చిత్రం: పెళ్ళి చేసి చూడు (1952) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్ టి రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్ నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి విడుదల తేది: 29.02.1952
Songs List:
-->
చిత్రం: పెళ్ళి చేసి చూడు (1952) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్ టి రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి దర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్ నిర్మాతలు: నాగిరెడ్డి, చక్రపాణి విడుదల తేది: 29.02.1952
Songs List:
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్.టి.రామారావు, షావుకారు జానకి దర్శకత్వం: ఎల్. వి.ప్రసాద్ నిర్మాతలు: ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డి విడుదల తేది: 07.04.1950 (యన్.టి.రామారావు గారికి హీరోగా తొలి సినిమా)
Songs List:
ఇంతేనా నిజమింతేనా పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: మాధవపెద్ది సత్యం ఇంతేనా నిజమింతేనా
ఏమనెనే చిన్నారి పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: ఘంటసాల ఏమనెనే...ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే.. వన్నెల సిగ పూవ కను సన్నలలో భావమేమి ఏమనెనే... ఆమని కోయిల పాటల గోములు చిలికించు వలపు కిన్నెర తానేమని రవళించెనే వనరుగా చనువైన నెనరుగా పలుకె బంగారమై కులుకె సింగారమై మా వాడ రాచిలుక మౌనమౌనముగా
తెలుపవలెనే చిలుకా పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: రావు బాలసరస్వతి దేవి, ఘంటసాల తెలుపవలెనే చిలుకా
తెలుపవలెనే చిలుకా పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: రావు బాలసరస్వతి దేవి తెలుపవలెనే చిలుకా
దీపావళి దీపావళి పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: రావు బాలసరస్వతి దేవి దీపావళి దీపావళి
దీపావళి దీపావళి పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: రావు బాలసరస్వతి దేవి , పి. శాంత కుమారి దీపావళి దీపావళి
పలుకరాదటే చిలుక పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: ఘంటసాల పలుకరాదటే చిలుక
భాగవత పఠనం పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: ఎం. ఎస్. రామారావు భాగవత పఠనం
భలే దొరలకు దొరకని సొగసు పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: టి. కనకం భలే దొరలకు దొరకని సొగసు
మారిపోవురా కాలం పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: మాధవపెద్ది సత్యం మారిపోవురా కాలం మారుట దానికి సహజం
వలపుల వల రాజా పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ వలపుల వల రాజా
విరహవ్యధ మరచు కథ పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ విరహవ్యధ మరచు కథ తెలుపవే ఓ జాబిలి
హరికథ పాట సాహిత్యం
చిత్రం: షావుకారు (1950) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సీనియర్ సముద్రాల గానం: ఘంటసాల హరికథ
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మి కథ : జలిమ్-జెవేద్ మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజు దర్శకత్వం: తాపీ చాణక్య నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి బ్యానర్: విజయా ప్రొడక్షన్స్ విడుదల తేది: 30.11.1973
Songs List:
గాలిలో పైరగాలిలో పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: వి.రామకృష్ణ, పి.సుశీల పల్లవి: అలా అలా అలా అలా గాలిలో... పైర గాలిలో సాగి పోదామా తెలిమబ్బు జంటలై వలపు పంటలై పొదామా... సాగి పోదామా... పొదామా... సాగి పోదామా అలా అలా అలా అలా నింగిలో నీలి నింగిలో ఎగిరిపోదామా అందాల హంసలై రాజ హంసలై పోదామా ఎగిరి పోదామా పోదామా ఎగిరి పోదామా చరణం: 1 వెనుదిరిగి చూసే పనిలేదు మనకు దూరాలు తీరాలు చేరాలి మనము వెనుదిరిగి చూసే పనిలేదు మనకు దూరాలు తీరాలు చేరాలి మనము జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా మునుముందుకేగాలి మనము జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా మునుముందుకేగాలి మనము నీకు నేను తోడుగా నేను నీకు నీడగా ఈ బాట మన బ్రతుకు బాటగా పూల బాటగా... హాయిగా సాగి పోదామా అలా అలా అలా అలా గాలిలో పైర గాలిలో పోదామా... ఎగిరి పోదామా చరణం: 2 అనురాగ లతలే పెనవేసె మనను ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం అనురాగ లతలే పెనవేసె మనను ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం అందాలు చిందే నీ లేతమోము నీ కంటి పాపలో నిలవాలి నిరతం అందాలు చిందే నీ లేతమోము నా కంటి పాపలో నిలవాలి నిరతం చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా నీ మాట నా మనసు మాటగా వలపు బాటగా... జంటగా సాగి పోదామా అలా అలా అలా అలా గాలిలో పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా పోదామా ఎగిరి పోదామా
