-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Silk Smitha"



చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అర్జున్ సార్జా, సౌందర్య, ప్రియారామాన్, సుజాత, సిల్క్ స్మిత
కథ: రాజ్ కిరణ్
మాటలు: గణేష్ పాత్రో
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: కొల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆదిరెడ్డి
విడుదల తేది: 19.08.1994



Songs List:



తక థింత థింత తక పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

కోరస్:
ఘణ ఘణ గంటలు గుండెలో మ్రోగెను
మంగళ వాద్యములై
గురువు గువ్వలు కమ్మగ పాడెను మన్మధ మంత్రములై
అణువణువున అల్లరి మల్లెలు పూసెను ఆశల ఆమణియై

పల్లవి:
తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం
సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి
చెంగు చెంగుమని జతులాడినది
శుభ తరుణం చూసుకొని

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం

చరణం: 1
మెల్లగా మేలుకో ఈడులో కోరిక
చల్లగా ఏలుకో కౌగిలే కోటగా
ముళ్ళు వేయగ పిలిచింది పెళ్లి పందిరి వేడుక
అల్లుకుందుకు రమ్మంది మల్లె పానుపు వేదిక
ఇకపైన రేయిపగలు మనపాలి పూల పొదలు
ఒక ప్రాణమైన వడిలో కలవాలి రెండు కథలు

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం

చరణం: 2
నింగిలో రంగులే నేలపై వాలెనా
గంగలో పొంగులే కన్నెగా మారెనా
కోవెలే దరిచేరినది పావురానికి గూడుగా
వెన్నెలే వడి చేరినది జీవితానికి తోడుగా
ఎదురైన ఇంత సుఖమో ఏ పూర్వ పుణ్యఫలమో
ఎదలోని వింత స్వరము ఏ వెనుక జన్మ వరమో

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం
సిరిమువ్వై చిలిపిమది ఉరికింది ఉప్పొంగి
చెంగు చెంగుమని జతులాడినది
శుభ తరుణం చూసుకొని

తక థింత థింత తక
దిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్
ఒక తోడు దొరికెనని కథం తొక్కినది పడుచుదనం




అమ్మ నువ్వొక్కసారి బతకాలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు

అమ్మ నువ్వొక్కసారి బతకాలమ్మ
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా
నువ్వు లేవన్నది కల కావాలమ్మా
ఈ కంటిపాప రెప్పలేక వుండలేదమ్మా
అమ్మ.అమ్మ... అమ్మ...
అమ్మ నువ్వొక్కసారి బతకాలమ్మ
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా

అమ్మ పాలలోన కమ్మనైన ప్రేమ
కుమ్మరించేనంట చిన్ననాడే
గోరు ముద్దలతోనే కోటి ముద్దులు పెట్టి
గుండే ఊయల చేసి ఊపే నా తల్లి
తన మమతంతా చేరింది ఆ కాటికి
సామ్రాజ్యాలే సరికావు ఆ ప్రేమకి
ఏ దేవుడైన అమ్మ ప్రాణమిచ్చి వెళ్లడా.
అమ్మ.అమ్మ... అమ్మ...
అమ్మ నువ్వొక్కసారి బతకాలమ్మ
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా

పేగు తెంచుకున్నా ప్రేమపంచుకున్నా
అన్ని నాకు అమ్మే అనుకున్న
జాలే లేని కాలం గుండే లేని దైవం
చేసేనయ్యో మోసం తీరే ఈ బంధం
యమపాశానికే ఇంత బలమున్నదా
మన పాశాన్ని విడదీసి పోతున్నదా
మా అమ్మనిచ్చి బ్రహ్మ రాత తిరిగి రాయడా
అమ్మ.అమ్మ... అమ్మ...
అమ్మ నువ్వొక్కసారి బతకాలమ్మ
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా
నువ్వు లేవన్నది కల కావాలమ్మా
ఈ కంటిపాప రెప్పలేక వుండలేదమ్మా
అమ్మ.అమ్మ... అమ్మ...




