Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kishore Tirumala"
Aadavallu Meeku Johaarlu (2022)



చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
నటీనటులు: శర్వానంద్, రస్మిక మందన్న
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: 25.02.2022



Songs List:



ఆడాళ్ళు మీకు జోహార్లు పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవీశ్రీప్రసాద్

హే లక్ష్మమ్మో పద్మమ్మో
శాంతమ్మో శారదమ్మో
గౌరమ్మో కృష్ణమ్మో
నా బాధే వినవమ్మో

ఈ గోలే ఏందమ్మో
ఈగోలే చాలమ్మో
ఓలమ్మో ప్లీజమ్మో
నా బతుకే బుగ్గయ్యేనమ్మో

నీ మొగుడేమన్నా మహేష్ బాబా
పోనీ అందానికేమైనా బాబా
చైలా..! కాపురం చైలా
కన్లా..! ఇద్దర్ని కన్లా

పోనీ నువ్వేమన్నా కత్రీనా కైఫా
నీ చూపేమన్నా గుచ్చే నైఫా
కానీ, చైలా..! కాపురం చైలా
మీరు కన్లా..! ముగ్గుర్ని కన్లా

మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి
పూలన్నీ జళ్ళోన ముడిసేత్తారా
నాకేమో ఏ పూలు లేకుండా సేసేసి
ఫూల్లాగ మడిసెత్తారా..?

ప్రతి మొగాడి విజయం వెనక
ఆడది ఉంటది అంటారు
కానీ నా విజయాన్ని
చెడగొట్టడానికి ఎందరు ఆడాల్లో

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

సినిమాకెళ్తే నా ఏజ్ ఫ్రెండు
పెళ్ళాన్ని తీసుకురాడా
వాడు నన్నే చూసి
సెల్లమ్మేదని అనడా, మరి అనడా

సాయంత్రమైతే సందు శివర
పువ్వుల కొట్టు సుబ్బన్న
మల్లెలు తీసుకెళ్ళి సెల్లెలుకిమ్మని
వెయ్ డా, జోకులు వెయ్ డా

మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా
సిరునవ్వులొలికించి ఎదురొత్తారా
నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి
ఇవ్వనియ్యకుండా ఆపెత్తారా

ఎదురింట్లోన ఎంకయ్య తాతకి
ఇద్దరు పెళ్ళాలు
అరె, లేనే లేదు నా తలరాతకి
సింగిలు ఇల్లాలు

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు

ముద్దులతోటి నిద్దుర లేపే
పెళ్ళాం కావాలని ఉండదా
డిన్నరు పెట్టి డ్రీమ్స్ లోకి
నెట్టే డ్రీమ్ గర్ల్ నాకు కావాలని పించదా

తన ఒళ్ళో వాలి ఓటీటి చూడాలి
అని నాక్కుడా ఉండదా
ఆకలి వేస్తే తనకో ఆమ్లెట్
వేయాలనిపించదా, నాకనిపించదా

మీరేమో మీ మొగుడు పండక్కి
కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేత్తారా
నేనేమో ఓ పట్టు సీరైనా కొనకుండా
నా పెళ్లి హాంఫట్టు సేసేత్తారా

అరె గంతకి తగ్గ బొంతని సామెత
మీరే సెబుతారే..!!
నా రేంజికి తగ్గా పిల్లని తెస్తే
ఓకే చెప్పరే..!!

ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడాళ్ళు మీకు జోహార్లు, హ




ఓ మై ఆద్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: యాజిన్ నిజార్

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే 
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా 
ప్యారంటూ పలికేనే

ఓ ఓ ఓ - తేరే జైస కోయి నహీ
ఓ ఓ ఓ - మేరే జైసా దివానా నహీ
ఓ ఓ ఓ - రూటే గీసా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే
నడవని బండినే మనతో
వీక్ డే సాటర్డే‌ బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో

సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం..!!