తొలి వలపులలో పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను.. అది కవుల కల్పననుకున్నాను .. అది కవుల పైత్యమనుకున్నాను .. నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను .. నీ చెలిమి కోరుతూ ఉన్నాను.. మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు.. ప్రతి మగువకిలాగే చెబుతారు.. ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు.. ఆ అలకే వలపనుకుంటారు .. చరణం: 1 కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు.. మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు.. మొగము తిప్పుకుంటారు.. సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు.. నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు.. సాకులు చెబుతూ ఉంటారు తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను.. అది కవుల కల్పననుకున్నాను మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు.. ప్రతి మగువకిలాగే చెబుతారు.. చరణం: 2 ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు కుత కుత లాడుతూ ఉంటారు తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి పెడదారి పట్టుతూ ఉంటాయి... చరణం: 3 కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం జీవించడమే నా గమ్యం కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు అది పొంగుతున్నదని తెలుసు... ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ ల.ల.లా..ఉ..ఊ..ఉ..
హుషారు కావాలంటే పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు పల్లవి: హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే మందొక్కటే... మందురా చరణం: 1 అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ అహ అహ ఆ... ఏది?.... మందొక్కటే మందురా చరణం: 2 జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా నిన్నా రేపని తన్నుకోకురా... ఉన్నది నేడే మరువబోకురా అహ .... అహ.... అహా..ఆ హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే మందొక్కటే.... మందురా చరణం: 3 ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ... చొ..తోకాడించే నీవే తోడురా హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే మందొక్కటే మందురా...
గడసాని దొరసాని పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: యస్. పి.బాలు, పి. సుశీల పల్లవి: గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు... ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి... అబ్బొ..దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని.. చరణం: 1 అరెరెరె నడకంటె నడక కాదు చలాకి నడక.. బల్ కిలాడి నడక నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ... అది వడిసెల రువ్వ ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా వగలంటే వగలు కాదు వలపుల సెగలు చూపంటే చూపు కాదు మదనుడి తూపు ఆ నడక... ఆ నవ్వు... ఆ వగలు... ఆ చూపు అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి గడసాని..హేయ్..గడసాని దొరసాని ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి... అబ్బొ... దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని.. చరణం: 2 మాటలతోటే నన్ను మురిపించకురా ఏమేమో పొగిడేసి బులిపించకురా మాటలతోటే నన్ను... మురిపించకురా ఏమేమో పొగిడేసి... బులిపించకురా ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా కవ్వించాలని నువ్వు కలలు కనకురా కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా గడ ఎక్కి... తాడెక్కి... గంతేసి... చిందేసి అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని... చరణం: 3 తళుకు బెళుకు చూపిస్తా.. గజ్జె ఘల్లుమనిపిస్తా.. తళుకు బెళుకు చూపిస్తే.... తటపట తటపటపట లాడాలి గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా తళుకు బెళుకు చూపిస్తే.... తటపట తటపటపట లాడాలి గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి ఆ తళుకు... ఆ బెళుకు... ఆ బిగువు... ఆ బింకం అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి ఓ..బాబు ఒడుపు చూడండి మెరుపులాంటి చినదాని సొగసు చూడండి సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి గడసాని... దొరసాని..
