-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rana Daggubati"



చిత్రం: వేట్టయన్ (ద హంటర్) (2024)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
నటీనటులు: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ , అభిరామి
దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్ 
నిర్మాత: సుభాస్కరాన్ అల్లిరాజ 
విడుదల తేది:  10.10.2024



Songs List:



మనసిలాయో పాట సాహిత్యం

 
చిత్రం: వేట్టయన్ (ద హంటర్) (2024)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ 
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గానం: నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్

మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే
ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే
వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడతపెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

దరువే దద్దరిల్లి ఉలిక్కిపడే ఉరే
ఉరిమి మేళాలతో జనమే ఊగే
అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్ తోన
నరమే సురుక్కుమనే సందడి చానా

హే వా వా వారే వా
ఆ స్టైలు స్మైలు వవ్వరే వా
హే వా వా వారే వా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే
చానా షానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

మెరుపై వచ్చిండే మనసుపెట్టి వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే సుట్టంబుచ్చిండే
ఆట కొచ్చిండే నాటు బీటైవచ్చిండే
వేట కత్తై వచ్చిండే వేటకొచ్చిండే

కన్నా పాస్ట్ ఈస్ పాస్టు టైం చాల పాస్టు పట్టి రఫ్ఆడరా
గొడవలు నూరు దేవుడి పేరు ఒకడే పైవాడురా
లైఫ్ వెరీ షార్ట్ మా లవ్ యువర్ డ్యూటీ మా
అది వదిలేసి తెగ జలసీ వై పోటీ మా
నీ గెలుపే నువ్వు ఓ కథవే అవ్వు
ఇగో దులుపేసి తిరగేస్తే వండర్ ఫుల్లు

హే హే హే వా వా వారే వా
ఆ స్టైలు స్మైలు వవ్వరే వా
హే వరె వరె వారే వా
అన్న విజిలే కొడితే
దుమ్మా ధూమ్ ధామ్

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే
చానా షానా మనసిలాయో

అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
అదరకొట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే
మడత పెట్టా వచ్చిండే మెరుపులెక్కా వచ్చిండే

హే ఆరుపేరున గోతిని తొవ్వుకోమా సిల్లర ఎత్తుకోమా
బొట్టుకోమా చెల్లవు ఎత్తులమా గన్నే పేలునమా
ఉండరా బుద్దిగమా గన్నే పేలునమా సింగమొచ్చేరా
బొక్కలు మెక్కర దండాలు బంధురా పొట్లాలు బంధురా మూసుకోరా

అండరు కవరు థండరు బోల్టు రా
హంటరు పంటరు చూడు చిన్నా
హంటరు చూడు చిన్నా వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడు హంటరు చూడు చిన్నా
వాట్ ఏ డ్యూడ్ చిన్నా
ఇప్పుడు చూడూ

అది అది అది గది గది
అదరగొట్టా వచ్చిండే
చిన్నా కన్నా మనసిలాయో
అది అది అది గది గది
మెరుపులెక్కా వచ్చిండే

Palli Balakrishna Sunday, April 19, 2026



చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, పి. సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి
దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్
నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్
విడుదల తేది: 14.11.2025



Songs List:



పసి మనసే వినదసలే పాట సాహిత్యం

 
చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం:  ప్రదీప్ కుమార్ , ప్రియాంక NK

హాయ్, పసి మనసే వినదసలే
ముహామిది నీదే నీదా..!
హాయ్, తమ తనువే తగులగనే
తమకము పోనే పోదా..!

ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మొహాలే నా నిండా
మౌనంగా నీతో ఉంటా..!

హాయ్, పసి మనసే వినదసలే
ముహామిది నీదే నీదా..!
హాయ్, తమ తనువే తగులగనే
తమకము పోనే పోదా..!

నీ గాలే... చలి పెంచేనే
నీ గాలే... చలి పెంచేనే
మొహాలే నను మించేలే
నా కోరికే.. మన్నించవా
కరిగితే... వచ్చేయవా
కరిగితే వచ్చేయవా
వచ్చేయవా, వచ్చేయవా

వా వా వా... వా వా వా, ఆ....