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే

వేమన పద్యమే, షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే
లాస్ట్ బాల్ సిక్సరే, షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే

అందగా ఉంటావంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన హైకూ లెన్నెన్నో చదివాలె
అసలందం ఇవాళ చూసానే అది నీ నవ్వే

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కారైనా గిటారై మోగెనే
ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేరైనా
ప్యారంటూ పలికేనే



ఆసమ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్ 

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

బాగున్నావా అని నువ్వడిగావా
నా బాధలన్నీ పారిపోవడం, ఆసమ్
భోంచేశావా అని ఓ మాటన్నావా
నా ఆకలే మాయమవ్వడం, ఆసమ్

ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్నా
ఇంక కొన్ని మిగిలిపోవడం, ఆసమ్
ఎంత ఎంత ఎంత… ఎంత దూరమున్న
నువ్వు పక్కనున్న ఫీలింగ్ కలగడం, ఆసమ్

ఇంత కాలము… ఇన్ని రాత్రులు
ఎలాగ నువ్వల్లే కబుర్లే లేక
కాలం వ్యర్థమాయనే

ఇన్ని రోజులు… రెండు కళ్ళలో
ఇలాగ కలల్నే కథల్నే
చూసే వీలే లేకపోయెనే

నువ్వు నన్ను కలవమన్న
చోటు ఎక్కడున్నా
ఓ గంట ముందే నేను రావడం, ఆసమ్

ఇంటి వరకు సాగనంపి
వీడుకోలు అన్న వెంటనే
ఫోన్లో కలవడం, ఆసమ్

నాకెంత నచ్చినా… నీ ఇంత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ… ఛా అంటూ
నీతోటి ఏవోటి తిట్లు కల్పనా

ఏ పనొచ్చినా… మా అమ్మే చెప్పినా
నాతోటి నీకేదో పనుంది అన్నానో
నీవైపే పరుగు తియ్యనా

నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చెప్పగానే
నా ఇష్టమే మారిపోవడం, ఆసమ్
తాజ్ మహల్ అందం అంటూ
నువ్వు పొగుడుతుంటే
షాజహాన్ ని నేనే అవ్వడం, ఆసమ్

మేల్కొన్నావా అని నువ్వు అడిగావా
నా నిద్ధరే సారీ చెప్పడం, ఆసమ్
తెల్లారిపోయిందా అని ఫోనే పెట్టావా
ఆ సూర్యుడంటే ఒళ్ళు మండడం, ఆసమ్





మాంగల్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: దేవీశ్రీప్రసాద్
గానం: జేస్ప్రీత్ జస్జ్

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా
కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా
నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనివ్వకుండా
ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు

రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా
నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు
చుక్కలు చూపిస్తున్నారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం ఓం
ఓం శత ఓం
శత శత ఓం ఓం
శత ఓం శత శత ఓం

జీలకర్ర బెల్లం బదులు
నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా
నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు

ఫస్ట్ నైటే నాకు లేకుండా
ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు
హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా
ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు

మాంగల్యం తంతునానేనా
మన లైఫులో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ
మన జీవితమే సాగునా

కంఠే భద్నామి సుభగే
ఈ సౌండే పడునా మనకే
త్వం జీవ శరదాం శతం
ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం




కలగా కలగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (2022)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: శ్రీమణి 
గానం: మహాలింగం 

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ దరో చేరాలని
మొదలైన ఈ ప్రయాణమే
ఏ ధరి దరిచేరక ఏ వైపు సాగునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

ఏ గుండెది ఏ భారమో
ఈ మనసుకే తెలిసేదెలా
ఏ కన్నుది ఏ శోఖమో
ఈ చూపుతో చూసేదెలా

తెలియదు ఏ పదాలు
రెండు ముడిపడునో
ఏ క్షణాన విడిపోవునో
తెలుపవు ఏ స్వరాలూ
తీపి పాటౌనో టెన్ టు ఫైవ్
వేధనల్లే వేధించునో

కలగా కలగా
కలగా మిగిలే కధలెన్నో
అటువైపే అడుగేస్తుందా
ఈ కథ కూడా

అనగా అనగా
అనగనగ పయనాలెన్నో
వాటన్నిటి మధ్య
నలగని ప్రేముంటుందా

Palli Balakrishna Monday, February 14, 2022
Red (2021)



చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రామ్ పోతినేని, నభా నటేష్ , నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవి కిశోర్
విడుదల తేది: 14.01.2021



Songs List:



నువ్వే నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: రమ్యా బెహ్రా , అనురాగ్ కులకర్ణి 

నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరెవరం కోరే పనేమీ లేదుగా
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక

నీ స్పర్శే చెప్పింది
నే సగమే ఉన్నానంటూ
నీలో కరిగినాడే నేనంటూ పూర్తయినట్టు
ఇన్నాళ్లు ఉన్నట్టు
నాక్కూడా తెలియదు ఒట్టు
నువ్వంటూ రాకుంటే
నేనుండున్నాను లేనట్టు
ఈ లోకంలో మనమే తొలి జంటని
అనిపించే ప్రేమంటే పిచ్చే కదా
ఆ పిచ్చే లేకుంటే ప్రేమేదని
చాటిస్తే తప్పుందా నిజం కాదా

నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మారె వరం కోరే పనేమీ లేదుగా
ఎడారి దారిలో ఎదురయ్యే వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక

ఎందుకు జీవించాలో అనిపించిందంటే చాలు
ఇందుకు అంటూ నిన్ను చూపిస్తాయి ప్రాణాలు
ఎవ్వరితో చెప్పోదే మనిద్దరిదీ గుట్టు
నువ్వే నా గుండెల్లో గువ్వల్లే గూడును కట్టు
ఎటు వెళ్లాలో వెతికే పదాలకు
బదులయి ఎదురొచ్చింది నువ్వే కదా
నన్నేవారికివ్వాలి అన్నందుకు
నేనూనున్నది నువ్వే కదా




డించిక్ డించిక్ డింకా... పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాకేత్, కీర్తన శర్మ

ఎక్కడీ దానవే... సక్కనీ కోమలి
ఒక్కదానివి ఉన్నావేందే... వస్తవా భీమిలీ
గంపెడు ఆశతో... దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగాళ్ళంతా... ఇడిసినా ఫ్యామిలీ
అయ్.. చెప్పుకుంటే బాధ... అరె, తీరిపోద్ది చంచిత
అరె..సెట్టంతా మావోడున్నాడు... సెట్టు సేత్తడు నీ కథా
ఏడి... ఎక్కడున్నడు..?
నా కళ్ళకు కనిపించమను, మీ హీరోని కూసింత

పన్నెండు డబ్బాల... పాసెంజర్ బండెక్కి...
పదకొండు గంటలకు... పోదమన్నడు బొంబైకి
పదిమంది సూచారని... సాటుగ వచ్చా టేషనుకి
హే..తొమ్మిదో నెంబర్ మీదికి... రైలొచ్చేరొవ్వంతటికే
సల్లటి ఏసీ బోగీలో... సూపిత్తాడే ఒకటికి
హాయ్ చెప్పి దుప్పటి ఏసి... దూరిండమ్మీ మాపటికీ
కూ చుక్ చుక్ కూతలు తప్ప... మోతలు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి... జంపయ్యిండే పొద్దటికీ

ఆయ్...డించిక్ డించి డింకా... ఆడా ఈడా దూకకేజింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించి డింకా... తీగ లాగితే కదిలే డొంకా

గుంజూతుంటే చైను... గురునాథం పిలిచే నన్ను
కట్టే చేస్తే సీను... చెన్నైలో తేలాను
రంజూగుందే స్టోరీ... ఏటయ్యిందే ఈసారి
కంచిపట్టు సారీ... నలిగిందా లేదా జారి
ఇంగిలీషు సినిమా సూద్దాం... ఇంగవా అన్నాడు
ఎంగిలి ముద్దులంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా... నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో... నైటు హుషారు
లుంగీ డాన్స్ చేద్దామంటూ... పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రుపెట్టి... మెక్కి ఇడ్లీ సాంబారు, ఊఊ

ఆయ్...డించిక్ డించి డింకా... ఆడా ఈడా దూకకేజింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించి డింకా... తీగ లాగితే కదిలే డొంకా

తిప్పి సందు సందూ... నా వల్ల కాదని చందు
ఛార్మినారు ముందు... తాగించాడే మందు
జాగాలన్నీ చుట్టి... మా వైజాగోచ్చావా చిట్టి
బాగుంటాదే సిట్టీ... చూస్తావా చెమట పట్టీ
లైటు హౌజులాగా ఉంది బాసు కటౌటు
రూటు పట్టి రౌండే సొద్దాం... పట్నం సూపెట్టు
చెండూ లాగా మెత్తగా ఉంది... పాప నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే... తిరుగుతాయే కళ్ళు
ఎత్తుపళ్ళం ఎక్కి దిగి... వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసి ఈన్నే ఉంటా... ఇచ్చావంటే సిగ్నళ్ళు, ఊఊ

ఆయ్... డించిక్ డించిక్ డింకా... ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా... మా బుచ్చుకి
రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా... తగలెట్టేస్తా నీలంకా
డించిక్ డించి డింకా... తీగలాగితే కదిలే డొంకా



కౌన్ హై అచ్చ... పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
నటీనటులు: రామ్ పోతినేని, మాళవిక శర్మ, అమ్రితా అయ్యర్
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం : శ్రవంతి రవికిశోర్
విడుదల తేది: 14.01.2021

వాడు వీడు బ్యాడు అంటూ... నువ్వు చెప్పకు,
దొబ్బెయ్
మంచి అంటూ ఒకటి అసలుంటేగా
నంగి నంగి చూసే... గండు పిల్లిలాంటి
నీకు రంగులెన్ని చెప్పు...

నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని... చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె
వేషాలింకా చాలు ఇంకైనా... మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పినా

కౌన్ హై అచ్చా... కౌన్ హై లుచ్చా
ఫరకే లేదు చిచ్చా... ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ... కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా... ఇదంతా నీ పిచ్చా
నింగి నేల చూశా... నీతి ఎక్కడుంది చెప్పు
చూసి వద్దాం కాస్త...
మారిపోద్ది న్యాయం... నోటు రేటు మారేకొద్ది

వెతకమాకు దాన్ని... ఆ
అంతా తెలుసని అంటావు... తెలిసిందేదైనా అంతా కానేకాదు,
సమ్లోనా
లైఫ్ ఫెయిరు కాదు అన్నావో... ఒకటిచ్చుకొన
ఎవడు మాటిచ్చాడు నీకైనా...
రచ్చా
కౌన్ హై అచ్చా... కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు
చిచ్చా...
ఎందుకంటా
కౌన్ హై అచ్చ...
కౌన్ హై లుచ్చా
బోలో మేం
బచ్చా...
ఇదంతా నీ పిచ్చా
కళ్ళలోకి చూసే... నిన్ను లెక్క వేసేనంట
లోకం అంత అంతే రేయ్...
పూటకొక్క మాట... పూటకూళ్ళ వాడి బాట
నువ్వు మాత్రం కాదా... చెత్త నా కొ**
నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా... ఒప్పుకోవు ఉన్న
నిజాన్ని, అర్హహా
నాటకాలు ఆడుజగాన... నీ అద్దం ముందు ఆపుకొం

నాటకాలు ఆడు జగాన... నీ అద్దం ముందు ఆపు కొంతైనా,
హేయ్ థు
కౌన్ హై అచ్చా...
కౌన్ హై లుచ్చా
ఫరఖే లేదు చిచ్చా... ఎందుకంటా రచ్చా
కౌన్ హై అచ్చ... కౌన్ హై లుచ్చా
బోలో మేరె బచ్చా... ఇదంతా నీ పిచ్చా





మౌనంగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: రెడ్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దిన్కర్ , నూతన్ మోహన్

మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా
కదపొద్దంటున్నా లేలెమ్మనీ

వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన

లోలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ 
నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన

ఎవరూ మన జాడని చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరికి ఇకపైన

ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన

Palli Balakrishna Sunday, January 17, 2021
Chitralahari (2019)





చిత్రం: చిత్రలహరి (2019) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్ దర్శకత్వం: కిషోర్ తిరుమల నిర్మాతలు: నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ , మోహన్ చెరుకూరి బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ విడుదల తేది: 12.04.2019



Songs List:



పరుగు పరుగు పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: డేవిడ్ సైమన్

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

చక్రాల్లేని సైకిల్ లాగ
రెక్కల్లేని ఫ్లైట్ లాగ
బుల్లెట్ లేని రైఫిల్ లాగ
దారం లేని కైట్ లాగ
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

రేపనేది కలల్లోనేనా
నిజంగా అది రాద
నిన్నలోనె నేనుండిపోవాల
దాటి వెల్లె దారి లేదా
మబ్బుల లోని ఫుల్ల్ మూన్ లాగ
ఆర్కెస్ట్రా లేని ట్యున్ లాగ 
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం

Yeah, You Got to Run
You Got to Run
You Got to Run
You Got to Do
What You Got to Do
To Get to Where You Wanna Be
Life Is Not A
Bed of Roses Man
You Got to Get
That in Your Head
Let’s Go

ఒక్క అడుగు నన్ను
ముందుకెయ్యనివ్వదె వెనక్కి
తోసె ఎదురు గాలి
ఒక్క మెట్టు నన్ను
పైకి ఎక్కనివ్వదె
నన్ను తొక్కె ఫోర్స్ నేమనాలి
అంతం లేని నిరీక్షణ లాగ
ఫలితం లేని పరీక్షలాగ
నేను కూడ మిగిలిపోయా

పరుగు పరుగు వెల్తున్న ఎటువైపు
జరుగు జరుగు అంటుందె లైఫు
ఎంత పెంచుకుంటున్న నా వేగం
నన్ను దాటిపోతుందె లోకం




గ్లాస్మెట్సు…పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్ , పెంచల్ దాస్, దేవి శ్రీ ప్రసాద్