అలా అలా అలా పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: వి. రామకృష్ణ, పి. సుశీల పల్లవి: అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై పొదామా... సాగి పోదామా... పొదామా... సాగి పోదామా అలా అలా అలా అలా నింగిలో.... నీలి నింగిలో ఎగిరిపోదామా.... అందాల హంసలై ... రాజ హంసలై.... పోదామా ... ఎగిరి పోదామా పోదామా ... ఎగిరి పోదామా చరణం: 1 వెనుదిరిగి చూసే పనిలేదు మనకు దూరాలు తీరాలు చేరాలి మనము వెనుదిరిగి చూసే పనిలేదు మనకు దూరాలు తీరాలు చేరాలి మనము జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా మునుముందుకేగాలి మనము జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా మునుముందుకేగాలి మనము నీకు నేను తోడుగా నేను నీకు నీడగా ఈ బాట మన బ్రతుకు బాటగా పూల బాటగా... హాయిగా సాగి పోదామా అలా అలా అలా అలా గాలిలో పైర గాలిలో పోదామా... ఎగిరి పోదామా చరణం: 2 అనురాగ లతలే పెనవేసె మనను ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం అనురాగ లతలే పెనవేసె మనను ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం అందాలు చిందే నీ లేతమోము నీ కంటి పాపలో నిలవాలి నిరతం అందాలు చిందే నీ లేతమోము నా కంటి పాపలో నిలవాలి నిరతం చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా నీ మాట నా మనసు మాటగా వలపు బాటగా... జంటగా సాగి పోదామా అలా అలా అలా అలా గాలిలో పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా పోదామా ఎగిరి పోదామా
తాగాను నేను తాగాను పాట సాహిత్యం
చిత్రం: గంగ - మంగ (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల పల్లవి: తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను చరణం: 1 కైపులో ఉన్నాను కలలుకంటున్నాను మదిలోని వేదన మరువలేకున్నాను కైపులో వున్నాను కలలు కంటున్నాను మదిలోని వేదన మరువలేకున్నాను మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను.... తాగాను చరణం: 2 కోటి తారలు నిన్నే కోరుకుంటాయి అందాలు చందాలు అందజేస్తాయి కోటి తారలు నిన్నే కోరుకుంటాయి అందాలు చందాలు అందజేస్తాయి మ్మ్ హూ మ్మ్ హూ ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను నీ దారిలో నుండి తొలగిపోతాను మన్నించమన్నాను.... మరచిపొమ్మంటాను
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్. టి.రామారావు, యస్.వి.రంగారావు, కె.మాలతి దర్శకత్వం: కదిరి వెంకటా రెడ్డి (కె.వి.రెడ్డి) నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి విడుదల తేది: 15.03.1951
Songs List:
తీయని ఊహలు పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: పి.లీల తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్ తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్ చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్ గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్ ఓ ఓ ఓ ఓ కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి వసంత నాట్యమే హాయ్ హాయ్
ఇతిహాసం విన్నారా పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: టి.జి.కమలాదేవి ఇతిహాసం విన్నారా
కలవరమాయే మదిలో పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల, పి.లీల కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే కలవర మాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో
ఎంత ఘాటు ప్రేమయో పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల, పి.లీల ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో ఎంత ఘాటు ప్రేమయో కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ ఎంత లేత వలపులో కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే ఎంత లేత వలపులో ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము విరహములో వివరాలను విప్పిచెప్పెనే ఎంత ఘాటు ప్రేమయో ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ ఎంత లేత వలపులో
