Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Judagadu (1979)




చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ 
దర్శకత్వం: వి.మధుసూధనరావు 
నిర్మాత: చటర్జీ 
విడుదల తేది: 15.08.1979



(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు వీరిద్దరూ కలిసి యమగోల (1977) సినిమాలో పాటలు రాయటం ఇదే మొదటిసారి, తరువాత మల్లెపువ్వు (1978) సినిమాలో మళ్ళీ రెండవసారి పాటలు రాశారు. మూడవసారి జూదగాడు (1979) సినిమాలో పాటలు రాశారు. తరువాత,  మంగళ గౌరి (1980)  ఈ నాలుగు సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )



Songs List:

కాశీకి పోయినా గంగలో దూకినా పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

కాశీకి పోయినా గంగలో దూకినా



అల్లారు ముద్దుగా పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

పల్లవి:
అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది
మా చెల్లి బంగారు తల్లీ ...
మా అక్కా చక్కనీ చుక్కా ...
పోయిరావమ్మా... పేరు తేవమ్మా... బంగారు తల్లీ

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది

చరణం: 1
పూజ చేసి.. ఏరి కోరీ.. నిన్ను చేసుకుంది
పూజ చేసి.. ఏరి కోరీ.. నిన్ను చేసుకుంది

పువ్వుల్లో పెట్టుకో... చిరునవ్వుల్లో దాచుకో
మనసారా కాపురాన్ని మలుచుకో...
మా లక్ష్మికి అండగా మేమున్నాం తెలుసుకో
బావా.. ఓ .. మా మంచి బావా
బావా.. ఓ .. మా మంచి బావా

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది

చరణం: 2
బావగారూ.. మహా గడుసువారూ.. మంచి చేసుకో
బావగారూ.. మహా గడుసువారూ.. మంచి చేసుకో

చిలిపి పనులు చేశాడో... ఆ చెవులు పుచ్చుకో
కట్టుకున్నవాడు కలకాలం నీ మదిలోనే ఉన్నా...
తోడబుట్టినాము మమ్ము క్షణ కాలం తలుచుకో

చెల్లీ.. ఓ.. బంగారు తల్లీ..
అక్కా.. ఓ.. చక్కని చుక్కా

అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి
అత్తవారింటికి తరలింది
మా చెల్లి బంగారు తల్లీ ...
మా అక్కా చక్కనీ చుక్కా ...
పోయిరావమ్మా... పేరు తేవమ్మా...
బంగారు తల్లీ... బంగారు తల్లీ ...





రంగు పూల పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

రంగు పూల మంగినీలు అందుకోర




కారు కింద కోడి పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు

కారు కింద కోడి 



రైకంతా రంగేమిటే పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: జాలాది రాజారావు 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

రైకంతా రంగేమిటే 




మల్లెల వేళ అల్లరి వేళ పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల, జి. ఆనంద్ 

పల్లవి:
మల్లెల వేళ అల్లరి వేళ
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

చరణం: 1
ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు జల్లంది
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

చరణం: 2
ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది
నింగీ నేల ఉరిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల దీవించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల





కన్నెపిల్లలు కలల హీరో పాట సాహిత్యం

 
చిత్రం: జూదగాడు (1979)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

కన్నెపిల్లలు కలల హీరో 

No comments

Most Recent

Default