Ammoru Maa Thalli Song Lyrics in Telugu – Ammoru (1995)
'Ammoru Maa Thalli' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Rasaraju.
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: రసరాజు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
అమ్మా..అమ్మోరు తల్లో
మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లో
ఆదిశక్తివి నువ్వేనంట
అపరశక్తివి నువ్వేనంట
దుష్టశక్తులను ఖతం చేసే పరాశక్తివి నువ్వేనంట
నీ కళ్ళలో సూర్యుడు చంద్రుడు నిత్యం వెలుగుతూ ఉంటారంట
వేదాలన్ని నీ నాలుకపై ఎపుడూ చిందులు వేస్తాయంట
నింగి నీకు గొడుగంట
నేల నీకు పీఠమంట
నిన్ను నమ్మినవాళ్ళ నొములు పంటకు నారు నీరు నువ్వేనంట
పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలవమ్మా
జిత్తులమారి నక్కల మధ్య దిక్కేదో తోచని దీనులవమ్మా
బ్రతుకు మాకు సుడిగుండం
ప్రతిరోజు ఆకలిగండం
గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా
Challani Maatalli Ammoru Song Lyrics in Telugu – Ammoru (1995)
'Challani Maatalli Ammoru' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra. Lyrics are written by Mallemala.
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: కె. ఎస్. చిత్ర
చల్లని మా తల్లి అమ్మోరు
Dandalu Dandalu Song Lyrics in Telugu – Ammoru (1995)
'Dandalu Dandalu' song from Ammoru (1995) movie is composed by Sri Kommineni and sung by K. S. Chithra, Mano, Lalitha Sagari and Madhavapeddi Ramesh. Lyrics are written by Mallemala.
చిత్రం: అమ్మోరు (1995)
సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: మల్లెమాల టీం
గానం: కె. ఎస్. చిత్ర
ఎదురు తిరిగి నిలువలేక
వేరే దిక్కేవ్వరులేక
పతితముద్ర పడకుండా పదసన్నిధికి వచ్చాను
నువ్వు దిద్దిన నుదిటిబొట్టు నేలపాలు కాకముందే
చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే
ప్రళయకాల మేఘంలా
పెనుతుఫాను కెరటంలా
రా రా కదలిరా కదలిరా
కడుపుచిచ్చు చల్లారకముందే
నిప్పులచెరలో నిలేపేవమ్మా
క్షుద్రశక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా
ఉందో లేదో తెలియని స్దితిలో ప్రాణం ఉందమ్మా
ఉప్పెనలాగా ముంచుకు వచ్చే ముప్పును తప్పించి
ఆదిశక్తిలా కాకపోయినా ఆమ్మగ రక్షించి
నా పసుపుకుంకుమ నిలుపగ రావమ్మా
రా రా కదలిరా కదలిరా
ఆలయాన ఒక మూగబొమ్మవై శిలగా నిలిచేవే
చేసిన కర్మను అనుభవమించమని నన్ను వదిలేసావే
ఐతే నీకు ఈ మొక్కులు ఎందుకు
ఏటేటా ఈ జాతరలెందుకు
ఇంక నీకు ఈ గుడిఎందుకు
ఆ గోపురమెందుకు
ఆగకముందే నా ఆక్రోశం అగ్నిగా మారకముందే
ఆ దావానలజ్వాలలో నేను ఆహుతి కాకముందే
దుర్గవై..చండివై..దురితవినాశంకరివై
అంబవై..అభయవై..అగ్రహోతగ్రవై
చూపులెడి బాకులుగా
పాపత్ముల గుండే చీల్చి
పెల్లుబికిన రక్తంలో
తల్లీ నువ్వు జలకమాడి
సత్యమేవ జయతే అని లోకానికి చాటింపగా
రా రా కదలిరా కదలిరా
No comments
Post a Comment