వినవే బాల నా ప్రేమగోల పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: రేలంగి వినవే బాల నా ప్రేమగోల వినవే బాల నా ప్రేమగోల నీకే నువ్వేల నిలువగజాల వినవే బాల నా ప్రేమగోల గుబుల్ గుబుల్గా గుండెలదరగా దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా గుబుల్ గుబుల్గా గుండెలదరగా దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా వినవే బాల నా ప్రేమగోల చిరునవ్వుచాలే చిత్తైపోతానే చిరునవ్వుచాలే చిత్తైపోతానే మురిపించేస్తాలే మూర్చైపోతానే వినవే బాల నా ప్రేమగోల వినవే బాల నా ప్రేమగోల జూడుగుడి తోడిరాగం పాడుకుంటు జూడుగుడి తోడిరాగం పాడుకుంటు మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో చెట్టాపట్టిల్ జడకోలాటం చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో
వగలోయి వగలు పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: జిక్కీ & కోరస్ పల్లవి: వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలూ బావలూ మామలూ బావలు మావలు భామలూ లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు లాలలో చరణం: 1 సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా సింగారి వీధంట మావా రంగేళి పిల్లంట బావా కొంగు తాకిందంటె హేయ్ హేయ్ కొంగు తాకిందంటె కూయి కూయి కూయునే లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు వగలోయ్ వగలూ థళుకు బెళుకు వగలు చరణం: 2 నీ వెంట వస్తాను, ఆఁ... నీ జంట ఉంటాను... నీ వెంట వస్తాను నీ జంట ఉంటాను... యేఁ? సయ్యంటే బావా... ఊఁ అంటే మావా సయ్యంటే బావా... ఊఁ అంటే మావా చెలీయనీ భలేయని సరే యనీ చలామణి నా వెంట మీరంతా గూమి గూమి గూడితే లాలలూ లాలలూ లాలలు లాలలు లాలలు వగలోయ్ వగలు థళుకు బెళుకు వగలు ధీం తత తత ధీం తత తత ధీం తత తత వగలోయ్ వగలు తలుకు బెలుకు వగలు ఓ..ఓ..ఓ చరణం: 3 తరిగినతక నకతక జం ఝనంతరి తకిట ఝంతకతోం తకిటతై తకిటతై తకిటతై తకిటతై తలాంగుతోం తలాంగుతోం తలాంగు... తాళలేనే నే తాళలేనే భామలారా ఓయమ్మలారా ఇందరిలోనూ నీ సొమ్ములేవే నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే తాళలేనే నే తాళలేనే తాళలేనే ఓ యమ్మా అవునే భామామణీ... తధిగినతోం తధిగినతోం తధిగిన తాళలేనే నే తాళలేనే తాళలేనే నే తాళలేనే తాళలేనే నే తాళలేనే తాళలేనే తాళలేనే తాళలేనే...
ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: వి.జె.వర్మ పల్లవి: ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు. అయ్యో పాపం పసివాడు ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ... వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు చరణం: 1 ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు చరణం: 2 ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ... ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు అయ్యో పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు....
హాయిగా మనకింక స్వేచ్చగా పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల, పి.లీల ప్రణయజీవులకు దేవివరాలే కానుకలివియే ప్రియురాల హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ నీవు నేను విడివడని ప్రేమమాలగా హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా కలలు నిజముకాగా కలకాలమొకటిగా కలలు నిజముకాగా కలకాలమొకటిగా తెలియరాని సుఖములలో తేలిపోవగా హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా - స్వేచ్చగా - హాయిగా
కనుగొన గలనో లేనో పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: ఘంటసాల కనుగొన గలనో లేనో కనుగొన గలనో లేనో ప్రాణముతో సఖిని కనుగొన గలనో లేనో పెండ్లి పీట పై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా పెండ్లి పీట పై ప్రియనెడబాయ గాలి మేడలు గారడి కాగా కల కాలమును కర్మను దూరుచు కలగ బ్రతకడ మేనో కనుగొన గలనో లేనో వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంత చీకటిగా వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంత చీకటిగా ఎంత పిలిచినా పిలుపే అందక చింతిని తిరగడమేనోయ్ కనుగొన గలనో లేనో పులివాతను బడు బాల హరిణియై చెలి ఎచ్చటనో చెరబడగా పులివాతను బడు బాల హరిణియై చెలి ఎచ్చటనో చెరబడగా జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో... కనుగొన గలనో లేనో ప్రాణముతో సఖిని కనుగొన గలనో లేనో కనుగొన గలనో లేనో
రానంటే రానోయి పాట సాహిత్యం