స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు
రెంట్ కట్టె వరకేరా రూమెట్సు

స్కుల్ కెల్లె వరకేరా క్లాస్మెట్సు
రెంట్ కట్టె వరకేరా రూమెట్సు
వీకెండ్ వచ్చె వరకేరా ఆఫిస్మెట్స్
లైఫె ఎండ్ అయ్యె వరకేరా సోల్మెట్స్

అరెయ్..ఎండ్ అంటు లేని
బెండ్ అంటు కాని..
రియల్ రెలేషన్షిప్ యే

గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు
గ్లాస్మెట్సు…గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు

హెయ్ పప్పు రేటు పెరిగితె
పెరగని పెరగని
ఉప్పు రేటు పెరిగితె
పెరగని పెరగని
పెత్రోల్ దర తగ్గితె
తగ్గని తగ్గని
ఏ పార్టి ఓడని
నెగ్గని నెగ్గని

మన స్నాక్స్ ఫ్రెష్గుండని
మన ఐస్ చల్లగుండని
మన మంచింగ్ మంచిగుండని
మన గ్లాస్ ఫుల్లుగుండని
అరెయ్ ముంచేద్దాం దాన్లొ
మన గుండెని

గ్లాస్మెట్సు మనం గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు
గ్లాస్మెట్ మనం గ్లాస్మెట్సు
గల గల గల గల గ్లాస్మెట్సు

గల గల గల
ఇది గ్లాస్మెట్స్ కల
గల గల గల
ఒక గుటకేస్తె భలా

గల గల గల
ఇది గ్లాస్మెట్స్ కల
గల గల గల
ఒక గుటకేస్తె భలా

ట్రంప్ మనకు విసాలె
ఇవ్వని మానని
పంపు నీల్లు ప్రతిరోజు
నిండని యెండని

బయ్ వన్ కి గెట్ వన్
అమ్మని ఆపని
ఐఫోన్ కి న్యూ మోడల్
దించని ముంచని

మన బీర్ పొంగుతుండని
మన బార్ రస్ గుండని
ఈ సిప్ సాగుతుందని
ఈ కిక్కు వూగుతుండని
ఈ ఒక్కటుంటె లోకం తొ
ఇంకేం పని…

గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్
గల గల గల గల గ్లాస్మెట్స్

గ్లాస్మెట్స్ మనం గ్లాస్మెట్స్
గల గల గల గల గ్లాస్మెట్స్

వి ఆర్ ఆల్ గ్లాస్మేట్స్



ప్రేమ వెన్నెలా పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సుదర్శన్ అశోక్

రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 

వానలా వీణలా వాన వీణ వాణిలా 
గుండెలో పొంగిన కృష్ణ వేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా 
సరిగమల్ని తియ్యగా ఇలా 

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో 
ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 
ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో 
నేలకే జారిన కొత్త రంగులా 

దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల 
మారదా పగలిలా అర్థరాత్రి లా 
నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలత పూతలా

రాయలోరి నగలలోంచి 
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కళ్లలా 
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన 
నిన్ను చూసే రాసినాడలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 

నడకే  నువ్వలా కలలలో కోమలా...
నడకే  నువ్వలా కలలలో కోమలా
పాదమే కందితే మనసు విల విలా 
విడువకే నువ్వలా పలుకులే గల గల
పెదవులు అదిరితే గుండె గిల గిల 

అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంతా పొంగిపోయేలా

ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా 




ప్రయత్నమే పాట సాహిత్యం

 
చిత్రం: చిత్రలహరి (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కైలాష్ కెహర్, విష్ణు ప్రియ రవి

ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే
అడుగు అడుగు వెయ్యనిదే అంతరీక్షమే అందేనా
పడుతూ పడుతూ లేవనిదే 
పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే
మహా సంద్రమే లొంగేనా
కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే

వెళ్లే దారుల్లోన రాళ్ళే అడ్డొస్తున్నా
అడ్డును కాస్తా మెట్టుగ మలచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేసాక ఆగకుండ సాగాలిర నీ సాధన

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం (2)

ఓ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే


Palli Balakrishna Tuesday, March 19, 2019
Vunnadhi Okate Zindagi (2017)



చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 27.10.2017



Songs List:



ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

ఉన్నది ఒకటే జిందగి
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా 
ఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడే 
నిజమైన ఫ్రెండ్
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక 
కాలింగ్ మారినా...
ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా....

