Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dulquer Salmaan"
Lucky Baskhar (2024)



చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
దర్శకత్వం: అట్లూరి వెంకీ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల తేది: 31.10. 2024



Songs List:



శ్రీమతి గారు పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ భాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: విషాల్ మిశ్రా, శ్వేతా మోహన్ 

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే.. సమయంలోన మరిచిపోతే బాధ కబురు
వద్దు అంటూ ఆపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడమ్ గారు

పలుకే నీది.. ఓ వెన్నె పూస
అలకే ఆపే మనసా
మౌనం తోటి మాట్లాడే భాష.. అంటే నీకే అలుసా
ఈ అలలా గట్టు.. ఆ పూల చెట్టు.. నిన్ను చల్లబడవే అంటున్నాయే
ఏం జరగనట్టు నీవ్వు కరిగినట్టు.. నే కరగనంటూ చెబుతున్నాలే
నీతో వాదులాడి.. గెలువలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు.. ఆఖరికి నెగ్గేది మీ మగవారు

హాయే పంచే ఈ చల్లగాలి.. మళ్లీ మళ్లీ రాదే
నీతో ఉంటే ఏ హాయికైనా.. నాకే లోటేం లేదే

అదుగో ఆ మాటే.. ఆంటోంది పూటే.. సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే.. ఆడే అలవాటే మానేయవేంటో కావాలని
నువ్వే.. ఉంటే చాల్లే.. మరిచిపోనా ఓనమాలే

బావుంది.. బావుంది.. ఓ శ్రీవారు
గారాబం మెచ్చిందే శ్రీమతి గారు



లక్కీ భాస్కర్ పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి
గానం: ఉషా ఉతుప్

షబాషు సోదర కాలర్ ఎత్తి తిరగర
కరెన్సీ దేవి నిను వరించేరా
తమాష చూడరా నీ గ్రహాలు సర సరా
అదృష్టరేఖ పైనే కదిలెరా
నిన్ను ఆపేవాడే లేడే
నీదైన కాలం నీదే
మొదలురా మొదలురా మొదలురా…..

యు  లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

శక్తి నీదిర యుక్తి నీదిర
కోటి విద్యలేవైనా కూటి కోసమేలేరా
లెగర నరవర మెదడుకే పదును పెట్టరా
దిగర ధీవర లాకెర్లు కొల్లగొట్టరా
ఎగుడుదిగుడుగా ఇన్నాళ్ల రొస్టు చాలుర
బెరుకునోదలరా మారాజులాగ బతకరా
మబ్బుల్లో తేలే చోర డబ్బుల్తో నాట్యం చేయరా
గల గల గల గల గల గల

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్

గీత దాటర రాత మార్చరా
సగటు మానవా సైరా నగదు పోగు చేసేయరా
మనను నమ్మిన నలుగురి మంచి కొరకెర
మంచి చెడునల మనసులోనే దాచర
మెతుకు పరుగులు ఈ పైన నీకు లేవురా
బతుకు బరువుని దించేసి కాస్త నవ్వరా
ఆర్చేది వారా వీర నీ యుద్ధం నీదేలేరా
చెగువరా చెగువరా చెగువరా

యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్
యు లక్కీ భాస్కర్ యు లక్కీ భాస్కర్




నిజామా కలా పాట సాహిత్యం

 
చిత్రం: లక్కీ బాస్కర్ (2024)
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సాహిత్యం: శ్రీమణి
గానం: కృష్ణ తేజస్వి 

నిజామా కలా

Palli Balakrishna Wednesday, November 13, 2024
Sita Ramam (2022)



చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
నటినటులు:దుల్కర్ సాల్మన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ 
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వని దత్ 
విడుదల తేది: 05.08.2022



Songs List:



ఓ సీతా వదలనిక పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: యస్.పి.బి.చరణ్ , రమ్యా బెహ్రా 

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా

హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా

జంట జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా

నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ
నీ చూపులే నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో

నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే

ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా

హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా




ఇంతందం దారి మల్లిందా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యస్.పి.బి.చరణ్ 

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా

జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి 
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా

అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే



కానున్న కళ్యాణం ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి. S

ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా...
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా...
ప్రణయమునేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)

చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా

గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా
అవా..! సరే..!!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా.... (2)

తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట..!
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి.!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)




ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద 

వస్తా… నే వెంటనే
ఉంటా… నీ వెంటనే

ముద్దంటిన చెంపపై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా

నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుందీ
చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

Palli Balakrishna Tuesday, August 2, 2022
Kurup (2021)