చిత్రం: పాతాళ భైరవి (1951) సంగీతం: ఘంటసాల సాహిత్యం: పింగళి గానం: పిఠాపురం, టి.జి. సరస్వతి రానంటే రానోయి
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు (All) నటీనటులు: ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి, జగ్గయ్య, గిరిజ దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్ నిర్మాతలు: బి.యన్. రెడ్డి, ఆలూరి చక్రపాణి విడుదల తేది: 14.01.1959
Songs List:
ఆనందం పరమానందం పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, పి.లీలా పల్లవి: ఆనందం పరమానందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం చరణం: 1 యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం చరణం: 2 వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం
అప్పుచేసి పప్పుకూడు పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, స్వర్ణలత అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా రూపాయే దైవమురా రూపాయే లోకమురా రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
చేయి చేయి కలుపరావె పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఎ. యమ్.రాజా, పి.లీలా చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా ఉం ఉం ఉం ఉం చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా అహ చేయి చేయి పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉం ఉహు ఉహు పెద్దవారి అనుమతింక లేదు లేదుగా చేయి చేయి కలుపుటెలా హాయిహాయిగా ఉహు చేయి చేయి చరణం: 1 మగని మాటకెదురాడుట తగదు తగదుగా నాతి చెంత విరహము నే తాళలేనుగా ఉం ఉం ఉం ఉం మగని మాటకెదురాడుట తగదు తగదుగా నాతి చెంత విరహము నే తాళలేనుగా అహ చేయి చేయి చరణం: 2 వీలు కాని విరహమింక వలదు వలదుగా దాసి మీద వలపు మీకు తగదు తగదుగా ఉం ఉం ఉహు ఉహు వీలు కాని విరహమింక వలదు వలదుగా దాసి మీద వలపు మీకు తగదు తగదుగా చేయి చేయి కలుపరావె హాయిహాయిగా నదురు బెదురు మనకింక లేదు లేదుగా అహ చేయి చేయి
ఎచటి నుండి వీచెనో పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, పి.లీలా ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ.... తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ .... ప్రకృతినెల్ల హాయిగా తీయగా, మాయగా పరవశింపజేయుచు ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ జాబిలితో ఆడుతూ, వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా ఆ ఆ ఆ .... మనసు మీద హాయిగా తీయగా, మాయగా మత్తుమందు జల్లుచు ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ హృదయవీణ మీటుతూ, ప్రేమగీతి పాడుతూ ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . .. ప్రకృతినెల్ల హాయిగా తీయగా, మాయగా పరవశింపజేయుచు ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి ఈ చల్లని గాలి.
జోహారు గైకొనరా పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: పి.లీలా జోహారు గైకొనరా
కాలం కాని కాలంలో పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: పి.లీలా, పి. సుశీల కాలం కాని కాలంలో
కాశీకి పోయాను రామా హరీ! పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, స్వర్ణలత కాశీకి పోయాను రామా హరీ! గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరీ! (2) కాశీకి పోలేదు రామా హరీ, ఊరి కాల్వలో నీళ్ళండి రామ హరీ! మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరీ! శ్రీశైలమెళ్ళాను రామా హరీ, శివుని విభూది తెచ్చాను రామా హరీ! (2) శ్రీశైలం పోలేదు రామా హరీ, శివుని విభూది తేలేదు రామా హరీ! ఇది కాష్టంలో బూడిద రామ హరీ! అన్నమక్కరలేదు రామా హరీ, నేను గాలి భోంచేస్తాను రామా హరీ! (2) గాలితో పాటుగా రామ హరీ, వీరు గారెలే తింటారు రామా హరీ! నేతి గారెలే తింటారు రామా హరీ! కైలాసమెళ్ళాను రామా హరీ, శివుని కళ్ళార చూసాను రామా హరీ! రెండు కళ్ళార చూసాను రామా హరీ! కైలాసమెళితేను రామా హరీ, నంది తన్ని పంపించాడు రామా హరీ, బాగ తన్ని పంపించాదు రామా హరీ! ఆలుబిడ్డలు లేరు రామా హరీ, నేను ఆత్మయోగినండి రామా హరీ! గొప్ప ఆత్మయోగినండి రామా హరీ! ఆ మాట నిజమండి రామా హరీ, నేనందుకే వచ్చాను రామా హరీ! నేను అందుకే వచ్చాను రామా హరీ!