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే

పుల్ల ఐస్ నుండి క్రీమ్ స్టోన్ కి మారినా
రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే
ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే 
టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారినా
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్పే
పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే

పెన్సిళ్ల నుండి పెండ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్  ఫ్రెండ్షిప్పే
ఫ్రూటీల నుండి బీరులోకి మారినా
పొందుతున్న కిక్ పేరే ఫ్రెండ్షిప్పే
మొట్టికాయ నుండి గట్టిపంచ్ లోకి మారినా
నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే
అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
ఎండ్ కాని బాండ్ పేరే ఫ్రెండ్షిప్పే
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే
గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే





వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్

ఆ.. మైక్ ఉన్నదే పాట లేదు
డప్పు ఉన్నదే బీటే లేదు
స్పీకరున్నదే పెప్పే లేదూ
స్టేజు ఉన్నదే స్టెప్పే లేదూ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా

పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు
సర్కిలున్నదే సెంటర్ లేదు
ఈడు ఉన్నదే ఈలే లేదు
బాడీ లోపల గోలే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా

హే రాగమున్నది రంభే లేదు
రంగు ఉన్నది పొంగే లేదు
బ్యాండ్ ఉన్నది సౌండే లేదు
గ్యాంగ్ ఉన్నది బాంగే లేదు
మేజువాని ఉన్నా ఏ జవాని లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా అయ్యో..

టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్లి బుక్కైనట్టు
రేటింగ్ చూసి రెచ్చిపోయి డిన్నర్ కెళ్ళి లాకైనట్టు
క్రేజ్ చూసి మోజుపడి చైనా ఫోన్ కి ఫూలైనట్టు
ఆఫరుంటే ఆశపడి ఆన్లైన్ మని బ్లాకైనట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కాని పార్టీ ఊసే లేదు
డిస్కో డాన్స్ ఉందీ కాని జ్యోతిలక్ష్మీ లేదూ 
గ్లామర్ బోలెడు ఉంది కాని ఓ గ్రామరంటు లేదు
రాతిరి మొత్తం ఉంది జాతర జాగరమే లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అరె వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ

ఆ పండగేల తెచ్చుకున్న థౌసాండ్ వాలా తుస్సన్నట్టు
కల్లు తాగి కోతిపిల్ల లోల్లే మరచి తొంగున్నట్టు
పవర్ బాంక్ ఫుల్ గున్నా ఛార్జింగ్ కేబుల్ కట్టైనట్టు
ఫ్రైడే రోజు పబ్బు ఉన్నా ట్రై డే అంటూ బోర్డెట్టినట్టు
గ్రూపు ట్రూపు ఉంది ఊపులేమి లేవు
బారు బీరు ఉంది ఏ జోరు లేనే లేదు
మ్యాటర్ బోలెడు ఉంది ఓ మీటరంటు లేదు
ప్రాణం పంచే స్నేహం ఉంది మనసే పంచే మార్గం లేదు
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా
అమ్మ వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ
వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా మ్మ మ్మ మ్మ మ్మ



హా రయ్యి రయ్యిమంటూ పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దివ్య కుమార్ , యమ్.యమ్.మానసి

స రి గ రి స ని స ని స
ప ని మ ప ఆ అ అ ఆ
ప మ ప మ గ ప మ
స గ స గ స ని

గ స ని ప
స స ని ప ని
ని ని ప మ ప
గ మ గ మ
మ ప మ ప
అ ఆఆ ఆ ఆఆ ఆఆఆ 

హా రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

స గ స గ రి స ని ప

హే ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

సా... గ స గమ ప మ గ

నీలాకాశం ఎంత దూరం ఉన్నా
ఎగిరామంటే,అందదా 
ఊహ లోకం ఎక్కడెక్కడున్న 
పిలిచామంటే నిజాంగా నిజం కదా ..

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఆ ఆఆఆఆ

ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

స రి ప ని స రి మ గ రి స 
స రి గ ప మ గ రి స
స రి ప ని స రి మ గ రి స 
స రి గ ప మ గ ద …
ప ద ప మ గ మ గ రి గ రి 
రి గ మ ప గ రి స రి 
ప ద ప మ గ మ గ రి గ రి 
రి గ మ ప గ 

ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే 
ఒక్క కలనైనా 
నిజము చేయందే
నిదుర పోనందే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం
ఏ కుక్క పిల్లో కాదు 
కోరుకున్న నిజము ఎగిరి వెళ్లిపోదామే

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో

హ ఆ ఆఆ… దారి చూపించే
వెలుగు వెంటుంటే
కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులొ 
బొమ్మ గీయించి కుంచె తోడుంటే
రేయిని సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటే అర్థం పరిచయాలు కాదు
తోడు నీడ కాలి నడకలో పరుగులు 

