత: మున్నా వెంకట కృష్ణారెడ్డి
విడుదల తేది: 11.11.2011

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా
నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

ఏదేదో తెలిపే ఈ ముగ మనసే
కవ్వించెనే భలే ఇది వింత కనుకే

కలయిక కలే ఆ కల ఇక నిజమాయేనా
కలవరమంతా ఓ వరమయి రుజువాయేనా
గడియారమైనా కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా
ప్రియ రాగమేదొ నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా .... అ అ అ

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

తెలియని మౌనం ఈ నడకకు తడబాటేనా
తలవని భారం ఈ మనసుకి సుఖమాయేనా
గడి దాటగానే ఏవేవో భావాలే ఏదేదో చేసి బందీ చేసేనా
చేయి తాకగానే ని మనసే నిను తట్టి తియంమ్మాయింక అంది నిన్నేనా

నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే
తను నీతో కలిసి ఉంటానంటే
వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే

Palli Balakrishna Tuesday, September 26, 2017

Most Recent

Default