గంగాలాంటి పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు

గంగాలాంటి 




సంగతి చెప్పేయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

సంగతి చెప్పేయ్



ఇదేం దరువురో పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, రాధిక 

ఇదేం దరువురో 



అబ్బయ్యో అందాలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: మావూరి మారాజు (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు 

అబ్బయ్యో అందాలన్నీ 

Palli Balakrishna Wednesday, March 20, 2019



చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, సిల్క్ స్మిత
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: సి.ఎమ్. కృష్ణ
విడుదల తేది: 26.01.1995



Songs List:



బావా మరదలు పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దంతులూరి వర్మ 
గానం: యస్.పి. బాలు, రాధిక 

బావా మరదలు 



చిక్కుదు బెండకాయ పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యం.యం.కీరవాణి 

చిక్కుదు బెండకాయ 



అనగనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: శివ గణేష్ 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

అనగనగనగా 




గొబ్బియల్లో పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దంతులూరి వర్మ, శివ గణేష్ 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

గొబ్బియల్లో 



అలకెందుకు లే పాట సాహిత్యం

 
చిత్రం: ఆస్తి మూరెడు ఆశ బారెడు (1995)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

అలకెందుకు లే 

Palli Balakrishna Sunday, March 10, 2019



చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చిరంజీవి,
దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాత: పింజల నాగేశ్వరరావు
విడుదల తేది: 29.07.1983



Songs List:



అచ్చట్లు ముచ్చట్లు పాట సాహిత్యం

 
చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అచ్చట్లు ముచ్చట్లు 



చినదాని కొనచూపు పాట సాహిత్యం

 
చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్. జానకి 

చినదాని కొనచూపు




నేనంటే చూడు నేనే పాట సాహిత్యం

 
చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు

నేనంటే చూడు నేనే 




యవ్వనం నీకు స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

యవ్వనం నీకు స్వాగతం 



రాలుగాయి ప్రాయం పాట సాహిత్యం

 
చిత్రం: రోషగాడు (1983)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: రాజశ్రీ 
గానం:  యస్. జానకి 

రాలుగాయి ప్రాయం 

Palli Balakrishna Monday, January 28, 2019


చిత్రం: అగ్నిగుండం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: యస్.పి..బాలు,పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, సుమలత, సిల్క్ స్మిత
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 23.11.1984

పల్లవి:
చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో

చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో

చరణం: 1
కన్ను సోకిన్నాడే కట్టూతప్పింది
చేయి తాకిన్నాడే చెంగు జారింది
ముట్టు కుంటే కట్టూ బొట్టూ ఏమవుతాదో
పక్కా కొచ్చిన్నాడే పట్టూతప్పింది
గూడుదాటిన్నాడే గుట్టు చెదిరింది
ఒళ్లోకొస్తే ఒళ్ళు కాస్తా ఏమవుతాదో
జత కూడగనే జతులాడుకునే
చలి వేడుకలో తొలి కోరికలే చాలే

చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో

చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో

చరణం: 2
ఈడు వచ్చిన్నాడే ముద్దు కోరింది
ఇద్దరయ్యిన్నాడే పొద్దుజారింది
మూడు ముళ్ళు వేసేలోగా ఏమవుతాదో
మిసమోచ్చిన్నాడే ఆసపుట్టింది
మిర్రి చుసిన్నాడే అగ్గిపుట్టింది
కమ్ముకొచ్చి కౌగిలిస్తే ఎట్టుంటాదో
పొగమంచులలో పొగరెందుకురో
సోగాసంచులలో వగలందుకు పోరాదా

చెంపకు చారెడు కళ్ళమ్మా
చెంగుకు చాలని ఒళ్లమ్మా
ఒంపుల సొంపుల ఒయ్యారమ్మా
చంపుకు తినకే బుల్లెమ్మా
నిను చూడగనే మతి పోయినదే
కను గీటగనే కసి పెరిగిందే పిల్లో

చెంతకు చేరితె బావయ్యో
చెంగులు చాలవు లేవయ్యో
చీకటి చాటున సింగారయ్యో
సిగ్గులు దోచుకు పోకయ్యో
తడి పోద్దులలో పొడి చేరెనులే
పొడి కోరికలే సుడి రేగెనులేవయ్యో