ఏకాంతం ఈ పూట
ఆనందం ఈ చోట
మొహాలే నా నిండా
మౌనంగా... నీతో ఉంటా




అమ్మడివే పాట సాహిత్యం

 
చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం:  ప్రదీప్ కుమార్ 

ఈ అద్భుతమే ఊహించనిదే
ఊహల్లో ఈ ప్రేమే లేనే లేదే
ఈ అద్భుతమే ఊహించనిదే
నాకింత సంతోషం ఎప్పుడు లేదే

నిసిలా నలుపై నేనే ఉంటే
శశివై ఇలకే నువ్వొచ్చావే
ఎదకే వెలుగే చూపించావే
అలనై ఒడిలో నేనొదిగానే

తరాలకే జోపలికే
జాబిలివే తెలుసా నీకే
అమ్మడివే నా చెలివే

నిసిలా నలుపై నేనే ఉంటే
శశివై ఇలకే నువ్వొచ్చావే
ఎదకే వెలుగే చూపించావే
అలనై ఒడిలో నేనొదిగానే

తరాలకే జోపలికే
జాబిలివే తెలుసా నీకే
అమ్మడివే నా చెలివే....



Rage Of Kaantha పాట సాహిత్యం

 
చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
సాహిత్యం: Lunarpunk, Yogi B, Devoid
గానం:  Siddharth Basrur, Yogi B, AbhinavaKavi	

Rage Of Kaantha

Varumai Uladathil Piranthavan Naan
Vethanai Mattum Yenathu Gethi
Vithi Vadikum Pudhu Illavarasan
Zero To Hero Now Vanavedi

Guru Vazhiyil Vazhkai Saranam
Imaiyam Serum Vega Payanam
Silar Ennai Theruvukku Thalla Virupam
Ehirparkirargal En Maranam

Kalaimagal Ennidam Pozhivaal
Nirantharapet Pugazh Sila Kangaluko
Ithuve Peighal Naadaga Vilayattil
Melana Keezhena Nee’ena Naan’ena

Irumugam Viruppum Veruppum Manathil
Porkalam Rasigar Raajiyam
Perugam Yen Aanavam
Am I Really The Monster?
En Shakti Adiye Kaantha

I Will Not Bow Tear It Down
I’ll Show You How
Born From Ashes Here Is My Rise
I’m The Voice That Never Dies

Nijam Nene Izam Nene
Padi Padi Leche Alala Thala
Pogaruni Nisi Nene
Sasi Nene Pidigu Padina
Padane Padadhu Venakadugu

Ne Adigina Theravale Talupulu
Arichina Theravale Thalupulu
Eduraye Kalaakaarulaki
Erugane Malupulu Aina Thadabada Vadugulu

Chathikila Padithey Theeram Cheravu
Kalalu Theeyaka Thappadhu Parogu
Therapai Ranga Vallulu Thera Venurana
Hangula Valalu

En Ulle Urumum Kadal
En Kannil Eriyum Porul
Yemanayum Adakidum Oru Kural
Kalaimagal Ezhupidum Yerimalai Perum Thanal

Flames Consume But I Stand Tall
Drowned By Echoes Down The Hall
Fallen World Can’t Hold Me Back
Iron Soul One Way Track
I Pay The Price For What It Takes
Silence Breaks For My Bloody Face

Edhalo Potettu Sandram
Evadiki Thalavanchani Gunam
Edahalo Potetthe Sandram
Evadiki Thalavanchani Gunam
Yedalo Potetthe Sandram
Evadiki Thalavanchani Gunam

Nijam Yaar Thaan Nizhale Poi Thaan
Vidhiyai Maatrum Madhiyai Konda
Vallavan Yaar? Oll Naan Thaan
Irulum Naan Thaan

Iravum Pagalum Irulum Idiyum
Kadanthavan Nijam Yaar Nizhalai Poi Thaan
Vidhiyai Maatrum Madhiyai Konda
Vallavan Yaar -LyricsRead.com

Olli Naan Irulum Naan
Iravum Pagalum Irulum Idiyum
Kadanthavan Nijam Yaar
Nizhale Poi Thaan

Vidhiya Maatrum Madhiyai Konda
Vallavan Yaar?
Iravum Pagalum Irulum Idiyum
Kadanthavan Naan