చిత్రం: కురూప్ (2021)
సంగీతం: శుశిన్ శ్యామ్
నటినటులు: ధుల్కర్ సల్మాన్ , శోభిత దులిపాల 
దర్శకత్వం: శ్రీనాథ్ రాజేంద్ర 
నిర్మాతలు: ధుల్కర్ సల్మాన్ , విసాక్ సుబ్రహ్మణ్యం
విడుదల తేది:  12.11.2021



Songs List:



ఇది పరవశమో పాట సాహిత్యం

 
చిత్రం: కురూప్ (2021)
సంగీతం: శుశిన్ శ్యామ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: హరిప్రియ 

ఇది పరవశమో… తొలి కలవరమో
ఎద మలుపులలో… మెదిలిన స్వరమో
ఎద వణికినది… నిను పిలిచినది
నిను తలువగనే మదువొలికినది

అణువణువున ఓ అలజడి కలిగే
ఒక విరహములో వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది ప్రియ సఖుడా

క్షీరసాగరమేగా అనురాగం
కసికసి తనువుల ప్రియరాగం
నిండు యవ్వనమేగా ఒక యోదం
వయసులు కలబడు సుఖభోగం

ప్రియుడా ప్రియుడ ప్రియతమా సఖుడా
కలలో ఇలలో నిను విడగలనా
సొగసుల భారం పెరిగినదోయి
సమరమే సఖుడా ప్రియమోయి

ఇది పరవశమో… తొలి కలవరమో
ఎద మలుపులలో… మెదిలిన స్వరమో

అణువణువున ఓ, హ్మ్ హ్మ్… అలజడి కలిగే, హ్మ్ హ్మ్
ఒక విరహములో వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది ప్రియ సఖుడా




డింగరి డింగాలే పాట సాహిత్యం

 
చిత్రం: కురూప్ (2021)
సంగీతం: సులైమాన్ కక్కొదన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: దీపక్ బ్లూ

డింగరి డింగాలే
అమ్మాడి… డింగరి డింగాలే
మధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే

డింగరి డింగాలే
అమ్మాడి… డింగరి డింగాలే
మధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే

పక్కింట్లో ఉన్న రంగేళి బొమ్మ
కొంచం వాటేస్తే… పెట్టెయ్నా చుమ్మా
బెల్ బాటమ్ ప్యాంటు వేసి
హై హీల్స్ షూస్ తొడిగి
చేపమల్లె జారుద్ది గుమ్మా

రావే రావే రావే
నా వంక రావే రావే
ఇయ్ వే ఇయ్ వే
ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే

మోజుపడ్డ కుర్రదాని పోజులో
ఒక మజా ఉందే… ముద్దు గుమ్మ
కళ్ళు మూసి… నిన్నే నేను తలవగా
అరె నువ్వే నా కలల తలుపు తీశావంట

బ్రెడ్డుకి వెన్నపూసే మిస్సమ్మ
నువ్వు లేకుంటే ఆకలి లేదే
బ్రెడ్డుకి వెన్నపూసే మిస్సమ్మ
నువ్వు లేకుంటే ఆకలి లేదే

నీకోసం ప్రేమ ప్రేమ
ఒక సంద్రాన్నే ఈదొస్తానే
సై అంటే భామ భామ
మత్స యంత్రాన్నే కొట్టేస్తానే

రావే రావే రావే
నా వంక రావే రావే
ఇయ్ వే ఇయ్ వే
ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే

రావే రావే రావే
నా వంక రావే రావే
ఇయ్ వే ఇయ్ వే
ఓ గిఫ్టు ఇయ్ వే ఇయ్ వే

Palli Balakrishna Monday, November 1, 2021
Kanulu Kanulanu Dochayante (2020)
చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, రక్షన్, నిరంజని అగతియాన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతపతి
దర్శకత్వం: దేసింఘ్ పెరియా స్వామి
నిర్మాణ సంస్థలు: Viacom18
విడుదల తేది: 28.02.2020







చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
సాహిత్యం: సామ్రాట్ నాయుడు
గానం: రోహిత్ పరిటాల

తొలి చూపులోనే పడిపోయానే
నా బాధను ఎవరకి చెప్పనే
నా మనసు కూడా నా మాటను
ఇప్పుడు వినడం లేదు లే
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే
మనసే ఎగిరే… నింగే తగిలే
చెలివే వినవే.. నవ్వుతు ప్రాణం తీయొద్దే

గుండెగిల్లి ప్రాణం తీయొద్దే (8)

ఓ ఓ ఓ ఓ

నీవే తొలి వలపే పదవే నువ్వే వినరాదటే
తలపే నీదసలే వీడనులే నీ జతే

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

ఒకసారి మనసు కలిశాక
నా పరుగు ఆపె వీలేది నా తరమా
ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా
పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి
అంతగా కవ్వింతగా నే చూసెననీ

