-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Madhavapeddi Suresh"



చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ, సిరివెన్నెల, జలదంకి సుధాకర్
నటీనటులు:  జయసుధ, రాధిక, కృష్ణం రాజు, హరీష్, మేఘన
దర్శకత్వం: అజయ్ కుమార్ 
నిర్మాత: శ్రీనివాస రావు 
విడుదల తేది: 1997



Songs List:



నిను చూసాకా పాట సాహిత్యం

 
చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు, చిత్ర 

నిను చూసాకా 



బోలో తారా తారా పాట సాహిత్యం

 
చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: జలదంకి సుధాకర్
గానం: సునీత ఉపద్రష్ట , విజయలక్మి 

బోలో తారా తారా 



పగలు రాతిరి కలిసి పాట సాహిత్యం

 
చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

పగలు రాతిరి కలిసి 




లౌలీ లౌలీ కాలేజీ పాట సాహిత్యం

 
చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సురేష్ పీటర్స్, సునీత ఉపద్రష్ట & కోరస్ 

లౌలీ లౌలీ కాలేజీ 



నువ్వూ నేనూ సాక్షిగా పాట సాహిత్యం

 
చిత్రం: కుటుంబ గౌరవం (1997)
సంగీతం: మాధవపెద్ది సురేష్ 
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: యస్.పి.బాలు, చిత్ర 

నువ్వూ నేనూ సాక్షిగా

Palli Balakrishna Tuesday, January 2, 2024


చిత్రం: నీ సుఖమే నే కోరుకున్నా (2008)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం:
గానం:
నటీనటులు: రాజా ఎబుల్, స్నేహ
దర్శకత్వం: గిరిబాబు
నిర్మాత: గిరిబాబు
విడుదల తేది: 22.02.2008


Palli Balakrishna Tuesday, March 26, 2019



చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్ 
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 
నటీనటులు: కృష్ణ , సౌందర్య
దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాత: ఉమామహేష్
విడుదల తేది: 16.02.1996



Songs List:



అల్లిబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

అల్లిబిల్లి 




అమ్మలేని పుట్టిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

అమ్మలేని పుట్టిల్లు



గుస గుస పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

గుస గుస 




కన్నులు కలిసినవి పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

కన్నులు కలిసినవి 



పరమేశ్వరుడా మేలుకో పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పరమేశ్వరుడా మేలుకో 



పుడమిలో తొలివలపు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పుడమిలో తొలివలపు 




పుణ్య చారిత్రులు పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

పుణ్య చారిత్రులు 




వచ్చాడే అమ్మదొంగ పాట సాహిత్యం

 
చిత్రం: పుట్టింటి గౌరవం (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, చిత్ర, నాగూర్ బాబు 

వచ్చాడే అమ్మదొంగ

Palli Balakrishna Thursday, March 14, 2019



చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద
దర్శకత్వం: కె.సదాశివరవు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.10.1996s



Songs List:



మాఘమాసం పాట సాహిత్యం

 
చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: జలదంకి సుధాకర్ 
గానం: యస్. పి. బాలు, కవితా కృష్ణమూర్తి 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 
కలలే చాలిక లేమ్మంటూ 
తనువే మనసుని లేపింది 
మనసే నిద్దర మేలుకొని 
కరగని కలలను చూసింది 
ఈ మాయ మహిమేమిటో 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

విరబూసే ప్రతి మల్లితీగని బ్రతిమలాడుకున్నా 
నువ్వీదారిలో మెత్తగా పూలు పరువాలని 
నను తాకే ప్రతి పిల్లగాలిలో 
పిలుపు పోల్చుకున్నా 
నీ గుండెలో పలికిన భావ గీతాలని 
హారతిగ ఇవ్వనా నా ఆశని 
బహుమతిగ పొందనా అందాలని 
పరువాలన్నీ వలువాలల్ని అందించే సమయమిది 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

ప్రతి పూట పదహారేళ్ళపాటుగ పెంచుకున్న పరువం 
కానుకే ఇచ్చుకో కాముడే సాక్షిగా 
పుడుతూనే ముడేశారు పెద్దలు తెంచలేని బందం 
వెచ్చగా పుచ్చుకో నోములే పండగా 
మబ్బులను దాటని ఈ మాటని 
చుక్కలకు తాకని  శుభవార్తని 
తెగ సందడిగా కనువిందులుగా 
కళ్యాణం జరుగునని 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