Palli Balakrishna Wednesday, November 22, 2017


చిత్రం: యస్. పి.భయంకర్  (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్. పి.బాలు సుశీల (All)
నటీనటులు: నాగేశ్వరరావు , కృష్ణంరాజు , సురేష్ , శ్రీదేవి, విజయశాంతి, గీత, సిల్క్ స్మిత
దర్శకత్వం: వి. బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి. బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 01.05.1984

కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే  పోనీ

ఉఁ కానీ కానీ రాతిరి కానీ

నిలవేసే కన్నుల్ని వలవేసే నవ్వుల్ని
ఎవరేమన్నా ఆగవని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
ముందు ముందు ముసళ్ళ పండగ మనమే చూడాలని

కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ

చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ప్రాణం ఎవరో దేహం ఎవరో
తెలియక మధ్యన సాగాలని

ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే  పోనీ

ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ

Palli Balakrishna Sunday, November 5, 2017
Aditya 369 (1991) Telugu Songs Lyrics Album Cover

Aditya 369 (1991) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aditya 369 (1991)
Banner : Sridevi Movies
Music : Ilaiyaraaja
Director : Singeetam Srinivasa Rao
Producer : Sivalenka Krishna Prasad
Actors : Nandamuri Balakrishna
Actresses : Mohini
Supporting Cast : Master Tarun, Silk Smitha, Baby Raasi
Release Date : 18 July 1991
MOVIE HIGHLIGHTS

Nandamuri Balakrishna played a memorable dual role as Krishna Kumar and Emperor Sri Krishnadevaraya.

Aditya 369 (1991) is regarded as one of India's earliest and most celebrated science fiction time-travel films.

Singeetam Srinivasa Rao brilliantly blended science fiction, fantasy and history into one unforgettable cinematic experience.

• The majestic Vijayanagara Empire episodes featuring Sri Krishnadevaraya remain one of the biggest highlights of the film.

Ilaiyaraaja composed five evergreen songs that continue to be loved by Telugu music lovers.

Master Tarun appeared as Kishore, Silk Smitha portrayed Simha Nandani, and Baby Raasi (credited as Baby Vijaya) appeared as Kishore's friend.

• The futuristic 2504 A.D. sequences and time machine concept were technically far ahead of their time in Telugu cinema.

Jaanavule Song Lyrics in Telugu – Aditya 369 (1991)

'Jaanavule' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. P. Sailaja and S. Janaki.

SONG INFORMATION
Movie : Aditya 369 (1991)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: ఆదిత్య 369 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: జిక్కీ, ఎస్. పి. శైలజ, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ..ఆ ఆ పల్లవి: నెర జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే.. సన్నలలో గుస గుస తెమ్మెరలే.. మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో చరణం: 1 మోమటు దాచీ మురిపెము పెంచే..లాహిరిలో అహహహహ ఒహొహో హొహొహో మూగవుగానే మురళిని ఊదే..వైఖరిలో చెలి ఒంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుస గుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా జాణవులే..మృదుపాణివిలే మధు సంతకాలలో చరణం: 2 చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో అహహహహ ఒహొహో హొహొహో వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ తొలి సోయగమే ఓ సగము ఇవ్వాళీవేళ పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా జాణవులే వర వీణవులే కిలికించితాలతో ఆహాహాహా... జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుస గుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే ఆహాహా వర వీణవులే కిలికించితాలతో ఆహహహా మృదుపాణివిలే మధు సంతకాలలో

Raasaleela Vela Song Lyrics in Telugu – Aditya 369 (1991)

'Raasaleela Vela' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Aditya 369 (1991)
Music : Ilaiyaraaja
Lyricist : Vennelakanti
చిత్రం: ఆదిత్య 369 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వెన్నెలకంటి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పల్లవి: రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా రాసలీలవేళ రాయబారమేల చరణం: 1 కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల మోజులన్ని పాడగా జాజిపూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము మేని వీణలోన పలికే సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా రాసలీలవేళ రాయబారమేల చరణం: 2 మాయజేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చేరదీసి పెంచకు భారమైన యవ్వనం దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు రాసలీలవేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేలా రాసలీలవేళ రాయబారమేల రాసలీలవేళ రాయబారమేల

Centurylu Kotte Vayassu Song Lyrics in Telugu – Aditya 369 (1991)

'Centurylu Kotte Vayassu' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.