రయ్యి రయ్యిమంటూ
రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఓ ఓహోహో .. ఘల్లు ఘల్లు మంటూ 
గుండె ఝల్లుమంటూ
అడుగులేసేనే స్వరాల కొత్త బాటలో




లైఫ్ ఇస్ అ రెయిన్ బో  పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యాజిన్ నిజార్ , ప్రియ హిమేష్

యల్లో అంటే స్వేచ్చా 
ఆరెంజ్ అంటే ఆశా 
బ్లూ అంటే సంతోషం 
రెడ్ అంటే ఆవేసం 
గ్రీన్ అంటే ప్రసాంతం 
వైలెట్ అంటే పంతం 
ఇండిగో ప్రేమల సిద్దాంతం 
రంగులన్ని చల్లిన కాగితం జీవితం 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 

గయ్స్ టునైట్ ఐయాం గోఇంగ్ టూ 
ఇంట్రడ్యూస్ టూ యూ ఆల్ బ్యుటిఫుల్ వాఇస్ 
హూ’స్ గోన్న రాక్ యు 
లేడీస్ అండ్ జెంటిల్మెన్ 
ప్లీస్ వెల్కం మహా 

హా ఆ ఆ ఆ ఆ మేఘంలాగ మొదలైంది 
నాలోని రాగం 
గాలే వచ్చి కదిలించింది 
ఓ తీపి స్నేహం 

మెరుపయ్యింది ఉరుమయ్యింది 
ఇన్నాల్ల మౌనం 
వానయ్యింది వరదయ్యింది 
ఈ నాటి గానం 

నా పాటె ఓ వానై వస్తే 
మీరంత ఓ వెలుగై ఉంటే 
హెయ్ నా పాటె ఓ వానై వస్తే 
మీరంత ఓ వెలుగై ఉంటే 
వాన వెలుగు కలిసిన వేల 
ఆనందాల హరివిల్లె రాదా 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 

హా..ఆ..మాటె తీయ్యని పాటవుతుంది 
స్వరమే తోడుంటే 
భాదే చివరకి బలమౌతుంది 
చెలిమే తోడుంటే 

హోయ్ కడలే ఎగసే అలలవుతుంది 
కలలే తోడుంటే 
కలలే కంటె నిజమౌతుంది 
తపనే తోడుంటే 

నమ్మకమే నీ తోడై ఉంటే 
అరె నిమిషాలన్నీ నిచ్చెన కావా 
హొ హో నమ్మకమే నీ తోడై ఉంటే 
నిమిషాలన్ని నిచ్చన కావా 
చిరునవ్వే తోడై ఉంటే 
నీ చిరునామ హరివిల్లే కాదా 

లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో 
ల్లైఫ్ ఇస్ అ రెయిన్.బో 
రంగుల్లో రంగైపో



ఉన్నది ఒకటే జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్

ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ...
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు  ఓ స్కేల్ ఎందుకు

ఎవరెస్ట్ హైటే చాలదే ఓ..
పసిఫిక్ లోతే చెల్లదే ఓ...
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైలుకు  ఓ స్కేల్ ఎందుకు
అర్  ఎక్సయిట్మెంట్  ఎగ్జామ్పులై పద ముందుకు 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 

లైఫే ఒక పాఠశాల 
కష్టం నష్టం మన బెంచ్ మేట్సే
ఎన్నో అనుభవాల 
మన పయనాలే మొత్తం బెంచ్ మర్క్స్
చిరు చిరు గొడవల పిడుగుల వానొచ్చినా 
మన చెలిమను గొడుగును దాటొచ్చునా
మన అడుగుల కలిపిన ఓ నిచ్చెనే స్నేహం హం హం హం
ఒడి దుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి

కడదాం ఓ కొత్త కంట్రీ 
స్నేహం కోసం ఖండాలు దాటి 
పెడదాం ఓ కొత్త పార్టీ 
ఫ్రెండ్షిప్పంటూ మరి పేరు పెట్టి 
డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే 
మన జర్నీ ఎండ్ కి డేటుండదే 
నడి మధ్యలో లైఫ్ ని గిఫ్ట్ గ ఫీలవుదాం ధామ్ ధామ్
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం 

ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి 
ఉన్నది ఒకటే జిందగీ 
చూసేద్దాం దాని సంగతి

Palli Balakrishna Saturday, September 2, 2017
Nenu Sailaja (2016)