మూగవైన యేమిలే పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఎ. యమ్.రాజా మూగవైన యేమిలే, నగుమోమే చాలులే! సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే! మూగవైన యేమిలే! ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే.. దొంగ మనసు దాగదులే..సంగతెల్ల తెలిపెనులే! మూగవైన యేమిలే! పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే.. పలుకకున్న యేమాయెను వలపు బాసలింతేలే.. నను దయతో యేలుకొనుము... నను దయతో యేలుకొనుము...కనుసన్నల మెలిగెదలే! మూగవైన యేమిలే! అందాలే బంధాలై నను బందీ చేసెనులే.. అందాలే బంధాలై నను బందీ చేసెనులే.. కలవరమిక యెందుకులే.. కలవరమిక యెందుకులే..వలదన్నా వదలనులే! మూగవైన యేమిలే, నగుమోమే చాలులే! సైగలింక చాలింపుము, జాణతనము తెలిసెనులే! మూగవైన యేమిలే!
ఓ పంచవన్నెల చిలకా! పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, స్వర్ణలత ఓ మరదలా, నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా! నీరూ పాలూ కలిసి ఒకటైనటులే నీవూ నేనూ ఒకటే గదా! ఓ పంచవన్నెల చిలకా! ...ఆ!? ఆ! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) మాటాడవేమే? మాటాడవేమే, నీ నోటి ముత్యాలొలక! ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) ఓహో బావా, మార్చుకో నీ వంకరటింకర దోవ! ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే ఒప్పుతుందా యీ లోకం? ఓ కొంటె బావగారూ! హాయ్! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2) మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు! ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? (2) సీమటపాకాయ లాగ చిటాపటాలాడేవు (2) ప్రేముందా లేదా, ఓ మరదలా, నా మీద? ఓ పంచవన్నెల చిలకా! ఓ పంచవన్నెల చిలకా! నీకెందుకింత అలక? (2) మరదలినైతే మాత్రం మరీ అంత చనువా? (2) మరియాద కాదు మీ బావ మరిది చొరవ! ఓ కొంటె బావగారూ! ఓ కొంటె బావగారూ! మనకెందుకింక పోరు? మా నన్నగారు చూస్తే... మా నన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు! ఓ కొంటె బావగారూ! ఓ పంచవన్నెల చిలకా! (2)
రామ రామ శరణం పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: పి.లీలా రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం! తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2) శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2) జనకు మాటనెంచి వనవాసమేగినట్టి రావణుని వధించి ఘనకీర్తి జగతినించి పాపముల హరించి మునులెల్ల గాచినట్టి
సుందరాంగులను చూసిన పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, పి.లీలా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా చరణం: 1 అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా అందము,ప్రాయము,ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా ముందుగ ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకద సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చనుపడనేలా కొందరు ముచ్చటపడనేలా చరణం: 2 హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించుగద మందహాసమున మనసును తెలిపే ఇందువదన కనువిందుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేల కొందరు కలవరపడనేల చరణం: 3 యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా ప్రేమపరీక్షలు జరిగే వేళల కొందరు కలవరపడనేల కొందరు పరవశ పడనేల చరణం: 4 కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద కోయిలపలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగుగద వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చటపడనేలా కొందరు పిచ్చనుపడనేలా
ఆనందం పరమానందం (Version - 2) పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఎ. యమ్.రాజా, పి.లీలా పల్లవి: ఆనందం పరమానందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం చరణం: 1 యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకె చిక్కుట పరమానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం చరణం: 2 వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం వేణుగానమున శిశువులు, పశువులు తన్మయమందుట ఆనందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం బాలకృష్ణుని లీలలు గాంచిన భక్తకోటులకు బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం పరమానందం
బలిదానం పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, పి.సుశీల బలిదానం
చిత్ర నలీయం పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల, పి.లీలా చిత్ర నలీయం
నవ కళా సమితి పాట సాహిత్యం
చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: పింగళి నాగేశ్వరరావు గానం: ఘంటసాల నవ కళా సమితి
'Neekosame' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.
'Choopulu Kalisina Subhavela' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.