SONG INFORMATION
Movie : Aditya 369 (1991)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: ఆదిత్య 369 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పల్లవి: సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చరణం: 1 మేఘమాలనంటుకున్న యాంటినాలతో మెరుపుతీగ మీటి చూడు తందనాలతో సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో వలపు వేణువూది చూడు వందనాలతో చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న కుర్రవాళ్ళ ఈలపాట హుషారులో లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చరణం: 2 వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో రెచ్చి రాసుకున్నపాటకెన్ని పంక్తులో విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత కధక్కులో నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా పాటలన్ని పూవులైన తోటలాంటి లేత యవ్వనాన సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ చాకిరీలనైనా మజా మజావళీలు చేసి పాడు సోలో ఇక ఆడియోలో వీడియోలో చెలి జోడియోలో సెంచరీలు కొట్టే వయస్సు మాదీ బౌండరీలు దాటే మనస్సు మాదీ జింగు చాక చచ్చ జిజిక్ చాచా జింగు చాక చచ్చ జిజిక్ చాచా

Chilipi Yaatralo Song Lyrics in Telugu – Aditya 369 (1991)

'Chilipi Yaatralo' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Aditya 369 (1991)
Music : Ilaiyaraaja
చిత్రం: ఆదిత్య 369 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పల్లవి: చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో చరణం: 1 ఎదురుగ ఉంది ఏదో వింత పద పద చూద్దాం ఎంతో కొంత కలలకు కూడా కొత్తే ఔనా కనబడలేదే నిన్నా మొన్నా కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం కలవరింతలా ఉందే రాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం ఎవర్నైనా హలో అందాం ఎటేముందో కనుక్కుందాం టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణం కదా ఇది చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో చరణం: 2 వినబడలేదా కూ కూ Welcome అతిథిలమంటు ఆన్సర్ చేద్దాం తళ తళలాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం మునుపు ఎప్పుడు లేదే మైకం మయుడి మిస్టరి ఏమో ఈ మాలోకం మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయ మంత్రం నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరీక్షిద్దాం కనుక్కొన్న చమత్కారాలన్ని చిలవలు పలువలు కలిపి తెలుపుదాం చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్కబెట్టుకో అరెరరె చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో గల్ గల్ గల్ గల్ తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో

Suramodamu Song Lyrics in Telugu – Aditya 369 (1991)

'Suramodamu' song from Aditya 369 (1991) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki and Sunanda.