Palli Balakrishna Friday, March 1, 2019



చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నటీనటులు: బాలక్రిష్ణ, రోజా, రంభ
దర్శకత్వం: ఎ.కోదండరామి రెడ్డి
నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 28.07.1995



Songs List:



అధిరింది అధిరింది పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి. బాలు, రేణుక 

అధిరింది అధిరింది 



లచ్చిమి లచ్చిమి పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర 

లచ్చిమి లచ్చిమి 




సూపర్ డూపర్ పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, అనుపమ 

సూపర్ డూపర్ 




మాఘమాసం పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర 

మాఘమాసం 




మాజారే గజ్జల పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర 

మాజారే గజ్జల 



అమ్మంటే ఎలేలో పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మనో, పి. సుశీల, రేణుక 

అమ్మంటే ఎలేలో 


Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నాటినటులు: బాలక్రిష్ణ, రోజా
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: బి. వెంకట రామ రెడ్డి
విడుదల తేది: 15.05.1996



Songs List:



భలే భలే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం:ఎస్.జానకి , బి.ఎ.నారాయణ 

భలే భలే 




ఈ నీటి ఉయ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:ఎస్.జానకి , బి.ఎ.నారాయణ 

ఈ నీటి ఉయ్యాల 



నడిచేది జీవుడు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నలకంటి 
గానం:ఎస్.జానకి

నడిచేది జీవుడు 




ప్రియా పిలుపు అందేరా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ప్రియా పిలుపు అందేరా



సాహో మహా వీరుడా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి 
గానం: ఎస్.జానకి 

సాహో మహా వీరుడా 



స్వరం చరణం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణార్జున విజయము (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

స్వరం చరణం 

Palli Balakrishna


చిత్రం: మేడమ్ (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్ , సౌందర్య , చిరంజీవి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: యమ్.చిట్టిబాబు
విడుదల తేది: 1994

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి
తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్లికి
చిగురుటాకు రాశి చూసి చిలక జ్యోస్యమేదో అడిగి
పులకరింత పందిరేసి పూలసంత పానుపేసి
మల్లెలే మాయగా మత్తుజల్లగా

ఓ వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి

హత్తుకున్న నీ ఒళ్ళు మత్తు మల్లె పూజల్లు
పెళ్లి ఆడు కున్నాయి కౌగిలింతలు
ఏకమైన ఎంగిల్లు వెన్నెలమ్మ పొంగల్లు
పిలుపందుకున్నాయి బుజ్జగింతలు
దీపాలెట్టే చోటులో
జడ తాళాలేసే జతసిరి మాటలో
ఎద కలిసే వేళ వయసే హేళ
వలచే వేళ పండిన కలలా

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి

రామచిలక రాగాలు రామపండు పాదాలు
కోరుకున్న భోగాలు గోరువంకవే
కోకచాటు పాదాలు కొంగుచాటు యోగాలు
సోకులమ్మ శ్లోకాలు నాకు చిలకవే
చిగురాకుల్లోన స్వాతిలా
పొగరెక్కి పాడే గడసరి కోకిల
బిగిసింది ప్రాణం మధనుడి బాణం
పలికిందేదో పరువపు ప్రాణం

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి
తెచ్చే తెచ్చే వైభోగాలే ప్రేమకి మా పెళ్లికి
చిగురుటాకు రాశి చూసి చిలక జ్యోస్యమేదో అడిగి
పులకరింత పందిరేసి పూలసంత పానుపేసి
మల్లెలే మాయగా మత్తుజల్లగా

వచ్చే వచ్చే వైశాఖంలో పల్లకి ఈ పిల్లకి

Palli Balakrishna Friday, October 20, 2017



చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
నటీనటులు: బాలక్రిష్ణ, రోజా, రంభ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: బి. వెంకటరామిరెడ్డి
విడుదల తేది: 14.04.1994



Songs List:



ఎంత ఎంత వింత మోహమో పాట సాహిత్యం

 
చిత్రం: భైరవద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సంధ్యా

పల్లవి:
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా
జంట లేదనా... ఆహాహా
ఇంత వేదనా... ఓహోహో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్నబోతివమ్మా
ఓ మురిపాల మల్లిక...
దరిజేరుకుంటినే పరువాల వల్లిక...
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో (2)
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో (2)
ప్రణయానుబంధమెంత చిత్రమో

చరణం: 1
విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో తరిమింది
తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక

చరణం: 2
కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేల ప్రియురాల మణిమేఖల





ఘాటైన ప్రేమఘటన పాట సాహిత్యం

 
చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలుక

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

చరణం: 1
కోరుకున్నవాడే తగువేళచూసి జతగూడే
సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే అందించమంటు దరిచేరే
సందేశం ఎద విన్నది
లేనిపోని లోని శంక మానుకోవె బాలిక
ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక
కులుకా రసగుళిక కళలొలుక తగు తరుణము దొరికెనుగా

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

చరణం: 2
పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి
అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే మగతోడు చేరు ఈనాడు
సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా
రాచకన్నె నేలగా దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా అణువణువొక చినుకవగా

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసిచిలుక
ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే ఏ నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే




శ్రీతుంబుర నారద పాట సాహిత్యం

 
చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

శ్రీతుంబుర నారద నాదామృతం ఆ...ఆ...
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు
స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
సాపాసా గరిసనిదపమగా నీగా మగరిసనిస సగామా గమాపా మపానీస గరిసపనిద రిసనిదప సనిదపమ

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం

సా సా సా సా స సనిపగసరి గపనిగరిసా
నిసరి పనిస గపని రిగప గరిసా

సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే
రీ రీ రిమపనిదమ మపనిస గరి మగరిస నిసరి మాగరిస నిసరి నీదమప మగరీ నిదపా మగరీ
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే
గ గా గారిస రిసగ సగప గగపదస
మురళి వనాంతాల విరుయు వసంతాల
మురళి వనాంతాల విరుయు వసంతాల చిగురించు మోహన గాంధారమే
మా సమగ సనిదమా సమాగాప దనీమాద గనిసా
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే
పా పమపా దదపా పమపా దనిదా పదస పాదసరి పమరిస నిదపమపా రిసరిమపా
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసమగ రిసరిగదమప రిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ.ఆ.ఆ.ఆ.
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గనిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
నినిపమగమ పనిమపనినిసా
నిని సస సస నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
నినినిసస సస నినిని గగ గగ
నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని
గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
నిస గమ సగ మప గమ పని మప నిస
సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ
రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమపా
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం





విరిసినది వసంతగానం పాట సాహిత్యం

 
చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: సింగీతం శ్రీనివాసరావు
గానం: చిత్ర

ఆ ఆ ఆ... ఆ... ఆ...
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం: 1
ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడే చెలికాంతుడై దరి చేరె మెల్లగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం: 2
ఋతువు మహిమేమో విరితేనె
జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరిచి
మురిసేనూ తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడె సుకుమారుడై జతకూడె మాయగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా




నరుడా ఓ నరుడా పాట సాహిత్యం

 
చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం:  మాధవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం: 1
రా దొరా ఒడి వలపుల చెరసాలర
లే వరా ఇవి దొరకని సరసాలురా
దోర దొంగ సోకులేవి దోచుకో సఖా
రుతువే వసంతమై పువ్వులు విసరగా
ఎదలే పెదవులై సుధలే కొసరగా
ఇంత పంతమేల బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం: 2
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ చలి స్వరమెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్నీ వెన్నెలేనయా
రగిలే వయసులో రసికత నాదిరా
పగలే మనసులో మసకలు కమ్మెరా
ఇంక బింకమేల బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక



అంబా శాంభవి పాట సాహిత్యం

 
చిత్రం: భైరవ ద్వీపం (1994)
సంగీతం: మాధవపెద్ది సురేష్
సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.జానకి

అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా
అమ్మలగన్న అమ్మవి ఈ అమ్మ మనసునే ఎరుగవా
అమ్మలగన్న అమ్మవి ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువు కరుగవా ఆ శాపమే ఇక బాపవా

అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా

ఏనాడైనా ఏ వరమైనా కలలోనైనా అర్ధించాన
విధి నెదిరించే శక్తియేలేక ఈ విధి నిన్నే వేడితినమ్మా
కష్టాలన్ని కడతేర్చవా కన్నీళ్లన్ని తొలగించవ
కారుణ్యం చూపించవా ఈ ఘోరమ్ము తప్పించవా
ఒక అమ్మగా నువు కరుగవా ఒక అమ్మగా నువు కరుగవా

అంబా శాంభవి బద్రరాజ గమనా
కాళీ హైమతీశ్వరీ త్రినయనా

తర తరాలుగ నిన్ను తల్లివని కొలిచాను
మమ్మింక మన్నించవే
శుభము శాపముమార్చి నారూపు గ్రహియించి
ఆదుకొన అరుదెంచవే
సత్యమ్ముగా నీది మాతృ హృదయమ్మైతె
సత్వరంనే సాగిరా
ఉరుములా మెరుపులా ఉప్పొంగు కడలిలా
శీగ్రమ్ముగా కదలిరా
ఓంకార బీజాక్షరీ త్రైలోక్య రక్షాకరీ
శ్రీ చక్ర సంచరిణి రుద్రాణి నారాయణి
పాహిమాం పరమేశ్వరి రక్షమాం రాజేశ్వరీ
పాహిమాం  పాహిమాం  పాహిమాం  పాహిమాం

Palli Balakrishna Wednesday, September 13, 2017

చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి, వెన్నలకంటి
నటీనటులు: కృష్ణ , కస్తూరి, నరేష్, రంజిత
నిర్మాత, దర్శకత్వం: విజయనిర్మల
బ్యానర్: శ్రీ విజయ కృష్ణ ఆర్ట్స్
విడుదల తేది: 09.11.1996


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: ఎస్.పి.బాలు

చుక్కే వేశానే



*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: గంగాధర్ ,స్వర్ణలత

చిత్రం భళారే చిత్రం


*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

చీరాల పాప


*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

చీరాల పాప


*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, స్వర్ణలత

జ్వాలత్, జ్వాలత్, జ్వాలన్



*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, ఎస్.జ్యోతి

చలో ప్రియా హలో మియా


*****   *****  ******


చిత్రం: రెండు కుటుంబాల కథ (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, చిత్ర

మాతేశ్వరి మొగ్గ మజా

Palli Balakrishna Saturday, September 2, 2017


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి. ఆర్, సావిత్రి
దర్శకత్వం: కె. హేమాంబరదర రావు
నిర్మాతలు: బి. పద్మనాభం, బి.పురుషోత్తం
విడుదల తేది: 24.07.1964

పల్లవి:
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం: 1
పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధుర భావనా

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం: 2
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగ
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగ
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి


*******   ******   ******


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అందము లొల్కు మోముపై
హాస విలాస మనోజ్ణ రేఖలే చిందులు వేయ
వాల్కనుల సిగ్గులు మొగ్గలుపూయ
అందియల్ సందడి సేయ
కాంతివలె చల్లగ జానకి వచ్చె
ఓరగా సుందరుడైన రాఘవుని చూచె
తటాలున పూలమాలికా బంధము వైచె
దేవతలు పాడగా.. లోకము సంతసించగా
ఆ... ఆ... ఆ..


********   ********   ********


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: దాశరధి
గానం: యస్. జానకి

సాకీ:
అందమైన చల్లని రేయి
చల్లని రేయిని చక్కని అమ్మాయి
ఆ అమ్మాయితో ఉంది హాయి
ఆ హాయిలో ఉంది జీవితమోయి

పల్లవి:
అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ

ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు

చరణం: 1
నాతో దీటైన నాయకుడవు నీవేలే
నీకు సరియైన ప్రియురాలిని నేనేలే
నాతో దీటైన నాయకుడవు నీవేలే
నీకు సరియైన ప్రియురాలిని నేనేలే
మల్లె విరజాజి మనసూ నీకేలే
మల్లె విరజాజి మనసూ నీకేలే
గులాబి రేకు వంటి నా సొగసూ నీకేలే
అందించిన అందాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్... చేజారనీయకోయ్...
ఇదే సమయమోయ్...