ఓ ఓ ఓ ఓ

నీదే తొలి వలపే మనవే నువ్వే 
వినరాదటే తలపే వీడెనులే
కోరగా మది కోరగా నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడననీ

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

Palli Balakrishna Friday, February 19, 2021
Mahanati (2018)


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కీర్తి సురేష్ , దూల్కర్ సాల్మన్, సమంత, విజయ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వినీ దత్, ప్రియాంకా దత్
విడుదల తేది: 2018

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించినది ఈ జనదాత్రి
నిండుగా ఉందిలే దుర్గ దేవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిబాగునం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కనుకే అంకితం ని కన కణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

కలను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరితపుటలోన వెలుగు పొదిగావు
పెను శికరాగ్రానివై గాగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుధకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం

మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి
మహానటి మహానటి


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత ఉపద్రష్ట

అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కథలు
అపుడో ఇప్పుడో దరి చేరునుగా
కడలై ఓడై కడతేరునుగా
గడిచే కాలానా గతమేదైనా
స్మృతి మత్రమే కదా...

చివరకు మిగిలేది చివరకు మిగిలేది
చివరకు మిగిలేది చివరకు మిగిలేది

ఎవరో ఎవరో ఎవరో నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
లేదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే...

చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేలే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది

మహానటి మహానటి మహానటి మహానటి
మహానటి మహానటి మహానటి మహానటి



*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయఘోషల్

మూగ మనసులు మూగ మనసులు
మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయమన్న జాడలేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటె చైత్రమా కుహూ కుహూ కుహూ
స్వరాల ఉయాలుగుతున కోయిలైన వేల

మూగ మనసులు మూగ మనసులు

ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమ పూల పరాగమా
నా గత జన్మల ఋణమా
ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కథ అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కలలలోనే గడపని
వేరే లోకంచేరి వేగం పెంచే మైకం
మననిల తరమని తారతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని

మూగ మనసులు మూగ మనసులు


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చారులత మణి

సదా నన్ను నడిపే నీ చెలిమే పూ దారై నిలిచే...
ప్రతి మలుపు ఇక పై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే
కాలం నర్తించద నీతో జతై
కాలం స్మృతించదా నీకోసమై
కాలం నటించదా నీతో జతై

నదికి వరదల్లె మదికి పరవల్లై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పేరిగిందో
తలుపు తొలి జల్లై తనువు హరివిల్లై
వయస్సు ఎపుడు కడిలిందో
సొగసు ఎపుడు మేరిసిందో
గమనించే లోగా గమకించే రాగానా
ఏదో ఇలా లోన మోగెనా
కాలం నర్తించద నీతో జతై
ప్రాణం సుమించదా! నీ కోసమై
కాలం నటించదా నీతో జతై


*******  ******   *******


చిత్రం: మహానటి (2018)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమ్యా బెహ్రా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా
చిటికెల తాళాలు వేద్దాం
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా
తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకు మా

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా

ఓ... ఓ...ఓ...ఓ...

వూరికే పని లేక తీరికస్సలులేక
తోటలో తూనీగల్లే తిరిగొద్దామా ఎంచక్కా
అంత పొడుగెదిగాక తెలుసుకోలేనింక
సులువుగ ఉడతల్లే చెట్టెక్కే ఆ చిట్కా
నింగికి నిచ్చెన వేయవే నింగికి నిచ్చెన వేయవే
గుప్పెడు చుక్కలు కొయ్యవే
హారమల్లే రేపటి మెడ్లో వెయ్యవే
నీ పిలుపె  తంగి నలు వైపుల నుండి
అర చేతులు వాలలేయ్ నీ మధి కోరిన కానుకలన్ని

ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా
సరదా సిరిమువ్వలవుదాం
యేటిలో వేగమా పాటలో రాగమా



Palli Balakrishna Thursday, May 10, 2018
Hey Pillagada (2017)


చిత్రం: హే పిల్లగాడ (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: దుల్కర్ సల్మాన్ , సాయి పల్లవి,
దర్శకత్వం: సమీర్ తాహిర్
నిర్మాత: డి.వి.కృష్ణస్వామి
విడుదల తేది: 2017

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే
వీచే చిరుగాలివా లేదా జడివానవా
నువ్వే తాకేయగా కలలే రేగెనలా
వాలు కనులా వసంత గానమా
కౌగిలివే పోయేలా ప్రాణమా

