Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tarangini (1982)






చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: సుమన్, భాను చందర్, పూర్ణిమ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: కె.రాఘవ
విడుదల తేది: 1982



Songs List:



నిర్మల సురగంగా (ఒక దేవత) పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, శైలజ

నిర్మల సురగంగా జల మంజుల స్వర్ణకమలమో
క్షీర సాగర సమానీత సుధాపూర్ణ కలశమో ఆ...
ఒక దేవత ప్రేమ దేవత - పోతపోసిన అనురాగమో
ఏ పూర్వజన్మల ప్రణయరమ్య కసయోగమో
ఒక దేవత ప్రేమ దేవత
ఎదలో సూటిగా పదునుగ నాటిన మదన బాణమో
సద పదమున మధు మధురిమలొలికిన రసోన్మాదమో ?
ఒక దేవత ప్రేమ దేవత
రసికత దాచిన శృంగార మో
ఆ రతీదేవి ధరియించిన తొలి అవతారమో
ఒక దేవత ప్రేమ దేవత ఆ...ఆ...
హృదయమే సుమహారముగా అర్పించినా
జీవితమే కర్పూరముగా వెలిగించినా
ఆరాధన మాటున దాగిన ఆవేదన ఎలా తెలుపను
మనసులోన రగిలే కలతలు మాటలతో ఎలా చెప్పను 
ఆరాధన ఒక నటన ఆవేదన ఒక నటన
రసయోగం ఒక నటన ఆ అనురాగం ఒక నటన
అది నటనయని వంచనయని తెలిపెనులే
ఇక ఆ దేవత ఆ గుడిలో నిలవదులే
కోరుకున్న కోవెలలో చేరునులే
సరికొత పూజలంది తీరునులే

స్వార్ధం ఎరుగదు ప్రేమ-పరమార్ధం మరువదు ప్రేమ
ఆ ప్రేమకు రెండె అక్షరాలు అవి గగనాలు సాగరాలు
అవి అందుకోలేరు కాముకులు అవి పొందుకోలేరు పంచకులు
ఆ దేవత ప్రేమ దేవత 
మదిలో వెలసిన మాధవుడే ఎరులై నిలిచిన రాఘవుడే
ప్రియ విభుడు నా ప్రియ విభుడు




మహారాజ రాజశ్రీవారు పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల, వి,రామకృష్ణ, జె. వి. రాఘవులు

మహారాజ రాజశ్రీవారు మంచిచారండీ బహుమంచివారండీ
వేళ దాటి పోతుందీ వేగం పెంచండి మీ వేగం పెంచండి

ఘనత వహించిన వనితల సంగతి మాకు తెలుపండి (2)
వలపులతో నే మెలికలు వేసే కళాకారులంగి
నవరస కళాకారులండి

మహారాజ

ముత్యాల పందిరి వేయాల
వేయాలి
రతనాల తలంబ్రాలు పొయ్యాలా
పొయ్యాలి
పల్లకి కావాలా
ఆ
ఊరేగి పోవాలా
ఆహా
ఊరంత చూడాల నే వెళ్ళి తీరాల
ఆహా
ఆహా! అంటే వెళ్ళే దెలా వెళ్ళకపోతే పెళ్ళిఎలా

మహారాజ

ఓసోసి జగమొండి రాకాసి పొగబండి
ప్రేమించు జంటలను విడదీయు భూతమా
ప్రతిరోజు అతి రేటు ఈరోజు నువుంటు
మరవై తే మరలిపో మనసుంటే నిలిచిపో
నిలిచిపో నిలిచిపో నిలిచిపో

రైటయిన లేటయిన రావడం నావంతు
రాజయిన రైతయిన ఒక్కడే నా ముందు
గాంధీని తెచ్చాను గాడ్రిని మోసాను
మనిషినని మరిచేపు మరలాగ అరిచేవు

మహారాజ రాజశ్రీ శ్రీవారు మ ట ఏసుకోంది
నా మాట వినుకోండి నీ ప్రేయసినే శ్రీమతిగా
తెస్తానుండంది త్వరలో వస్తానుండండి



తరంగిణీ పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

తరంగిణీ ఓ తరంగిణీ తరంగిణీ ఓ తరంగిణి
ఏ ఒడిలో నీ జననం ఏ కడలికో నీ పయనం
తరంగిణి ఓ తరంగిణీ

చరణం: 1
ఇసుక తిన్నె లెదురైన ఏగిరులు తిరిగి పొమ్మన్నా
లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా 
ఆగిపోదు నీ సడకా 
ఆ గమ్యం చేరేదాకా
తరంగిణి ఓ తరంగిణీ

చరణం: 2
గుండె ముక్కలై పోయి సుడిగుండాలే చెలరేగి
కల్లోలం విషమించినా కాలమే వంచించినా
తరంగిణి ఓ తకంగిణీ ఆగిపోదు నీ నడకా ఆ గమ్యం చేరేదాకా