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్
నటీనటులు: రామ్, కీర్తి సురేష్, ప్రిన్స్, శ్రీముఖి
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 01.01.2016

నువ్వు నేను కలుసుకున్న చొటు‌ మారలేదు
బైక్ మీద రైయ్ మన్న రూటు మారలేదు
నీకు నాకు ఫేవరెట్టు స్పాట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు
మనవంక చూసి కుళ్ళుకున్న బాచ్ మారలేదు
మనం ఎక్కిదిగిన రైల్ కొచ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

ధియెటర్లో మన కార్నర్ సీటు మారలేదు
నీ మాటల్లో దాగిఉన్న స్వీట్ మారలేదు
నిన్ను దాచుకున్న హర్ట్ బీట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా
శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

మా అమ్మ రోజువేసిపెట్టె అట్టు మారలేదు
మా నాన్న కొపమొస్తె తీట్టే తిట్టు మారలేదు
నెలవారి సామాన్ల లిస్టు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

వీధి కుళాయ్ దగ్గరేమొ ఫైట్ మారలేదు
నల్లరంగు పూసుకున్న నైట్ మారలేదు
పగలు వెలుగుతున్న స్ర్టీట్ లైట్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

సమ్మర్ లో సుర్ మనె ఎండ మారలేదు
బాధలోన మందుతెచ్చే ఫ్రెండ్ మారలేదు
సాగదీసే సీరియల్స్ ట్రెండ్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా

నీ ఫొటొని దాచుకున్న పర్స్ మారలేదు
నీ కోసం కొట్టుకొనే పల్స్ మారలేదు
నువ్వు ఎంతకాదు అన్న మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా
నీ స్ర్కీన్ సేవరెట్టుకున్న ఫోను మారలేదు
నీకిష్టమయిన ఐస్ క్రీమ్ కోన్ మారలేదు
నీ మీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

బ్రాంది విస్కీ రమ్ములొన కిక్కు మారలేదు
ఈస్టు వెస్టు నార్త్ సౌతు దిక్కు మారలేదు
ప్రేమ ప్యార్ మహబ్బత్ ఇష్క్ మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా
గుండెల్లో కొట్టావే డోల్ బాజా
శైలజా శైలజా శైలజా శైలజా
నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజా


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: పృథ్వీచంద్ర

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటే
చైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందే

మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి పానిపూరీ తింటుంటే
ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే
కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే
నిన్ను చూసినాక సో సో గుందే
రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక  ఐ యామ్ హ్యాపీ అందే
రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై
పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి
పెరుగుతుంటే ఆస్కార్  విన్ అయినట్టుందే
సారీ హరి  నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది
నువు ఇచ్చిన సంపదే ఇది
నా చుట్టు అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నొ చేరువౌతు ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేదేదో పోతున్నదెదో తేల్చేదెవ్వరు
ఈ ప్రేమకీ ఏవిటి వేడుక
ఏ జన్మకీ జంటగా ఉండక


********  *******   ********


చిత్రం: నేను శైలజ (2016)
సంగీతం: దేవీశ్రీప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఏం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను
ఏ ప్రశ్నను ఎవరినేం అడగను
ఓ మౌనమా నిన్నెలా దాటను
పెదాల పైన నవ్వు పూత పూసుకున్న నేనే
కన్నీటితో ఈవేళ దాన్నెలా చెరపను
తన జ్ఞాపకమైన తగదని మనసునెలా మార్చాను
ఈ ప్రేమకి ఏవిటి వేడుక
ఏ జన్మకి జంటగా ఉండక

ఏం చెప్పను నిన్నెలా ఆపను
ఓ ప్రాణమా నిన్నెలా వదలను

ఇదివరకలవాటు లేనిది
మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనుక చేయి జారుతుంటే ఎం తోచకున్నది
ఊరించిన నిలిమబ్బుని ఉహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి
ఎడారి వైపు వెళ్లకంటూ ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రా రమ్మని
తన వెంటపడి ఇటు తిసుకురాలేవా ఉపిరి

ఈ ప్రేమకి ఏవిటి వేడుకా
ఏ జన్మకి జంటగా ఉండక

నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుభందమై అది
నువ్విచ్చిన సంపదే ఇది
నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నొ చేరువవుతు ఉన్నా
అవందుకోనూ నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేది ఎదో పోతున్నదెదో తెల్చేదేవ్వరు

ఈ ప్రేమకి ఏవిటి వేడుకా
ఏ జన్మకి జంటగా ఉండక



Palli Balakrishna Tuesday, August 1, 2017

Most Recent

Default