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే

నిన్నే చూస్తూ ఉంటే ఓ ప్రియం
నిమషమల్లే కరిగేను ఓ యుగం
ప్రణయమా ఆ కడలి గుండెల్లో లోతు అంత
ప్రాణమా నీ మీద నాకు ఉంది ప్రేమ అంత
పువ్వుల్లో నిను దాచుకుంటానులే పసి నవల్లే
నిన్ను చూసు కుంటానులే

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే

నాలో  ఎగసే నా కోపమే అలా
తరిగి పోయే గుర్తొస్తే నువ్ ఎలా
కాలమే ఓ తీపి నవ్వులే పలకరించే
లోకమే నా కెదురుగా వచ్చి తలుపు తెరిచే
ఏముందే నీ జంట నాయనాలలో
నన్ను మార్చావే నీ రంగు స్వప్నాలతో

బుల్లి లాంతర్ వెలుగే చెలి నీ నవ్వే
అది జిల్ జిల్ మని చిందేస్తే  ఎదకు లబ్ డబ్ పెరిగే
నిన్ను రమ్మని పిలిచే చెలి నా మనసే
నీ ఘల్ ఘల్ అను పట్టీల మెరుపే గుండెకు ఉషస్సే
వీచే చిరుగాలివా లేదా జడివానవా
నువ్వే తాకేయగా కలలే రేగెనలా
వాలు కనులా వసంత గానమా
కౌగిలివే పోయేలా ప్రాణమా


*******  *******   *******


చిత్రం: హే పిల్లగాడా (2017)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: సింధూరి

ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్
ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా
అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని
నువ్వు గాయం చెయ్యొద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం

అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం

మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు
ఇంకేదో ఐనట్టు గొడవెందుకు
నువ్వే పలికే ఖర్చేమి లేదంట
తప్పేమి కాదంట నవ్వచ్చుగా
నీ అందం నీ ఆనందం
నీ చేతుల్లో ఉండాలంటే
నువ్వింకా వదిలెయ్యాలి కోపం
ఓ సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే చాలురా..
ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్
ఒక చూపుతో చిరుకాంతులే పంచేయ్

పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా
నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే వీడొద్దు నువ్వే


Palli Balakrishna Saturday, October 7, 2017
OK Bangaram (2015)

చిత్రం: ఓకే బంగారం (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఏ. ఆర్.రెహమాన్, కార్తిక్, శాశా తిరుపతి
నటీనటులు: దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 17.04.2015

మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
జస్ట్ లైక్ దట్
మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా

మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి (2)
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి
మక్కువెక్కువై పొద్దుపోదు అంటే
తిట్టుకోదా మధి తిక్కరేగిపోయి

వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్

మాయేదో చెయ్యవా మరేదొ చెయ్యవా
ని ని ని ని ని ని ని నీక్కూడా తెలుసేమో

వీలుకాదేమో - జస్ట్ లైక్ దట్
ఆశ తగదేమో - జస్ట్ లైక్ దట్

ఇలాంటి వేళలో పంతానికేం పని
తెగించి అల్లుకో ఉన్నాను రమ్మని
మేఘాల గాలిలో పైకి తూగిపో
ఎల్లలన్ని దాటవా గాలి వేగమా

మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా

సడిలేని మాటతో కబురులు చెప్పవా
తడిలేని వనలలో తలంటు పొయ్యవా
స్నేహాల వాగులో దాహాలు తీర్చుకో
మోహల ఊహలో దేహాలు దేనికో

M- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
F -మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
M&F మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
F- మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా



*********   *********   **********



చిత్రం: ఓకే బంగారం (2015)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శాశా తిరుపతి , సత్యప్రకాష్

విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
కొన్నాళ్లుగా ఏదో నీలో ఉన్నదీ...
విన్నావ నా హృదయం ఏదో అన్నదీ
ఏదో అడగనా ఏదైనా అడగనా

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన

ఏదో.. ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న సంగతులే
చిన్న చిన్న చిన్న చిన్న స్వరగతులే
చిన్న చిన్న సరదాలు
చిన్న దాని చిన్న చిన్న సంశయాలు
విన్నవించు ఆశలు పలికిన సరిగమలో..ఓ..ఓ..

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగనా...
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా

తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి జతిలోన
తకధిమి తకధిమి సడిలోన
తకధిమి కదలిక
తకధిమి తికమక కవళిక
తదుపరి తకధిమి తెలుపని తరుణంలో

ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా
అణుకువగా అడగనా తెగ తెగువై అడగనా
అడగకనే అడగన అడిగినదే అడగన
ఏదో..ఏదో..ఏదో అడగనా ఏదైనా అడగనా
మాటల్తో అడగనా మౌనంతో అడగనా



Palli Balakrishna Friday, August 11, 2017

Most Recent

Default