కాటుక కన్నులవో పాట సాహిత్యం

 
చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం:  శ్రీరామ చంద్ర మైనంపాటి

కాటుక కన్నులవో 
పాటల వెన్నెలవో
కన్నుల అంచున 
నవ్వులు దాచిన
నాయకా ప్రేయసివో 
 
మార్చిన మాయ నువ్వో 
చిరునవ్వుల నీవరమో 
కలవద్దని ఆపని హద్దులు
చెరుపుతు ఒక్కటి అయ్యెదమో

కాటుక కన్నులవో
పాటల వెన్నెలవో
కన్నుల అంచున
నవ్వులు దాచిన
నాయకా ప్రేయసివో

కాటుక కన్నులవో
పాటల వెన్నెలవో 

చిరునవ్వుతో పాడే నా రాగం
ఇరు గుండెల్లో పుట్టే సంగీతం 
జతే రావడం హలె పాడటం 
అదే రేపు కాదా మన సంగమం 

కాటుక కన్నులవో 
పాటల వెన్నెలవో 
కన్నుల అంచున 
నవ్వులు దాచిన 
నాయకా ప్రేయసివో (2) 



కరిగిపోయే కావ్యం పాట సాహిత్యం

 
చిత్రం: కాంత (2025)
సంగీతం: ఝాను చంతర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం:  కాలభైరవ

కరిగిపోయే కావ్యం 

Palli Balakrishna Monday, April 6, 2026



చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
నటీనటులు: రాణా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్
దర్శకత్వం: వేణు ఊడుగుల
నిర్మాతలు: డి. సురేశ్ బాబు,  సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండి
విడుదల తేది: 2022



Songs List:



కోలు కోలో కోలోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి

కోలు కోలో కోలోయమ్మ
కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో
మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే 
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని
గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా

కుర్రగాడి చూపులన్ని
కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా

వాడి గూర్చి ఆలోచనే
వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట
పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా

అక్షరాలు వాడివంట
అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా

ప్రాణమంతా వాడేనంటా
ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే
నూరేళ్ళు నిదుర రాదులే




వీర తెలంగాణ పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర 

వీర తెలంగాణ




నగాదారిలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: ద్యావారి నరేందర్ రెడ్డి, సేనాపతి భరద్వాజ్ పాత్రుడు 
గానం: వరం 

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది

కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా

ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో




చలో చలో పాట సాహిత్యం

 
చిత్రం: విరాట పర్వం (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి
సాహిత్యం: జిలుకర శ్రీనివాస్ 
గానం: సురేష్ బొబ్బిలి

మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం, మారదులే
రౌద్రపు శత్రువు దాడిని
ఎదురించే పోరాటం మనదే

చలో చలో చలో చలో
చలో చలో చలో చల్ పరిగెత్తు
అడుగే పిడుగై రాలేలాగా
గుండెల దమ్ముని చూపించు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
శ్రీకాకుళంలో రాలిన పువ్వులను
గుండెకు అద్ది నినదిద్దాం

సిరిగల భూములు చర విడిపించి
నిరుపేదలకు పంచేద్దాం
చలో చలో చలో
చలో చలో చలో

దొరోడి తలుపుకు తాళంలా
ఘడీల ముంగట కుక్కల్లా
ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు
మన బతుకులు మారేదెన్నాళ్ళు

ఆడబిడ్డ రక్షణకై పోరాటం
దళితుడి ఆత్మగౌరవంకై పోరాటం
పేదోడి ఆకలి ముద్దకై పోరాటం
రైతు నాగలి సాలుకై పోరాటం
హ, ఎన్నాళ్ళు… ఇంకెన్నాళ్లు

చలో చలో చలో చలో
ఏ, చలో చలో చలో
చలో చలో చలో చలో
చలో చలో చలో

కనబడలేదా తుక్కిట జాబిలి
వినబడలేదా వేదనాగ్ని రవళి

అమరుల రక్తం
పాతులు గట్టే పాటలు గట్టే
ఎర్రని మల్లెలు నింగిన వెలిగే
వసంత మేఘం మరింత గర్జనై
ఆఖరి సమరం అన్నార్తుల విజయం