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ హోయ్
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు

చరణం: 2
స్వర్గం ఎక్కడనో లేదోయీ మొనగాడా
అంతా నాలోనే ఉందోయీ చెలికాడా
స్వర్గం ఎక్కడనో లేదోయీ మొనగాడా
అంతా నాలోనే ఉందోయీ చెలికాడా
నిజాన్ని తెలుసుకుని భుజాలు కలుపుకుని
నిజాన్ని తెలుసుకుని భుజాలు కలుపుకుని
సుఖాన్ని పొందాలి ఓ అందగాడా
విలువైన జీవితాన్ని అనుభవించవోయ్
వృధా చేయకోయ్... చేజారనీయకోయ్...
ఇదే సమయమోయ్....

అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు
బలె బలె మోగునులే వలపు సితారు
వలపు మజా చూపిస్తా ఇటురావోయీ హోయ్
ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు


********   *******   ********


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల

పల్లవి:
బ్రతుకంతా బాదగా.. కలలోని గాధగా..
కన్నీటి ధారగా.. కరిగిపోయే...
తలచేది జరగదూ... జరిగేది తెలియదు..

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం: 1
అందాలు సృష్టించినావు దయతో నీవు
మరలా నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడి ఆశ చేసీ
కొండంత ఆశ అడి ఆశ చేసీ
పాతాళ లోకాన తోచేవులే

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా

చరణం: 2
ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉధ్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు
ఆలహల జ్వాల చేసేవులే
ఆనందనంక పయనించు వేళా
ఆనందనంక పయనించు వేళా
శోకాల సంద్రాన ముంచేవులే

బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసీ గుండెను కోసీ నవ్వేవు ఈ వింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసీ ఆడేవు నీకిది వేడుకా


********   *******   ********


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల

జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి
సుదతి సీతను నీవు చూడలేదా
ప్రతి చరాచరముల పయనించు చిరుగాలి
జానకి నెటనైనా కానలేదా
కరుణతో విశ్వమ్ముభరియించు భూమాతా
చెలిజాడ నీవైన తెలుపరాద
తరులార గిరులార నెరయు తారకలార
పడతి ఏమయ్యనో పలుకరాద
ఏది వైదేహి జానకి ఏది
సీత లేనిదే రాముడే లేడూ
లేడటంచు కరకు కొండల గుండెలే
కరగి మారుమ్రోగ ఎలుగెత్తి పిలిచెనా
రాఘవుండు సీతా... హా.. సీతా...


********   *******   ********


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల, పి.సుశీల

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
నీ చూపుతో నన్ను ముడివేయకూ

చరణం: 1
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నా పైట చెంగు లాగీ కవ్వించకు
అనువైన వేళ అందాలు దాచకూ
అనువైన వేళ అందాలు దాచకూ
అణువణువు నిన్నే కోరే మురిపించకూ
ఇకనైన నునుసిగ్గు తెరవేయకూ

నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

చరణం: 2
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మరిపించకూ
ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మరిపించకూ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనలోని ప్రేమా మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకూ
ఈ పూలు వింటాయి సడిచేయకూ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ


********   *******   ********


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: బి.పద్మనాభం, ఎల్.ఆర్. ఈశ్వరి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు
మావూరు మదరాసు, నా పేరు రాందాసు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
మదనపడి మనసు చెడి వచ్చానె అమ్మాయి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా
ఏమిటి నీ బాధ ఏ మాత్రం నీ హోదా
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి

చరణం: 1
రోడ్లమీద కార్లున్నాయ్  బ్యాంకుల్లో డబ్బులున్నాయ్
రోడ్లమీద కార్లున్నాయ్  బ్యాంకుల్లో డబ్బులున్నాయ్
దేవిడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మయి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు

క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ?
క్యాడిలాక్ కారుందా? న్యూ మోడల్ మేడుందా ?
ఇంటిముందు వ్యానుందా? నిదురబోను ఫ్యానుందా?
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదు కదా?

మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి
మావూరు మదరాసు, నా పేరు రాందాసు

చరణం: 2
వూరు తిరగ బస్సుంది పబాం... పబాం..
వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి..
వూరు తిరగ బస్సుంది పబాం... పబాం..
వుండను ఫ్లాట్ ఫారముంది హి.. హి..
కడుపు నిండా నీరు త్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా... లేకున్నా  ఏమున్నా లేకున్నా
మిన్నయైనదొకటుంది  మిన్నయైనదొకటుంది
ఏముంది ?
ప్రేమించే హృదయముంది
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినీ కనాలి
హాయిగా తాపీగా  హాయిగా తాపీగా
హాయిగా తాపీగా  హాయిగా తాపీగా
బ్రతుకు పరుగు తీయాలి బ్రతుకు పరుగు తీయాలి

మావూరు మదరాసు, నా పేరు రాందాసు
మావూరు బొంబాయి, నా పేరు రాధాబాయి


*******   ******   ******


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: మాధవ పెద్ది, యస్.జానకి

ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ
నాకు నీవే కావాలె రా ఓ.. ఓ.. ఓ..
నీకు నేను కావాలె రా ఆ...ఆ... ఆ..
ప్రక్కన నువు లేకుంటే...
ఒక్కదాన్నే వుంటె వూరంతా పడుకుంటే
ఏమో ఏమో ఏమేమొ ఆయరా

ఒహో.. హో హో ఓ ఓ ఓ యా యా యా ఓ ఓ ఓ

చరణం: 1
అద్దాన నీ రూపే ముద్దుగా కనిపించె
నిద్దరలో నీ పిలుపే కొద్దిగా వినిపించె
కలలో వస్తిని గమ్మత్తు చేస్తిని
అమ్మతోడు ఉలికులికి పడ్డానురా
నన్ను నమ్మరా ఇంక నమ్మరా
నిన్నిడిచి వుండలేనురా
ఓరయ్యో బలే ఓరయ్యో

చరణం: 2
ఒడ్డున పోతుంటే ఒళ్ళు జల్లుమన్నాదే
పడవను నడుపుతుంటే పట్టుదప్పిపోనాదే
చేపలు పడుతున్నా ఏ పని చేస్తున్నా
అమ్మతోడు చూపంతా నీ మీదనే
నన్ను నమ్మవే ఇంక నమ్మవే
నిన్నిడిచి పోలేనులే
ఓలమ్మీ భలే ఓలమ్మీ
నాకు నీవే కావాలె రా.. ఓ.. ఓ ... ఓ
నీకు నేను కావాలె రా ఆ...ఆ...ఆ
ఓయ్
మెత్తని ఇసుకుంది మత్తైన గాలుంది
కోరుకున్నపుడెల్ల కొబ్బరి నీరుంది
మెత్తని యిసుకేమి మత్తైన గాలికేమి
అన్నిటికి మించి నాకు నువ్వుంటివి
నీ అందమే ఆ అందమే పదివేల సొమ్మంటిని
ఓలమ్మీ భలే ఓలమ్మీ
ఓరయ్యో బలే ఓరయ్యో


*******   ******   ******


చిత్రం: దేవత (1964)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఘంటసాల, పి.సుశీల

తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...

చరణం: 1
ఏమో ఇది ఏమో
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం
నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు
ఏమో ఇది ఏమో
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం
నా మనసున నీకై నోచిన పూసిన కానుకలు
నీ కనుల వెలిగేనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
నీ కనుల వెలిగేనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు

తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే తొలి వలపే

గరి నిరిగా
ఆ ఆ ఆ
మగనిగమా
ఆ ఆ ఆ
గమ నీద నీదపా
ఆ ఆ ఆ

చరణం: 2
ఏలా ఈ వేళా
కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ
యవ్వనము అనుభవమూ
జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ
ఏలా ఈ వేళా
కడువింతగ తోచె తీయగ హాయిగ ఈ జగమూ
యవ్వనము అనుభవమూ
జతగూడిన వేళా కలిగిన వలపుల పరవశమూ
ఈ రేయి పలికెలే స్వాగతమూ
ఈనాడే బ్రతుకున శుభదినమా
ఈ రేయి పలికెలే స్వాగతమూ
ఈనాడే బ్రతుకున శుభదినమా
ఈ తనువే మనకిక చెరి సగమూ

తొలి వలపే పదే పదే పిలిచే
ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే... తొలివలపే...

Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default