చరణం: 3
ఎదలోని రాపిడిలోన కదలాడు నురగలపై న
కలకల నవ్వులున్నాయో కన్నీళ్ళు పొంగుతున్నాయో
తెలిసే దేవరికి ఆ



గుట్ట మీద కాలు పెట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: జె.వి. రాఘవులు, కోరస్

గుట్ట మీద కాలు పెట్టిందా గుట్టమీంచి జారిపడుతుందా

కోరస్: 
కొంగున నిప్పులు ముడిచిందా గుండేమంటలై నడిచిందా
రావులమ్మో రావులమ్మో రవ్వలబొమ్మా రావులమ్మో

ఉత్తమ ఇల్లాలు రావులమ్మో ఊరికి దీపం రావులమ్మో
ముద్దుల చెల్లీ రావులమ్మో మురిపాల తల్లి రావులమ్మో

కోరస్: రావులమ్మో

కన్నెల దీవెన లేమాయె
కోరస్: రావులమ్మో
వదినమ్మ అర్చన లేమాయె
కోరస్: రావులమ్మో
నోచిన నోము లేమాయే
కోరస్: రావులమ్మో
మొక్కిన 'మొక్కు లేమాయె
కోరస్: రావుల మ్మో

కనకదుర్గకు అన్నపూర్ణకు కన్నుల్లో జాతి కరువాయే
ఆడదానికి నాటికి నేటికి అగ్నిపరీక్షలు తప్పవాయే
కోడన్: రావులమ్మో

రాకాసి గుహలోకి పోతున్న రామచిలకా
ఏమి ఘోరమమ్మా ఎవరి నేరమమ్మా
అగ్ని గుండమని తెలిసి ఆహుతి కానున్నావా
సుడిగుండమని ఎగిరి పడిపోతున్నానా
కసాయోడి కత్తికి నీ కంత మివ్వబోతున్నావా
ఆ కత్తినే ఎదిరిస్తావా

రావులమ్మో

కసిగా కామం లేచిందా బుసబుసలాడుతూ లేచిందా
విచ్చుకొని పడగెత్తిందా పచ్చి విషాన్నే కక్కిందా
రావులమ్మో రావులమ్మో రావులమ్మో రావులమ్మో




స్వయంవరం స్వయంవరం పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ప్రకాష్

స్వయంవరం స్వయంవరం స్వయంవరం స్వయంవరం
ప్రియ తరంగిణి స్వయంవరం నా ప్రియ తరంగిణి స్వయంవరం
స్వయంవరం నా ప్రియ తరంగిణ్ స్వయంవరం.
స్వయంవరం ఆహా ఓహో ఏ హే

చరణం: 1
హరుని ధనుస్సును విరిచెను నాటి రాముడు
ముగ్గురి మనస్సులను గెలుచును నేటి రాముడు

స్వయంవరం

చరణం: 2
సంగీత మహారణ్య చరణ మృగేంద్రుడే రాఘవేంద్రుడు
గరి సరిగగ సరినిస దనిరిసనిద సనిదప
సరిగ రిగమ మగప మగరిగసా దనిసా

సంగీత

చరణం: 3
కరాటా నిరాట పర్వశృంగ బలుండే
పరసురాముడు హాహూ హాహూ
నిత్యదైవ సమర్చనా నిష్టా జీవన పునీత సావిత్ర 2
పొంతము కుదరని ముగ్గురు గొంతుకలూడిన
విచిత్ర శంఖారావం శంఖారావం
"స్వయంవరం

చరణం: 4
కృష్ణా... వేదాలే గోపులట పిండే వాడవు నీవట
గీతాసారమె క్షీరమట అరిచేతి కందితే మోక్షమట
మురళీలోలా మోహనలా మానసచోరా గోపకిశోరా
గిరిధారీ వనమాలీ యదుమౌళి యదుమౌళీ కృష్ణా కృష్ణా కృష్ణా

స్వయంవరం!




రాఘవేంద్రా నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: తరంగిణి (1982)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వి.రామకృష్ణ

రాఘవేంద్రా నిన్ను ఆమోఘ సంగీత
తరంగాల దేల్చిన రఘును నేనే
పరశురామా నిన్ను పరుషకరాత్రేహతరు నెత్తించిన పరుమనేనే
విదుషీ లలాను సావిత్రీ నీదీవెనలందిన రాఘవుడననేనే
చిన్నారి జాబులు భిన్న రీతులలోనా
నటనమాడిన అభినయము నాదే-మూడు రూపముల్ ధరియించి
మూడు నామముల్ వహియించి
నీ చిత్తములకు ముదము పెంచినట్టి తరంగిణీ ప్రియుండనేనే
ఇక తధాస్తనిమమ్ము దీవించి వినతీ...

No comments

Most Recent

Default