Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Subhalagnam (1994)





చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నటీనటులు: జగపతిబాబు, ఆమని, రోజా
దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: కె.వెంకటేశ్వరరావు
విడుదల తేది: 25.09.1994



Songs List:



ఘల్లు ఘల్లు పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: విశ్వనాధ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఘల్లు ఘల్లు 




అల్లుకుపోవే పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లుకుపోవే  ఓసి మల్లెతీగ 




అల్లరి తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: యస్.పి.బాలు, చిత్ర 

అల్లరి తుమ్మెద 




చిలకా ఏ తోడు లేక పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

చిలకా ఏ తోడు లేక ఎటెపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటీ ఆశల వెనక 
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్ జారాకా 
లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెశాక 

గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
గోరింకా ఏదే చిలక లేదింకా గోరింకా ఏదే చిలక లేదింకా
బతుకంతా బలి చేసే పెరాసను ప్రేమించావే
వెలుగుల్నె వెలివెసే కలలోనే జీవించావే 
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహాలం పొందావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలొ తడిసీ కనుమరుగైనావే 

కొండంత అండ నీకు లేదింక కొండంత అండ నీకు లేదింక 
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో 
మమకారం విలువెంతో మరీచావా సిరి మైకంలో 
ఆనందం కొనలేని ధన రాసితో 
అనాధగా మిగిలావే అమవాసలో
తీరా నువ్వు కను తెరిచాకా తీరం కనబడదే ఇంకా 



పొరుగింటి మంగళ గౌరి పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పొరుగింటి మంగళ గౌరి 
వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు
ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు
నాగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు
మనకు మల్లే ఎవరు ఉన్నారు
ఉసూరంటూ ఇలా ఎన్నాళ్ళు
మన బతుకేమో ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది

పక్కాళ్ళ పాడు గోల పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర తెగ మెచ్చుకోవద్దే
నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకూ ఉన్నాడే
అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే
మనకి లేక అదో ఏడుపా
పరులకుంటే మరో ఏడుపా
ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు
ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు

ఓ... ఓ... ఓ....
కాంతమ్మ గారు కట్టే చీర ఖరీదైనా
లేదే పాపం తమ జీతం
నేత చీర కట్టుకున్నా కొట్టవచ్చినట్టు ఉందే
అందం నీ సొంతం
ఉత్తి మాటలెన్ని అన్నా నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం సర్డుకుంటే మంచిదిగా
కట్టుకున్నదాని సంబరం 
తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం
చంపకే నన్ను నీ డాబు కోసం

పలానా వారి మిస్సెస్ అంటూ అంతా మెచ్చుకుంటే మీకే గొప్ప కాదా
ఆ బోడి పదవికని అప్పో తప్పో చెయ్యమంటే
ఊళ్ళో పరువు పోదా
ఖానీకి కొరగాని పరువూ ఓ పరువేనా
మగాణ్ణి తూచేది వాడి పర్స్ బరువేనా
డబ్బు లేని దర్పమెందుకు
చేతగాని శౌర్యమెందుకు
నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే



చినుకు చినుకు అందెలతో పాట సాహిత్యం

 
చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు, చిత్ర

(మాయలోడు (1993) సినిమాలో ఈ పాటని ఈ సినిమాలో మళ్ళీ వాడటం జరిగింది. మాయలోడు సినిమాలో సౌందర్య, బాబూమోహన్ పై ఈ పాట చిత్రీకరణ జరిగింది, ఈ సినిమాలో ఆలీ, సౌందర్య పై  ఈ పాట చిత్రీకరణ జరిగింది.)

పల్లవి:
చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 1
నింగి నేల ఈవేల చలికి వనికి పోతుంటే 
బిగికౌగిలి పొదరింటికి పద పద మంది 
ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండకాసె ఏలో
అరెయ్ పైన మొబ్బు ఉరిమింది 
పడుచు జింక బెదిరింది 
వలవేయక సెలయేరై పెనవేసింది 
అరెయ్ చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటుకేసే బుగ్గమీద ఏలో 
తలపు తొలివలపూ ఇక తకజమ్ తకజమ్
వయసూ తడి సొగసూ అరవిరిసే సమయమ్  
ఆహ - ఊహూ,  ఓహొ హొ హొ

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చరణం: 2
మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది 
యదలోపల చలిగాలుల సుడిరేగింది 
వానొచ్చే వరదొచ్చే ఏలో 
వయసంటే తెలిసొచ్చే ఏలో
నేలచూపు పోయింది వాలుచూపుసై అంది 
చలికోరిక అలఓకగ తల ఊపింది
అరెయ్ సరసాల సింధులోన ఏలో 
సరిగంగ తానాలు ఏలో 
ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 
సరసానికి  దొరసానికి ముడిపెడుతుంటే 
ఆహా - ఊహూ
ఓహో హొ హో 

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా

చినుకు చినుకు అందెలతో 
చిట పట చిరు సవ్వడితో
నీలిమబ్బు కురుల ముడిని 
జారవిడిచి వల్లు మరిచి 
వాన జాన ఆడింది వయ్యారంగా 
నీల్ల పూలు జల్లింది  సింగారంగా


No comments

Most Recent

Default