SONG INFORMATION
Movie : Aditya 369 (1991)
Music : Ilaiyaraaja
Lyricist : Veturi
చిత్రం: ఆదిత్య 369 (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, సింగీతం శ్రీనివాసరావు తా.. తకతాం..తకితాం..తక తకిట దిత్తై.. తకిటతై తత్ తరికిటతాం.. తకతకిట తకతధిమి తకఝుణుతక తకిట తద్దిమిత.. ధిమిత తక తకిట.. పల్లవి: సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా... స్వరరాగ సంగమ సాధక జీవన సురగంగ పొంగిన నర్తనశాలల పదములు చేరగ భంగిమలూదే సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా... చరణం: 1 ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో... ఆఆఆఆఅ...ఓఓఓఓ.. ఘటనా ఘటనాల కదలిక లెన్నెన్నో దాచెనులే కడలి ఆ... నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి రాయని చదువే రసనలు దాటే రాయల సన్నిధిలో ఆమని ఋతువే పువ్వును మీటే నాట్య కళావనిలో నాకు వచ్చు నడకల గణితం - నాది కాక ఎవరిది నటనం నాకు చెల్లు నవవిధ గమకం - నాకు ఇల్లు నటనల భరతం ఉత్తమోత్తమము వృత్తగీతముల ఉత్తమోత్తమము వృత్తగీతముల మహా మహా సభాసదులు మురిసిన... సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా ఆ.. జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా... చరణం: 2 స్పందించే వసంతాల తకఝణు హంపీ శిల్ప శృంగారమై సర్వానంద రాగాల రసధును సర్వామోద సంగీతమై నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై నాలో ఉన్న చిన్నారి కళలివి నానా చిత్ర వర్ణాంకమై వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ వన్నెలు పిలవగ - నెవ్వగ మొలవగ మ మ గ గ మ ద మ మ మ ద స ని ద మ రంపంప రంపపంప రంపంప రంపపంప రంపంప రంపపంప భరతము నెరుగని నరుడట రసికుడు Rock Roll ఆట చూడు బ్రేకు లోని సోకు చూడు వెస్ట్ సైడ్ రైమ్ మీద ట్విస్ట్ చేసి పాడి చూడు పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు rock rock rock n roll shake shake shake n roll (2) రప్ప పాప - పపాప - పపాప ర పాప పాప పాప పాప పాప పాప పాప తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు.. త త జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా...

Palli Balakrishna Thursday, July 27, 2017


చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: రాధిక
నటీనటులు: కృష్ణంరాజు, సుమన్, జయసుధ, మాలశ్రీ
దర్శకత్వం: శరత్
నిర్మాతలు: ఆకుల మోహన్, సి.యమ్.కృష్ణ
విడుదల తేది: 1993

బావలూ... బావలూ....  బావలూ... సయ్యా..? -  సై సై
నై నై - వెయ్ వెయ్ నువ్వు ముయ్ ముయ్ - హా హా హా

బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
ఆ... ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ
డింగర డింగా డింగర డింగా
డింగర డింగా డింగర డింగా

ఆ... నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఆఁ ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఆ వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా
చేరమెపిల్లా మేముచేరమె పిల్లా
ఆఁ చేరమెపిల్లా మేముచేరమె పిల్లా
కూరిమితో కుళుకులతో దండవేస్తా రారా
కూరిమితో కుళుకులతో దండవేస్తా రారా - అహే
అందగాడా సందకాడ రారా వచ్చినీవు ముద్దులాడి పోరా
రాటుదేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా
రాటుదేలిన - ఆఁ... రాటుదేలిన -  ఓ...
రాటుదేలిన మంచమేసినాను రాతిరంతా తైతక్కలేరా
బావలు బావలు బావలు బావలు బావలూ
హొయ్ బావలు బావలు బావలు బావలు బావలూ

బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
డింగర డింగా డింగర డింగా
డింగర డింగా డింగర డింగా

ఆ... నోటు రేటు తేలిస్తే నాకిస్తే
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఆ ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా
మురిపించేయ్ మైమరపించేయ్
మురిపించేయ్ మైమరపించేయ్
మాటలకే లోబడని పేట జాణను నేను
ఆ మాటలకే లోబడని పేట జాణను నేను
చిల్లరుంటే అల్లరంత మీకే
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబునేను
పైట జారిన పైట జారిన
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబునేను
బావలు బావలు బావలు బావలు బావలూ
హొయ్ బావలు బావలు బావలు బావలు బావలూ

ఆ బావలు సయ్యా - హేయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా - హోయ్ మరదలు సయ్యా
సై రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హా రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హొయ్ రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్
హా రింబోల రింబోల రింబోలా - హొయ్ హొయ్




********  ********   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా

చరణం: 1
ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు
ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో
నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో
ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ
గంటకొట్టే కౌగిళ్ళలోనా...
మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో
జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో
నీరెండలో నీ గుండెలో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా

చరణం: 2
చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీ గోరువంకల్లో
చీరంటు సిగ్గుల్లో చీపో లు రేగేను నా పూల సంతల్లో
కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో
ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచూపుల్లో
పంచదార పందిళ్లలో మంచు తేనె సందెళ్లలో
పాలు పంచుకోరాదా ప్రాయం
వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో
కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి వేడెక్కిపో
వేధించుకో వేటాడుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా
లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే
సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో
చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో
కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో
తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా




********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

ఈ కన్నె లేతందాలే ఏతలేసి తోడుకో
నా సిగ్గు పూతల్లోన తేనె జున్ను అందుకో
ఈ పొద్దు వద్దంటున్న మొమాటాల పక్కనే
ఓ ముద్దు ముద్దంటాయి ఆరాటాలు ఎక్కడో
చేరుకో పొదరిల్లకి చీకటి చిరు తిల్లకి
అలకాపురి చిలకమ్మకి
కుళుకెందుకో ఒక్కసారికి
ఒళ్ళో వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

మంచమ్మ ముంగిళ్ళల్లో దీపాలెట్టి చూసుకో
సందేల మంచాలేసి సంకురాత్రి చేసుకో
మామల్లే మాగానుల్లో బాసలంత చేసుకో
పూబంతి పూవందాలు బందీ కట్టి వెళ్లిపో
పూటకో పులకింతగా జంటగా పురి విప్పుకో
మరుమల్లెల మహారాజుకి తెరచాటుల ప్రతి రోజుకి
ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో
కలత నిదర చెదిరే తొలి కలల వలపు ముదిరే
కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో
ఉత్తరాలు రాయజాలని ప్రేమలో



********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: డి. నారాయణ శర్మ
గానం: యస్.పి. బాలు, చిత్ర

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్

ఈలవేసి గాలమేసి గోల చూశానే
రూపు జూసి ఊపు జూసి కాపు కాశానే
వయసు తహ తహ లాడే
సొగసు చిటపటలాడే
వయసు తహ తహ లాడే
సొగసు చిటపటలాడే
వలపు నెగడతో వగలు సెగలతో రగిలిపోతి నేను
మరులు మెరుపులై కుళుకు ఉరుములై దరికి చేరినాను
గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్

తీపిపూత పూతరేకు మూత వేశాను
మూత తీసి పూతరేకు తీపి చూశాను
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
కొసరు మరువకు మావా
ఎసరు పెడతను భామా
ఎగువ బిగువులో ముడులు సడలగ మరిగిపోయే మేను
పొగరు పరువమే పురులు విరియగ మురిసిపోతి నేను
ఒడిలో పడ్డాక వద్దేమిటున్నాది

మాయదారి తేనెటీగ
మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా
గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా
పదహారు ఈడు నాది నీదేరా

మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్
కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో
జమ్ జజమ్ జమ్ జమ్ జజమ్ జమ్



********  *******   ********



చిత్రం: బావ బావమరిది (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాల్లకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లై పోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నచ్చే పోజీవ్వన మెచ్చే ముద్దివ్వనా
నువ్వొకటిస్తే రాజా నేనింకొకటిస్తా
అరవై నాలుగు కళలు నా ఒడిలో నేర్పిస్తా
కోడె వయసు కౌగిట్లో కొత్త కోక నలగాలి
నంగనాచి మలుపుల్లో గంగ వెర్రులెత్తాలి
వాడుకుగా వేడుకగా గుమ్మని గుమాయించు గురుడా

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి

నీలో ఆవేశము నాలో ఆరాటము
పోటా పోటీ లూటీ చేసెయ్యాలీపూట
సొగసులు దాచిన చోట సాగించే నీ వేట
వగలమారి వెన్నెల్లో ఉడుకులెత్తి పోవాలి
మల్లె పూల గుండెల్లో మోత మోగిపోవాలి
ఆ రతికే హారతిగా రేయిని రఫ్ఫాడించు మగడా

కొంటె కోనంగి వయసిది
నీలో చూసింది మగసిరి
అబ్బ ఎన్నాల్లకో నువ్వు దొరికావురో
కసిగా ఇల్లు ఒళ్ళు గుల్లై పోనీ
రారా హీరో మస్తి మారో
గుమ్మెత్తిస్తా దేఖో యారో

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default