'Lahiri Lahiri' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.
'Srikarulu Devathalu' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by M. L. Vasanthakumari.
'Neeve Naa' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and P. Leela.
'Aha Naa Pellanta' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.
'Sundari' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and Savitri.
'Vivaha Bhojanambu' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.
'Vinnava Yesodhamma' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Susheela.
'Dayacheyandi' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Leela.
'Bhali Bhali' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Madhavapeddi Satyam.
'Lalli Lalla' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by P. Leela.
'Ashtadhikkum' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala.
'Jai Sathya Sangalpa' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala and Chorus.
'Aanandham Aanandham Aanandhame' song from Mayabazar (1957) movie is composed by Ghantasala and sung by Ghantasala, P. Leela and Chorus.
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు నటీనటులు: యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ, సావిత్రి, నాగేశ్వరరావు అక్కినేని, జమున దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్ నిర్మాత: బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి విడుదల తేది: 12.01.1955
Songs List:
రాగ సుధారస పానము పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: త్యాగరాజ గానం: పి. లీల, జిక్కీ రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా రాగ సుధారస రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా రాగ సుధారస యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా రాగ సుధారస సదాశివ మయమగు నాదోంకార స్వర సదాశివ మయమగు నాదోంకార స్వర విధులు జీవన్మూక్తులని త్యాగరాజు విధులు జీవన్మూక్తులని త్యాగరాజు తెలియు రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా రాగ సుధారస
బాబు ధర్మం చెయ్ పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: రేలంగి బాబూ..బాబు బాబు బాబు ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం బాబు కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు ఐస్ క్రీం తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు అయ్యా..అమ్మా..బాబూ.. చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బావును బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు నీ చెయి పైన నా చెయి కింద ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ ధర్మం అరణా ఒరణా రెండణా ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ఆడువారి మాటలకు పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఎ.ఎమ్.రాజా (ఈ పాటని పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ (2001) సినిమాలో రీమిక్స్ చేశారు దీనికి సంగీతం మణిశర్మ సమకూర్చారు, మురళీధర్ ఆలపించారు) అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే
బాలనురా మదనా పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి. సుశీల బాలనురా మదనా బాలనురా మదనా విరి పువ్వులు వేయకురా మదనా బాలనురా మదనా నిలిచిన చోటనే నిలువగ నీయక ఆ.. నిలిచిన చోటనే నిలువగ నీయక వలపులు కురియునురా తియ్యని తలపులు విరియునురా మదనా బాలనురా మదనా బాలనురా మదనా విరి పువ్వులు వేయకురా మదనా బాలనురా మదనా చిలుకల వలె గోర్వంకల వలెనో ఓ.. చిలుకల వలె గోర్వంకల వలెనో కులుకగ తోచనురా తనువున పులకలు కలుగునురా మదనా బాలనురా మదనా బాలనురా మదనా విరి పువ్వులు వేయకురా మదనా బాలనురా మదనా చిలిపి కోయిలలు చిత్తములోనే ఏ.. చిలిపి కోయిలలు చిత్తములోనే కల కల కూయునురా మనసులు కలవర పరచునురా మదనా బాలనురా మదనా బాలనురా మదనా విరి పువ్వులు వేయకురా మదనా బాలనురా మదనా
తెలుసుకొనవే చెల్లి పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి. లీల తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ... మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ... పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ తెలుసుకొనవే చెల్లి