ఇదిగో ఇదిగో అరుణ పతాకం
అజేయ గీతం టెన్ టు ఫైవ్
అదిగో అదిగో అదిగో
అదిగో ఎర్రని కిరణం

అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు
అదిగో ఉద్యమ నెల బాలుడు

Palli Balakrishna Tuesday, June 28, 2022



చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: రాణా  దగ్గుబాటి, రెజీనా కసండ్రా
దర్శకత్వం: సత్య శివ 
నిర్మాత: ఎస్.యన్.రాజరాజన్
విడుదల తేది: 07.01.2022



Songs List:



అల్లరి చేసే కల పాట సాహిత్యం

 
చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హరిచరణ్ , ప్రియా మాలి 

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

వెల్లువలాంటి ప్రాణమే
వేచి వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా

ఆఆ ఆ, నమ్ముదుగా నమ్మవుగా
మేమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆదమరిచేనా

పెదవిపైన పెదవిలా
హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే
మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే
ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

Palli Balakrishna Sunday, January 9, 2022



చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ 
స్క్రీన్ ప్లే & డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 25.02.2022



Songs List:



భీమ్లానాయక్ పాట సాహిత్యం

 
సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడు చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఎగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల

పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లా గండు

నాయన పేరు సోమ్లా గండు
తాత పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా

భీమ్లానాయక్

ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండు
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పు కొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించిన
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీమ్లానాయక్ భీమ్లానాయక్

ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారి విహారం - పెట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తాలు దోస్తే




అంత ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: చిత్ర

ఈసింత నన్నట్ట న న న న
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న
ముద్దిస్తే మారాము సెయ్యవు

పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
నాఇంటి పెనివిటివే
బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
దేవుళ్ళ సరిసాటివే

నా బంగారి మావ…నా బలశాలి మావ
నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే
నా సుడిగాలి మావ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడి వేగాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు

గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఏ తల్లి కన్నాదో నిన్నూ
కోటి కలలకు రారాజై వెలిసినావంట
ఏ పూట పుట్టినావో నువ్వు
అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట

వెలకట్టలేనన్ని వెలుగుల్ని
నా కంట పూయించినావంట నువ్వు
ఎత్తు కొండమీది కోహినూరే గాదు
గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ




అంత ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం: అరుణ్ కౌండిన్య 

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

గడ గడ గడ  గుండెలదర 
దడ దడ దడ  దున్నే బెదిరే 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 

పది పడగల పాము పైన 
పాదమెట్టిన సామి తోడు
పిడిగులొచ్చి మీద పడితే 
కొండ గొడుగు నెత్తినోడు

లాలా భీమ్లా
ఎద్దులోచ్చి మీద పడితే 
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ని 
పైకి పైకి ఇసిరినోడు 
లాలా భీమ్లా

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

భీమ్లా నాయక్
భీమ్లా నాయక్
భీమ్లా నాయక్



అడవి తల్లి మాట పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, కుమ్మరి దుర్గవ్వ

కిందున్న మడుసులకా
కోపాలు తెమలవు
పైనున్న సామెమో
కిమ్మని పలకడు

దూకేటి కత్తులా
కనికరమెరుగవు
అంటుకున్న అగ్గీలోన
ఆనవాళ్లు మిగలవు

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

పుట్టతేనే బువ్వ పెట్నా
సెలయేటి నీళ్లు జింక
పాలు పట్నా

ఊడల్ల ఉయ్యాల గట్టి
పెంచి నిన్ను ఉస్తాదల్లే
నించోబెట్నా

పచ్చన్ని బతికిత్తే నీకు
ఎల్లెల్లి కచ్చళ్ళ పడబోకు బిడ్డా

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

Palli Balakrishna Saturday, December 4, 2021


 

చిత్రం: అరణ్య (2021)
సంగీతం: శాన్తాను మోయిత్ర
సాహిత్యం: వనమాలి
గానం: హరిచరన్
నటీనటులు: రాణా దగ్గుబాటి, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, విష్ణు విశాల్, శ్రియ పిల్గొంకర్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాణ సంస్థ: ఈరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేది: 02.04.2021

చిటికేసే ఆ చిరుగాలి... చిందేసి ఆడే నెమలి...
కిలకిలమని కోకిల వాలి పాడెనులె హాయిగ లాలి
అడివంతా ఒకటై ఆహ్వానమే పలికనీ

ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ (2)

చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి
అడివంతా ఒకటై… ఆహ్వానమే పలికనీ.

ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2)

చుక్కలేడి కూనల్లారా.. అడివమ్మ పాపల్లారా
అందమైన లోకం ఇదే… అందుకో మరి అంటున్నదే

కొమ్మల్లో పూచే పూలు… కురిపించెను అక్షింతల్లు
అల్లరి చేసే తెమ్మెరలు పూసెనులే సుమగంధాలు

సాగే నీ దారుల్లో హరివిల్లులే దించనీ...
ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ (2)

మేఘాలే దరువేసే మెరుపులతో అడుగేసే
అది పంచే వెలుగంతా నీ కన్నుల్లో పోగేసే
తూఫానే నీ నేస్తం సుడిగాలే నీ చుట్టం
నువు గుర్తిస్తే చాలంట అడివంతా దాసోహం
మట్టి బొమ్మలాంటోడిని చెట్టు చేమలో ఒకడిని
నా ప్రాణమే నువ్వని కంటి రెప్పల్లే నిను కాయని

చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి
కిలకిలమని కోకిల వాలి పాడెనులె హాయిగ లాలి
అడివంతా ఒకటై ఆహ్వానమే పలికనీ

ఆడనీ! పాడనీ! చిందులే వెయ్యనీ… (2)

మబ్బు చాటు నెలవంకమ్మా ...
నింగి దాటి దిగి రావమ్మా
కడదాకా తన కలలని 
కన్నతల్లైన మించాలమ్మా






Palli Balakrishna Wednesday, January 20, 2021



చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
నటీనటులు: బాలకృష్ణ , మోహన్ బాబు, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి, విద్యాబాలన్, రకూల్ ప్రీత్ సింగ్, ఆమని
దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
నిర్మాత: నందమూరి బాలక్రిష్ణ , సాయి కొర్రపాటి
విడుదల తేది: 22.02.2019



Songs List:



కథానాయకా.. పాట సాహిత్యం

 
 చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ
గానం: కైలాష్ కెహర్

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా..

ఆహార్యాంగిక
వాచిక పూర్వక
అద్భుత అతులిత
నటనా ఘటికా..

భీమసేన వీరార్జున
కృష్ణ దానకర్ణ
మానధన సుయోధాన
భీష్మ బృహన్నల
విశ్వామిత్ర

లంకేశ్వర దశకంఠరావణాసురాధి
పురాణ పురుష భూమికా పోషకా… 
సాక్షాత్ సాక్షాత్కారకా..
త్వదీయ ఛాయాచిత్రాచ్ఛాదిత
రాజిత రంజిత్‌ చిత్రయవనికా..

న ఇదం పూర్వక
రసోత్పాదకా..
కీర్తికన్యాకా..
మనోనాయకా..
కథానాయకా..
కథానాయకా..

ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా...

త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా




వెండితెర దొర పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: యం. యం. కీరవాణి
గానం: యం. యం. కీరవాణి

వెండితెర దొర 



బంటురీతి కొలువు పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, శ్రీనిధి తిరుమల 

బంటురీతి కొలువు 




కథానాయకా (Female version) పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ
గానం: శ్రీనిధి తిరుమల, రమ్యా బెహ్ర, మోహన భోగరాజు 

కథానాయకా 




రామన్న కథ పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: యం. యం. కీరవాణి
గానం: చిత్ర, సునీత ఉపద్రస్ట 

రామన్న కథ 




చైతన్య రథం పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యం. యం. కీరవాణి, కాలభైరవ, కీర్తి సాగతియ, సాయి శివాని 

చైతన్య రథం 




రాజర్షి పాట పాట సాహిత్యం

 
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, యం. యం. కీరవాణి
గానం: శరత్ సంతోష్ ,  యం. యం. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..

జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని 
ఉర్వీజనోద్ధరణకై  చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ

అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ 
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ 
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన 
భావుకుడు ఇతడు..

మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం

చిదానందరూప:
శివోహం శివోహం..
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..

Palli Balakrishna Monday, January 21, 2019

Most Recent

Default