తెలుసుకొనవే యువతి పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఎ.ఎమ్.రాజా తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి యువకుల శాసించుటకే ఏ.. యువకుల శాసించుటకే యువతులవతరించిరని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని ఆ.. సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని హృదయమిచ్చి పుచ్చుకొనే హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదే నేర్పాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని ఆ.. మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని మగువలెపుడూ మగవారిని మగువలెపుడూ మగవారిని చిరునవ్వుల గెలావాలని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి
కరుణించు మేరిమాత పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి. లీల కరుణించు మేరిమాత శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత కరుణించు మేరిమాత శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష కరుణించు మేరిమాత శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు క్షణమైనా శాంతిలేదే దినదినము శోధనాయే కరుణించు మేరిమాత శరణింక మేరిమాత నీవే శరణింక మేరిమాత
ఈ నవనవాభ్యుదయ పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఎ.ఎమ్.రాజా ఆ..ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే ఆ తలుకు తలుకుమని తారలు మెరిసే నీలాకశము నాదేలే ఎల్లరి వనముల కలవర పరిచే జిలిబిలి జాబిలి నాదేలే ఏ.. కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే ఆ.. ప్రశాంత జగమును హుషారు చేసే వసంత ఋతువు నాదేలే పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే... మలయమారుతము నాదేలే..ఏ కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
బృందావనమది అందరిదీ పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: ఎ.ఎమ్.రాజా, పి.సుశీల బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే
రావోయి చందమామ పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి.లీల, ఏ.యమ్.రాజా రావోయి చందమామ మా వింత గాద వినుమా రావోయి చందమామ మా వింత గాద వినుమా చరణం: 1 సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్ సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే చరణం: 2 ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్ మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా చరణం: 3 తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్ మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్ చరణం: 4 నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా
ఏమిటో ఈ మాయ పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: పి. లీల ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయ వినుటయే కాని వెన్నెల మహిమలు వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా అనుభవించి నేనెరుగనయా నీలో వెలసిన కళలు కాంతులు నీలో వెలసిన కళలు కాంతులు లీలగా ఇపుడే కనిపించెనయా ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయ కనుల కలికమిది నీ కిరణములే కనుల కలికమిది నీ కిరణములే మనసును వెన్నెగా చేసెనయా మనసును వెన్నెగా చేసెనయా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయ
సీతారం సీతారం పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: రేలంగి సీతారం సీతారం సీతారం జయ సీతారం సీతారం సీతారం సీతారం జయ సీతారం పైన పటారం లోన లోటారం ఈ జగమంతా డంబాచారం సీతారం సీతారం సీతారం జయ సీతారం నీతులు పలుకుతూ ధర్మ విచారం గోతులు తీసే గూఢాచారం సీతారం సీతారం సీతారం జయ సీతారం చందాలంటూ భలే ప్రచారం వందలు వేలు తమ ఫలహారం సీతారం సీతారం సీతారం జయ సీతారం గుళ్ళో హాజరు ప్రతి శనివారం గూడుపుఠాణి ప్రతాదివారం సీతారం సీతారం సీతారం జయ సీతారం డాబులు కొడుతూ లోక విహారం జేబులు కొట్టే ఘన వ్యాపారం సీతారం సీతారం సీతారం జయ సీతారం టాకు టీకుల టక్కు టామారం కలికాలం మన గ్రహచారం సీతారం సీతారం సీతారం జయ సీతారం సీతారం సీతారం సీతారం జయ సీతారం సీతారం జయ సీతారం రం సీతారం జయ సీతారం
శ్రీ జానకి దేవి పాట సాహిత్యం
చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వర రావు సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు గానం: శ్రీ జానకి దేవి సీమంతమలరె మహలక్ష్మి సుందరవదనారము గనరే పన్నీరు గంధాలు సఖిపైన చిలికించి కానుకలు కట్నాలు చదివించరమ్మా మల్లేమొల్లలసరులు సతిజడను సవరించి ఎల్లా వేడుకలిపుడు చేయించరమ్మా కులుకుచు కూర్చున్న కలికిని తిలకించి అలుక చెందనీక అలరించరమ్మా కులమెల్ల దీవించు కొమరును గనుమంచు ఎల్లముత్తెదువులు దీవించరమ్మా మేరీ : ఏమిటో ఈ మాయా - ఓ చల్లని రాజా- వెన్నెలరాజూ వినుటయెకాని వెన్నెల మహిమలు అనుభవించి నే నెరుగనయా నీలో వెలసిన కళలూ కాంతులు లీలగ యిపుడే కనుపించెనయా కనుల కలికమిడి నీ కిరణములే మనసును వెన్నగ చేసెనయా చెలిమి కోరుచూ - ఏవో పిలువులు నాలో నాకే వినుపించెనయా